• facebook
  • whatsapp
  • telegram

అవగాహన ఉంటే గెలుపు బాటే

మౌఖిక పరీక్షలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికైనా విభజన అనంతర సమస్యలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వర్తమాన సంబంధితంగా సమస్యలను అర్థం చేసుకుంటే సంయమనంతో సమాధానాలు చెప్పవచ్చు.

ఏపీపీఎస్‌సీ ఇంటర్వ్యూల్లో బయోడేటా, వర్తమాన జాతీయ అంతర్జాతీయ విషయాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక, సాంస్కృతిక అంశాలు, విభజనానంతర సమస్యలు ప్రశ్నాంశాలుగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జరిగేవి గ్రూప్‌-1 స్థాయి మౌఖిక పరీక్షలు కాబట్టి అభ్యర్థి విశ్లేషణ, నిర్ణయాత్మకత ప్రధానంగా పరిశీలించవచ్చని తెలుస్తోంది.

చారిత్రక సాంస్కృతిక అంశాలు
* గౌతమీ పుత్ర శాతకర్ణి సంబంధిత అంశాలు * శాతకర్ణికి ముందు తెలుగునాడు * శాతకర్ణి అనంతర చిన్నచిన్న పాలకులు (జిల్లాల ఆధారంగా గుర్తుపెట్టుకుంటే మంచిది) * చోళుల, పల్లవుల, చాళుక్యుల ప్రభావం * తెలుగు భాషా పరిణామం-కీలక సాహిత్య అంశాలు * మతపరమైన నేపథ్యంలో ఆంధ్రనాడు * అమరావతి, సంబంధిత కాకతీయ, విజయనగర రాజ్య మూలాలు * ఆంధ్ర మూలాలుగా ఆవిర్భవించిన కళలు, సంపర్కం * బ్రిటిష్‌ కాలం నాటి కీలక ఘట్టాలు * ఆంధ్ర- ఆంధ్రప్రదేశ్‌- నవ్యాంధ్రప్రదేశ్‌ పరిణామాలు * బ్రిటిష్‌ కాలంలో ఆంధ్రప్రాంతం రాణించిన మూలాలు * సాంస్కృతిక సామాజిక ఆధునిక పోకడలు

భౌగోళిక అంశాలు
* విభజన అనంతర భౌగోళిక స్వరూపం * జిల్లాల వారీగా సమాచారం (అభ్యర్థి సొంత జిల్లాకు అధిక ప్రాధాన్యం) * ఏర్పరుస్తున్న పరిశ్రమలు, ఖనిజాలు, వనరులు * భౌగోళిక అనుగుణ్యత- అననుగుణ్యత * విపత్తు నివారణ చర్యలు * వివిధ జల వనరులు-నిర్వహణ * కృష్ణా- గోదావరి డెల్టా సమస్యలు * రాయలసీమ కరువు నివారణ

మౌలిక వనరులు
నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మూలాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణాన్ని చేపట్టాల్సివచ్చింది. వాటి గురించి సాధారణ పరిజ్ఞాన స్థాయిలో అభ్యర్థిని పరిశీలించే అవకాశం ఉంటుంది.
నౌకాశ్రయాల ఏర్పాటు, వ్యూహాత్మకంగా వాటి ప్రాధాన్యం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కొత్త విమానాశ్రయాలు, సౌర విద్యుత్‌కేంద్రాలు, నదుల అనుసంధానం, ఫైబర్‌ గ్రిడ్‌, అమరావతి కేంద్రంగా మౌలిక వనరులు ముఖ్యమైనవి.

ఆర్థిక అంశాలు
* నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం వ్యవసాయ నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తోంది? * 7 మిషన్లు, 5 గ్రిడ్లు * ఏపీ ప్రభుత్వ పర్యాటక విధానం * ప్రభుత్వం పర్యాటకరంగంపై అధిక దృష్టి పెట్టటానికి కారణాలు ఏమిటి? * సాఫ్ట్‌వేర్‌ రంగం ఏపీలో ఆశించినస్థాయిలో ముందుకు వెళ్ళకపోవటానికి కారణాలు? * ఆర్థిక ప్రగతిలో నదుల అనుసంధానం పాత్ర ఏమిటి? * పుష్కరాలు మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలపై మీ అభిప్రాయం? * రెండున్నర ఏళ్ళుగా ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి లేదంటున్న ప్రతిపక్షం వ్యాఖ్యలలోని హేతుబద్ధత ఏమిటి? * ఈ-గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందనటానికి నిదర్శనాలు? * ఈ-గవర్నెన్స్‌ ముఖ్యమంత్రి కోరికా? అవసరమా? * ఆహారశుద్ధి, వ్యవసాయానుబంధ ఉత్పత్తులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి నిలపటానికి కారణం? * సంక్షేమ పథకాలను నూతన పంథాలో ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్నదనే ప్రశంసకు కారణాలు? * వ్యవసాయ, ఇతర రుణాల మాఫీపై మీ అభిప్రాయాలు? * వ్యవసాయ భూముల క్షీణత ఏపీలో ఎక్కువగా ఉందనే విమర్శపై మీ అభిప్రాయం ఏమిటి? * ఏపీ రెవిన్యూ లోటు తగ్గేందుకు మీరేమైనా మార్గాలు చూపించగలరా? * ఏపీ బడ్జెట్‌ తయారీలో జీరో బేస్‌డ్‌ బడ్జెట్‌ వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. హేతుబద్ధమేనా? * నైపుణ్య అభివృద్ధికి ఏపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎందువల్ల?

విభజన అనంతర సమస్యలు
మౌఖిక పరీక్షలో దాదాపు ప్రతి ముగ్గురిలో ఇద్దరికైనా విభజన అనంతర సమస్యలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏపీఆర్‌ఏ- 2014ని స్థూలంగా అర్థం చేసుకుని వర్తమాన సంబంధితంగా సమస్యలను అర్థం చేసుకుంటే సంయమనంతో సమాధానాలు చెప్పవచ్చు.
* రాజధాని ఏర్పాటు సమస్యలు * షెడ్యూల్స్‌ 9,10, 13 లోని వివిధ అంశాలు * జల వనరుల విధాన సమస్యలు * ఉద్యోగ విభజన సమస్యలు
* ఆర్థిక సమస్యలు * ఆస్తుల వివాదాలు * ప్రత్యేక హోదా- ప్రత్యేక ప్యాకేజి అని విభజించుకుని అధ్యయనం చేయాలి. ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు-
1. ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణాలు ఏమిటి?
2. ప్రత్యేక ప్యాకేజి నిజంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందా?
3. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వాదన సమర్థనీయమా?
4. ఇప్పటికీ గ్రూప్‌-2, 3, ఇతర ఉద్యోగాల విభజనలు జరగకపోవటానికి కారణాలు?
5. 9,10 షెడ్యూల్‌ సంస్థలపై కేంద్రప్రభుత్వ నిర్ణయం ఏమిటి?
6. విభజన చట్టం అమలుపై వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయం?
7. చట్టంలో పేర్కొన్న వివిధ సంస్థల ఏర్పాటు ఇప్పటికే జరిగిందనే వాదనలో సత్యం ఎంత?
8. ప్రస్తుత రాజధాని నిర్మాణం ప్రజా రాజధాని కోణంలో జరుగుతోందా?

సంక్షేమ పథకాలు
* ఎన్టీఆర్‌ భరోసా * ఎన్టీఆర్‌ వైద్యసేవ * అన్న అమృత హస్తం * చంద్రన్న విద్యోన్నతి * గిరి గోరుముద్దలు * 102, 104, 108 కాల్‌ సెంటర్లు * ఉజ్వల * చంద్రన్న బీమా పథకం
ఇలాంటి పథకాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ముఖ్యంగా అమల్లో ఎదురవుతున్న సవాళ్ళు, పరిష్కార మార్గాలపై అవగాహన ఉంటే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పవచ్చు.

- కొడాలి భ‌వానీ శంక‌ర్‌

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌