మాదిరి ప్రశ్నలు
1. జాతీయ ఎస్టీ కమిషన్ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్ 338(A)
2. కిందివాటిలో జాతీయ ఎస్టీ కమిషన్ ప్రాంతీయ కార్యాలయం లేని సముదాయాన్ని గుర్తించండి.
1) భోపాల్, భువనేశ్వర్ 2) భద్రాచలం, బస్తర్ 3) షిల్లాంగ్, రాంచీ 4) జైపూర్, రాయ్పూర్
జ: 2 (భద్రాచలం, బస్తర్)
3. PESA ను విస్తరించండి.
జ: Panchayats Extension to the Scheduled Areas
4. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, దాన్ని రాష్ట్రపతి ఎవరికి అందజేస్తారు?
జ: పార్లమెంట్
5. భారత ప్రభుత్వం నేషనల్ ట్రైబల్ పాలసీని ఎప్పుడు ప్రకటించింది?
జ: 2010
6. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ మొదటి ఛైర్మన్?
జ: కున్వర్ సింగ్
7. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ ప్రస్తుత ఛైర్మన్?
జ: నందకుమార్ సాయి
8. కిందివారిలో జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్కు ఛైర్మన్గా వ్యవహరించనివారు?
1) కున్వర్ సింగ్ 2) ఊర్మిళా సింగ్ 3) రామేశ్వర్ ఓరాన్ 4) నందగోపాల్
జ: 4 (నందగోపాల్)
9. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ ఛైర్మన్ వేతనం ఎవరి వేతనానికి సమానంగా ఉంటుంది?
జ: కేంద్ర కేబినెట్ మంత్రి