• facebook
  • whatsapp
  • telegram

జైన, బౌద్ధమతాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జైన, బౌద్ధమతాల్లో ప్రాచీనమైంది?

జ: జైనమతం
 

2. క్రీ.పూ.6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భవానికి కారణం కాని అంశం?
జ: వస్తుమార్పిడి విధానం

 

3. కిందివాటిలో అతి ప్రాచీన మతం?
1) జైనమతం         2) బౌద్ధమతం      3) అజీవక మతం     4) హిందూ మతం
జ: 4 (హిందూ మతం)

 

4. జైనమత గురువులను ఏమని పిలుస్తారు?
జ: తీర్థంకరులు

 

5. 22వ తీర్థంకరుడైన అరిష్టనేమి గుర్తు?
జ: శంఖం

 

6. అస్థేయ వ్రతం అంటే?
జ: దొంగతనం చేయకపోవడం

 

7. కిందివాటిలో జైనమతానికి సంబంధించి సరికానిది?
1) చారిత్రకంగా జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు.
2) జైనమత గ్రంథాలను అంగాలు అంటారు.
3) జైనమత సంప్రదాయంలో 24 మంది తీర్థంకరులున్నారు.
4) జైనమతం సల్లేఖన వ్రతాన్ని బోధించింది.
జ: 1 (చారిత్రకంగా జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు.)

 

8. జైన త్రిరత్నాల్లో లేనిది?
జ: సరైన వాక్కు

 

9. బౌద్ధ త్రిరత్నాల్లో లేనిది?
జ: ఆరామం

 

10. బౌద్ధమత గ్రంథాలను ఏమంటారు?
జ: త్రిపీటకాలు

 

11. మధ్యేమార్గంగా పేరొందిన మతం?
జ: బౌద్ధమతం

 

12. సత్యం కోసం అన్వేషించేవారిని ఏమంటారు?
జ: పరివ్రాజకులు

 

13. వర్ధమాన మహావీరుడి భార్య?
జ: యశోద

 

14. బుద్ధుడి వంశం?
జ: శాక్య

 

15. వర్ధమాన మహావీరుడు ధ్యానం చేసిన సాలవృక్షం ఏ నదీతీరంలో ఉంది?
జ: రిజుపాలిక

 

16. గౌతమ బుద్ధుడు ఎన్నో ఏట పరివ్రాజకుడయ్యాడు?
జ: 29

 

17. గౌతమబుద్ధుడు జన్మించిన లుంబినీ వనం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది?
జ: నేపాల్‌

 

18. వర్ధమాన మహావీరుడి తర్వాత జైనమతానికి ప్రధాన గురువుగా వ్యవహరించినవారు?
జ: ఆర్య సుధర్ముడు

 

19. జైనమతం వల్ల ప్రేరణ పొంది, అభివృద్ధి చెందిన శిల్పకళ?
జ: మధుర

 

20. కిందివాటిలో బౌద్ధమతంతో సంబంధం లేనిది?
1) స్తూపాలు        2) త్రిపీటకాలు       3) ఆర్యసత్యాలు      4) పంచవ్రతాలు
జ: 4 (పంచవ్రతాలు)

 

21. దిగంబర జైనానికి నాయకత్వం వహించినవారు?
జ: భద్రబాహుడు

 

22. రెండో జైన పరిషత్తు క్షమశ్రవణుడి నాయకత్వంలో ఎక్కడ జరిగింది?
జ: వల్లభి

 

23. ‘జినుడు’ అంటే?
జ: కోరికలు, ఇంద్రియాలను జయించినవాడు

 

24. కిందివాటిని జతపరచండి.
బౌద్ధ సంగీతులు                                      ప్రాంతం
i) మొదటి బౌద్ధ సంగీతి                           a) కుందనవనం
ii) రెండో బౌద్ధ సంగీతి                            b) రాజగృహం
iii) మూడో బౌద్ధ సంగీతి                          c) పాటలీపుత్రం
iv) నాలుగో బౌద్ధ సంగీతి                          d) వైశాలి
జ: i-b, ii-d, iii-c, iv-a

 

25. వర్ధమాన మహావీరుడి తొలి శిష్యుడు?
జ: జామాలి

 

26. సల్లేఖన వ్రతం ఆచరించిన మౌర్య చక్రవర్తి?
జ: చంద్రగుప్త మౌర్యుడు

 

27. వర్ధమాన మహావీరుడు జన్మించిన, మరణించిన ప్రాంతాలు వరుసగా?
జ: కుంద, పావాపురి

 

28. ప్రతీయ సముత్పాద సిద్ధాంతంగా పేరొందిన మతం?
జ: బౌద్ధం

 

29. జైనమత తొలి తీర్థంకరుడు?
జ: రుషభనాథుడు

 

30. పార్శ్వనాథుడి గుర్తు?
జ: పాము

 

31. దిల్వారా జైన దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: రాజస్థాన్‌

 

32. విశ్వవిద్యాలయాలుగా వెలుగొందిన బౌద్ధ నిర్మాణాలు?
జ: ఆరామాలు

 

33. వల్లభి విశ్వవిద్యాలయం ఏ శాఖకు చెందింది?
జ: హీనయాన

 

34. సంస్కృత భాషకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన శాఖ?
జ: మహాయాన

 

35. గోమఠేశ్వర విగ్రహం ఉన్న శ్రావణబెల్గోళ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: కర్ణాటక

 

36. కల్పసూత్రాలను ఎవరు రచించారు?
జ: భద్రబాహుడు

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌