• facebook
  • whatsapp
  • telegram

ప్రయోజనాలే ప్రమాణం! 

జనరల్‌ స్టడీస్‌ - జనరల్‌ సైన్స్‌

గ్రూప్స్‌ లాంటి పోటీ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌లో భాగంగా జనరల్‌ సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్నట్లుగా... సైన్స్‌ మానవుని జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయా అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రశ్నలడుగుతారు. అందువల్ల అనువర్తన (అప్లికేషన్‌) కోణంలో వీలైనంత బాగా చదివితే ఈ విభాగంపై పట్టు సాధించి మంచి మార్కులతో రాణించవచ్చు!  

జనరల్‌ సైన్స్‌ సిలబస్‌ మొత్తం మూడు ప్రధాన విభాగాలుగా ఉంటుంది. 1. భౌతిక, రసాయన శాస్త్రాల సాధారణ పరిజ్ఞానం 2. జంతు, వృక్ష శాస్త్రాల సాధారణ పరిజ్ఞానం 3. శాస్త్ర సాంకేతిక జ్ఞానం. మొత్తం 15- 20 ప్రశ్నలు వస్తాయనుకుంటే.. అందులో భౌతిక శాస్త్ర పరిజ్ఞానంపై 5-7 ప్రశ్నలు, జంతు శాస్త్ర పరిజ్ఞానంపై 5-7 ప్రశ్నలు, రసాయన శాస్త్రంపై 2-3 మూడు ప్రశ్నలు, వృక్ష శాస్త్రంపె 3-4 ప్రశ్నలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై 4-5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కచ్చితంగా ఇదే పరిధిలో అడగాల్సిన అవసరం లేదు. కొన్ని పరీక్షల్లో కొన్ని విభాగాలపై ఏ ప్రశ్నలూ రాలేదు. అయితే అభ్యర్థులు పైన చెప్పిన మోతాదు దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్‌ అయితే మంచి ఫలితాలు వస్తాయి.

అభ్యర్థులు గమనించాల్సిన అంశం - సైన్స్‌కి సంబంధించిన శుద్ధ శాస్త్ర అంశాలపై పోటీ పరీక్షల్లో చాలా తక్కువ ప్రశ్నలు ఇస్తారు.

శుద్ధ శాస్త్ర అంశాలంటే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సైద్ధాంతిక అంశాలు. ఈ సైద్ధాంతిక అంశాల ప్రాథమిక సమాచారంపై ప్రశ్నలుంటాయి కానీ పాఠశాల స్థాయిలో పేర్కొనే సిద్ధాంతపరమైన విషయాలపై కూడా ప్రశ్నలు రావు.

చరిత్ర, రాజ్యాంగ వ్యవస్థ లాంటి సబ్జెక్టులపై గ్రాడ్యుయేషన్‌ స్థాయి ప్రశ్నలు సాధారణంగా అడుగుతారు. కానీ జనరల్‌ సైన్స్‌ విషయంలో బాగా లోతుగా అడగదలిస్తే టెన్‌ ప్లస్‌ టు స్థాయివి అడుగుతారు. సాధారణ స్థాయిలో అడగదలిస్తే పాఠశాల స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఈ సూక్ష్మాన్ని గుర్తిస్తే ఏ విధంగా సిద్ధమవ్వాలనే విషయంలో స్పష్టత ఉంటుంది.

భౌతిక, జంతుశాస్త్రాల్లోని కొన్ని అంశాలను సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలతో అనుసంధానించి వర్తమాన కోణంలో చదివితే క్లిష్టత తగ్గుతుంది. సులభంగా అర్థమవుతాయి.

పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా తెలుగు అకాడమీ జనరల్‌ సైన్స్‌ పుస్తకాల్ని ప్రచురించలేదు. అందువల్ల ఎస్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపై ఆధారపడక తప్పదు. ప్రైవేటు ప్రచురణల్లో పాఠశాల స్థాయి సమాచారం తక్కువ; గ్రాడ్యుయేషన్‌ స్థాయి సమాచారం ఎక్కువ ఉంటుంది. పెద్ద ప్రయోజనం ఉండదు. పైగా ఆ క్లిష్టత వల్ల సమయం వృథా అధికం. అందువల్ల జనరల్‌ సైన్స్‌పై పట్టు సంపాదించేందుకు పాఠశాల పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడటం మంచిది.

భౌతిక పరిజ్ఞానం 

భౌతికశాస్త్రంలో అనేక టాపిక్స్‌ ఉన్నప్పటికీ ఎక్కువ ప్రశ్నలు- కాంతి, ఉష్ణం, పని శక్తి, చలన నియమాలు, విద్యుత్తు, ఆధునిక భౌతికశాస్త్ర అంశాలపై అడుగుతారు. ఈ అంశాలు మానవుని నిత్య జీవితంలో వివిధ రకాల ఉపయోగాల రూపంలో కనిపిస్తూనే ఉంటాయి.

భౌతిక శాస్త్రంలో వాడే వివిధ రకాల ప్రమాణాలు నిజ జీవితంలో కూడా ఉపయోగిస్తాం. అందుకే ఆ ప్రమాణాల సమాచారంపై ప్రశ్నలు వస్తాయి. 

యభౌతికశాస్త్రంలోని ఏ టాపిక్‌ నైనా మొదట ప్రమాణాలు, నిర్వచనాలు తెలుసుకుని నేరుగా ఉపయోగాలు తెలుసుకోవాలి. ఇలా చేస్తే ఆ టాపిక్‌పై 60 నుంచి 70 శాతం ప్రిపేర్‌ అయినట్లే. ఈ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని చాప్టర్స్‌ అన్నిట్లోనూ ప్రమాణాలు, మౌలిక అంశాలు, అన్వయాలు అనే మూడు కోణాల్లో ప్రిపేరయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆధునిక భౌతికశాస్త్ర అంశాల్లో మౌలిక పరిజ్ఞానం, అన్వయాలపైనే అధిక ప్రశ్నలుంటాయి. వీటిని పాఠశాల స్థాయి పుస్తకాల ద్వారా సిద్ధమైతే సులభంగా ప్రశ్నలు ఎదుర్కోవచ్చు.

పాఠశాల పుస్తకాల్లో ఇచ్చిన భౌతిక శాస్త్రవేత్తలందరి గురించి చదవాల్సిన అవసరం లేదు. న్యూటన్, ఐన్‌స్టైన్‌ మొదలైన కొద్దిమంది ప్రముఖుల సిద్ధాంతాలు తెలుసుకుంటే చాలు. 

రసాయన పరిజ్ఞానం 

రసాయనశాస్త్రంపై తక్కువ సంఖ్యలోనే ప్రశ్నలుంటాయి. పాఠశాల స్థాయి పుస్తకాల సమాచారం సరిపోతుంది.

మూలకాల వర్గీకరణపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి. సంబంధిత విషయాలపై కనీసం ఒక్క ప్రశ్న అయినా అడగటానికి అవకాశం ఉంది.

మూలకాలు, సంయోగాలు, మిశ్రమాల పరిజ్ఞానంపై ప్రశ్నలు రావచ్చు.

నిత్యజీవితంలో వినియోగించే ఆమ్లాలు-క్షారాలు సంబంధిత పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు.

ఔషధ రంగంలో ఉపయోగపడే రసాయనాలు ప్రశ్నల రూపంలో కనిపిస్తున్నాయి.

పాఠశాల స్థాయిలో కనిపించే రసాయన సమీకరణాలు, సంబంధిత సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యం ఉండదు వాటిని వదిలివేసి చదువుకోవడం మంచిది.

రిఫరెన్స్‌ పుస్తకాలు

1. పాఠశాల స్థాయి పుస్తకాల్లో ఇచ్చిన సమాచారం

2. ఎస్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణలు.

3. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ కోసం ప్రచురించిన స్పెక్ట్రమ్‌ పబ్లికేషన్స్, టాటామెక్‌గ్రాహిల్‌  పుస్తకాల్లోని సంబంధిత భాగాలు.
 

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వర్తమానం... పోటీ పరీక్షలకు ప్రాణం!

‣ చక్కగా నిద్రపోతే బాగా గుర్తుంటుంది!

‣ దక్షిణాసియా వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ

‣ వేగంగా చదివితేనే.. పాసయ్యేలా..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌