• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణం

1. 1 కిలో కెలోరి = ......... జౌల్‌

A) 4.18          B) 41.8         C) 418             D) 4180

జవాబు : D

2. 273C = .......రీ

A) 0         B) 546         C) 273          D) 273

జవాబు : B

3. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణరాశి = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణరాశి అనేది దేన్ని సూచిస్తుంది?

A) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం           B) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం

C) శక్తి నిత్యత్వ నియమం            D) త్వరణ నిత్యత్వ నియమం

జవాబు : C

4. శీతాకాలంలో ఉదయంపూట కిటికీ అద్దాలపై నీటి బిందువులు ఏర్పడటానికి కారణం?

A) తుషారం        B) పొగమంచు      C) ఆర్థ్రత          D) గుప్తోష్ణం

జవాబు : A

5. సరైన జతను ఎన్నుకోండి:

P) ఉష్ణం ( ) X) కెలొరి

Q) విశిష్టోష్ణం ( ) Y) కెలొరి/గ్రాం

R) గుప్తోష్ణం ( ) Z) కెలొరి/ గ్రాం

A) PZ QX RY       B) PX QY RZ

C) PY QX RZ       D) PX QZ RY

జవాబు : D

6. వేడిగా ఉన్న ఉడికించిన గుడ్డులోని పచ్చసొన తెల్లసొన కంటే వేడిగా ఉంటుంది. ఎందుకంటే...

A) పచ్చసొన విశిష్టోష్ణం ఎక్కువ

B) తెల్లసొన విశిష్టోష్ణం ఎక్కువ

C) తెల్లసొన, పచ్చసొన రెండింటిలో విశిష్టోష్ణం సమానం

D) ఏదీకాదు

జవాబు : A
 

7. ఆర్థ్రత ఏ ప్రాంతంలో ఎక్కువ?

A) పర్వతాలు       B) సముద్రాలు

C) ఎడారులు         D) మైదాన ప్రాంతాలు

జవాబు : B

8. 10 గ్రాముల మంచును నీరుగా మార్చడానికి ఎంత ఉష్ణశక్తి అవసరమవుతుంది?

A) 540 కెలోరీలు       B) 80 కెలోరీలు

C) 54 కెలోరీలు         D) 800 కెలోరీలు

జవాబు : D

9. 10 గ్రాముల నీటికి 50 కెలోరీల ఉష్ణశక్తిని అందించినప్పుడు, నీటి ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది?

A) 60°C         B) 40°C           C) 10°C         D) 5°C

జవాబు : D

10. ప్రెజర్‌ కుక్కర్‌లో వంట చాలా త్వరగా అవుతుంది. ఎందుకంటే...?

A) నీటి విశిష్టోష్ణం పెరుగుతుంది

B) నీటి విశిష్టోష్ణం తగ్గుతుంది

C) నీటి మరిగే స్థానం పెరుగుతుంది

D) నీటి మరిగే స్థానం తగ్గుతుంది

జవాబు : C

11. ఒక ద్రవ ఉపరితలం వద్ద, ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందే ప్రక్రియ?

A) ద్రవీభవనం           B) ఘనీభవనం

C) సాంద్రీకరణం         D) బాష్పీభవనం

జవాబు : D

12. విశిష్టోష్ణం SI ప్రమాణం?

A) జౌల్‌/కెల్విన్‌            B) జౌల్‌/ కి.గ్రా.

C) జౌల్‌.కి.గ్రా./కెల్విన్‌           D) జౌల్‌/కి.గ్రా.- కెల్విన్‌

జవాబు : D

13. కిందివాటిలో సాంద్రీకరణకు ఉదాహరణ?

A) నీరు మంచుగా మారడం           B) తడి దుస్తులు పొడిగా మారడం

C) నీరు ఆవిరిగా మారడం             D) తుషారం ఏర్పడటం

జవాబు : D

14. 127°C + 400K + x = 1000 K. అయితే x విలువ

A) 200 K         B) 273 K          C) 473 K           D) 800 K

జవాబు : A
 

15. 30°C వద్ద 100 గ్రా.ల నీటిని, 60°C వద్ద 100 గ్రా.ల నీటిని మిశ్రమం చేసినప్పుడు, ఆ మిశ్రమం తుది ఉష్ణోగ్రత?

A) 45°C

B) 70°C

C) 90°C

D) 130°C

జవాబు : A
 

16. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ?

A) 540 cal/ gm          B) 80 cal/ gm

C) 100 cal/ gm            D) 0 cal/ gm

జవాబు : A
 

17. ఒక వ్యవస్థ మొత్తం శక్తిని ఏమంటారు?

A) గతిశక్తి         B) స్థితిశక్తి           C) ఆంతరికశక్తి       D) భ్రమణశక్తి

జవాబు : C

18. కిందివాటిలో ఎక్కువ విశిష్టోష్ణం ఉన్న పదార్థం?

A) గాజు         B) పాదరసం         C) రాగి          D) నీరు

జవాబు : D

19. కిందివాటిలో శీతలీకరణ ప్రక్రియ?

A) సాంద్రీకరణం          B) బాష్పీభవనం

C) ద్రవీభవనం          D) అన్నీ

జవాబు : B
 

20. A అనే వస్తువు 30°C వద్ద, B అనేది 35°C వద్ద ఉంటే ఉష్ణప్రవాహ దిశ?

A) B ® A

B) A ® B

C) A = B

D) B = A

జవాబు : A

Posted Date : 20-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌