1. స్టెతస్కోప్‌ను కనుక్కున్నది ఎవరు?
A) లిన్నేయస్ B) లెన్నెక్
C) జెన్నర్ D) హార్వే
జవాబు : B
2. రక్త పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
A) పెడోమీటర్ B) థర్మామీటర్
C) స్టెతస్కోప్ D) స్పిగ్మోమానోమీటర్
జవాబు : D
3. 120/80 అనేది దేన్ని సూచిస్తుంది?
A) హైపర్ టెన్షన్ B) సాధారణ రక్త పీడనం
C) తక్కువ రక్తపీడనం D) హైపో టెన్షన్
జవాబు : A
4. రక్తస్కందనాన్ని ప్రారంభించేది?
A) ఎర్రరక్త కణాలు B) తెల్లరక్త కణాలు
C) రక్త ఫలకికలు D) ప్లాస్మా
జవాబు : C
5. సాధారణంగా 3 గదుల గుండె ఉండే జీవులు....
A) చేపలు B) ఉభయచరాలు
C) సరీసృపాలు D) పక్షులు
జవాబు : C
6. సాధారణంగా హృదయస్పందన, నాడీస్పందనల నిష్పత్తి...
A) హృదయస్పందన రేటు ఎక్కువ
B) నాడీ స్పందన రేటు ఎక్కువ
C) రెండూ సమానం
D) నాడీ స్పందన కంటే హృదయస్పందన రెండు రెట్లు
జవాబు : C
7. ఎక్కువ దృఢంగా ఉండే రక్తనాళాలు?
A) దమనులు B) సిరలు
C) A, B D) కరోనరి దమని
జవాబు : A
8. కవాటాలు ఉన్న రక్తనాళాలు
A) దమనులు B) సిరలు
C) A, B D) ఏదీకాదు
జవాబు : B
9. మానవుల్లో సాధారణ డయాస్టోలిక్ పీడనం?
A) 120 B) 100 C) 90 D) 80
జవాబు : D
10. రాత్రంతా కదలకుండా కూర్చొని ప్రయాణిస్తే, కాళ్లు/ పాదాలు వాచినట్లు ఉండటాన్ని ....... అంటారు.
A) పెల్లగ్రా B) ఎనీమియా
C) ఎడిమా D) క్వాషియార్కర్
జవాబు : C
11. కణజాలాల్లో ఉన్న శోషరసాన్ని ........ అంటారు.
A) ప్లాస్మా B) ప్రోత్రాంబిన్
C) కణజాల ఫైబ్రిన్ D) కణజాల ద్రవం
జవాబు : D
12. ప్రోటోజోవన్ల జీవపదార్థంలో సహజమైన కదలికలను .......... అంటారు.
A) ప్రసరణ B) బ్రౌనియన్ చలనం
C) ద్రవాభిసరణం D) కోశిక ద్రవ్యసంకోచం
జవాబు : B
13. జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టని స్థితిని ............... అంటారు.
A) పెరినీషియస్ ఎనీమియా B) గ్లాసైటిస్
C) హీమోఫిలియా D) స్కర్వీ
జవాబు : C
14. మొక్కల్లో ఆహారపదార్థాలను రవాణా చేసే కణజాలం?
A) పోషక కణజాలం B) దారువు
C) సంధాయక కణజాలం D) విభాజ్య కణజాలం
జవాబు : A
15. బాష్పోత్సేకం అంటే........?
A) శ్వాసక్రియలో భాగంగా ఆక్సిజన్‌ను తీసుకోవడం
B) శ్వాసక్రియలో భాగంగా కార్బన్‌డైఆక్సైడ్‌ను వదలడం
C) నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం
D) నీటిని నీటిబిందువుల రూపంలో కోల్పోవడం
జవాబు : C
16. రక్తప్రసరణ వ్యవస్థను కనిపెట్టింది ఎవరు?
A) ఫాబ్రిసి B) మాల్ఫీజీ
C) హార్వే D) లెన్నెక్
జవాబు : C
17. త్రిపత్ర కవాటం యొక్క స్థానం?
A) కుడి కర్ణిక, ఎడమ కర్ణికల మధ్య
B) కుడి కర్ణిక, ఎడమ జఠరికల మధ్య
C) ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య
D) ఎడమ కర్ణిక, పుపుస దమనుల మధ్య
జవాబు : B
18. ఎడమ కర్ణిక నుంచి, ఎడమ జఠరికలోకి రక్తం ప్రసరించడానికి ఉపయోగపడే కవాటం?
A) త్రిపత్ర కవాటం B) పుపుస కవాటం
C) సిస్టెమిక్ (దైహిక) కవాటం D) ద్విపత్ర కవాటం
జవాబు : D
19. మానవుడిలోని రక్తప్రసరణ వ్యవస్థ?
A) ఏకవలయ ప్రసరణ B) సంవృత రక్తప్రసరణ
C) ద్వి (ద్వంద్వ) వలయ రక్తప్రసరణ D) B, C
జవాబు : D
20. హృదయ స్పందనలో మొదటి లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది?
A) గుండెలోని కవాటాలు మూసుకున్నప్పుడు
B) రక్తనాళాల్లోని కవాటాలు మూసుకున్నప్పుడు
C) గుండెలోని కవాటాలు తెరుచుకున్నప్పుడు
D) రక్తనాళాల్లోని కవాటాలు తెరుచుకున్నప్పుడు
జవాబు : A