మాదిరి ప్రశ్నలు
1. భారతదేశంలో 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఎల్పీజీ అనే అభివృద్ధి నమూనాను ప్రారంభించిన నాటి ఆర్థిక మంత్రి ఎవరు?
జ: డాక్టర్ మన్మోహన్ సింగ్
2. 1990-91 నాటికి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం (BOP) కరెంట్ఖాతా లోటు ఎంతకు చేరింది?
జ: 9.7 బిలియన్ డాలర్లు
3. 1990-91 నాటికి దేశ ద్రవ్యోల్బణ శాతం ఎంత నమోదైంది?
జ: 10.3%
4. 1990-91 నాటికి కోశపరమైన లోటు శాతం ఎంత?
జ: 7.8%
5. స్వేచ్ఛా వ్యాపార భావనను ఎవరు ప్రవేశపెట్టారు?
జ: ఆడమ్ స్మిత్
6. కిందివాటిలో సరళీకరణలో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమలు ఏవి?
1) రక్షణ సామాగ్రి 2) అణు విద్యుదుత్పత్తి 3) రైల్వే రవాణ 4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
7. సరళీకరణ విధానంలో తప్పనిసరి లైసెన్స్ పొందాల్సిన పరిశ్రమలను 18 నుంచి ఎంతకు కుదించారు?
జ: 5
8. కిందివాటిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది?
1) బ్యాంకులు 2) బీమా 3) పింఛను 4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
9. ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆచరణల చట్టాన్ని (ఎంఆర్టీపీ) ఏ సంవత్సరంలో చేశారు?
జ: 1969
10. 1969 లో ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు?
జ: ప్రొఫెసర్. పీటర్ డ్రకర్
11. బ్రిటన్లో మొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నాంది పలికిన నాటి ప్రధాని ఎవరు?
జ: మార్గరెట్ థాచర్
12. 'పెట్టుబడుల ఉపసంహరణ' కిందివాటిలో దేనిలో భాగం?
1) సరళీకరణ 2) ప్రైవేటీకరణ 3) ప్రపంచీకరణ 4) పైవేవీ కావు
జ: 2(ప్రైవేటీకరణ)
13. 2016-17 కేంద్ర బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ (ప్రభుత్వ రంగ సంస్థల్లో) లక్ష్యాన్ని ఎంతగా నిర్దేశించారు?
జ: రూ.56,500 కోట్లు
14. జాతీయ పెట్టుబడి నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 3 నవంబరు 2005
15. ప్రపంచ వర్తక సంస్థ (డబ్ల్యూటీఓ) ఎప్పుడు ఏర్పడింది?
జ: 1995
16. కిందివాటిలో బహుళజాతి సంస్థ ఏది?
1) శామ్సంగ్ 2) వీడియోకాన్ 3) గోద్రెజ్ 4) డాబర్
జ: 1(శామ్సంగ్)
17. 2015-16 బడ్జెట్లో ప్రకటించిన విదేశీమారక ద్రవ్య నిల్వలు ఎంత (బిలియన్ డాలర్లలో)?
జ: 350 బిలియన్ డాలర్లు
18. యూరో కరెన్సీ కూటమి నుంచి ఇటీవల వైదొలిగిన దేశం ఏది?
జ: బ్రిటన్
19. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది?
జ: 2000
20. కిందివాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది?
1) అణుశక్తి 2) లాటరీ వ్యాపారం 3) చిట్ఫండ్ సంస్థలు 4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)