1. ఒక ఆటలో గెలవడానికి ఉన్న సంభావ్యత 0.996. అయితే గెలవకపోవడానికి ఉన్న సంభావ్యత?
A) -1 B) 1 C) 0.0040 D) 0.4
జవాబు : C
2. ఒక పని కావడానికి ఉన్న సంభావ్యత 'x' అయితే ఆ పని కాకపోవడానికి ఉన్న సంభావ్యత?
A) x - 1 B) 1 - x C) 1 - 1/x D) x
జవాబు : B
3. 'EENADU' అనే పదం నుంచి ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తే అది హల్లు కావడానికి ఉన్న సంభావ్యత?
A) 5/6 B) 4/6 C) 2/6 D) 1
జవాబు : C
4. ఆంగ్ల అక్షరమాల నుంచి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎంపిక చేస్తే అది అచ్చు కావడానికి ఉన్న సంభావ్యత?
A) 5/26 B) 21/26 C) 10/13 D) 11/13
జవాబు : A
5. 'x' అనే సంఖ్యను 1, 2, 3 ల నుంచి, 'y' అనే సంఖ్యను 1, 4, 9 ల నుంచి తీసుకుంటే p(xy < 9) =
A) 7/9 2) 2/3 C) 5/9 D) 1/9
జవాబు : C
6. ఒక సంచిలో 1 నుంచి 30 వరకు సంఖ్యలు ముద్రించిన కార్డులు ఉన్నాయి. అందులో నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది 2, 3 లతో భాగించగల సంఖ్య అయ్యే సంభావ్యత?
A) 1/3 B) 1/6 C) 3/5 D) 2/15
జవాబు : B
7. ఒక బాక్సులో 1 నుంచి 100 వరకు రాసిన టోకెన్స్ వేసి, అందులోనుంచి ఒక టోకెన్ తీస్తే అది పరిపూర్ణ ఘనసంఖ్య అయ్యే సంభావ్యత?
A) 1/50 B) 1/100 C) 1/75 D) 1/25
జవాబు : D
8. రెండు పాచికలను ఒకేసారి దొర్లించారు. పాచికలపై కనిపించే రెండు సంఖ్యల మొత్తం 10 కావడానికి సంభావ్యత?
A) 5/36 B) 4/36 C) 1/12 D) 1
జవాబు : C
9. ఒక పెట్టెలో 10 ఎరుపు, 5 తెలుపు, 6 పచ్చ రంగు గోళీలు ఉన్నాయి. పెట్టె నుంచి తీసిన ఒక గోళీ ఎరుపు రంగుది కావడానికి ఉన్న సంభావ్యత?
A) 5/21 B) 6/21 C) 10/23 D) 10/21
జవాబు : D
10. కిందివాటిలో ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించనిది?
A) 1/5 B) 12% C) -0.004 D) 0.0007
జవాబు : C
11. వారంలో ఒక రోజును యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే ఆ రోజు బుధవారం లేదా ఆదివారం కావడానికి సంభావ్యత?
A) 1/7 B) 2/7 C) 4/7 D) ఏదీకాదు
జవాబు : B
12. కిందివాటిలో ఏది అసత్యం?
A) P(E) + P(Ē) = 1
B) రెండు పాచికలను విసిరితే మొత్తం అవకాశాల సంఖ్య 36
C) 0 ≤ P(E) ≤ 1
D) P(E) + P(Ē) = 0
జవాబు : D
13. మూడు నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు వచ్చే మొత్తం అవకాశాల సంఖ్య?
A) 1 B) 4 C) 3 D) 8
జవాబు : D
14. P(E) = U అనేది....
A) సంభవ ఘటన B) అసంభవ ఘటన
C) కచ్చితమైన ఘటన D) ఏదీకాదు
జవాబు : B
15. దృఢ ఘటన యొక్క సంభావ్యత?
A) 0 B) 1 C) 1 D) ఏదీకాదు
జవాబు : B
బిట్లు
1. రెండు నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు కనీసం ఒక బొమ్మపడే సంభావ్యత ఎంత?
జవాబు :
2. ఒక పెట్టెలో 1 నుంచి 40 వరకు సంఖ్యలున్న పలకలు ఉన్నాయి. వీటి నుంచి యాదృచ్ఛికంగా ఒక పలకను తీసినప్పుడు దాని మీద ఉన్న సంఖ్య 23 కంటే తక్కువగా ఉండే ప్రధాన సంఖ్య అయ్యేందుకు సంభావ్యత ఎంత?
జవాబు :
3. రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు రెండింటి మీద సరిసంఖ్య వచ్చే సంభావ్యత ఎంత?
జవాబు :
4. ఒక కుటుంబంలోని ముగ్గురు పిల్లల్లో కనీసం ఒకరు మగపిల్లవాడు అవడానికి సంభావ్యత ఎంత?
జవాబు :
5. 1, 2, 3, ....., 15 సంఖ్యల నుంచి ఎంపిక చేసిన ఒక సంఖ్య 4 యొక్క గుణిజం అయ్యే సంభావ్యత ఎంత?
జవాబు :
6. ఒక లీపు సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత?
జవాబు :
7. కచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత?
జవాబు : 1
8. 52 కార్డులున్న పేక కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఏస్ కాకపోవడానికి సంభావ్యత ఎంత?
జవాబు :
9. 1 నుంచి 30 వరకు గల సంఖ్యల నుంచి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంపిక చేస్తే అది ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత?
జవాబు :
10. ఒక సంచిలో 1 నుంచి 25 వరకు సంఖ్యలు వేసిన కార్డులు ఉన్నాయి. వీటి నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది 2, 3లతో భాగించబడటానికి సంభావ్యత ఎంత?
జ:
11. ఒక పాచికను విసిరినప్పుడు దానిపై 3 యొక్క గుణిజం వచ్చే సంభావ్యత ఎంత?
జవాబు :
12. మూడు నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు కనీసం రెండు బొమ్మలు పడే సంభావ్యత ఎంత?
జవాబు :
13. ఒక పరీక్షలో ఒక ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఊహించే సంభావ్యత , తప్పు సమాధానాన్ని ఊహించే సంభావ్యత . అయితే x = ?
జవాబు : 6
14. 3, 5, 5, 7, 7, 7, 9, 9, 9, 9 ల నుంచి యాదృచ్ఛికంగా ఒక అంకెను ఎంపిక చేస్తే అది ఆ దత్తాంశపు సగటు అయ్యేందుకు సంభావ్యత ఎంత?
జవాబు :
15. కిందివాటిలో ఒక ఘటన సంభావ్యత కానిది?
1) 2) 15% 3) 0.8 4) 1.5
జవాబు : 1.5
16. అసాధ్య ఘటన యొక్క సంభావ్యత ఎంత?
జవాబు : 0
17. సాధారణ సంవత్సరంలో 53 శుక్రవారాలు వచ్చేందుకు సంభావ్యత ఎంత?
జ:
18. ఒక సంవత్సరంలో యాదృచ్ఛికంగా ఒక నెలను ఎంపిక చేస్తే అది మార్చి లేదా మే నెల అయ్యే సంభావ్యత ఎంత?
జవాబు :
19. "PRATIBHA" అనే పదం నుంచి ఒక అక్షరాన్ని ఎంపిక చేస్తే అది అచ్చు అయ్యే సంభావ్యత ఎంత?
జవాబు :
20. రెండంకెల సంఖ్యల నుంచి ఒక సంఖ్యను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తే అది 10 యొక్క గుణిజం అయ్యే సంభావ్యత ఎంత?
జవాబు :