• facebook
  • whatsapp
  • telegram

మార్కులు తెచ్చే విపత్తు నిర్వహణ

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం

గత దశాబ్ద కాలంగా వివిధ పోటీ పరీక్షల్లో ప్రాధాన్యం పొందిన అంశాల్లో ‘విపత్తు నిర్వహణ’ ఒకటి. దీని పరిధిలోకి వచ్చేవి ఏమిటి? వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి అధిక మార్కులు తెచ్చుకునేదెలా? నిపుణుల సూచనలు ఇవిగో!  

విపత్తు నిర్వహణను కింది అంశాలుగా విభజించుకుంటూ అధ్యయనం చేయాలి. 1. భౌగోళిక శాస్త్ర కోణం 2. విపత్తు నిర్వహణ చట్టం 3. పాలన కోణంలో విపత్తును ఎదుర్కొనే ప్రభుత్వ యంత్రాంగం - ప్రక్రియలు 4. సాంకేతికత పాత్ర.

భౌగోళిక శాస్త్ర కోణంలో...

భూకంపాలు, సునామీ, వరదలు, చక్రవాతాలు, కొండ చరియలు విరిగి పడటం, కరవు, అగ్ని పర్వతాలు మొదలైనవాటిని ప్రధాన విపత్తులుగా గుర్తించారు. ఈ విపత్తుల వెనుక ఉన్న భౌగోళిక కారణాలను సాధారణ భాషలో అవగాహన చేసుకోవాలి. భౌగోళిక శాస్త్రంలో చదువుకునే నైసర్గిక స్వరూప అంశాలు, రుతు పవన వ్యవస్థ, సముద్ర ప్రవాహాలు, ప్రపంచవ్యాప్త శీతోష్ణస్థితులు మొదలైనవాటిపై అవగాహన పెంచుకుంటే వివిధ విపత్తుల వెనకున్న భౌగోళిక అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల భౌగోళిక శాస్త్ర ప్రాథమిక అంశాలు చదివాక విపత్తు సంబంధిత పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. భౌగోళిక శాస్త్ర కోణంలోనే విపత్తులు ప్రధానంగా ఏ భౌగోళిక ప్రాంతాల్లో వస్తున్నాయి అనే కోణం కూడా పరీక్షల్లో ప్రశ్నల రూపంలో కనిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ కోణంలో విపత్తులు ఎక్కడెక్కడ సంభవించాయి అనేది పోటీ పరీక్ష అభ్యర్థులు జ్ఞాపకం పెట్టుకోవాలి.

‣ కరోనా లాంటి ప్రాణాంతకమైన సమూహ వ్యాధుల వెనుకున్న కారణాలను అర్థం చేసుకోవాలి. పెద్దఎత్తున ప్రాణ నష్టాన్నీ, ఆర్థిక నష్టాన్నీ కలుగజేస్తున్న వ్యాధులను కూడా విపత్తులుగానే పరిగణిస్తున్నారు. భౌగోళిక సంబంధం కాని విపత్తులుగా గుర్తించి ఇలాంటి వాటిని అధ్యయనం చేయాలి.

‣ మానవుడు తన స్వార్థం కోసం, ఇతరులపై ఆధిపత్యం కోసం చేపట్టిన కొన్ని పనులు జన నష్టానికీ, ఆర్థికంగా నష్టానికీ కారణం అవుతాయి. వాటిని మానవ ప్రేరేపిత విపత్తులుగా గుర్తిస్తున్నారు. యుద్ధాలు, తీవ్రవాద చర్యలు, అణు ప్రయోగాలు, అణుదాడులు, రసాయన, జీవ ఆయుధాలు, తీవ్ర కాలుష్యం, రోడ్డు, రైలు విమాన ప్రమాదాలు, భారీ తొక్కిసలాటలు, గనుల విపత్తులు ఈ విభాగానికి చెందుతాయి. 

విపత్తు నిర్వహణ చట్టం

గత దశాబ్ద కాలంలో జరిగిన పోటీపరీక్షల్లోని వివిధ ప్రశ్నపత్రాల్లో విపత్తు నిర్వహణ చట్టంలోని వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. అందువల్ల ఈ చట్టంలోని ప్రధాన నిర్దేశకాలు అన్నింటిపైనా అభ్యర్థులు పట్టు ఏర్పరచుకోవాలి. ఒక రకంగా కాబోయే ప్రభుత్వ ఉద్యోగులందరూ పాలనలో అంతర్భాగంగా విపత్తు నిర్వహణలో పాలు పంచుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ చట్టంలోని అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. చట్టాన్ని 2005లో చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ చట్టంలోని అంశాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ రూపాలు ఎలా ఉన్నాయి అనేది తులనాత్మకంగా పరిశీలించాలి. చట్టం మొత్తం చదివితే చాలా సమయం పడుతుంది. పరీక్షను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అంశాలనే చదవాలి. తెలుగులో సరిగా ఈ చట్టం పరీక్షార్థుల కోణంలో దొరకకపోవటం వల్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌లో కూడా ఈ చట్టం ఆధారంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ప్రచురణకర్తల పుస్తకాల్లో సూక్ష్మీకరించిన చట్టం అందుబాటులో ఉంది.

రిఫరెన్స్‌ పుస్తకాలు 

1. తెలుగు అకాడమీ - విపత్తు నిర్వహణ

2. ఎన్‌సీఈఆర్‌టీ 10+2 స్థాయి ప్రచురణలు.

3. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెబ్‌సైట్‌ https://ndma.gov.in/ ప్రచురణలు

4. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన బుక్‌లెట్‌. 

పాలన కోణంలో... 

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005కి లోబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేశాయి. దేశ, రాష్ట్ర జిల్లాస్థాయులకు అవి విస్తరించాయి. వేగవంతంగా స్పందించేందుకు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిస్పందన దళాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి సంస్థాగత నిర్మాణాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విధులనూ అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టంలోని అంశాలనే కాక ఇతర సంస్థాపరమైన నిర్మాణాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టాయి. ముఖ్యంగా విపత్తు అవకాశాలున్న భూభాగాలు గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా అటువంటి ప్రత్యేక ఏర్పాట్లు పరీక్ష కోణంలో దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విపత్తుల నష్టాలను తగ్గించేందుకు, ఉపశమన వ్యూహాలను అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పుస్తక రూపంలో విడుదల చేసిన ఉపశమన వ్యూహాలు అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి.

సాంకేతికత పాత్ర 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని ‘విపత్తు నిర్వహణలో సాంకేతికత పాత్ర’ చాప్టర్‌ను చదవాలి. రిమోట్‌ సెన్సింగ్, డేటా ప్రాసెసింగ్, జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టం కోణాల్లో విపత్తు నిర్వహణ అర్థం చేసుకోవాలి. విపత్తు నిర్వహణకు ప్రత్యేకంగా వాడుతున్న ఉపగ్రహ వ్యవస్థ, సెన్సార్లపై ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు రావచ్చు.
 

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌