1.కణశక్త్యాగారాలుగా పేర్కొనే కణాంగం?
A) హరితరేణువు B) మైటోకాండ్రియా
C) కేంద్రకం D) రైబోసోమ్
జవాబు : B
2. ATP లో నిల్వ ఉన్న శక్తి
A) 7.2 కేలరీలు B) 72 కేలరీలు
C) 720 కేలరీలు D) 7200 కేలరీలు
జవాబు : D
3. సాధారణంగా మానవుల్లో అవాయు శ్వాసక్రియ జరిగే ప్రదేశం?
A) నాడీకణజాలం B) ఎపిథీలియల్ కణజాలం
C) కండర కణజాలం D) హృదయ కణజాలం
జవాబు : C
4. అథ్లెట్లు / క్రీడాకారుల కండర కణజాలంలో వచ్చే నొప్పికి కారణం?
A) లాక్టిక్ ఆమ్లం B) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
C) సిట్రిక్ ఆమ్లం D) సల్ఫ్యూరిక్ ఆమ్లం
జవాబు : A
5. స్థిరమైన వాయువుగా దేన్ని పేర్కొంటారు?
A) ఆమ్లజని B) కార్బన్‌డైఆక్సైడ్
C) హైడ్రోజన్ D) నైట్రోజన్
జవాబు : B
6. మానవుల్లో జరిగే వాయుప్రసార మార్గానికి సంబంధించి కింద ఇచ్చిన X, Y, Z ఖాళీలను పూరించండి. నాసికా రంధ్రాలు - నాసికా కుహరం - X - Y - వాయునాళం - శ్వాసనాళాలు - శ్వాసనాళికలు - Z
A) X - గ్రసని, Y - స్వరపేటిక Z - వాయుగోణులు
B) X - స్వరపేటిక, Y - గ్రసని, Z - వాయుగోణులు
C) X - వాయుగోణులు, Y - స్వరపేటిక, Z - గ్రసని
D) X - గ్రసని, Y - వాయుగోణులు, Z - స్వరపేటిక
జవాబు : A
7. మానవుల శ్వాసక్రియలో కీలక పాత్ర పోషించేది?
A) ఉపజిహ్విక B) జీర్ణాశయం
C) ఉదరవితానం D) ఆహారవాహిక
జవాబు : C
8. మానవుల రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్ ఏ రూపంలో రవాణా చేయబడుతుంది?
A) కార్బన్‌డైఆక్సైడ్ B) కార్బన్ మోనాక్సైడ్
C) బైకార్బొనేట్స్ D) కార్బొనేట్స్
జవాబు : C
9. వాయునాళ వ్యవస్థ ఉన్న జీవులు?
A) చేపలు B) ఉభయజీవులు
C) క్షీరదాలు D) ఆర్థోపొడా జీవులు
జవాబు : D
10. చేపల్లో ఉండే శ్వాస వ్యస్థను ...................... అంటారు.
A) చర్మీయ శ్వాసక్రియ B) వాయునాళ వ్యవస్థ
C) మొప్పల శ్వాసక్రియ D) వ్యాపనం
జవాబు : C
11. వ్యాపన పద్ధతిలో శ్వాసక్రియ జరుపుకునే జీవులు?
A) అనెలిడా జీవులు B) ప్లాటిహెల్మింథిస్ జీవులు
C) ప్రోటోజోవన్‌లు D) పొరిఫెరా జీవులు
జవాబు : C
12. చర్మీయ శ్వాసక్రియ జరుపుకునే జీవులు?
A) చేపలు B) ఉభయజీవులు
C) క్షీరదాలు D) ఆర్థోపోడ్స్
జవాబు : B
13. కాండంలో వాయుప్రసరణ జరగడానికి దోహదపడేవి?
A) పత్రరంధ్రాలు B) నిమాటోఫోర్‌లు
C) లెంటీసెల్స్ D) హైడథోడ్స్
జవాబు : C
14. శ్వాసక్రియ అనేది........?
A) విచ్ఛిన్న క్రియ B) నిర్మాణాత్మక క్రియ
C) జీవక్రియ D) A, B
జవాబు : D
15. మనం మాట్లాడగలగడానికి కారణం?
A) ఉపజిహ్విక B) ఉదరవితానం
C) గ్రసని D) స్వరపేటిక
జవాబు : D
16. మొక్కల్లో శ్వాసక్రియ జరిగే సమయం?
A) రాత్రి B) పగటివేళ
C) పగలు, రాత్రి D) ఏదీకాదు
జవాబు : C
17. 100 మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారులు.....?
A) వేగంగా శ్వాసిస్తారు B) నెమ్మదిగా శ్వాసిస్తారు
C) అసలు శ్వాస తీసుకోరు D) సాధారణంగానే శ్వాస తీసుకుంటారు
జవాబు : C
18. సున్నపుతేటను పాలలా తెల్లగా మార్చేది?
A) హైడ్రోజన్ B) ఆక్సిజన్
C) కార్బన్‌డైఆక్సైడ్ D) నైట్రోజన్
జవాబు : C
19. మాంగ్రూవ్ మొక్కల్లోని ప్రత్యేకమైన వేర్లు పీల్చే వాయువు?
A) హైడ్రోజన్ B) ఆక్సిజన్
C) కార్బన్‌డైఆక్సైడ్ D) నైట్రోజన్
జవాబు : B
20.ఈస్ట్‌ల శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు?
A) లాక్టిక్ ఆమ్లం + కార్బన్‌డైఆక్సైడ్ + శక్తి
B) ఇథనాల్ + కార్బన్‌డైఆక్సైడ్ + శక్తి
C) నీరు + కార్బన్‌డైఆక్సైడ్ + శక్తి
D) ఏదీకాదు
జవాబు : B