• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: అనుకూల రుతుపవనాలు

 

2. నాలుగో పంచవర్ష ప్రణాళిక విజయవంతం కాకపోవడానికి ఏర్పడిన ప్రధాన అవరోధం ఏది?
     1) బంగ్లాదేశ్ కాందీశీకుల సమస్య      2) రుతుపవనాల వైఫల్యం      3) పాకిస్థాన్‌తో యుద్ధం      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

3. ఇందిరాగాంధీ రద్దు చేసిన ప్రణాళిక ఏది?
జ: నిరంతర ప్రణాళిక

 

4. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది?
జ: 2వ

5. కిందివాటిలో మహలనోబిస్ నాలుగు రంగాల నమూనాలో అంశం కానిది ఏది?
     1) విదేశీ వ్యాపార రంగం                                      2) వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే రంగం
     3) మూలధన వస్తువులను ఉత్పత్తి చేసే రంగం     4) సేవలను ఉత్పత్తి చేసే రంగం
జ: 1(విదేశీ వ్యాపార రంగం)

 

6. నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 6వ

 

7. పంచవర్ష ప్రణాళికలు లేని కాలం ఏది?
జ: 1967

 

8. ప్రజా ప్రణాళికను రూపొందించింది ఎవరు?
జ: ఎం.ఎన్. రాయ్

 

9. సామ్యవాద దృక్పథంతో రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 2వ

 

10. కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ

 

11. ముఖర్జీ ఫార్ములా దేని స్థానంలో వచ్చింది?
జ: గాడ్గిల్ ఫార్ములా

12. మనదేశానికి ప్రణాళికా సంఘం అవసరమని సూచించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు?
జ: సుభాష్ చంద్రబోస్

 

13. కిందివాటిలో సరికానిది ఏది?
     1) ప్రణాళికా సంఘం - 1950, మార్చి 15
     2) ప్రణాళికలు - ఉమ్మడి జాబితా
     3) భారత ప్రణాళికల రూపశిల్పి - జవహర్‌లాల్ నెహ్రూ
     4) పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక
జ: 4(పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక)

 

14. కిందివాటిలో నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో చేపట్టని పథకం ఏది?
     1) పనికి ఆహార పథకం                       2) ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్
     3) కరవు ప్రాంతాల అభివృద్ధి పథకం     4) గ్రామీణ పనుల కార్యక్రమం
జ: 1(పనికి ఆహార పథకం)

 

15. ఆరో పంచవర్ష ప్రణాళిక అమలు చేసిన కాలం ఏది?
జ: 1980 - 85

 

16. భారత ఆర్థిక వ్యవస్థను సాధారణంగా కిందివిధంగా వర్ణిస్తారు?
   1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ    2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ    3) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ     4) ఏదీకాదు
జ: 2(మిశ్రమ ఆర్థిక వ్యవస్థ)

17. హరడ్ - డోమర్ వృద్ధి నమూనా ఏ ప్రణాళికకు ఆధారమైంది?
జ: 1వ

 

18. మౌలిక, భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ

 

19. సామాజిక అభివృద్ధి పథకాన్ని (సీడీపీ) ఒక తీర్థయాత్రగా ఎవరు వర్ణించారు?
జ: ఎస్.కె. డే

 

20. ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కిందివాటిలో ఏ ప్రణాళికను పిలుస్తారు?
     1) 1వ      2) 2వ      3) 10వ      4) 11వ
జ: 2(2వ)

 

21. విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం (ఫెరా) రూపొందించిన సంవత్సరం ఏది?
జ: 1973

 

22. కిందివాటిలో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగం కానిది ఏది?
     1) స్ట్రక్చరల్ రిఫారమ్స్ (నిర్మాణాత్మక సంస్కరణలు)     2) విత్తరంగ సంస్కరణలు
     3) జనాభా విధానం                                                    4) కోశ సంస్కరణలు
జ: 3(జనాభా విధానం)

 

23. 3వ పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: అశోక్ మెహతా

24. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: లకడవాలా

 

25. స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికల్లో జరిగిన కృషి వల్ల భారత ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొంటారు?
జ: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ

 

26. 4వ పంచవర్ష ప్రణాళిక దేనిపై ఆధారపడి ఉంది?
జ: గాడ్గిల్ నమూనా

 

27. కిందివాటిలో 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏవి?
     ఎ) జనాభా వృద్ధిని నిరోధించడం
     బి) వృద్ధి ప్రక్రియను కొనసాగించేందుకు అవస్థాపనా సదుపాయాలను బలోపేతం చేయడం
     సి) శతాబ్ద అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించేందుకు సరిపడే ఉపాధి సృష్టించడం
జ: ఎ, బి, సి

 

28. కిందివాటిలో రాజా చెల్లయ్య కమిటీని ఏ సంస్కరణల కోసం నియమించారు?
    1) పన్ను సంస్కరణలు    2) భూసంస్కరణలు    3) సేవా సంస్కరణలు    4) వర్తక సంస్కరణలు
జ: 1(పన్ను సంస్కరణలు)

 

29. భారత్‌లో ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యం-
     1) సాంఘిక న్యాయం                                                       2) ఆర్థిక స్వావలంబన
     3) ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచుతూ అధికవృద్ధి రేటు     4) అన్నీ
జ: 4(అన్నీ)

30. పేదరిక నిర్మూలన, స్వావలంబన లక్ష్యాలుగా ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ

Posted Date : 24-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రపంచీకరణ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారతదేశంలో 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఎల్‌పీజీ అనే అభివృద్ధి నమూనాను ప్రారంభించిన నాటి ఆర్థిక మంత్రి ఎవరు?
‌: డాక్టర్ మన్మోహన్ సింగ్

 

2. 1990-91 నాటికి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం (BOP) కరెంట్‌ఖాతా లోటు ఎంతకు చేరింది?
జ‌: 9.7 బిలియన్ డాలర్లు

 

3. 1990-91 నాటికి దేశ ద్రవ్యోల్బణ శాతం ఎంత నమోదైంది?
జ‌: 10.3%

 

4. 1990-91 నాటికి కోశపరమైన లోటు శాతం ఎంత?
జ‌: 7.8%

 

5. స్వేచ్ఛా వ్యాపార భావనను ఎవరు ప్రవేశపెట్టారు?
జ‌: ఆడమ్ స్మిత్

 

6. కిందివాటిలో సరళీకరణలో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమలు ఏవి?
      1) రక్షణ సామాగ్రి       2) అణు విద్యుదుత్పత్తి       3) రైల్వే రవాణ       4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

7. సరళీకరణ విధానంలో తప్పనిసరి లైసెన్స్ పొందాల్సిన పరిశ్రమలను 18 నుంచి ఎంతకు కుదించారు?
జ‌: 5

 

8. కిందివాటిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది?
      1) బ్యాంకులు       2) బీమా       3) పింఛను       4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

 

9. ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆచరణల చట్టాన్ని (ఎంఆర్‌టీపీ) ఏ సంవత్సరంలో చేశారు?
జ‌: 1969

 

10. 1969 లో ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు?
జ‌: ప్రొఫెసర్. పీటర్ డ్రకర్

 

11. బ్రిటన్‌లో మొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నాంది పలికిన నాటి ప్రధాని ఎవరు?
జ‌: మార్గరెట్ థాచర్

 

12. 'పెట్టుబడుల ఉపసంహరణ' కిందివాటిలో దేనిలో భాగం?
      1) సరళీకరణ       2) ప్రైవేటీకరణ       3) ప్రపంచీకరణ       4) పైవేవీ కావు
జ‌: 2(ప్రైవేటీకరణ)

 

13. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ (ప్రభుత్వ రంగ సంస్థల్లో) లక్ష్యాన్ని ఎంతగా నిర్దేశించారు?
జ‌: రూ.56,500 కోట్లు

14. జాతీయ పెట్టుబడి నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ‌: 3 నవంబరు 2005

 

15. ప్రపంచ వర్తక సంస్థ (డబ్ల్యూటీఓ) ఎప్పుడు ఏర్పడింది?
జ‌: 1995

 

16. కిందివాటిలో బహుళజాతి సంస్థ ఏది?
      1) శామ్‌సంగ్       2) వీడియోకాన్       3) గోద్రెజ్       4) డాబర్
జ‌: 1(శామ్‌సంగ్)

 

17. 2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన విదేశీమారక ద్రవ్య నిల్వలు ఎంత (బిలియన్ డాలర్లలో)?
జ‌: 350 బిలియన్ డాలర్లు

 

18. యూరో కరెన్సీ కూటమి నుంచి ఇటీవల వైదొలిగిన దేశం ఏది?
జ‌: బ్రిటన్

 

19. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది?
జ‌: 2000

 

20. కిందివాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది?
      1) అణుశక్తి       2) లాటరీ వ్యాపారం       3) చిట్‌ఫండ్ సంస్థలు       4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

Posted Date : 24-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రపంచీకరణ

* వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్నే ప్రపంచీకరణ అనవచ్చు.
* ప్రపంచదేశాల మధ్య వస్తువులు, సేవలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, శ్రమ, మానవ మూలధనం లాంటివి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమైక్యంగా సంఘటితం కావడమే ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది.
* ప్రపంచీకరణలో నాలుగు ప్రధాన అంశాలను గమనించవచ్చు.
    i) వివిధ దేశాల మధ్య వస్తుసేవల స్వేచ్ఛా ప్రవాహానికి ఉన్న అవరోధాలను తగ్గించడం.
    ii) దేశాల మధ్య మూలధన స్వేచ్ఛా ప్రవాహానికి తగిన వాతావరణాన్ని సృష్టించడం.
    iii) సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిహద్దులు దాటి, ప్రపంచమంతా విస్తరించేలా చేయడం.
    iv) దేశాల మధ్య శ్రామికుల గమనశీలతకు తగిన వాతావరణాన్ని సృష్టించడం.
* నేడు అంతర్జాలం విస్తరించిన నేపథ్యంలో ప్రపంచమే ఒక విశ్వ గ్రామంగా మారిపోయింది.
* అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) లాంటి వాటిని ప్రపంచీకరణకు ప్రతినిధులుగా చెప్పవచ్చు.
* అంతర్జాతీయీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే నిరపేక్ష, తులనాత్మక వ్యయాలు, లాభాలు ఏవిధంగా ఉద్భవిస్తాయో ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో లాంటి సంప్రదాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ వ్యాపార సూత్రాలు తెలియజేస్తాయి.

* 1980 వ దశకంలో ఆవిర్భవించిన విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ప్రాచుర్యంలోకి తెచ్చాయి.
* అంతర్జాతీయీకరణ, సరళీకరణల ఫలితమే ప్రపంచీకరణ అని చెప్పవచ్చు.
* ప్రపంచీకరణ వల్ల గ్లోబల్ మార్కెట్‌ల ఆవిర్భావం, బహుళ జాతి సంస్థల (ఎంఎన్‌సీలు) ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగడం లాంటి ప్రధాన అనుకూల అంశాలు ఏర్పడతాయి.
* రవాణ, కమ్యూనికేషన్ రంగాల శీఘ్రతర వృద్ధి వల్ల సాంకేతిక పరిజ్ఞానం బహుముఖంగా విస్తరిస్తుంది.
* ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఎన్ఏఎఫ్‌టీఏ లాంటి కూటముల ద్వారా ఏర్పడ్డ ప్రాంతీయ వర్తక మండళ్లు ప్రపంచీకరణకు తోడ్పడుతున్నాయి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వాటి మార్కెట్లలో బహుళజాతి సంస్థల పేరుతో అభివృద్ధి చెందిన దేశాల్లోని అధికోత్పత్తి, అధిక స్థాపిత శక్తి ప్రవేశించడం వల్ల ప్రపంచీకరణ పెరుగుతోంది.
* అంతర్జాతీయ వ్యాపారంలో వస్తుసేవల ఎగుమతి, దిగుమతులపై ఆంక్షల తొలగింపు, విదేశీ మారక ద్రవ్యంపై నియంత్రణలను తొలగించడం లాంటివి ప్రపంచీకరణకు అవకాశాన్ని ఏర్పరుస్తున్నాయి.
* వివిధ దేశాల విదేశీ వ్యాపార చెల్లింపు శేషంలో మార్పులు జరిగి, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడం ప్రపంచీకరణ ఫలితమే.
* వ్యాపార స్వేచ్ఛ, ప్రభుత్వ ప్రోత్సాహం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ది, పోటీతత్వం లాంటివి ప్రపంచీకరణకు మరింతగా తోడ్పడతాయి.

భారతదేశంలో ప్రపంచీకరణ

* 1980 వ దశకం ప్రారంభంలో భారతదేశ విదేశీ మూలధనానికి కల్పించిన అనేక రాయితీలు ప్రపంచీకరణకు నాంది పలికాయి.
* గతంలో బహుళజాతి సంస్థల ప్రవేశానికి అవరోధంగా ఉన్న పలు రంగాల్లో అనుమతులిచ్చారు.
* విదేశీ మారక నిరోధక చట్టం (ఎఫ్ఈఆర్ఏ) నిబంధనలను సడలించి, దాని స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (FEMA) అమల్లోకి తెచ్చారు.
* దిగుమతులను సరళీకరించారు.
* అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ) లతో కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం 1991 లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచీకరణకు బాటలు వేశాయి.
* ఆరో, ఏడో పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రభుత్వ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం లోటుతో, తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీల నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోసం సంప్రదించింది.
* అపుడు ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ భారత ప్రభుత్వాన్ని ఎల్‌పీజీ విధానాన్ని అమలు పరచాల్సిందిగా నిర్దేశించాయి. ఫలితంగా ప్రపంచీకరణ ఊపందుకుంది.

* భారతదేశంలోని అపార మానవ వనరులు, ముఖ్యంగా 400 మిలియన్లకుపైగా ఉన్న యువతకు ప్రపంచీకరణ ఫలాలు అందుకునే అవకాశం ఏర్పడింది.
* ప్రపంచీకరణతో ప్రజలు, సంస్థలు, పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగి, స్వదేశీ మార్కెట్లు విస్తరించడంతోపాటు, మన సంస్థలు కూడా వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టి, లాభాలను ఆర్జించే అవకాశం ఏర్పడింది. టాటా గ్రూపు సంస్థలు, ఎయిర్‌టెల్ లాంటివి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పెడుతున్న పెట్టుబడులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
* ప్రవాస భారతీయుల సేవలు, నైపుణ్యం, పెట్టుబడులు, అనుభవాలను కూడా ఉపయోగించుకోవచ్చు.
  ఉదా: లక్ష్మి నివాస్ మిట్టల్ లాంటి వారు భారత్‌లో ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి ఆసక్తి చూపడం.
* ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ స్థిరీకరణ, సంస్థాగత సర్దుబాట్లలో భాగంగా కోశ లోటును తగ్గించి, ద్రవ్య సప్లయ్‌ని తగ్గించడం, ఉత్పత్తి, పెట్టుబడి, ధరలపై నియంత్రణను తగ్గించి, స్వేచ్ఛా మార్కెట్ విధానాలను అనుసరించడం, విదేశీ మార్కెట్ల నుంచి వివిధ రకాల వస్తువుల, సేవల ప్రవేశానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ప్రపంచీకరణలో భాగంగా చేసినవే.
 ఉదా: భారత్‌లో శామ్‌సంగ్, ఎల్‌జీ లాంటి కంపెనీల ప్రవేశం.
* దలిప్ స్వామి చెప్పిన విధంగా 1990-91 లో భారత్‌లో ఉన్న పరిస్థితులు ప్రపంచీకరణకు పురిగొల్పాయి.
* ప్రపంచీకరణలో భాగంగా రూపాయి మారకపు విలువను తగ్గించడం (అమెరికన్ డాలర్‌తో), కరెంట్, మూలధన ఖాతాల్లో రూపాయి మారకం లాంటివి ప్రపంచీకరణలో భాగమే.

* నేడు అనేక రంగాలు 100% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వాగతిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రధానంగా కిందివాటిలోకి మాత్రం అనుమతించడం లేదు.
      i) రిటైల్ వ్యాపారం (సింగిల్ బ్రాండ్ ప్రొడక్ట్ రిటైలింగ్ మినహా)
      ii) అణుశక్తి
      iii) లాటరీ వ్యాపారం
      iv) జూదం, బెట్టింగులు
      v) చిట్‌ఫండ్ సంస్థలు
      vi) నిధి కంపెనీలు
* ప్రపంచీకరణ ప్రభావం వల్ల 1991 నాటికి సంక్షోభంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2015-16 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
* ప్రపంచీకరణ వల్ల బహుళజాతి సంస్థలు భారీగా అవతరించి, భారతీయ సంస్థలను చిన్నవిగా చేసి, అసమాన పోటీని పెంచాయి.
* అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశ వాటాను పెంచడానికి విదేశీ వ్యాపార విధానం (ఎఫ్‌టీపీ) 2015-20 ను ప్రకటించారు.
* ప్రపంచ జీడీపీలో భారతదేశ వాటా 2008-13 మధ్య 6.1% నుంచి 2014-15 కి 7 శాతానికి పెరిగింది.

* 2015-16 లో 7.6% జీడీపీ వృద్ధి రేటుతో భారత్ చైనాను కూడా అధిగమించింది.
* ఆసియా, ఇతర దేశాలతో ద్వైపాక్షిక, వ్యాపార ఒప్పందాల ద్వారా భారత్ అనేక కూటములను ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంచుకుంటోంది.
   ఉదా: SAFTA, SAPTA, BIMSTEC, BRICS లాంటివి.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థిక విధానాలు  

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత ఆర్థిక రాజ్యాంగంగా ఏ పారిశ్రామిక తీర్మానాన్ని అభివర్ణిస్తారు?
జ: పారిశ్రామిక తీర్మానం - 1956

 

2. ''వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి భూ వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు". అని నిర్వచించింది ఎవరు?
జ: ఐక్యరాజ్య సమితి

 

3. 'భారతదేశంలో భూ సంస్కరణలు' అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
జ: ముఖర్జీ

 

4. లియాంటిఫ్ వైపరీత్యం కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
      1) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, మూలధన వస్తువులనే ఎగుమతి, దిగుమతి చేయడం.
      2) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, మూలధన సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.
      3) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.
      4) శ్రమ సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి, దిగుమతి చేయడం.
జ: 3(మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.)

5. పారిశ్రామిక విధానం - 1991లోని ముఖ్యమైన ప్రతిపాదన-
జ: ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ప్రాధాన్యం ఉన్న పరిశ్రమల్లో 51% వరకు అనుమతించడం.

 

6. అధికారికంగా GATT, WTO లను ఎప్పుడు ఏర్పరిచారు?
జ: 1995

 

7. భారత్‌లో నూతన ప్రభుత్వ రంగ విధానం లక్షణం ఏమిటి?
      1) MOU పద్ధతిని ప్రవేశపెట్టడం
      2) ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ
      3) దీర్ఘరుగ్మత ఉన్న పరిశ్రమలను మూసివేయడం
      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

8. ఒక ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న హోదా పొందాలంటే-
      1) నవరత్న హోదాను కలిగి ఉండాలి.
      2) స్టాక్ మార్కెట్‌లో నమోదై షేర్స్ ట్రేడింగ్ అవుతూ ఉండాలి.
      3) వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు ఉండాలి.
      4) అన్నీ
జ: 4(అన్నీ)

9. కిందివాటిలో భూసంస్కరణల పరిధిలో లేనిది ఏది?
      1) కమతాల గరిష్ఠ పరిమితి విధింపు     2) మధ్యవర్తుల తొలగింపు
      3) భూదానోద్యమం                               4) ఏదీకాదు
జ: 3(భూదానోద్యమం)

 

10. కిందివాటిలో Soft loan window ద్వారా రుణాలు అందించేది-
      1) అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ       2) ప్రపంచ బ్యాంకు
      3) అంతర్జాతీయ ద్రవ్యనిధి                4) ప్రపంచ వాణిజ్య సంస్థ
జ: 1(అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ)

 

11. మనదేశంలో భూసంస్కరణల ముఖ్య లక్ష్యం ఏమిటి?
జ: భూమి సాగుచేసే వారికి భద్రత కల్పించడం.

 

12. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం.

 

13. భారతదేశంలో హరిత విప్లవం ఏ పంటల దిగుబడిలో ఎక్కువగా విజయవంతమైంది?
జ: గోధుమ, వరి

 

14. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు (DIC) అనే భావనను ప్రవేశపెట్టింది-
జ: జనతా ప్రభుత్వం (1977)

15. సభ్యదేశాలకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs)ను కల్పించే అంతర్జాతీయ సంస్థ ఏది?
జ: అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)

 

16. లియాంటిఫ్ వైపరీత్యం దేని దత్తాంశ పరీక్షకు సంబంధించింది?
జ: హెక్సర్ - ఒహ్లిన్

 

17. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏ రూపంలో విదేశీ పెట్టుబడి ఉండాలి?
జ: పోర్టుపోలియో నిధులు

 

18. కిందివాటిలో దేన్ని తగ్గించడం FRBM ముఖ్య లక్ష్యం?
      1) బడ్జెట్ లోటు       2) రాబడి లోటు       3) బహిర్గత లోటు       4) బ్యాంకింగ్ లోటు
జ: 2(రాబడి లోటు)

 

19. 1894 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి కింది ఏ భూమిని తీసుకునే అర్హత ఉంది?
      1) ప్రజా ప్రయోజనార్థం ఎవరి నుంచైనా భూసేకరణ
      2) ప్రైవేటు ఉద్దేశానికి ఎవరి నుంచైనా భూసేకరణ
      3) కార్పొరేట్ రంగం నుంచి భూసేకరణ
      4) ఉన్నత శ్రేణి కుటుంబాల నుంచి భూసేకరణ
జ: 1(ప్రజా ప్రయోజనార్థం ఎవరి నుంచైనా భూసేకరణ)

20. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1995

 

21. భారత్‌లో చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కారణం ఏమిటి?
జ: ఉద్యోగ అవకాశాలను విస్తరించడం

 

22. ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయకుండా ఒంటరిగా ఉండిపోతే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?
జ: ఇనుపతెర ఆర్థిక వ్యవస్థ

 

23. లక్ష్య నిర్ధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేది-
జ: బడుగు, పేదవారికి మాత్రమే

 

24. గ్రామీణ పరపతి కోసం ఏర్పరిచిన శిఖరాగ్ర వ్యవస్థ-
జ: నాబార్డు

 

25. జిల్లా స్థాయిలో గ్రామీణ పారిశ్రామికీకరణను ప్రోత్సహించే మూలాధార ఏజెన్సీ ఏది?
జ: డీఐసీ

 

26. మొదటిసారిగా ఏ దేశంలో పారిశ్రామిక విప్లవం ఏర్పడింది?
జ: ఇంగ్లండ్

 

27. అభిలషణీయ సుంకం అనేది-
జ: వ్యాపార షరతులను మెరుగుపరుస్తుంది

28. మేధోసంపత్తి హక్కులు (IPR) అమలు కావడం వల్ల సంభవించే పరిణామం ఏమిటి?
జ: నూతన ఆలోచనలు, పరిశోధనలను విస్తృతంగా ఉపయోగించడం

 

29. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధరల వ్యవస్థ దేని కేటాయింపులను నిర్ణయిస్తుంది?
జ: వనరులు

 

30. అంతర్జాతీయ వ్యాపారంలో ఆంక్షలున్న వర్తక విధానాన్ని ఏమని పిలుస్తారు?
జ: రక్షణ

Posted Date : 24-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక వృద్ధి - అభివృద్ధి భావనలు

    రెండో ప్రపంచ యుద్ధం చివరివరకూ పేద దేశాల సమస్యలపై ఆర్థికవేత్తలు దృష్టి సారించలేదు. పెట్టుబడిదారీ, వృద్ధి చెందిన దేశాల అస్థిరత్వ, వ్యాపార చక్రాల సమస్యల గురించే శ్రద్ధ వహించారు. వలస పాలిత దేశాల స్వాతంత్య్రంతో, మూడో ప్రపంచ దేశాలు తెర ముందుకు వచ్చాయి. 1950వ దశకం నుంచి వృద్ధి, అభివృద్ధి అనే రెండు సమస్యలను గుర్తించారు. ఆర్థిక వ్యవస్థ స్వభావం, అభివృద్ధి స్థాయులతో సంబంధం లేకుండా, ప్రతి దేశం శీఘ్రవృద్ధి, అభివృద్ధి అనే ధ్యేయంతో ఉన్నాయి.
     నిత్య జీవితంలో అభివృద్ధి అనే పదాన్ని తరచుగా వింటుంటాం. సాధారణంగా అభివృద్ధి అనే పదాన్ని బాగుపడటం, పురోగతి సాధించడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. అంటే ఆర్థికాభివృద్ధిని (Economic Development), ఆర్థిక వృద్ధిని (Economic Growth) పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ హిక్స్, షుంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు చూపించారు.

 

ఆర్థిక వృద్ధి:
     'దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి తెలియజేస్తుంది'. ఈ నిర్వచనంలో దీర్ఘకాలం, తలసరి, వాస్తవ అనే మూడు పదాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి.
ఎ) జాతీయోత్పత్తిలో పెరుగుదల అనేది వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా సంభవించవచ్చు. దీన్ని ఆర్థిక వృద్ధిగా పరిగణించరు. జాతీయోత్పత్తి పెరుగుదల అనేది దీర్ఘకాలంలో కొనసాగాలి.

బి) స్థూల జాతీయోత్పత్తి కంటే జనాభా వేగంగా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి జనాభా పెరుగుదల కంటే స్థూల జాతీయోత్పత్తి ఎక్కువ రేటులో పెరగాలి. అందుకే తలసరి స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఆర్థిక వృద్ధిని నిర్వచిస్తారు.
సి) ధరల పెరుగుదల వల్ల జాతీయాదాయం పెరగవచ్చు. ఆ రకమైన పెరుగుదల ఆర్థిక వృద్ధి కాదు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించి స్థిర ధరల్లో లెక్కించిన వాస్తవ జాతీయాదాయ పెరుగుదలే ఆర్థిక వృద్ధి.
ఆర్థికవేత్తల అభిప్రాయంలో ఒక దేశ ఆర్ధిక వృద్ధి కింది నాలుగు కారణాలపై ఆధారపడి ఉంటుంది.
    i) శ్రామిక శక్తి, నాణ్యత, పరిమాణం
    ii) భూమి, ఇతర సహజ వనరులు అధికంగా ఉండటం
    iii) మూలధన కల్పన ఎక్కువగా ఉండటం
    iv) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, నవకల్పనలు
ఆర్థిక వృద్ధి సూచికలు: ఒక దేశంలో జరిగే ఆర్థిక వృద్ధిని కింది సూచికల ద్వారా లెక్కిస్తారు.
    ఎ) నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి
    బి) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి
    సి) నామమాత్రపు తలసరి ఆదాయం
    డి) వాస్తవ తలసరి ఆదాయం

ఆధునిక ఆర్థిక వృద్ధి లక్షణాలు:
     ఆధునిక ఆర్థిక వృద్ధి ఒక ప్రత్యేకమైన ఆర్థిక శకాన్ని సూచిస్తుంది. ప్రొఫెసర్ సైమన్ కుజ్నెట్స్ ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల చారిత్రక అనుభవాల దృష్ట్యా ఆధునిక ఆర్థికవృద్ధికి సంబంధించి ఆరు లక్షణాలను గుర్తించారు.
1. తలసరి ఉత్పత్తి, జనాభా పెరుగదల
2. తలసరి ఉత్పత్తి సామర్థ్యం పెరగడం
3. నిర్మాణాత్మక మార్పుల రేటు ఎక్కువగా ఉండటం
4. సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామికీకరణ, రవాణా, సమాచార సౌకర్యాల పెరుగుదల వల్ల పట్టణీకరణ పెరగడం
5. అభివృద్ధి చెందిన దేశాల పరదేశ విస్తరణ
6. మూలధనం, వస్తువులు, మానవ వనరుల అంతర్జాతీయ ప్రవాహాలు

 

ఆర్థికాభివృద్ధి (Economic Development)
    ఆర్థికాభివృద్ధి అంటే ఉత్పత్తిలో పెరుగుదలే కాకుండా, ఆ పెరుగుదలను సాధించడానికి అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూర్వక, సాంఘిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పును కూడా సూచిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధి కంటే ఎక్కువ సమగ్రమైంది. వస్తువుల స్వరూపంలో, వస్తూత్పత్తికి ఉపయోగించే సాంకేతిక ఉత్పత్తి పద్ధతుల్లో; ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల స్వరూపంలో ఉత్పత్తిని ప్రభావితం చేసే సాంఘిక, ఆర్థిక వ్యవస్థల్లో; సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆర్థికాభివృద్ధిలో ఈ వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులు ఇమిడి ఉంటాయి.

ఆర్థికాభివృద్ధి లక్షణాలు

* తలసరి వాస్తవ జాతీయాదాయంలో పెరుగుదల.
* ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం.
* ఆర్థిక వ్యవస్థలో సంస్థాగత, సాంకేతిక మార్పులు రావడం.
* పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు తగ్గి, ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడటం.
* సంపద సమానంగా, న్యాయంగా పంపిణీ కావడం.
* నిర్ణయాల్లో సాధికారత పెరగడం.

 

ఆర్థికాభివృద్ధి - వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాలు

గున్నార్ మిర్దాల్: ఆర్థిక వ్యవస్థ, పూర్తి సాంఘిక వ్యవస్థ కింది స్థాయి నుంచి పైస్థాయికి కదలడాన్నే ఆర్థికాభివృద్ధి అంటారు.
డడ్లీశీర్స్: ఏ దేశంలోనైతే పేదరికాన్ని అసమానతలను, నిరుద్యోగితను వాటి అధిక స్థాయుల నుంచి తగ్గించగలుగుతారో, ఆ దేశంలో ఆ కాలాన్ని అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు.
సి.ఇ. బ్లాక్: ఒక దేశం అనేక ఆధునికీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి అవుతుంది.
మైఖేల్.పి. తొడారో: ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. సామాజిక నిర్మాణంలో ప్రజామోదమైన వైఖరులు, జాతీయ సంస్థల్లో చెప్పుకోదగిన మార్పులు ఈ ప్రక్రియలో భాగం. అంతేకాకుండా త్వరితగతిన ఆదాయ పెరుగుదల, అసమానతల తగ్గుదల, సాపేక్ష పేదరిక నిర్మూలన ఈ ప్రక్రియలో ఉంటాయి.

కిండల్ బెర్జర్: ఆర్థికాభివృద్ధి అంటే ఉత్పత్తిలో పెరుగుదలే కాకుండా, ఆ పెరుగుదలను సాధించడానికి అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూర్వక మార్పులు కూడా ఇమిడి ఉంటాయి.
జి.ఇ. మేయర్, జె.ఇ. రాచ్: అమెరికా డాలర్లలో లెక్కించిన తలసరి జాతీయాదాయం దీర్ఘకాల పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు.
కొలిన్ క్లార్క్: వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక, సేవా రంగాలకు శ్రామికులు తరలివెళ్లడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు.
సుమన్. కె. ముఖర్జీ: ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వస్తు, సేవల సగటు ఉత్పత్తిలో నిరంతర పెరుగుదలను తెచ్చే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి.

 

ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు:
* ఆర్థిక వృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల.
* సామాజిక న్యాయం చేకూర్చడం.
* సాంకేతిక నైపుణ్యంలో పెరుగుదల.
* ఆర్థిక స్థిరీకరణ.
* సమ్మిళితమైన అభివృద్ధి.
* ఆర్థిక స్వావలంబన.

ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు:
* సహజ వనరుల లభ్యత.
* మూలధన లభ్యత.
* సాంకేతిక అభివృద్ధి.
* మూలధన ఉత్పత్తి నిష్పత్తి.
* మానవ వనరుల సద్వినియోగం.
* సమర్థవంతమైన ఉద్యమిత్వం.
* నిర్మాణాత్మక మార్పులు సంభవించడం.
* విదేశీ వ్యాపారం, విదేశీ మూలధనం.
* ప్రభుత్వ పాత్ర.
* సాంఘిక వ్యవస్థ అనుకూలత, రాజకీయ స్థిరత్వం.

 

ఆర్థికాభివృద్ధికి నిరోధకాలు:
* మూలధన పెరుగుదల రేటు తక్కువగా ఉండటం.
* పేదరిక విష వలయాలు
* మార్కెట్ అసంపూర్ణతలు.

* అల్ప సాంకేతిక పరిజ్ఞానం
* మూలధన ఉత్పత్తి - నిష్పత్తి ఎక్కువగా ఉండటం.
* అభివృద్ధి చెందని మానవ వనరులు.
* వ్యవసాయ రంగ ప్రగతి తక్కువగా ఉండటం.
* ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
* విదేశీ వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటం.
* ప్రదర్శనా ప్రభావానికి గురికావడం
* జాతీయాదాయ వృద్ధిరేటు కంటే జనాభా వృద్ధిరేటు ఎక్కువగా ఉండటం.
* సామాజిక కారణాలు.

 

నిలకడ గల అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి (Sustainable Development)

     సహజ వనరుల క్షీణత జరగకుండా ఆర్థికాభివృద్ధిని సాధించడాన్నే 'నిలకడ గల అభివృద్ధిగా చెప్పవచ్చు. ఒకవైపు మానవుల జీవన విధానాన్ని, శ్రేయస్సును పెంచవలసిన అవసరానికి, మరోవైపు భవిష్యత్ తరాలవారు ఆధారపడే సహజ వనరులు, జీవావరణ వ్యవస్థ సంరక్షణకు మధ్య సున్నితమైన సంతులనాన్ని సాధించడాన్నే నిలకడ గల అభివృద్ధి తెలియజేస్తుంది.

       ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్, 'అవర్ కామన్ ఫ్యూచర్' అనే సెమినార్ నివేదికలో మొదటిసారిగా నిలకడగల అభివృద్ధి అనే పదాన్ని ఉపయోగించింది. ఐక్య రాజ్య సమితి ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం 'నేటితరం ప్రజల అవసరాలు ఇదే స్థాయిలో తీరుస్తూ, భావితరాల అవసరాలతో ఏ విధంగానూ రాజీ పడకుండా చూడటమే నిలకడ గల అభివృద్ధి.'
* 1987లో బ్రట్‌లాండ్ కమిషన్ 'భవిష్యత్ తరాలవారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలవారు తమ అవసరాలు తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి' అని నిర్వచించింది. మరోవిధంగా చెప్పాలంటే దీర్ఘకాలంలో మానవుల అత్యవసర అవసరాలను సంతృప్తిపరిచే లక్ష్యంతో మానవ, ప్రకృతి, ఆర్థిక వనరుల సమర్థమైన నిర్వహణను ఈ భావన తెలియజేస్తుంది.

 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు:
* సుస్థిర అభివృద్ధి అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే ఉద్దేశంతో ఉంటుంది.
* సుస్థిర అభివృద్ధిలో భౌతిక, మానవపరమైన సహజ మూలధనాలను పరిరక్షించి, నియమబద్ధంగా ఉపయోగిస్తారు.
* ఆర్థికాభివృద్ధి పర్యావరణ క్షీణతకు దారితీస్తూ, నాణ్యమైన జీవన విధానానికి హాని కలిగించే రీతిలో ఉండకూడదు.
* సుస్థిర అభివృద్ధి జీవ వైవిధ్య రక్షణకు ప్రాధాన్యాన్నిస్తుంది.
* పర్యావరణానికి ఉన్న శోషక సామర్థ్యాన్ని (absorbing capacity) దృష్టిలో ఉంచుకుని ఆర్థిక కార్యకలాపాలకు పరిమితులను విధిస్తుంది.

సమ్మిళిత వృద్ధి భావన (Concept of Inclusive Growth)

    భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక అంశాల్లో సంతృప్తికరమైన ప్రగతి సాధించినా, సంస్కరణల కాలంలో పేదరిక నిర్మూలన, గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు; ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు అంతగా తగ్గలేదు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు స్వల్పంగా ఉండి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పదకొండో ప్రణాళికలో సమ్మిళిత, సుస్థిర వృద్ధి లక్ష్యానికి ప్రాధాన్యమిచ్చారు. పన్నెండో ప్రణాళికలో కూడా దీన్ని కొనసాగించారు.
'సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందే విధంగా వనరులను న్యాయబద్ధంగా కేటాయించడం ద్వారా సాధించే అభివృద్ధిని సమ్మిళిత అభివృద్ధి'గా నిర్వచించవచ్చు.
* సమ్మిళిత వృద్ధి అనేది ఒక విస్తృత భావన. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలు ఇందులో అంతర్భాగాలు. వ్యవసాయ రంగంలో వృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, న్యాయబద్ధమైన వృద్ధి, వైద్య సదుపాయాలు, అందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్య అందుబాటు, ఉన్నత విద్యలో నమోదు, నాణ్యత పెరగడం, నైపుణ్యాల పెంపు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ లాంటి అంశాలు భారతదేశ సమ్మిళిత వృద్ధిలో ప్రధాన భాగాలుగా ఉన్నాయి.
ప్రధాన లక్ష్యం: ఇప్పటివరకూ విస్మరించిన వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడమే సమ్మిళిత వృద్ధి ప్రధాన లక్ష్యం. ఆర్థిక వ్యవస్థ సమవృద్ధి మార్గంలో ముందుకు వెళ్లడానికి ఈ లక్ష్య సాధన వీలు కల్పిస్తుంది.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వృద్ధి - అభివృద్ధి

       ప్రతి దేశం ఆర్థికాభివృద్ధిని చేరుకున్న తర్వాత మాత్రమే వృద్ధిని చేరుకుంటుంది. ఉత్పత్తిలోని పెరుగుదలనే వృద్ధి అంటారు. ఆర్థికాభివృద్ధికి అవస్థాపన, వ్యవస్థాపన, సాంకేతిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా నిదాన, సత్వర వృద్ధిని సాధించాలంటే తప్పకుండా ఆర్థికాభివృద్ధిని చేరుకోవాల్సిందే. 'వృద్ధి'ని పరిగణించే సమయంలో ఒకే ఒక అంశాన్ని (ఆదాయం) పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని ఏకముఖ వ్యూహం అంటారు. ఆర్థికాభివృద్ధిలో అనేక అంశాలు (బహుముఖ వ్యూహం) ఉంటాయి. కాబట్టి వృద్ధి కంటే ఆర్థికాభివృద్ధి సమస్యాత్మకమైంది. వర్ధమాన దేశాలన్నీ ఆర్థికాభివృద్ధిలోనే ఉన్నాయి. కిండ్లే బర్గర్ ప్రకారం వృద్ధిని మనిషి శారీరక పెరుగుదలతో పోలిస్తే... ఆర్థికాభివృద్ధిని మనిషి శారీరక, మానసిక అంశాలతో పోల్చవచ్చు. అనేకమంది ఆర్థికవేత్తలు వృద్ధి, ఆర్థికాభివృద్ధికి మధ్య తేడా లేదని భావించారు. షుంపీటర్, ఉర్సుల హిక్స్ ప్రకారం రెండింటి మధ్య తేడా ఉంది. చమురు దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించకుండానే వృద్ధిని చేరుకున్నాయి.
 

ఆర్థికవృద్ధి (Growth)
* దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల.

* ఇది పరిమాణాత్మక మార్పును తెలుపుతుంది.
     ఉదా: దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల.
* దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదల.
* జాతీయోత్పత్తి పెరుగుదల వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా పెరగవచ్చు కానీ, అసలైన వృద్ధి కాదు. జాతీయోత్పత్తి పెరుగుదల దీర్ఘకాలంగా కొనసాగాలి.

 

ఆర్థికాభివృద్ధి (Development)
* దేశంలో ఉత్పత్తి పెరుగుదలతోపాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పు ఆర్థికాభివృద్ధి.

* ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఉత్పాదక పెరుగుదల = ఆర్థికవృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పంపిణీ = వృద్ధి + సంక్షేమం
 

ఆర్థికాభివృద్ధి నిర్వచనాలు:
 

1. గున్నార్ మిర్డాల్: మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు సాగడమే ఆర్థికాభివృద్ధి.

2. జాన్ రాబిన్ సన్: దేశం ఆర్థికాభివృద్ధి దాటి వృద్ధిని చేరుకుంటే అది స్వర్ణయుగం.
3. గెరాల్డ్ మేయర్: దీర్ఘకాలంలో తలసరి ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థికాభివృద్ధి అంటారు.
4. హేగెన్: ఆర్థికాభివృద్ధి అంతులేకుండా నిత్యం జరిగే ప్రక్రియ.
5. కొలిన్ క్లార్క్: వ్యవసాయ రంగంలోని ప్రజలు పారిశ్రామిక, సేవల రంగానికి నిరంతరంగా తరలిపోవడం ఆర్థికాభివృద్ధి.
6. సి.ఇ. బ్లాక్: అనేక ఆధునికీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి.
7. ఆచార్య మైఖేల్, పి. తోడారో: ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ.
8. జె.ఇ. మేయర్, జె.ఇ. రాచ్: తలసరి జాతీయాదాయం దీర్ఘకాల పెరుగుదలే ఆర్థికాభివృద్ధి.
9. డడ్లీ శీర్స్: పేదరికాన్ని, అసమానతలను, నిరుద్యోగితను వాటి అధిక స్థాయిల నుంచి తగ్గిస్తే దాన్ని అభివృద్ధి కాలం అంటారు.

 

ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉన్న అంశాలు
1. తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల.

2. ఆర్థిక వ్యవస్థలో ఆభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం.
3. పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరగడం.
4. సంస్థాగత సాంకేతిక మార్పులు రావడం.
5. పైవన్నీ దీర్ఘకాలంలో కొనసాగడం.
ఉదా: లాటిన్ అమెరికాలోని లైబీరియాలో అరటిపండ్ల ఎగుమతి ద్వారా, అరబ్ దేశాల్లో పెట్రోలియం ఎగుమతి ద్వారా జాతీయాదాయం, తలసరి ఆదాయం పెరిగినప్పటికీ అవి స్వయంసమృద్ధి సాధించలేదు.
* రాబర్ట్ క్లేవర్ ''Growth without Development'' అనే గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఎలా జరుగుతుందో చెప్పారు. దీనివల్ల ఆ దేశ ప్రతిఫలాలు కొద్దిమందికే అందుతున్నాయి. సామాన్య ప్రజానీకం పేదరికంలో మగ్గుతున్నారు.

 

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు:
* ప్రారంభంలో ఈ పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించేవారు.

* హిక్స్, షుంపీటర్ ఈ పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సూచించారు.
* వృద్ధి, అభివృద్ధి అనే పదాలు 1960లో ప్రాచుర్యంలోకి వచ్చాయి.

 

       ఆర్థికవృద్ధి                   ఆర్థికాభివృద్థి
 1.       ఉత్పత్తి పెరుగుదలలో మార్పులు.  1.       ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత, సాంకేతిక, అవస్థాపక, వ్యవస్థాపక మార్పులను సూచిస్తుంది.
 2. ఇది పరిమాణాత్మకమైంది.  2. ఇది గుణాత్మకమైంది.
 3. దీన్ని కొలవచ్చు.  3. దీన్ని కొలవలేం.
 4. ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు.  4. ప్రభుత్వ ప్రమేయం అవసరం.
 5. ఇది దృగ్విషమైంది/ఏకమైంది.  5. ఇది బహుముఖమైంది.
 6.      ఇది సంకుచితమైంది/ఇది సూక్ష్మ (micro) స్వభావం ఉన్నది.  6. విస్తృతమైంది/ఇది స్థూల (macro) స్వభావం ఉంది.
 7. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు (OECD) వర్తిస్తుంది.  7. అభివృద్ధి చెందుతున్న (వర్ధమాన) దేశాలకు వర్తిస్తుంది.
8. సంస్థాగత మార్పులు లేకుండా పెరుగుదలను సూచిస్తుంది. 8. సంస్థాగత, సాంకేతిక మార్పులను సూచిస్తుంది.
9. కిండల్ బర్గర్ ప్రకారం వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలిపేది. 9. శారీరక పెరుగుదలతోపాటు మానసిక పరిపక్వతను కూడా సూచించేది.
10. ఇది స్వల్ప కాలానికి సంబంధించింది. 10. ఇది దీర్ఘకాలానికి సంబంధించింది.
11. పంపిణీని సూచించదు. 11. పంపిణీని సూచిస్తుంది.
12. ఆదాయం, సంపద లాంటి వాటి పంపిణీని తెలపదు. 12. ఆదాయం, సంపద లాంటివాటి పంపిణీని ఆర్థికాభివృద్ధి తెలియజేస్తుంది.
13. ప్రభుత్వ జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. 13. ప్రభుత్వ విధానాల ద్వారా ఉద్దేశపూర్వకంగా వివిధ మార్పులు చేసి సాధించే దాన్నే ఆర్థికాభివృద్ధిగా వర్ణించవచ్చు.
14. ఆర్థికవృద్ధిని ఆదాయం లేదా సంపదతో అంచనా వేస్తారు. 14. ఆర్థికాభివృద్ధిని గుణాత్మక అంశాలైన నిరుద్యోగం, పేదరికం, మానవ వనరుల అభివృద్ధి, జీవన ప్రమాణం స్థాయి లాంటి వాటిలో వచ్చిన మార్పులు ఆధారంగా అంచనా వేస్తారు.
15. ఆర్థికవృద్ధితో ఆర్థిక మార్పులను సాధించవచ్చు. కానీ సామాజిక మార్పులను సూచించదు. 15. ఆర్థికాభివృద్ధితో ఆర్థిక మార్పులతో పాటు సామాజిక మార్పులు సాధించవచ్చు.

అల్పాభివృద్ధి దేశాల లక్షణాలు (Characteristics of Under Development Countries)
 

1. మూలధనం కొరత: అల్పాభివృద్ధి /అభివృద్ధి చెందుతున్న/ వెనుకబడిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువ కాబట్టి పొదుపు సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా మూలధనం కొరత ఏర్పడుతుంది.
షుంపీటర్: ఆర్థికాభివృద్ధికి అవసరమైన చొరవతో ముందుకు వచ్చే వ్యవస్థాపకుల కొరత వల్ల కూడా పెట్టుబడి తక్కువ స్థాయిలో ఉంటుంది.
* కొద్దిమంది ధనవంతులకు వడ్డీలు, భాటకం రూపంలో ఆదాయం వచ్చినప్పటికీ వారు ఆడంబర వినియోగంపై ఖర్చు చేస్తారు. కానీ పొదుపు చేసి పెట్టుబడులు పెట్టరు.
* భారతదేశంలో తక్కువ (తలసరి) ఆదాయం, అధిక వినియోగ వ్యయం వల్ల పొదుపుస్థాయి తక్కువగా ఉంది.
* మనదేశంలో తలసరి మూలధన లభ్యత తక్కువగా ఉంది.
* మూలధన కల్పన రేటు కూడా తక్కువగా ఉంది.
* ఈ మధ్యలో కాలంలో మూలధన కల్పన రేటు పెరిగింది. ఇది కోరదగిన మంచి పరిణామంగా చెప్పవచ్చు.
* 1950 - 51లో GDPలో పొదుపు శాతం 8.6%గా ఉండేది.
* 2007 - 08లో GDPలో పొదుపు శాతం గరిష్ఠంగా 36.8%కు పెరిగింది.
* 2012 - 13లో GDPలో పొదుపు శాతం 31.8%కు చేరింది.
* స్థూల దేశీయ పొదుపునకు ప్రభుత్వ, కార్పొరేటు, గృహ రంగాల నుంచి పొదుపుల వనరులు లభ్యమవుతున్నాయి. వీటిలో ఎక్కువ గృహ రంగం నుంచి లభిస్తోంది.
* 2013 - 14లో స్థూల దేశీయ పొదుపు 30.6% కాగా ఇందులో మొదటి స్థానం గృహ రంగానిది 18.2%గా ఉంది. 10.9% కార్పొరేట్ రంగానిది 2వ స్థానం.
* స్థిర మూలధన కల్పన పెట్టుబడి కూడా పెరుగుతూ వస్తోంది.
* 2013 - 14 నుంచి పెట్టుబడిలో అత్యధిక వాటా కార్పొరేట్ రంగానిదే (12.6%). తర్వాత స్థానం గృహ రంగానిది (10.7%).

   1) సహజవనరులు - అల్పవినియోగం                            1) కులతత్వం

2) మానవ వనరులు - నైపుణ్యం కొరత                            2) మతతత్వం

3) మూలధనం కొరత                                                     3) సాంఘిక ఆచార వ్యవహారాలు

4) పేదరిక విషవలయాలు                                              4) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

5) అల్ప సాంకేతిక పరిజ్ఞానం                                          5) సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం

6) మార్కెట్ అసంపూర్ణతలు
   ఎ) శ్రమ విభజన లేకపోవడం
  బి) ఉత్పత్తి కారకాల గమన శీలత లేకపోవడం
  సి) ఏకస్వామ్య ధోరణులు
  డి) ధరల దృఢత్వం ఉండటం
  ఇ) మార్కెట్ సమాచారం అందుబాటులో లేకపోవడం

 

2. విదేశీ కారకాలు
   1) గతంలో వలసవాదానికి గురై ఉండటం
   2) ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం
   3) అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం

 

ఆర్థికాభివృద్ధికి ఆధారాలు:

విదేశీ వ్యాపారం:
* సాధారణంగా అల్పాభివృద్ధి దేశాలు ముడిసరకులు, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేసి, వినియోగ/ మూలధన వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతింటాయి.
* మనదేశం ముడిసరకులు ఎగుమతి చేసే స్థాయి నుంచి ఇంజినీరింగ్ వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
* భారత ఆర్థిక వ్యవస్థలో అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉన్నప్పటికీ, ప్రణాళికలు అమలుపరచి అభివృద్ధి దిశగా పయనించడం వల్ల పరిమాణాత్మక, వ్యవస్థాపూర్వక మార్పులు వచ్చాయి. అందువల్ల మనదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలవొచ్చు.

 

ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు:
 

1) అభివృద్ధి చెందిన దేశాలు
    ఉదా: యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్
2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
    ఉదా: భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రెజిల్
3) తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు
    ఉదా: భూటాన్, నేపాల్, ఆఫ్ఘానిస్థాన్, సబ్-సహారా దేశాలు, సూడాన్, చాద్

 

ప్రపంచ బ్యాంకు వర్గీకరణ:
* ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక (WDR)ను 2016, జులై 1న విడుదల చేసింది.

* తలసరి జీడీపీ ఆధారంగా వర్గీకరణ
* ప్రపంచ అభివృద్ధి నివేదిక సారాంశం - డిజిటల్ డివిడెంట్ (ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వృద్ధి, ఉద్యోగిత, సేవలు)
* ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు - జిమ్ యాంగ్ కిమ్.
* ప్రపంచ బ్యాంకు GNI, PCIలను ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది.
* GNI తలసరి ఆదాయాన్ని గణించడానికి ప్రపంచ బ్యాంకు 'వరల్డ్ అట్లాస్ మెథడ్‌'ను ఉపయోగిస్తుంది.

 

1. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు (Upper Income Countries):

* 12,476 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు
    ఉదా: యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఓఈసీడీ దేశాలు, రష్యా, సింగపూర్, జపాన్

 

2. మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు (Middle Income Countries):
* 1,025 డాలర్ల నుంచి 12,475 డాలర్లు

ఎ) ఎగువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు
* 4,036 డాలర్ల నుంచి 12,475 డాలర్లు
ఉదా: మాల్దీవులు, చైనా, మెక్సికో, బ్రెజిల్
బి) దిగువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు
* 1,025 డాలర్ల నుంచి 4,035 డాలర్లు
ఉదా: భూటాన్, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక

 

3. తక్కువ ఆదాయం ఉన్న దేశాలు:
* 1025 లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు

    ఉదా: ఆఫ్గానిస్థాన్, నేపాల్, సబ్ సహారా దేశాలు
* భారతదేశం ప్రపంచ జనాభాలో 17.6%, ప్రపంచ స్థూల జాతీయాదాయంలో 2.5% వాటాను కలిగి ఉంది. చైనా ప్రపంచ జనాభాలో 19%, స్థూల జాతీయ ఆదాయంలో 12% వాటా కలిగి ఉంది.
* వేగవంతంగా ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణం చెందే దేశాలను ఎమర్జింగ్ మార్కెట్ అంటారు.
    ఉదా: భారతదేశం, చైనా

 

ఐక్యరాజ్యసమితి వర్గీకరణ:
 

1. మొదటి ప్రపంచ దేశాలు:
* పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలను మొదటి ప్రపంచ దేశాలుగా పిలుస్తారు.
    ఉదా: యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా

 

2. రెండో ప్రపంచ దేశాలు:
* సామ్యవాద లేదా కమ్యూనిస్టు దేశాలైన పూర్వ రష్యా, క్యూబా, చైనా దేశాలను రెండో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు.

 

3. మూడో ప్రపంచ దేశాలు:
* అభివృద్ధి చెందుతున్న, అలీన దేశాలు.
    ఉదా: భారతదేశం, ఇండోనేషియా, ఈజిప్ట్

 

4. నాలుగో ప్రపంచ దేశాలు:
* అల్ప అభివృద్ధి చెందిన దేశాలు లేదా అభివృద్ధి చెందని దేశాలు.
    ఉదా: నేపాల్, భూటాన్, సబ్-సహారా దేశాలు, సూడాన్, చాద్.

 

5. అయిదో ప్రపంచ దేశాలు:
* వివిధ దేశాల్లోని గిరిజన తెగల ప్రజలను అయిదో ప్రపంచం అంటారు.

 

వృద్ధిరేటు
* వార్షిక జాతీయ ఆదాయ వృద్ధిరేటు ఆధారంగా ఆర్థిక వృద్ధిని లెక్కిస్తారు.
వృద్ధి రేటును లెక్కించే పద్ధతి:
 

దీనిలో Qt = ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి (Current year)
Q(t − 1) = గత సంవత్సరం ఉత్పత్తి (previous year)
ఉదా: 2006లో జాతీయాదాయం 1150 కోట్లు, 2005లో జాతీయాదాయం 1100 కోట్లు భావిస్తే
వృద్ధి రేటు = 4.8%గా ఉంది.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2019-20


బడ్జెట్‌ అధ్యయనం ద్వారా రాష్ట్ర పాలనకు సంబంధించి స్థూలమైన అవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమ పథకాల అమలు, వివిధ విభాగాలకు కేటాయించిన నిధుల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. ఒక్కోసారి కేటాయింపుల శాతాలపై ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపైనా దృష్టి పెట్టాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2019 జులై 12న తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. 2019-20 ఏడాదికి మొత్తం బడ్జెట్‌ వ్యయం రూ.2,27,974.99 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2018-19 నాటి రూ.1,91,063.61 కోట్ల కంటే 19.32 శాతం అధికం. 2019-20 మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు, మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు, ప్రజారుణం తిరిగి చెల్లింపు రూ.13,417 కోట్లు, లోన్లు, అడ్వాన్స్‌లు రూ.1,788.67 కోట్లుగా అంచనా వేశారు. గత బడ్జెట్‌ (2018-19)తో పోలిస్తే 2019-20 బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయంలో సుమారు 20.10 శాతం, మూలధన వ్యయంలో 12.60 శాతం పెరుగుదలను అంచనా వేశారు. 2019-20 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు సుమారు రూ.1,778.52 కోట్లుగా అంచనా వేశారు. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో 0.17%గా ఉంది. వ్యయలోటు (విత్తలోటు)ను సుమారు రూ.35,260.58 కోట్లుగా అంచనా వేశారు. ఇది జీఎస్‌డీపీ లో 3.30% శాతంగా ఉంది. 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ రాబడుల్లో రెవెన్యూ రాబడులు రూ.1,78,697.42 కోట్లు, మూలధన రాబడి రూ.49,277.58 కోట్లు, ప్రజారుణం రూ.46,921 కోట్లు, లోన్ల రికవరీ రూ.600 కోట్లు, నికర ప్రజాఖాతా రూ.1,756.58 కోట్లుగా అంచనా వేశారు.

2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూ, మూలధన ఖాతాల నుంచి ఆర్థిక సేవలకు రూ.86,185.63 కోట్లు (మొత్తం బడ్జెట్‌లో 37.80%), సాంఘిక సేవలకు రూ.75,465.04 కోట్లు (33.10%), సాధారణ సేవలపై రూ.66,324.35 కోట్లు (29.09%) వ్యయం చేయనున్నారు.

ప్రజారుణం: 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ల అంచనాల ప్రకారం మొత్తం ప్రజారుణం రూ.2,91,345 కోట్లు. ఇది మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో 26.96%గా ఉంది. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రూ.2,58,928.17 కోట్లుగా ఉంది. ఇది జీఎస్‌డీపీలో 28.18%. రాష్ట్ర ప్రభుత్వ ప్రజారుణంలో బహిరంగ మార్కెట్‌ లోన్‌లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, ఇతర సంస్థల నుంచి రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రావిడెంట్‌ఫండ్, డిపాజిట్లు, నిల్వ నిధులు కలిసి ఉంటాయి.

కేటాయింపులు
నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’లో భాగంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహరంగం, సంక్షేమ రంగాలకు సంబంధించిన 9 క్రాస్‌ కటింగ్‌ థీమ్స్‌తో కూడిన సమగ్ర సంక్షేమ విధానం కింద అనేక నూతన పథకాలను బడ్జెట్‌లో భాగంగా ప్రకటించింది.

మధ్యాహ్న భోజన పథకం: దేశంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1077 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి అయ్యే వ్యయ భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి 100% వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.

జగనన్న విద్యాదీవెన పథకం: మెట్రిక్‌ అనంతర కోర్సుల్లో తల్లితండ్రులపై భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బడ్జెట్‌లో రూ.4,923.3 కోట్లు కేటాయించారు. ఏటా ఒక్కో విద్యార్థికి రూ.20,000 చొప్పున అందించనున్నారు.

108 సేవలు: అదనంగా 432 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్‌లో రూ.143.38 కోట్లు కేటాయించారు.

104 సేవలు: దీనికి బడ్జెట్‌లో రూ.179.76 కోట్లు కేటాయించారు. అదనంగా 676 వాహనాలను సేకరించి సేవలందిస్తారు.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా: ఈ పథకం కింద ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే ఏటా మే నెలలో రూ.12,500 పెట్టుబడి మద్దతును అందించనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6500 కలిపి ఇవ్వనుంది. ఈ పథకం కింద 64.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.8,750 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు: రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించారు.

మత్స్యకారుల సంక్షేమం: చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చే సహాయాన్ని రూ.4000 నుంచి రూ.10000కు పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన మొత్తాన్ని 2020 జనవరిలో పంపిణీ చేయనున్నారు. వీరి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉపవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజనులు పోషకాహారాన్ని పెంపొందించుకోవడానికి ఆహారబుట్ట పథకాన్ని అమలు చేస్తుంది. ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్‌ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంచాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ కుటుంబాలకు రూ.348.15 కోట్లు, ఎస్టీ కుటుంబాలకు రూ.81.70 కోట్లు కేటాయించారు. రాష్ట్రప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.15,000.86 కోట్లు; ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.4,988.53 కోట్లు కేటాయించింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం: వెనుకబడిన తరగతుల్లోని 139 కులాల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి 139 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల్లో (బీసీ) 29 కులాలకు 29 ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌ల ద్వారా వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.7271.45 కోట్లు; వెనుకబడిన తరగతుల ఉపప్రణాళిక కింద రూ.15,061 కోట్లు కేటాయించారు.

మైనారిటీల సంక్షేమం: వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణ కోసం రూ.20 కోట్లు, వక్ఫ్‌ ఆస్తుల సర్వే కోసం రూ.20 కోట్లను 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. వైఎస్‌ఆర్‌ షాదీ కా తోఫా కింద మైనారిటీ యువతుల వివాహాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.50,000 నుంచి రూ. 1,00,000కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇమామ్‌ల గౌరవవేతనాన్ని నెలకు రూ.10,000కు, మౌజిమ్‌లకు నెలకు రూ.5,000కు పెంచాలని నిర్ణయించారు. పాస్టర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనారిటీల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాల కింద 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,106 కోట్లను కేటాయించారు.

కాపు సంక్షేమం: 2019-20 సంవత్సరానికి కాపు సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించారు.

బ్రాహ్మణ సంక్షేమం: ధూప, దీప, నైవేద్యం కార్యక్రమం కోసం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.234 కోట్లు;. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్‌ మొత్తాన్ని నెలకు రూ.2000 నుంచి రూ.2250కు పెంచింది. దీన్ని నాలుగేళ్లలో రూ.250 చొప్పున రూ.3000కు పెంచనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. డయాలసిస్‌ రోగులకు రూ.10,000 పెన్షన్‌ను అందించనున్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద లబ్ధిదారుల వయసు పరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.15,746.58 కోట్లను కేటాయించారు.

జగనన్న అమ్మఒడి పథకం: దీని కింద లబ్ధిదారులందరికీ 2020 జనవరి 26న రూ.15,000 చొప్పున అందిస్తారు.2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.6,455.80 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ: పేదవాళ్లకు నాణ్యమైన వైద్యసేవలు అందించే ఈ పథకానికి రూ.1740 కోట్లను కేటాయించారు. దీన్ని మరింత విస్తరించి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు, వైద్య ఖర్చులు రూ.1000కు మించిన అన్ని కేసులకు వర్తింపజేస్తారు.

మహిళా సంక్షేమం: 2019-20లో ఈ పథకం కోసం రాష్ట్రంలోని 6,32,254 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.1148 కోట్లు; 1,66,727 పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.648 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం: అయిదేళ్లలో 25 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం బడ్జెట్‌లో రూ.8,615 కోట్లు కేటాయించింది.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రణాళికల కాలంలో రాష్ట్రాభివృద్ధి  

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించారు. కేంద్ర ప్రణాళికా సంఘం దేశం మొత్తానికి ఒకే విధమైన కేంద్రీకృత ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్రాల సభ్యత్వం కలిగిన జాతీయాభివృద్ధి మండలి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమై చర్చించి నమూనా ప్రణాళికను ఆమోదిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రణాళికను అమలు చేస్తాయి.


1951-2017 మధ్య 12 పంచవర్ష ప్రణాళికలు; 1967-69, 1990-92 మధ్య రెండు వార్షిక ప్రణాళికలు, 1978-80 మధ్య ఒక నిరంతర ప్రణాళికను అమలుచేశారు. రాష్ట్రస్థాయిలో స్థానిక అవసరాలు, వనరులకు సరిపడే వార్షిక ప్రణాళికలను బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రాలు తయారు చేసుకుంటాయి. వీటిని ప్రణాళికా సంఘం ఆమోదించాలి. రాష్ట్రస్థాయి ప్రణాళికలు జాతీయ ప్రణాళికల లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. రాష్ట్రాలకు కావాల్సిన ప్రణాళిక నిధులను ప్రణాళికా సంఘం అందిస్తుంది. రాష్ట్ర ప్రణాళికలను ఆయా రాష్ట్రాల ప్రణాళికా బోర్డులు రచిస్తాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక మంత్రి, ప్రణాళిక మంత్రి, సాంకేతిక నిపుణులు ప్రణాళిక బోర్డులో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో పాలనాధికారి అధ్యక్షతన జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ; మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన 25 మంది సభ్యులతో మండల ప్రణాళిక, అభివృద్ధి కమిటీ ప్రణాళిక అమలును పర్యవేక్షిస్తాయి.


2015, జనవరి 1 నుంచి ప్రణాళికా సంఘం స్థానంలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతిఆయోగ్‌ను న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు. పంచవర్ష ప్రణాళికలు రద్దు చేసి మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక, ఏడేళ్ల విజన్, 15 ఏళ్ల దీర్ఘదర్శి ప్రణాళికను అమలు చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాలు నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి గతానికి భిన్నంగా ప్రణాళిక రచనలో పాలుపంచుకుంటున్నాయి. ఇది సహకార సమాఖ్యకు ముందడుగు. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసిన ప్రణాళికలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కింది ప్రాధాన్యాలను కలిగి ఉన్నాయి.

ప్రాధాన్యాలు
రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి అంశాలను ఎనిమిది ప్రాధాన్యత రంగాలుగా విభజించారు.
1. విద్యుత్తు
2. నీటిపారుదల
3. సామాజిక సేవలు
4. గ్రామీణాభివృద్ధి
5. రవాణా కమ్యూనికేషన్‌
6. వ్యవసాయం
7. పరిశ్రమలు, గనులు
8. ఇతర అంశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడే నాటికి (1956, నవంబరు )
1. దేశవ్యాప్తంగా రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61) అమల్లో ఉంది. రాష్ట్రానికి రూ.179.8 కోట్లు కేటాయించారు.
* మొదటి మూడు ప్రాధాన్య అంశాలు స్థానాలు మార్చుకుంటూ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నీటిపారుదలకు రెండు, మూడో ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం ఇచ్చి సగటున 35% నిధులు కేటాయించారు. వ్యవసాయాభివృద్ధికి ఆవశ్యకమైన నీటిపారుదల పెంపు కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించారు.
* పరిశ్రమల విస్తరణకు ఆధారమైన విద్యుత్‌ సౌకర్యాల వృద్ధి కోసం విద్యుత్‌ రంగానికి నాలుగు, ఐదు, ఎనిమిది, తొమ్మిదో పంచవర్ష ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం కల్పించి దాదాపు 37% పైగా నిధులు కేటాయించారు. థర్మల్, జలవిద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధికి పునాదులు వేశారు.
* ఆరు, ఏడు, పది, పదకొండో పంచవర్ష ప్రణాళికల్లో సామాజిక సేవలకు దాదాపు 30% నిధులు కేటాయించి మొదటి ప్రాధాన్యం కల్పించారు. వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలుచేశారు.
ఉదా: సబ్సిడీ బియ్యం, జనతావస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ.
* వ్యవసాయ అనుబంధ రంగాలకు సగటున అన్ని ప్రణాళికల్లోనూ 5%, గ్రామీణాభివృద్ధికి 6% నిధులు కేటాయించారు.
* పరిశ్రమల కోసం సగటున 4% నిధులు, రవాణా కమ్యూనికేషన్‌ లాంటి సేవల రంగాలకు 9% నిధులు మాత్రమే వెచ్చించారు. దీని ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రం సేవలరంగం అభివృద్ధిలో ముందంజలో ఉన్నప్పటికీ పారిశ్రామికంగా వెనుకబడింది. 90వ దశకం నుంచి ఈ ధోరణి ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఫలితంగా వ్యవసాయ ఆర్థికవ్యవస్థ నుంచి సేవలే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.
* 201217 మధ్యకాలంలో 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి 2014, జూన్‌ 2న నవ్యాంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. ఆ సమయంలో పర్యవేక్షించ గల 50 అభివృద్ధి సూచికలను లక్ష్యంగా కలిగి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రణాళికలో మొత్తం రూ.3,42,842 కోట్ల కేటాయింపులతో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది.
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు అమలుచేశారు. స్థానిక పరిస్థితులకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి సాధించారు.

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
 

1. ఆంధ్రప్రదేశ్‌ పదో పంచవర్ష ప్రణాళికలో అత్యధిక నిధుల వాటా ఏ రంగానిది? (గ్రూప్‌2, 2008)
    1. శక్తి 2. నీటిపారుదల 3. సామాజిక రంగం 4. గ్రామీణ రంగం

2. కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతి కోసం రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఎవరు సమర్పిస్తారు? (గ్రూప్‌2, 2011)
    1. ఆర్థిక మంత్రి  2. ముఖ్యమంత్రి
    3. రెవెన్యూశాఖ మంత్రి 4. రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి

3. ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళిక విజయం ఎక్కువగా వేటి పనితీరుపై ఆధారపడి ఉంటుంది? (గ్రూప్‌2, 2011)
     1. సేవల రంగం 2. పారిశ్రామిక రంగం
     3. ఎగుమతుల రంగం 4. వ్యవసాయ రంగం

4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పన్నెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యం వేగవంతమైన, నిలకడగల, అధిక ...... (గ్రూప్‌2, 2012)
    1. ఎగుమతుల వృద్ధి 2. మూలధన వృద్ధి
    3. సమ్మిళిత వృద్ధి 4. అన్నీ

సమాధానాలు: 1-3; 2-2; 3-4; 4-3.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి (2014 - 2019)  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014, జూన్‌ 2న విభజించడంతో నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. 2014 - 19 మధ్య అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి బాటలు వేస్తూ ఏడు మిషన్‌లతో అన్నిరంగాల్లో మార్పులు తీసుకొచ్చి రెండంకెల వృద్ధిరేటుకు ప్రయత్నించింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం అన్నిదశల్లో సమాచార, సాంకేతిక విజ్ఞాన అప్లికేషన్స్‌ - రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, సీఎఫ్‌ఎంఎస్‌, ఐ - ఏఎంఎస్‌ లాంటి నూతన విధానాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయంలో రైతుకు రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ప్రకృతి సేద్యం, నదుల అనుసంధానం, ఉద్యాన పంటల ప్రోత్సాహం లాంటి చర్యల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేసింది. పారిశ్రామిక సదస్సులు, విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రంలోని అనుకూల అంశాలను వివరిస్తూ సింగపూర్‌, జపాన్‌, దక్షిణకొరియా దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికితోడ్పడింది.

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2018 - 19 ప్రకారం రాష్ట్రం 1,62,970 చ.కి.మీ. విస్తీర్ణంతో దేశంలో 8వ స్థానం, జనాభాలో 4.10%తో 10వ స్థానంలో ఉంది. 2001 - 11 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధిరేటు అతి తక్కువగా (9.21%) నమోదైంది. రాష్ట్ర జనాభాలో 29.47% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇది దేశ సగటు 31.16% కంటే తక్కువ. మనది గ్రామీణ ప్రధాన ఆర్థిక వ్యవస్థ.

రాష్ట్ర స్థూల ఆదాయం (GSDP)
సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తయిన వస్తు సేవల మార్కెట్‌ విలువలను రాష్ట్ర స్థూల ఆదాయం అంటారు. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గణాంక శాఖ ప్రస్తుత, స్థిర ధరల్లో రాష్ట్ర స్థూల ఆదాయాన్ని లెక్కిస్తుంది. స్థిర ధరల కోసం 2011 - 12 ఏడాదిని ఆధార సంవత్సరంగా గుర్తించింది. ఆదాయ మదింపు కోసం ఆర్థిక వ్యవస్థను 3 స్థూల రంగాలు (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ), 9 ప్రధాన రంగాలుగా విభజించి తిరిగి వాటిని 17 ఉపరంగాలుగా గుర్తించారు. వివిధ రంగాల నుంచి సేకరించే అంచనాలను బిజుతి GVA (Gross Value Added) at basic price అంటారు.

GSDP = GVA at basic prices + Net of product taxes and product subsidies

రాష్ట్రంలో జీఎస్‌డీపీ 2014-15లో (2011-12 ధరల్లో) రూ.4,44,564 కోట్లు కాగా 2018-19 నాటికి రూ.6,80,332 కోట్లకు పెరిగింది. GVA రూ.6,14,665 కోట్లు, GSDP ప్రస్తుత ధరల్లో రూ.9,33,402 కోట్లుగా ఉంది.

స్థూల దేశీయ జిల్లాల ఆదాయం (GDDP)
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 13 జిల్ల్లాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించడంలో కొన్ని జిల్లాలు ముందుండగా మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. జిల్లాల మధ్య ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాల నుంచి లభించే ఆదాయాన్ని స్థూల దేశీయ జిల్లాల ఆదాయం అంటారు. అన్ని జిల్లాల ఆదాయాలను కలిపితే స్థూల రాష్ట్ర దేశీయ ఆదాయం వస్తుంది.

ఆదాయంలో ముందున్న జిల్లాలు
1) విశాఖపట్నం 2) కృష్ణా 3) తూర్పు గోదావరి 4) గుంటూరు

అతి తక్కువ ఆదాయాన్నిచ్చే జిల్లాలు
1) విజయనగరం 2) శ్రీకాకుళం 3) కడప 4) ప్రకాశం

తలసరి ఆదాయం
రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర జనాభాకు పంచగా సగటున ఒక్కొక్కరికి వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉండటం వల్ల ఈ అయిదేళ్ల కాలంలో తలసరి ఆదాయం స్థిర ధరల్లో రూ.79,174 నుంచి రూ.1,17,261 కు పెరిగింది. 2018 - 19 నాటికి ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం రూ.1,64,025 కు పెరిగింది.

తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు
1) విశాఖపట్నం 2) కృష్ణా 3) పశ్చిమ గోదావరి 4) నెల్లూరు

తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు
1) శ్రీకాకుళం 2) విజయనగరం 3) అనంతపురం 4) కర్నూలు

వివిధ రంగాల వాటా
రాష్ట్రానికి ఆదాయం స్థూలంగా మూడు రంగాల నుంచి లభిస్తుంది.

2018-19లో ఆయా రంగాల వాటా
1) ప్రాథమిక రంగం - 33.64% 2) ద్వితీయ రంగం - 23.38% 3) తృతీయ రంగం - 42.98%

విభజన తర్వాత రాష్ట్ర ఆదాయంలో ప్రాథమిక రంగం వాటా పెరిగింది. ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు తగ్గాయి.

శ్వేతపత్రం ప్రకారం....
2019 మే 30న ఏర్పాటైన కొత్త ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం జీఎస్‌డీపీ వృద్ధిరేటు 1999 - 2004 మధ్య 8.19%, 2004 - 2009 మధ్య అత్యధికంగా 15.08%, 2009 - 14 మధ్య 12.93% గా నమోదైంది. విభజన తర్వాత 2014 - 19 మధ్య కాలంలో 14.96% గా ఉంది. జాతీయ సగటు వృద్ధిరేటు (7%) కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిరేటు (రెండంకెల వృద్ధిరేటు) సాధించింది.

ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు
వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన పంటలు, అడవులు, చేపలు పట్టడం లాంటివన్నీ ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు. వీటిలో 2018 - 19లో చేపలు పట్టడం (19.0%), ఉద్యాన పంటల్లో (16%) అత్యధిక వృద్ధిరేటు నమోదవగా, వ్యవసాయంలో అతి తక్కువగా రుణాత్మక (-9.83%) వృద్ధిరేటు నమోదైంది. వర్షపాతం (-34.3%) లోటు వల్ల వృద్ధి తగ్గింది. నూతన ప్రభుత్వ శ్వేతపత్రం ప్రకారం 2014 - 19 మధ్య వ్యవసాయంలో రుణాత్మక వృద్ధిరేటు (-4.12%) నమోదైంది.

ద్వితీయ రంగంలోని ఉపరంగాలు
తయారీ రంగం; గనులు, క్వారీలు, నిర్మాణం; విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా ద్వితీయ రంగంలోని ఉపరంగాలు. వీటిలో విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా 10.72%; తయారీ రంగం 10.56%, గనుల తవ్వకం 10.34%, నిర్మాణ రంగంలో 9.55% వృద్ధి నమోదైంది.

తృతీయ (సేవా) రంగంలోని ఉపరంగాలు
వ్యాపారాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ గృహాలు, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పాలన, ఇతర సేవలన్నీ తృతీయ రంగంలోని ఉపరంగాలు. వీటిలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల్లో అత్యధికంగా 12.90%, రైల్వేలో అత్యల్పంగా 8.4% వృద్ధిరేటు నమోదైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటు పెరిగి ఆధునిక సాంకేతికత, మహిళా సాధికారత, నైపుణ్యం గల యువత లాంటి అంశాల్లో ముందంజలో ఉంది. కానీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీ పరిశ్రమలు తక్కువగా ఉండటం; ఐటీ కంపెనీలున్న నగరాలు లేకపోవడంతో ఆదాయానికి, ఉపాధికి ప్రాథమిక రంగంపై ఆధారపడాల్సి వచ్చింది. అర్థశాస్త్రం ప్రకారం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల్లో మాత్రమే ఈ లక్షణం కనిపిస్తుంది.

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ప్రణాళికా కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి

ప్రణాళికలు - పరిణామ క్రమం
లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించుకుని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశ పూర్వకంగా, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చొరవే ప్రణాళిక అని ప్రణాళికా సంఘం నిర్వచించింది.
* ఆడంస్మిత్ లాంటి సంప్రదాయవాదులు ఆర్థిక వ్యవస్థను అదృశ్య హస్తం నడిపిస్తుందని అంటారు. అదృశ్య హస్తం అంటే డిమాండు, సప్లయి లాంటి మార్కెటు శక్తులు. వీటినే ధరల యంత్రాంగం అని కూడా అంటారు.
* జె.బి. సే ప్రకారం సప్లయి తనకు తాను డిమాండ్‌ను సృష్టించుకుంటుంది. అంటే ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు తాము పొందిన ప్రతిఫలంతో ఉత్పత్తి అయిన వస్తువులను డిమాండు చేస్తాయి. ఆ విధంగా సప్లయి, డిమాండులు సమానం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు. అని సంప్రదాయ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

* 1929 - 33 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యం కాలంలో సంప్రదాయవాదుల సిద్ధాంతం పని చేయలేదు.
* ఆర్థికమాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అనేది జె.ఎం. కీన్స్ అభిప్రాయం.
* 1929 - 33 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏర్పడింది. ఫలితంగా మాంద్యం ప్రభావం అన్ని దేశాలపై పడింది. అయితే ఈ ఆర్థిక మాంద్యం ప్రణాళికలను అమలు చేస్తూ ప్రణాళికా బద్ధమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న రష్యా (సోవియట్ యూనియన్)ను ప్రభావితం చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల్లో అమెరికా సాధించిన వృద్ధిని రష్యా కేవలం కొన్నేళ్లలోనే సాధించింది. ఫలితంగా ప్రణాళికా భావన ప్రపంచ దేశాలను, ఆర్థిక వేత్తలను ప్రభావితం చేసింది. భారత్ కూడా రష్యాను స్ఫూర్తిగా తీసుకుని ప్రణాళికలను ప్రారంభించింది.

 

స్వాతంత్య్రానికి ముందు
* స్వాతంత్య్రానికి ముందు మనదేశానికి ఒక ప్రణాళిక అవసరమని చెప్పిన నాయకుడు సుభాష్ చంద్రబోస్.
* 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమీ ఫర్ ఇండియా (Planned Economy for India) అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో భారతదేశానికి 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించారు.

* భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన వేసింది.
* 1943లో బాంబేకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు A Plan of economic development for India అనే పేరుతో 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దీన్ని బాంబే ప్లాన్ అంటారు. వీరు ఇనుము, ఉక్కు, సిమెంట్, రసాయనాలు లాంటి భారీ పరిశ్రమల అభివృద్ధిని కాంక్షించారు.
* 1944లో ఎం.ఎన్. రాయ్ ప్రజాప్రణాళికలను (People's plan) రూపొందించారు. ఈయన వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తువులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* బాంబే ప్రణాళికను పారిశ్రామికవేత్తలు రూపొందించడం వల్ల అది పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉండగా, ప్రజాప్రణాళిక సామ్యవాద భావాలను కలిగి ఉంది.
* బాంబే ప్లాన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వగా, పీపుల్స్ ప్లాన్ చిన్న పరిశ్రమలకు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది.
* 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించి, వికేంద్రీకృత ప్రణాళికను సూచించారు. గాంధీ ప్రణాళికను క్రోడికరించి ఆర్థిక ప్రణాళికను రూపొందించారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూ.3,500 కోట్ల వ్యయ అంచనాలతో రూపొందించారు.

* 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికల అభివృద్ధి సమస్యలను పరిష్కరించడానికి High level advisory planning board ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో స్థిరప్రాతిపదికన ఒక ప్రణాళికా సంఘం ఉండాలని సలహా ఇచ్చింది.
 

స్వాతంత్య్రానంతరం:
* రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన వెనుకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఆర్థిక ప్రణాళికలను అమలు చేశాయి. ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించడాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు.
* కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ఉపయోగిత ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించి నిర్ణీత కాలంలో గరిష్ఠ వృద్ధిరేటు సాధించడానికి ఆర్థిక ప్రణాళికలు తోడ్పడతాయి.
* 1950లో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు.
* భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం అవసరమని అప్పటి ఆర్థికశాఖ మంత్రి షణ్ముగం శెట్టి పేర్కొంటూ ప్రణాళికా సంఘం స్వరూప, స్వభావాలను వివరించారు. దీనికి అనుగుణంగా 1950, మార్చి 15న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళికా సంఘం ఏర్పడింది.

ప్రణాళికా సంఘం:
* కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు 1950, మార్చి 15న ఇది ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పడిన సలహాసంఘం మాత్రమే.
* ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా లేదా ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా దేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* ఈ ప్రణాళికా సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్య నిర్వాహకుడు ఒకరు ఉంటారు. అతడే ఉపాధ్యక్షుడు అయితే అతడి పదవీకాలం, నియామకం, తొలగింపు లాంటి అన్ని అంశాలు ప్రభుత్వం విచక్షణ మేరకు జరుగుతాయి.
* ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణ ప్రకారం స్త్రీ, పురుషులు సమాన జీవన ప్రమాణాలను పొందాలని, దేశంలోని సహజ వనరులు సమానంగా పంపిణీ కావాలనీ, ఆర్థికశక్తి కొద్దిమంది వద్దే కేంద్రీకృతం కాకుండా చూడాలనీ తెలుపుతుంది.
* భారత రాజ్యాంగంలోని 39వ అధికరణను అనుసరించి ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.
* ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు సంబంధించినవి. అందువల్ల ప్రణాళికలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం రెండూ కూడా ప్రణాళికలను రూపొందించుకుంటాయి.
ప్రణాళిక సంఘం మొదటి అధ్యకుడు: జవహర్‌లాల్ నెహ్రూ.
ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు: గుల్జారీలాల్ నందా.
ప్రణాళికా సంఘం చివరి అధ్యక్షుడు: నరేంద్రమోదీ.
ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.

జాతీయ అభివృద్ధి మండలి (National Development Council - NDC)
* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కూడా ప్రణాళికా సంఘం మాదిరి కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పడింది.
* ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రణాళికల నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
* మనదేశంలో ప్రణాళికలను తయారు చేసేది ప్రణాళిక సంఘం. వాటిని ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. ఇది ఆమోదించిన తర్వాతే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి.
* జాతీయ అభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి (NDC)కి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
* NDC సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ అఫీషియో సభ్యులే. NDCలో పనిచేయడానికి పూర్తికాల సభ్యులు ఒక్కరూ కూడా లేరు.

* 1967లో పరిపాలనా సంఘం చేసిన సూచనల మేరకు జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వాన్ని విస్తరించారు. దీనిలోని సభ్యులు
    1) రాష్ట్ర ముఖ్యమంత్రులు.
    2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు.
    3) ప్రణాళికా సంఘం సభ్యులు.
    4) కేంద్ర కేబినెట్ మంత్రులు.
* ప్రణాళిక సంఘం రూపొంచిందించిన ప్రణాళికలను చివరగా జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి.
* అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రణాళికా బోర్డు (State Planning Board) ఉంటుంది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు.
* జిల్లాల్లో కూడా జిల్లా ప్లానింగ్ బోర్డు (District Planning Board) ఉంటుంది. జిల్లా కలెక్టరు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదేవిధంగా జిల్లా ప్లానింగ్ కమిటీ (District Planning Committee) కి ఛైర్మన్‌గా జిల్లాపరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.

ప్రణాళికలు - వ్యూహాలు: ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం.
     1) ఆర్థిక వ్యవస్థలో కనుక్కున్న వనరుల సమగ్ర అంచనా.
     2) దేశ సమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీతకాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
     3) నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన.

 

ప్రణాళికలు - రకాలు:
ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలు.
    1) ఆదేశాత్మక ప్రణాళిక
    2) సూచనాత్మక ప్రణాళిక.

 

1) ఆదేశాత్మక ప్రణాళిక/ నిర్దేశాత్మక ప్రణాళిక
* ఇందులో ప్రణాళిక రచన, అమలు లాంటి వ్యవహారాలను సర్వాధికారాలున్న ఒక కేంద్ర సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో ప్రజలకు, రాష్ట్రాలకు, వినియోగదారులకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండవు.
* ఆర్థిక వ్యవస్థలోని వనరులు, ఆర్థిక కార్యకలాపాలన్నీ కేంద్ర సంస్థ దిశానిర్దేశం మేరకు జరుగుతాయి.
* సాధారణంగా ఇలాంటి ప్రణాళికలు రష్యా లాంటి సామ్యవాద దేశాల్లో అమలవుతాయి.

 

2) సూచనాత్మక ప్రణాళిక:
* దీనిలో ప్రభుత్వ స్థూల అంశాలను నిర్దేశించి, వాటిని సాధించడం కోసం ప్రైవేట్ రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు.

* ఇలాంటి ప్రణాళికలను మొదటిసారిగా 1947 - 50లో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* ఈ ప్రణాళికను మార్కెట్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
* ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది.
* మనదేశంలో ఈ ప్రణాళికను 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేస్తున్నారు.

 

ప్రజల భాగస్వామ్యం ఆధారంగా .......
    1) కేంద్రీకృత ప్రణాళిక
    2) వికేంద్రీకృత ప్రణాళిక

 

1) కేంద్రీకృత ప్రణాళిక:
* ప్రణాళిక రచన, అమలుకు సంబంధించిన వ్యవహారాలను సర్వాధికారాలు ఉన్న ఒక కేంద్ర సంస్థ చూస్తుంది.

 

2) వికేంద్రీకృత ప్రణాళిక:
* కిందిస్థాయి నుంచి (గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో) ప్రణాళికలను తయారుచేసి, వాటి ఆధారంగా కేంద్ర ప్రణాళికలను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.

 

వనరుల కేటాయింపుల ఆధారంగా.........
    1) భౌతిక ప్రణాళిక
    2) విత్త ప్రణాళిక

1) భౌతిక ప్రణాళిక:
* సహజ వనరులు, మానవ వనరులు, ముడిపదార్థాలు లాంటి వాస్తవిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రణాళికను భౌతిక ప్రణాళిక అంటారు.

 

2) విత్త ప్రణాళిక:
* నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ద్రవ్యం రూపంలో వనరులను అంచనావేస్తే దాన్ని విత్త ప్రణాళిక అంటారు.

 

కాలం ఆధారంగా ప్రణాళికలు..........
    1) స్వల్పకాలిక ప్రణాళిక
    2) మధ్యకాలిక ప్రణాళిక
    3) దీర్ఘకాలిక ప్రణాళిక

 

1. స్వల్పకాలిక ప్రణాళిక:
* ఒక సంవత్సర కాలానికి రూపొందించే ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటారు.

 

2. మధ్యకాలిక ప్రణాళిక:
* 4, 5, 6 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను తయారుచేస్తే వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అంటారు.

3. దీర్ఘకాలిక ప్రణాళిక:
* 15 నుంచి 20 సంవత్సరాల కాలానికి తయారుచేసే ప్రణాళికలను దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు.

 

సరళత్వం ఆధారంగా...........
      1) నిర్దిష్ట/స్థిర ప్రణాళిక
      2) నిరంతర ప్రణాళిక

 

1. నిర్దిష్ట/స్థిర ప్రణాళిక:
* కొన్ని సంవత్సరాల కాలాన్ని స్థిరంగా నిర్ణయించి ప్రణాళికను రూపొందిస్తే దాన్ని స్థిర/నిర్దిష్ట ప్రణాళిక అంటారు.

 

2. నిరంతర ప్రణాళిక:
* కొత్తగా, అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలను బట్టి ప్రణాళిక లక్ష్యాలను కూడా నిరంతరం మార్చుకోవడానికి అవకాశం ఉండే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు.
* ఈ నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసింది గున్నార్ మిర్డాల్. ఈయన స్వీడన్ దేశస్థుడు.
* ఈ ప్రణాళికను మొదటిసారిగా నెదర్లాండ్స్‌లో అమలు చేశారు.
* ఇండియాలో ఈ నిరంతర ప్రణాళికా నమూనాను డాక్టర్ లక్‌డావాలా తయారుచేశారు.

 

వ్యవస్థ స్వరూపం ఆధారంగా ..........
     1) నిర్మాణాత్మక ప్రణాళికలు
     2) కార్యాత్మక ప్రణాళికలు

ప్రాంతాన్ని బట్టి..........
     1) ప్రాంతీయ ప్రణాళిక
     2) జాతీయ ప్రణాళిక
     3) అంతర్జాతీయ ప్రణాళిక
* ప్రణాళికలను పాక్షిక ప్రణాళిక, సాధారణ ప్రణాళిక, వార్షిక ప్రణాళికలుగా కూడా వర్గీకరించవచ్చు.
వార్షిక ప్రణాళికలు: ఒక సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసే ప్రణాళికను వార్షిక ప్రణాళిక అని పిలుస్తారు. దీన్ని పిగ్మీ ప్రణాళిక అంటారు.
భారత్‌లో వార్షిక ప్రణాళికల కాలం: 1966 - 69 (3 సంవత్సరాలు), 1990 - 92 (2 సంవత్సరాలు)
* ప్రణాళికలను వేరొక విధంగా కూడా పేర్కొనవచ్చు. అవి:

 

1. నియంతృత్వ ప్రణాళిక:
* ఒక నియంతృత్వ వ్యక్తి లేదా ప్రభుత్వం చేతిలో ప్రణాళిక నియంత్రణ ఉంటే అది నియంతృత్వ ప్రణాళిక.

 

2. ప్రజాస్వామ్య ప్రణాళిక:
* ఈ ప్రణాళికలో లక్ష్యాలు, వనరుల కేటాయింపులను ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు.
* ఈ ప్రణాళికలో ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్ణయించదు.
* ప్రణాళికా సంఘం తయారు చేసిన ప్రణాళికలను మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

3. శాశ్వత ప్రణాళిక:
* ఒకసారి ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలను రూపొందిస్తే అవి దీర్ఘకాలంలో కూడా అమలు అవుతాయి. వాటిని మధ్యలో ఆపివేయడం లాంటిది జరగదు.

 

4. అత్యవసర ప్రణాళిక:
* ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాలు ఏర్పడినప్పుడు, వాటిని తొలగించడానికి తాత్కాలికంగా ప్రవేశపెట్టేదే అత్యవసర ప్రణాళిక. అత్యవసర పరిస్థితులు తొలిగిపోయిన తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేస్తారు.

 

5. సాధారణ ప్రణాళిక:
* ఇందులో స్థూల సమస్యలనే ప్రస్తావిస్తారు. స్థూల మార్గదర్శకాలు మాత్రమే ఉంటాయి.

 

6. వివరణాత్మక ప్రణాళిక:
* స్థూల మార్గదర్శకాలే కాకుండా వాటిని సాధించడానికి పూర్తి వివరాలు కూడా ఉంటాయి.

 

7. కరెక్టివ్ ప్లాన్: (Corrective plan)
* బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తరచూ వ్యాపార చక్రాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ వ్యాపార చక్రాల నియంత్రణకు తయారు చేసే ప్రణాళికను Anticyclical planning లేదా Corrective plan అని అంటారు.

8. డెవలప్‌మెంట్ ప్లాన్:
* ఆర్థికాభివృద్ధి సాధన కోసం వెనుకబడిన దేశాల్లో అవలంబించే ప్రణాళిక. ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడమే దీని లక్ష్యం. ఇది కరెక్టివ్ ప్లాన్ కంటే కూడా విస్తృతమైంది.

 

9. మిశ్రమ ఆర్థిక ప్రణాళిక:
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అందుకు తగిన ప్రణాళికే mixed economy planning.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు.

 

ప్రణాళికా విరామం (plan holiday):
* ఒక planకి మరొక planకి మధ్య వచ్చిన విరామాన్నే ప్రణాళికా విరామం (plan holiday) అంటారు.
* భారత్‌లో 1966 - 69 మధ్య 3 సంవత్సరాలు, 1990 - 92 మధ్య 2 సంవత్సరాలు ప్రణాళికా విరామం వచ్చింది.

 

భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు:
   1. జాతీయ, తలసరి ఆదాయం పెంచడానికి గరిష్ఠ ఉత్పత్తి సాధించడం.
   2. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి.
   3. పారిశ్రామిక ప్రగతి.

   4. సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.
   5. ఆదాయ సంపదల అసమానతలు తగ్గించడం.
   6. సాంఘిక న్యాయం చేకూర్చడం.
   7. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
   8. జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి.

 

భారత ప్రణాళికల లక్షణాలు:
* ఇవి సూచనాత్మక ప్రణాళికలు
* సమగ్ర ప్రణాళికలు
* భౌతిక, విత్తప్రణాళికలు
* ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు
* దీర్ఘకాలిక స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాయి.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రణాళికా సంఘం - నీతి ఆయోగ్‌

1. కేంద్రమంత్రి మండలి తీర్మానం ద్వారా ఏ రోజున ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు?

1) 2014, ఆగస్టు 17 

2) 2014, ఆగస్టు 18

3) 2014, ఆగస్టు 19 

4) 2014, ఆగస్టు 20

2. నీతి ఆయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 2015, జనవరి 1    2) 2015, జనవరి 2

3) 2015, జనవరి 3    4) 2015, జనవరి 4

3. నీతి ఆయోగ్‌ అధ్యక్షులు ఎవరు?

1) రాష్ట్రపతి     2) ఉపరాష్ట్రపతి  

3) ప్రధానమంత్రి     4) కేంద్ర ఆర్థిక మంత్రి

4. నీతి ఆయోగ్‌కు ఉపాధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)లను ఎవరు నియమిస్తారు?

1) రాష్ట్రపతి         2) ఉపరాష్ట్రపతి 

3) కేంద్ర ఆర్థిక మంత్రి  4) ప్రధానమంత్రి

5. నీతి ఆయోగ్‌ ప్రస్తుత ఉపాధ్యక్షుడు?

1) ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా

2) డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌

3) డాక్టర్‌ సి.రంగరాజన్‌ 

4) సుమన్‌ బెరీ


6. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I         జాబితా - II 

i) నీతి ఆయోగ్‌ మొదటి ఉపాధ్యక్షుడు  a) డా.అమితాబ్‌కాంత్‌ 

ii) నీతి ఆయోగ్‌ ప్రస్తుత సీఈఓ   b) ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా

iii) నీతి ఆయోగ్‌ జనరల్‌ కౌన్సిల్‌ ఏర్పాటైన రోజు   c) నరేంద్రమోదీ

iv) నీతి ఆయోగ్‌ మొదటి అధ్యక్షుడు   d) 2015, ఫిబ్రవరి 16     

1) i-b, ii-a, iii-d, iv-c

2) i-a, ii-d, iii-c, iv-b

3) i-d, ii-c, iii-b, iv-a

4) i-c, ii-b, iii-a, iv-d

7. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు కింది ఎవరితో సమాన హోదాను కలిగి ఉంటారు?

1) కేంద్ర కేబినెట్‌ మంత్రి 

2) ప్రధానమంత్రి        3) రాష్ట్రపతి  

4) ఉపరాష్ట్రపతి

8. నీతి ఆయోగ్‌ పూర్తికాలం సభ్యుల సంఖ్య...

1) 2   2) 3   3) 4   4) 5

9. కిందివాటిలో నీతి ఆయోగ్‌ అనుబంధ/ స్వయంప్రతిపత్తి సంస్థలు ఏవి?

1) అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ్బతిఖిల్శీ

2) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లేబర్‌ ఎకనామిక్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ్బవిఖిలినిళిద్శీ

3) డెవలప్‌మెంట్, మానిటరింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫీస్‌ ్బదీలీనివ్శీ

4) పైవన్నీ

10. నీతి ఆయోగ్‌ కింది ఏ సమాఖ్య వ్యవస్థలను అనుసరిస్తోంది?

1) సహకార సమాఖ్య (కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం)

2) పోటీ సమాఖ్య (కాంపిటీటివ్‌ ఫెడరలిజం)

3) 1, 2     4) ఫ్యూడలిజం

11. నీతి ఆయోగ్‌ కార్యాచరణ ప్రణాళిక పత్రాలు, వాటి అమలు కాలానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దార్శనిక పత్రం (దీర్ఘదర్శి ప్రణాళిక) -  15 సంవత్సరాలు

బి) మధ్యకాలిక వ్యూహపత్రం (మధ్యకాలిక ప్రణాళిక) - 7 సంవత్సరాలు

సి) కార్యాచరణ ఎజెండా (స్వల్పకాలిక ప్రణాళిక) - 3 సంవత్సరాలు 

డి) నీతి ఆయోగ్‌ విజన్‌ ప్రణాళిక కాలం - 201732

1) ఎ, బి      2) బి, సి, డి  

3) ఎ, డి      4) పైవన్నీ


12. నీతి ఆయోగ్‌ ‘న్యూ ఇండియా జీ 75’ ముసాయిదా నివేదికలో 2022 నాటికి భారతదేశాన్ని ఎన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు?

1) ఒక ట్రిలియన్‌ డాలర్‌ 

2) రెండు ట్రిలియన్‌ డాలర్లు

3) మూడు ట్రిలియన్‌ డాలర్లు 

4) నాలుగు ట్రిలియన్‌ డాలర్లు

13. 2016లో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసింది. ఈ చర్య ఫలితంగా నీతి ఆయోగ్‌ ఆశించిన ప్రయోజనకర మార్పు .....

1) డిజిటల్‌ చెల్లింపుల పెరుగుదల

2) డిజిటల్‌ చెల్లింపుల తగ్గుదల

3) క్రిప్టోకరెన్సీ పెరుగుదల  4్శ ఏదీకాదు

14. నీతి ఆయోగ్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

1) ప్రణాళికా సంఘం అనుసరించిన ‘పై నుంచి కిందికి’ ్బగ్న్పి ్మ్న త్న్మ్మ్న్ఝ్శీ పద్ధతికి భిన్నంగా ‘కింది నుంచి పైకి’ ్బత్న్మ్మ్న్ఝీ ్మ్న గ్న్ప్శి పద్ధతిని అనుసరించడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 

ఈ మార్పు ద్వారా దేశాన్ని సహకార ఫెడరల్‌ వ్యవస్థగా మార్చాలని నిర్దేశించింది.

2) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను అందించే ‘మేధో కేంద్రం’ ్బగ్తిi-ఁగ్చి-ఁ్శగా నీతి ఆయోగ్‌ను రూపొందిస్తున్నారు.

3) శాస్త్రీయ, మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మానవ మూలధనాన్ని ్బఖి-్మ’ఃః’‘్మ్య్చః ్త్య్ఝ్చ- ‘్చ్పi్మ్చః్శ పెంపొందించడం దీని లక్ష్యం.

4) పైవన్నీ

15. నీతి ఆయోగ్‌ ఒక...

1) రాజ్యాంగేతర సంస్థ    2) చట్టబద్ధమైంది  

3) శాసనబద్ధమైంది         4) రాజ్యాంగబద్ధమైంది

16. కిందివారిలో నీతి ఆయోగ్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎవరు?

1) అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌

2) నిర్మలా సీతారామన్‌

3) నరేంద్రసింగ్‌ తోమర్‌  

4) పైవారంతా

17. కిందివారిలో నీతి ఆయోగ్‌ పూర్తికాల సభ్యులు ఎవరు?

1) డాక్టర్‌ వి.కె.సారస్వత్‌  

2) డాక్టర్‌ రమేష్‌చంద్‌

3) డాక్టర్‌ వి.కె.పాల్‌    4) పైవారంతా

18. నీతి ఆయోగ్‌ పాలనా మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 2015, ఫిబ్రవరి 8 

2) 2015, ఫిబ్రవరి 9

3) 2015, ఫిబ్రవరి 10

4) 2015, ఫిబ్రవరి 11

19. నిరంతర ప్రణాళిక అనే భావనను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త .....

1) ప్రొఫెసర్‌ గున్నార్‌ మిర్దాల్‌

2) జె.ఎం.కీన్స్‌     3) డి.టి.లక్డావాలా

4) పాల్‌ శామ్యూల్‌సన్‌

20. నిరంతర ప్రణాళికను మనదేశంలో ప్రవేశపెట్టింది? (ఈయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.)

1) డి.టి.లక్డావాలా    2) వై.కె.అలఘ్‌

3) సురేష్‌ తెందూల్కర్‌ 

4) డాక్టర్‌ సి.రంగరాజన్‌

21. నిరంతర ప్రణాళిక అమలు కాలం ....

1) 197880      2) 197980

3) 197680      4) 197580

22. పంచవర్ష ప్రణాళికలు అమలయ్యాక, మొదటి విరామకాలం .....

1) 196667 నుంచి 196869 వరకు

2) 196567 నుంచి 196870 వరకు

3) 196465 నుంచి 196669 వరకు

4) 196364 నుంచి 196568 వరకు

23. పంచవర్ష ప్రణాళికల రెండో విరామ కాలం...

1) 199092     2) 199192

3) 199091     4) 198992

24. ‘హిందూ వృద్ధి రేటు’ అనే మాటను మొదటిసారి ఉపయోగించింది? (ఈయన 1978లో తన ఉపన్యాసంలో ఈ మాట వాడారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోనూ భారత్‌ వృద్ధి రేటు 3.5% ఉంటుందని ఈయన పేర్కొన్నారు.)

1) ప్రొఫెసర్‌ రాజ్‌ కృష్ణ 

2) డాక్టర్‌ సి.రంగరాజన్‌

3) సురేష్‌ తెందూల్కర్‌    4) వై.కె.అలఘ్‌

25. ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ (పేదరికాన్ని తరిమెయ్యండి) నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారు? (నాలుగో పంచవర్ష ప్రణాళికలో ఈమె ఈ ప్రకటన చేశారు.)

1) 1972   2) 1971   3) 1973   4) 1974

26. నూతన ఆర్థిక సంస్కరణల (1991) నేపథ్యంలో రూపొందించిన పంచవర్ష ప్రణాళిక?

1) 8వ   2) 9వ   3) 10వ    4) 11వ 

27. ఏ పంచవర్ష ప్రణాళికను సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి లక్ష్యంతో రూపొందించారు?

1) 7వ     2) 8వ    3) 9వ    4) 10వ 

28. 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం...

1) శీఘ్రవృద్ధి, అధిక సమ్మిళిత వృద్ధి

2) నిరుద్యోగ నిర్మూలన

3) మానవ వనరుల అభివృద్ధి

4) గ్రామీణాభివృద్ధి

29. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం?

1) శీఘ్రవృద్ధి, సుస్థిరవృద్ధి, అధిక సమ్మిళిత వృద్ధి

2) పేదరిక నిర్మూలన

3) ఆర్థిక అసమానతల తగ్గింపు

4) ఉపాధి సృష్టి

30. రెండో పంచవర్ష ప్రణాళికలో అనుసరించిన అభివృద్ధి వ్యూహం?

1) ప్రొఫెసర్‌ మహలనోబిస్‌ నమూనా

2) హరాడ్‌ - డోమర్‌ నమూనా

3) ఎల్‌పీజీ నమూనా  

4) పురా నమూనా

31. ధైర్యంతో కూడిన ప్రణాళిక ్బ్జ్నః్ట ్పః్చ-్శ అని దేన్ని పిలుస్తారు?

1) మొదటి పంచవర్ష ప్రణాళిక  

2) రెండో పంచవర్ష ప్రణాళిక

3) మూడో పంచవర్ష ప్రణాళిక

4) నాలుగో పంచవర్ష ప్రణాళిక

సమాధానాలు

11  21  33  44  54  61  71  84  94  103  114  124  131  144  151  164  174  181  191  201  211  221  231  241  252  261  273  281  291  301  312


మరికొన్ని...

1. మొదటి ప్రణాళికలో అనుసరించిన అభివృద్ధి నమూనా?

1) హరాడ్‌ - డోమర్‌    2) మహలనోబిస్‌

3) నెహ్రూ         4) ఎల్‌పీజీ

2. భారతదేశ సత్వర పారిశ్రామికాభివృద్ధికి పునాది వేసిన పంచవర్ష ప్రణాళిక....

1) మొదటి      2) రెండో 

3) మూడో      4) నాలుగో 

3. ఏ పంచవర్ష ప్రణాళికలో మూడు ఉక్కు కర్మాగారాలను నిర్మించారు? (రష్యా సహకారంతో ఛత్తీస్‌గఢ్‌లో భిలాయ్‌ ఉక్కుకర్మాగారం,  జర్మనీ సహకారంతో ఒడిశాలో  రూర్కెలా ఉక్కు కర్మాగారం, ఇంగ్లండ్‌ సహకారంతో పశ్చిమ్‌ బంగాలో దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగారాలను స్థాపించారు.)

1) మొదటి        2) రెండో 

3) మూడో        4) నాలుగో 

4. సామ్యవాద రీతి సమాజ సాధనే లక్ష్యంగా రూపొందించిన పంచవర్ష ప్రణాళిక? (ప్రొఫెసర్‌ మహలనోబిస్‌ను దీని పితామహుడిగా పేర్కొంటారు.)

1) రెండో         2) మూడో  

3) నాలుగో         4) అయిదో 

5. నాలుగో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు?

1) సుస్థిరతతో కూడిన అభివృద్ధి

2) క్రమంగా స్వావలంబన సాధన

3) 1, 2 

4) నిరుద్యోగ నిర్మూలన

6. కిందివాటిలో తీవ్రవైఫల్యం చెందిన పంచవర్ష ప్రణాళికగా దేన్ని పేర్కొంటారు? (ఈ కాలంలో జరిగిన చైనా దురాక్రమణ - 1962, భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం - 1966, తీవ్ర కరవు - 1965-66 మొదలైనవి దీనికి కారణాలు.)

1్శ మూడో     2్శ నాలుగో 

3్శ అయిదో     4్శ ఆరో

7. నాలుగో పంచవర్ష ప్రణాళిక వైఫల్యానికి ప్రధాన కారాణాలు ....

1్శ బంగ్లాదేశ్‌ యుద్ధం

2్శ భారీగా కాందిశీకుల (శరణార్థుల) రాక

3్శ ధరల అనిశ్చితి

4్శ పైవన్నీ

8. నిరంతర ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళిక?

1) అయిదో     2) ఆరో

3) ఏడో     4) ఎనిమిదో

సమాధానాలు 

1 - 1  2 - 2  3 - 2  4 - 1  5 - 3  6 - 1  7 - 4  8 - 2

Posted Date : 25-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)

1. మనదేశంలో వస్తు, సేవల పన్ను (Goods and Service Tax - GST) ఎప్పుడు ప్రారంభించారు?

1) 1 జులై, 2017   2్శ 1 జూన్, 2017 

3) 1 ఏప్రిల్, 2017  4్శ 1 జులై, 2016

2. వస్తు, సేవల పన్ను ప్రధాన లక్ష్యం.....

1) ద్వంద్వ పన్ను విధింపు తొలగించడం

2) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ విధానం

3) ద్వంద్వ ధరల విధానం

4) ఏకపన్ను విధానం

3. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల గురించి తెలియజేస్తుంది?

1) 5వ షెడ్యూల్‌     2) 6వ షెడ్యూల్‌

3) 7వ షెడ్యూల్‌    4) 8వ షెడ్యూల్‌

4. సమాఖ్య వ్యవస్థలో ఎగుమతి - దిగుమతులపై పన్ను విధించేది?

1) కేంద్ర ప్రభుత్వం    2) రాష్ట్ర ప్రభుత్వం 

3) స్థానిక ప్రభుత్వం    4) పైవన్నీ

5. సమాఖ్య వ్యవస్థలో భూమి శిస్తు వసూలు చేసేది?

1) కేంద్ర ప్రభుత్వం  2) రాష్ట్ర ప్రభుత్వం

3) స్థానిక ప్రభుత్వం  4) ఏదీకాదు

6. మనదేశంలో వ్యాట్‌ను (VAT - Value Added Tax) ఎప్పుడు అమలు చేశారు?

1) 1 ఏప్రిల్, 2005   2) 1 ఏప్రిల్, 2004

3) 1 ఏప్రిల్, 2003   4) 1 ఏప్రిల్, 2006

7. కింది వాటిలో ప్రత్యక్ష పన్నులకు ్బదీi౯’‘్మ గ్చ్ల్శి సంబంధించి సరైంది?

1) వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, వడ్డీపై పన్ను

2) వ్యయ పన్ను, సంపద పన్ను

3) ఎస్టేట్‌ డ్యూటీ, కానుక పన్ను

4) పైవన్నీ

8. ఉత్పత్తిపై విధించే పన్ను...

1) రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకం

2) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం

3) వస్తు, సేవల పన్ను   4) కస్టమ్స్‌ సుంకాలు

9. కింది వాటిలో పరోక్ష పన్నులకు (Indirect Tax) సంబంధించి సరైంది? 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం 

2) కస్టమ్స్‌ సుంకాలు   3) సేవల పన్ను

4) పైవన్నీ

10. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను  తెలియజేస్తున్నాయి?

1) 268వ అధికరణం   2) 300వ అధికరణం   

3) 1 & 2              4) 280వ అధికరణం

11. ఎవరిపై పన్ను విధిస్తే వారే ఆ పన్ను భారాన్ని భరించడం అనేది.......

1) ప్రత్యక్ష పన్ను     2) పరోక్ష పన్ను 

3) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం   4) భూమి శిస్తు

12. పన్నుల భారాన్ని ఇతరులపైకి పూర్తిగా లేదా పాక్షికంగా బదిలీ చేయడానికి వీలున్న పన్ను ఏది?

1) ప్రత్యక్ష పన్ను     2) పురోగామి పన్ను 

3) అనుపాతపు పన్ను   4) పరోక్ష పన్ను

13. వస్తు, సేవల పన్ను ఆమోదానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ?

1) 101వ రాజ్యాంగ సవరణ

2) 102వ రాజ్యాంగ సవరణ 

3) 103వ రాజ్యాంగ సవరణ

4) 104వ రాజ్యాంగ సవరణ

14. 2003లో తొలిసారిగా వ్యాట్‌ చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రం?

1) అసోం     2) హరియాణా      

3) పంజాబ్‌      4) పశ్చిమ్‌ బంగ

15. ప్రపంచంలో తొలిసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేసిన దేశం, సంవత్సరం?

1) ఫ్రాన్స్, 1954   2) ఆస్ట్రియా, 1955 

3) యూఎస్‌ఏ, 1956   4) స్విట్జర్లాండ్, 1957

16. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఒక...

1) ప్రత్యక్ష పన్ను     2) పురోగామి పన్ను

3) అనుపాత పన్ను    4) పరోక్ష పన్ను

17. వస్తు, సేవల పన్నులు, వాటి ధరలను ఖరారు చేసే యంత్రాంగం ఏది?

1) జీఎస్టీ కౌన్సిల్‌ (మండలి) 

2) ప్రత్యక్ష పన్నుల బోర్డు

3) పరోక్ష పన్నుల బోర్డు   4) కేంద్ర ఆర్థికశాఖ

18. సర్‌ట్యాక్స్‌ లేదా సర్‌ఛార్జ్‌ అంటే...

1) పన్ను మీద విధించే పన్ను 

2) పురోగామి పన్ను    3) ఆదాయపు పన్ను

4) మూల్యానుగత పన్ను

19. సమాంతర ఆర్థిక వ్యవస్థను సూచించే అంశం?

1) నల్లధనం      2) బ్లాక్‌ మార్కెటింగ్‌

3) మనీలాండరింగ్‌   4) హవాలా

20. కింది వాటిలో 1991 పన్నుల సంస్కరణల కమిటీ ఏది?

1) ఆర్‌.చెల్లయ్య కమిటీ 

2) ఎల్‌.కె.ఝా కమిటీ

3) భూత లింగం కమిటీ 

4) జాన్‌ మత్తాయ్‌ కమిటీ

21. వ్యవసాయంపై పన్ను, వ్యవసాయ సంపదపై పన్నుకు సంబంధించి సరైంది?

1) కె.ఎన్‌.రాజ్‌ కమిటీ 

2) ఎస్‌.ఎన్‌.రాజ్‌ కమిటీ

3) విజయ్‌ కేల్కర్‌ కమిటీ 

4) వాంఛూ కమిటీ

22. కింది వాటిని జతపరచండి.

i) సంపద పన్ను        ఎ) 196566

ii) కార్పొరేషన్‌ పన్ను   బి) 1957

iii) ఆదాయపు పన్ను   సి) వ్యయ పన్ను

iv) 1957          డి) 1860

1) i-బి, ii-ఎ, iii-డి, iv-సి

2) i-సి, ii-డి, iii-బి, iv-ఎ

3) i-డి, ii-బి, iii-ఎ, iv-సి

4) i-బి, ii-సి, iii-ఎ, iv-డి

23. అమ్మకం పన్ను చట్టం స్థానంలో ప్రవేశ పెట్టింది?

1) కస్టమ్స్‌ సుంకాలు  2) వ్యాట్‌

3) జీఎస్టీ        4) సేవా పన్ను

24. భారతదేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది?

1) 1999   2) 2000    3) 2001    4) 2002

25. వస్తు, సేవల పన్ను లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరైంది?

1) డబుల్‌ ట్యాక్సేషన్‌ను నిరోధించి ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలపై దుష్ప్రభావాలను తొలగించడం, ఫలితంగా నాణ్యమైన వస్తువుల తయారీ, మార్కెట్‌లో  పోటీతత్వం పెంచడం

2) బహుళ పన్ను విధానానికి స్వస్తి పలికి పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడం

3) ఆర్థికాభివృద్ధికి సహకరించడం

4) పైవన్నీ

26. ‘‘ఒకే దేశం - ఒకే పన్ను’’ భావనతో పరోక్ష పన్నును సరళీకృత విధానంగా భారత రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్‌ ఆమోదించింది. అది ఏ రకమైన పన్ను?

1) వస్తు, సేవల పన్ను 

2) యాంటీ డంపింగ్‌ డ్యూటీ

3) ఫేస్‌లెస్‌ పన్ను   4) ఏంజెల్‌ పన్ను

27. జీఎస్టీ కౌన్సిల్‌ను ఎవరు ఏర్పాటు చేస్తారు?

1్శ ఉపరాష్ట్రపతి      2్శ రాష్ట్రపతి

3్శ ప్రధాన మంత్రి      4్శ కేంద్ర ఆర్థికమంత్రి

28. భారత రాజ్యాంగంలో సవరించిన ఏ ఆర్టికల్‌ ప్రకారం జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు?

1) 279వ అధికరణం (1) 

2) 280వ అధికరణం  (1)

3) 282వ అధికరణం (1) 

4) 283వ అధికరణం (1)

29. జీఎస్టీ అమలులో లేని ఏకైక దేశం?

1) ఆస్ట్రేలియా     2) యూఎస్‌ఏ

3) జర్మనీ       4) యూకే 

30. జీఎస్టీ పరిధిలో చేర్చని వస్తువులు?

1) మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు 

2) పొగాకు ఉత్పత్తులు 

3) వినోదపు పన్ను     

4) పైవన్నీ

సమాధానాలు

1 - 1    2 - 1    3 - 3    4 - 1    5 - 2    6 - 1    7 - 4    8 - 2    9 - 4    10 - 3    11 - 1    12 - 4    13 - 1    14 - 2    15 - 1    16 - 4    17 - 1    18 - 1    19 - 1    20 - 1    21 - 1    22 - 1    23 - 2    24 - 2    25 - 4    26 - 1   27 - 2   28 - 1   29 - 2   30 - 4

మరికొన్ని...

1. మోడిఫైడ్‌ వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ను ్బల్న్టీi÷i’్ట జ్చుః్య’ త్ట్టి’్ట గ్చ్లి  లీవీదీజుతిగ్శి ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1986      2) 1987 

3) 1988     4) 1989

2. జీఎస్టీ మండలికి ఛైర్మన్‌గా ఎవరు ఉంటారు?

1) ప్రధానమంత్రి    

2) కేంద్ర ఆర్థికమంత్రి

3) ఉపరాష్ట్రపతి     

4) రాష్ట్రపతి

3. జీఎస్టీ విధివిధానాల రూపకల్పనకు ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించారు?

1) అరుణ్‌జైట్లీ     

2) ఆసిమ్‌దాస్‌ గుప్తా  

3) అహ్లూవాలియా   4) రంగరాజన్‌

4. మనదేశంలో జీఎస్టీని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం?

1) అసోం     2) కేరళ 

3) మహారాష్ట్ర     4) కర్ణాటక 

5. పన్నుల పరిశీలన సంఘం ్బ195354్శ అధ్యక్షుడు?

1) జాన్‌ మత్తాయ్‌     

2) మహవీర్‌ త్యాగి

3) భూతలింగం

4) రంగరాజన్‌

6. తొలిసారిగా సేవల పన్ను ్బళీ’౯్రi‘’ గ్చ్ల్శిను ఏ సంవత్సరంలో విధించారు?

1) 1994 - 95     2) 1993 - 94 

3) 1992 - 94     4) 1991 - 92

7. సేవల పన్నును ప్రవేశపెట్టిన వారెవరు?

1) డా.మన్మోహన్‌ సింగ్‌ 

2) రంగరాజన్‌      3) ప్రణబ్‌ ముఖర్జీ 

4) చిదంబరం

8. కస్టమ్స్‌ సుంకాలు వేటి మీద విధిస్తారు?

1) ఎగుమతి, దిగుమతులు 

2) టెలిఫోన్‌ 

3) స్టాక్‌మార్కెట్‌ సేవలు 

4) జనరల్‌ బీమా సేవలు

9. సంపద పన్ను ్బజూ’్చః్మ్త గ్చ్ల్శిను  ఏ సంవత్సరంలో రద్దు చేశారు?

1) 2014     2) 2015 

3) 2016     4) 2017

10. కేంద్ర ప్రభుత్వం వేటిని మినహాయించి ఇతర అన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది? 

1) మద్యం     2) మత్తు పదార్థాలు

3) 1, 2     4) బంగారం

11. కింది వాటిలో జీఎస్టీకి సంబంధించి సరైంది? 

ఎ) కేంద్ర జీఎస్టీ     బి) రాష్ట్ర జీఎస్టీ 

సి) యూజీఎస్టీ      డి) ఐజీఎస్టీ 

1) ఎ సరైంది     2) బి సరైంది     

3) సి సరైంది      4) పైవన్నీ

12. కింది వాటిలో జీఎస్టీ పన్ను విధింపు రేట్లకు సంబంధించి సరైంది? 

1) 5%, 12%, 18%, 28% 

2) 12%, 27%, 28% 

3) 10%, 12%, 28% 

4) 15%, 20%, 25%

సమాధానాలు

1 - 1    2 - 2   3 - 2   4 - 1   5 - 1   6 - 1  7 - 1   8 - 1   9 - 2   10 - 3   11 - 4   12 - 1

ముఖ్యాంశాలు..

* జీఎస్టీ అంటే దేశవ్యాప్తంగా అన్ని వస్తు, సేవలపై ఒకే రకమైన పరోక్ష పన్ను వర్తింపజేయడం.

* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను జీఎస్టీ మండలి ఖరారు చేస్తుంది.

* మద్యంపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. 

* పన్నుకు ఆధారమైన ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు కూడా పెరిగితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

* పన్నుకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గితే దాన్ని తిరోగామి పన్ను అంటారు.

* బంగారు ఆభరణాల మీద 3% జీఎస్టీని విధిస్తున్నారు.

* వస్తువు విలువను బట్టి విధించే పన్నును మూల్యానుగత పన్ను అంటారు. 

Posted Date : 29-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌