• facebook
  • whatsapp
  • telegram

74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)

మాదిరి ప్రశ్నలు

1. పి.వి. నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ రాజ్యాంగానికి చేర్చిన భాగం ఏది?
1) 9వ భాగం 2) 9(A) భాగం 3) 10వ భాగం 4) 10(A) భాగం

2. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికారాలు, విధులను 11వ షెడ్యూల్‌లో పొందుపరిచారు?
1) 18 2) 21 3) 29 4) 31

3. పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1993 ఏప్రిల్‌ 24 2) 1993 మే 1 3) 1993 జూన్‌ 1 4) 1994 ఆగస్టు 2

4. మెట్రో పాలిటన్‌ మహానగరంగా పరిగణించాలంటే జనాభా ఎంతకు మించి ఉండాలి?
1) 10 లక్షలు 2) 8 లక్షలు 3) 6 లక్షలు 4) 5 లక్షలు

5. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వివిధ పదవుల ఎన్నికకు సంబంధించి సరికానిది?
1) నగర పంచాయతీ వార్డు సభ్యుడి ఎన్నిక ప్రత్యక్షం 2) నగర పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక పరోక్షం 3) మున్సిపాలిటీ కౌన్సిలర్‌ ఎన్నిక ప్రత్యక్షం 4) మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నిక పరోక్షం

6. పట్టణ, నగరపాలక సంస్థల్లోని ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు హక్కును కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పుడు చట్టం చేసింది?
1) 2007 2) 2008 3) 2009 4) 2010

7. పట్టణ, నగరపాలక సంస్థల్లో ఎంతకుపైగా జనాభా ఉంటే ఆర్టికల్‌ 243(ళీ) ప్రకారం వార్డు/డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు?
1) 50,000 2) లక్ష 3) 2 లక్షలు 4) 3 లక్షలు

8. ఏ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన బహుళసభ్య వార్డు కమిటీలను సుప్రీంకోర్టు సమర్థించింది?
1) రాజస్థాన్‌ 2) గుజరాత్‌ 3) మహారాష్ట్ర 4) కర్ణాటక

9. ఆర్టికల్‌ 243(గి) ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిర్దేశించిన రిజర్వేషన్లు?
1) 1/2వ వంతు 2) 1/3వ వంతు 3) 2/3వ వంతు 4) వారిజనాభా ప్రాతిపదికన

10. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కేటాయించాల్సిన స్థానాలు?
1) 1/3వ వంతు 2) 1/2వ వంతు 3) 2/3వ వంతు 4) వారి జనాభా ప్రాతిపదికన

సమాధానాలు: 1-2, 2-1, 3-3, 4-1, 5-2, 6-3, 7-4, 8-2, 9-4, 10-1

Posted Date : 29-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌