• facebook
  • whatsapp
  • telegram

సమాజాభివృద్ధి - సంక్షేమ చర్యలు

మాదిరి ప్రశ్నలు

1. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్‌ పథకాన్ని ఏ పేరుతో అమలుచేస్తోంది?

1) వైఎస్‌ఆర్‌ ఆసరా 2) వైఎస్‌ఆర్‌ అభయహస్తం
3) వైఎస్‌ఆర్‌ భరోసా 4) వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక

2. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి తొలి సంతకాన్ని ఏ పథకానికి సంబంధించిన ఫైలుపై చేశారు?
1) వైఎస్‌ఆర్‌ రైతు భరోసా 2) వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక
3) వైఎస్‌ఆర్‌ ఆసరా 4) వైఎస్‌ఆర్‌ చేయూత

3. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద లబ్ధిదారులను గుర్తించడానికి వయఃపరిమితిని ఎంతకు తగ్గించింది?
1) 70 నుంచి 65 ఏళ్లకు 2) 65 నుంచి 60 ఏళ్లకు
3) 65 నుంచి 45 ఏళ్లకు 4) 60 నుంచి 45 ఏళ్లకు

4. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద డయాలసిస్‌ రోగుల పెన్షన్‌ను ఎంతకు పెంచారు?
1) రూ.3500 2) రూ.5000
3) రూ.7500 4) రూ.10,000

5. సామాజిక భద్రతా పింఛన్‌ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతున్న వర్గం?
1) వృద్ధులు 2) వితంతువులు
3) దివ్యాంగులు 4)ఒంటరిమహిళలు

6. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఎంత బడ్జెట్‌ను కేటాయించింది?
1) రూ.13,746.58 కోట్లు 2) రూ.14,746.58 కోట్లు
3) రూ.15,746.58 కోట్లు 4) రూ.16,746.58 కోట్లు

7. వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి సంబంధించి సరికానిది?
1) ప్రమాద మరణానికి ఆర్థిక సహాయం రూ.5,00,000
2) పూర్తి అంగవైకల్యానికి ఆర్థిక సహాయం రూ.5,00,000
3) పాక్షిక అంగవైకల్యానికి ఆర్థిక సహాయం రూ.2,50,000
4) సహజ మరణానికి ఆర్థిక సహాయం రూ.30,000

సమాధానాలు: 1-4; 2-2; 3-2; 4-4; 5-1; 6-3; 7-4

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌