• facebook
  • whatsapp
  • telegram

వక్రతలాలపై కాంతి పరావర్తనం

1. వస్తువు ఎత్తు 10 సెం.మీ., ప్రతిబింబం ఎత్తు 5 సెం.మీ. అయితే ఆవర్థనం m = ?
A) 2            B) 1        C) 1/2           D) 0
జవాబు : C

2. ఈఎన్‌టీ వైద్యులు ఉపయోగించే దర్పణం ఏది?
A) సమతల       B) పుటాకార         C) కుంభాకార         D) ఏదీకాదు
జవాబు : B

3. పుటాకార దర్పణం నాభ్యంతరం 10 సెం.మీ. అయితే వస్తువును 40 సెం.మీ.వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబ లక్షణాలు?
A) పెద్దది - తలకిందులు - నిజ          B) సమాన పరిమాణం - నిలువు - మిథ్యా
C) చిన్నది - తలకిందులు - నిజ           D) చిన్నది - తలకిందులు - మిథ్యా
జవాబు : C

4.‘‘కాంతి ఎల్లప్పుడు తక్కువ ప్రయాణకాలం ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది’’
A) ఫెర్మాట్‌ సూత్రం          B) న్యూటన్‌ సూత్రం
C) ఐన్‌స్టీన్‌ సూత్రం           D) వృద్ధీకరణ సూత్రం
జవాబు : A

5. సరైన దర్పణ సూత్రాన్ని ఎన్నుకోండి.

    జవాబు : C

    6. 

     కుంభాకార కటకాన్ని మూడు వేర్వేరు పదార్థాలతో తయారు చేస్తే, ఈ కటకం ఏర్పరిచే ప్రతిబింబాల సంఖ్య?
    A) 1          B) 2           C) 3           D) 4
    జవాబు : C

    7. సాధారణ మానవుడి దృష్టికోణం?
    A) 60°         B) 45°          C) 30°           D) 90°
    జవాబు : A
     

    8. P: ప్యూజ్‌ ఒక రక్షణ పరికరం.
    Q: ఫ్యూజ్‌ పదార్థం ద్రవీభవన స్థానం తక్కువ.
    A) P, Q సరైనవి         B) P, Q సరైనవి కాదు
    C) P సరైంది, Q సరైంది కాదు
    D) P సరైంది కాదు, Q సరైంది

    జవాబు : A
     

    9.  X విలువ = ........... ఆంపియర్లు
    A) 11A          B) 1 A         C) 4 A          D) 0 A
    జవాబు : B

     

    10. వైరు ఏ దిశలో కదులుతుంది?

    A) ఎడమవైపు          B) కుడివైపు
    C) తలం లోపలివైపు            D) తలం బయటవైపు
    జవాబు : A

     

    11. ఒక వ్యక్తి సమతల దర్పణానికి ఎదురుగా 30 సెం.మీ. దూరంలో నిలుచున్నాడు. అతడు దర్పణానికి దగ్గరగా 10 సెం.మీ. జరిగితే, అతడికి, దర్పణంలో అతడి ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత?
    A) 30 సెం.మీ         B) 10 సెం.మీ.       C) 20 సెం.మీ.        D) 40 సెం.మీ.
    జవాబు : D

     

    12. రాజు ఒక పుటాకార దర్పణాన్ని ఉపయోగించి వస్తువు పరిమాణానికి సమానమైన పరిమాణం ఉన్న ప్రతిబింబాన్ని పొందాలనుకున్నాడు. అయితే అతడు వస్తువును ఉంచాల్సిన చోటు?
    A) F వద్ద        B) F, 2F మధ్య         C) C వద్ద          D) C కి అవతల
    జవాబు : C

    13. ఒక గోళాకార దర్పణం వక్రతా వ్యాసార్ధం 40 సెం.మీ. అయితే దాని నాభ్యంతరం?
    A) 10 cm          B) 20 cm          C) 30 cm            D) 40 cm
    జవాబు : B

     

    14. దంత వైద్యుడు దంతాలను పరిశీలించడానికి ఉపయోగించే దర్పణం?
    A) కుంభాకార          B) పుటాకార 
    C) సమతల          D) కుంభాకార లేదా పుటాకార
    జవాబు : B

    15. పరావర్తన నియమాలు .................. వర్తిస్తాయి.
    A) కుంభాకార దర్పణాలకు మాత్రమే      B) పుటాకార దర్పణాలకు మాత్రమే
    C) సమతల దర్పణాలకు మాత్రమే         D) పై అన్నింటికి
    జవాబు : D

     

    16. సమతల దర్పణం యొక్క ఆవర్థనం?
    A) 1            B) < 1        C) > 1            D) అనంతం
    జవాబు : A

     

    17. ఒక కటకానికి .......... నాభులు ఉంటాయి.
    A) 1          B) 2          C) 3            D) 4
    జవాబు : B

     

    18. మానవ కన్నులోని పారదర్శక పొర?
    A) ఐరిస్‌          B) కార్నియా       C) కనుపాప         D) రెటీనా
    జవాబు : B

     

    19. విద్యుత్‌ ఘటం సంకేతం?

      జవాబు : C

      20. విద్యుత్‌ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త?
      A) ఫారడే        B) లెంజ్‌         C) కూలుంబ్‌           D) అయిర్‌స్టెడ్‌
      జవాబు : D

      Posted Date : 24-06-2021

      <

      గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

      స్టడీమెటీరియల్

      పాత ప్రశ్నప‌త్రాలు

       

      విద్యా ఉద్యోగ సమాచారం

       

      నమూనా ప్రశ్నపత్రాలు

       

      లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌