• facebook
  • whatsapp
  • telegram

జీవావిర్భావ పరిణామం

 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భూమి వయసు సుమారుగా
జ: 4.6 బిలియన్‌ సంవత్సరాలు

 

2. కాస్మిక్‌ సిద్ధాంతం దేని ఆవిర్భావానికి సంబంధించింది?
జ: భూమి

 

3. భూమిపై మొదట ఏర్పడిన జీవి?
జ: అవాయు పరపోషక బ్యాక్టీరియా

 

4. భూమి ఏర్పడినప్పుడు ఏ వాయువుల ఉనికి ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు?
      ఎ) హైడ్రోజన్‌       బి) మీథేన్‌         సి) అమ్మోనియా        డి) ఆక్సిజన్‌
జ: ఎ, బి, సి

 

5. హాల్డేన్‌ ప్రకారం జీవపూర్వ ద్రవం (ప్రీ బయాటిక్‌ సూప్‌)లో ఉండే ప్రధాన భాగాలు?
జ: కోసర్వేట్‌లు

 

6. భూమిపై నివసిస్తున్న జీవుల్లో క్రమంగా జీవపరిణామం చెందుతూ కొత్తజీవుల ఏర్పాటు జరుగుతుందన్న వాదనకు ఏ ఆధారాలను సాక్ష్యాలుగా పరిగణించవచ్చు?
      ఎ) జీవులు నిర్మాణ, క్రియా సామ్య అవయవాలను కలిగి ఉండటం.
      బి) అవశేష అవయవాలు జీవుల్లో వ్యవస్థితం కావడం.
      సి) ఉపయుక్త వికిరణాన్ని జీవులు ప్రదర్శించడం.
జ: ఎ, బి, సి

 

7. కిందివాటిలో క్రియా సామ్య అవయవాలకు ఉదాహరణ 
      1) కీటకం, పక్షి, గబ్బిలం రెక్కలు                   2) సీల్‌ చేప ఫ్లిప్పర్‌లు, పావురం రెక్క, మనిషి చేయి
      3) చిరుత కాళ్లు, పక్షి రెక్క, మనిషి చేయి       4) పక్షి, గబ్బిలం రెక్కలు; మనిషి చేయి
జ: 1 (కీటకం, పక్షి, గబ్బిలం రెక్కలు)

 

8. ఒకే రకమైన జీవి నుంచి వివిధ వాతావరణ పరిస్థితుల్లో జీవించగలిగే జీవజాతుల ఆవిర్భావం దేనివల్ల సంభవిస్తుంది?
    ఎ) ఉపయుక్త వికిరణం       బి) అపసారి వికిరణం      సి) ఉపయుక్త విస్ఫోటనం      డి) అభిసారి వికిరణం
జ: ఎ, బి

 

9. అకస్మాత్తుగా పూర్వీకుల లక్షణాలు పరిణామక్రమంలో బయటపడటాన్ని శాస్త్ర పరిభాషలో ఏమంటారు?
జ: ఆటవిజం

 

10. కిందివాటిని జతపరచండి.
i) ఎజోయిక్‌ ఎరా                                  a) క్షీరదాలు ఉద్భవించాయి
ii) ఆర్కియోజోయిక్‌ ఎరా                       b) సముద్ర అకశేరుకాలు ఉద్భవించాయి
iii) ప్రొటిరోజోయిక్‌ ఎరా                          c) భూమిపై జీవి ఉద్భవించిన కాలం
iv) సీనోజోయిక్‌ ఎరా                             d) భూమిపై జీవులు లేని కాలం
జ: i-d, ii-c, iii-b, iv-a

 

11. కిందివాటిలో లామార్కిజంలోని ముఖ్య ప్రతిపాదనలు?
      ఎ) పరిసర ప్రభావ సూత్రం     బి) ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం      సి) ఆర్జిత గుణాల అనువంశిక సూత్రం
జ: ఎ, బి, సి

 

12. లామార్క్‌ రచించిన గ్రంథం?
జ: ఫిలాసఫీ జులాజిక్‌

 

13. బీజద్రవ్యంలో జరిగిన మార్పులే సంతానానికి చేరతాయని చుంచెలుకలపై ప్రయోగాలు చేసి బీజద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? 
జ: అగస్ట్‌ వీస్‌మన్

 

14. జీవ సృష్టి వాదాన్ని (బయోజెనిసిస్‌ సిద్ధాంతం) ప్రతిపాదించినవారు?
జ: లూయీపాశ్చర్‌

 

15. డార్విన్‌ సిద్ధాంతంలోని ప్రధానాంశాలు 
      ఎ) మనుగడ కోసం పోరాటం                        బి) యోగ్యతమముల సార్థక జీవనం
      సి) ప్రకృతివరణం ద్వారా జాతుల ఉత్పత్తి
జ: ఎ, బి, సి

 

16. ‘ఆన్‌ ది ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌’ వ్యాసాన్ని రాసినవారు?
జ: మాల్థస్‌

 

17. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన హ్యూగోడీవ్రీస్‌ ఏ మొక్కపై పరిశోధనలు చేశారు?
జ: ఈనోథిరా లామార్కియానా

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆక్సిజన్‌ను కలిగి ఉండే జీవులు సుమారు ఎన్ని బిలియన్‌ సంవత్సరాల కింద ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు? (ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్, 2012)
జ: 350

 

2. మొదటిసారి పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించినవారు? (ఏపీపీఎస్సీ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్) 
జ: జె.బి.డి.లామార్క్‌

 

3. కిందివాటిలో అవశేషాంగం కానిది? (గ్రూప్‌ 1, 1995)
      1) మానవుడి తోక                          2) గుర్రంలో స్ల్పింట్‌ ఎముక
      3) మానవుడి శరీరంపై రోమాలు       4) కప్పలో నిమేషక త్వచం
జ: 4 (కప్పలో నిమేషక త్వచం)

 

4. కిందివాటిలో ‘గ్రేట్‌ ఐస్‌ ఏజ్‌’ అని దేన్ని పేర్కొంటారు?(గ్రూప్‌ 1, 2008)
      1) కేంబ్రియన్, ఆర్కియోజోయిక్‌       2) సైలూరియన్, డెవోనియన్‌
      3) మయోసీన్, హోలోసీన్‌               4) ప్లీస్టోసీన్, ప్లియోసీన్‌
జ: 4 (ప్లీస్టోసీన్, ప్లియోసీన్‌)

 

5. భూమి ఆవిర్భావం వాయువులు, ధూళికణాలతో ఏర్పడిందని తెలియజేసినవారు? (గ్రూప్‌ 2, 2008)
జ: జేమ్స్‌ జీన్స్‌

 

6. కిందివాటిలో పురాతన జంతువు? (గ్రూప్‌ 4, స్టెనో, టైపిస్ట్‌ 2012)
      1) డాల్ఫిన్‌       2) ఒట్టర్‌       3) టర్టిల్‌       4) వాల్‌రస్‌
జ: 3 (టర్టిల్‌)      

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌