గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మెక్‌మోహన్ రేఖ కింది ఏ రెండు దేశాల మధ్య ఉంది? (జూనియర్ స్టెనో, 2010)
జ: భారత్ - చైనా
2. భారత ప్రధాన భూభాగపు దక్షిణ ప్రాంతం? (అసిస్టెంట్ టీఎంవీఐ, 2009)
జ: కన్యాకుమారి
3. కిందివాటిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది?
1) గుజరాత్ 2) మధ్యప్రదేశ్ 3) ఆంధ్రప్రదేశ్ 4) మహారాష్ట్ర
జ: 2 (మధ్యప్రదేశ్)
4. కింది ఏ దేశంతో భారతదేశానికి సమష్టి సరిహద్దు లేదు? (జేఎల్, 2004)
1) అఫ్గానిస్థాన్ 2) బంగ్లాదేశ్ 3) నేపాల్ 4) బర్మా
జ: 1 (అఫ్గానిస్థాన్)
5. భారతదేశ మొత్తం భూభాగ వైశాల్యం ఎంత? (జేఎల్, 2006)
జ: 32,87,263 చ.కి.మీ.
6. వైశాల్యంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం? (జేఎల్, 2011)
జ: లక్షదీవులు
7. భారత్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం (గ్రూప్ 1, 2007)
జ: 8º జలమార్గం
8. సర్‌క్రీక్ వివాదం కింది ఏయే దేశాల మధ్య ఉంది? (గ్రూప్ 1, 2004)
1) భారత్ - పాకిస్థాన్ 2) నార్వే - స్వీడన్ 3) మయన్మార్ - థాయ్‌లాండ్ 4) నేపాల్ - చైనా
జ: 1 (భారత్ - పాకిస్థాన్)
9. కిందివాటిలో మూడు దేశాలతో సరిహద్దు గల రాష్ట్రాలు? (గ్రూప్ 4, 2011)
1) జమ్ముకశ్మీర్, పశ్చిమ్ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్
2) పశ్చిమ్ బంగ, మణిపూర్, జమ్ముకశ్మీర్, గుజరాత్
3) జమ్ముకశ్మీర్, త్రిపుర, సిక్కిం, పశ్చిమ్ బంగ
4) పశ్చిమ్ బంగ, నాగాలాండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్
జ: 1 (జమ్ముకశ్మీర్, పశ్చిమ్ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్)
10. భారత్, అఫ్గానిస్థాన్‌లను వేరుచేసే రేఖ (డీఈవో, 2010)
జ: డ్యూరాండ్ రేఖ
11. భారతదేశం ఎన్ని దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది? (పీఎల్, 2011)
జ: 7