• facebook
  • whatsapp
  • telegram

విసర్జన

1. జ్వాలా కణాలు ఉన్న జీవులు ఏవి?
A) ప్రోటోజోవా         B) అనెలిడా
C) ఆర్థోపొడా           D) ప్లాటిహెల్మింథిస్‌
జవాబు : D


2. మూత్రం వర్ణానికి కారణమైన పదార్థం ఏమిటి?
A) బైలిరూబిన్‌          B) బైలివర్డిన్‌
C) యూరోక్రోమ్‌          D) అన్నీ
జవాబు : C


3. హరితగ్రంథుల ద్వారా విసర్జన జరుపుకునే జీవులు?
A) మొక్కలు           B) అనెలిడ్‌లు
C) ఆర్థోపోడ్‌లు        D) ఇఖైనోడర్మేట్‌లు
జవాబు : C


4. రక్తపరీక్షలు, వాటి చికిత్సకు సంబంధించిన వైద్య విభాగం?
A) బ్యాక్టీరియాలజీ          B) హెమటాలజీ
C) లింఫోమాలజీ             D) మైలోమాలజీ
జవాబు : B


5. మూత్రపిండం అంతర్నిర్మాణంలో ముదురు వర్ణపు ప్రాంతం?
A) నెఫ్రాన్‌          B) దవ్వ
C) వల్కలం          D) మాల్ఫీజియన్‌ దేహం
జవాబు : C


6. కాఫీ మొక్కలో ఉండే కెఫిన్‌ అనేది ఒక....
A) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నం
B) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నం
C) తృతీయ జీవక్రియా ఉత్పన్నం
D) ఒక హార్మోన్‌
జవాబు : B


7. విసర్జక అవయవాలు లేని జీవులు?
A) ప్రోటోజోవా          B) పొరిఫెరా
C) సిలెంటరేటా           D) అన్నీ
జవాబు : D


8. జట్రోపా మొక్కలో బయోడీజిల్‌గా ఉపయోగించే భాగం?
A) వేరు         B) కాండం       C) విత్తనాలు          D) పత్రాలు
జవాబు : C

 

9. తోళ్ల పరిశ్రమలో ఉపయోగపడే మొక్కల ద్వితీయ జీవక్రియా ఉత్పన్నం?
A) టానిన్‌లు           B) రెసిన్‌లు         C) ఆల్కలాయిడ్స్‌           D) లేటెక్స్‌
జవాబు : A

 

10. మూత్రం ఏర్పడే విధానంలో దశల వరుసక్రమం:
A) గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, అతి గాఢత ఉన్న మూత్రం ఏర్పడటం, నాళికాస్రావం
B) గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం, అతి గాఢత ఉన్న మూత్రం ఏర్పడటం
C) గుచ్చగాలనం, నాళికాస్రావం, వరణాత్మక పునఃశోషణం, అతి గాఢత ఉన్న మూత్రం ఏర్పడటం
D) అతి గాఢత ఉన్న మూత్రం ఏర్పడటం, గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం
జవాబు : B


11. పాము కాటుకు ఔషధంగా ఉపయోగపడే ఆల్కలాయిడ్‌ పేరు?
A) క్వినైన్‌          B) మార్ఫైన్‌          C) రిసర్పైన్‌            D) స్కోపోలమైన్‌
జవాబు : C


12. మొక్కల్లో ఏర్పడే నత్రజనియుత ఉప ఉత్పన్నాలు?
A) టానిన్‌లు          B) ఆల్కలాయిడ్స్‌         C) లేటెక్స్‌        D) రెసిన్‌లు
జవాబు : B


13. ఎర్రరక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే జీవక్రియా వ్యర్థాలు?
A) బైలిరూబిన్‌        B) బైలివర్డిన్‌         C) యూరోక్రోమ్‌           D) అన్నీ
జవాబు : D

 

14. తప్పుగా ఉన్న జతను గుర్తించండి:
A) టానిన్‌లు - అకర్బన పదార్థాలు
B) గమ్స్‌/ జిగుర్లు - పాలీశాకరైడ్లు
C) లేటెక్స్‌ - ప్రోటీన్స్, పిండిపదార్థాలు, చక్కెరలు, నూనెలు, ఆల్కలాయిడ్స్‌ కలిపిన ఎమల్షన్‌
D) రెసిన్‌లు - కర్బన పదార్థాలు
జవాబు : A


15. మూత్రంలోని ప్రధాన భాగం?
A) యూరియా           B) సోడియం
C) నీరు          D) క్రియాటిన్‌
జవాబు : C

 

16. వాసోప్రెసిన్‌ హార్మోన్‌ దేనికి సంబంధించింది?
A) అండాశయం/ స్త్రీ బీజకోశాల అభివృద్ధి
B) శుక్రకణాల విడుదల
C) స్త్రీల నుంచి అండం విడుదల
D) మూత్ర విసర్జన
జవాబు : D

 

17. మూత్రపిండం బాహ్య భాగంలో ఉండే నెఫ్రాన్‌ భాగం?
A) బౌమన్స్‌ గుళిక            B) సమీపస్థ సంవళిత నాళం
C) దూరస్థ సంవళిత నాళం         D) హెన్లీ శిక్యం
జవాబు : A


18. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోవడాన్ని ఏమంటారు?
A) SRDE          B) ESRD        C) DRSE            D) SERD
జవాబు : B

 

19. తప్పుగా ఉన్న జతను గుర్తించండి:
A) డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ - వాసోప్రెసిన్‌
B) హీమో డయాలసిస్‌ - కృత్రిమంగా రక్తం వడపోత
C) యురేమియా - రక్తంలో ఎక్కువగా నీరు, వర్థపదార్థాలు చేరడం
D) మూత్రపిండ మార్పిడి - అన్ని హాస్పిటళ్లలో అందరికీ అందుబాటులో ఉంది
జవాబు : D


20. చూయింగ్‌ / బబుల్‌ గమ్స్‌ను వేటితో తయారు చేస్తారు?
A) జిగుర్లు          B) లేటెక్స్‌        C) ఆల్కలాయిడ్‌లు         D) రెసిన్‌లు
జవాబు : B

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌