• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలన సంస్థలు

1. కింది వాటిలో భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించి సరైంది? 

ఎ. గ్రామీణ పాలనను చోళులు అభివృద్ధి చేశారు.

బి. పట్టణ పాలనను మౌర్యులు అభివృద్ధి చేశారు.

సి. చోళుల కాలంలో రంధ్రం చేసిన కుండలను బ్యాలట్‌ బాక్స్‌లుగా, రంగు వేసిన తాటాకులను బ్యాలట్‌ పత్రాలుగా ఉపయోగించారు.

డి. చోళుల కాలంలో అయిదుగురు సభ్యులతో కూడిన ‘పంచాస్‌Ã అనే మండలి గ్రామీణ పాలనను నిర్వహించేది.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి     4) పైవన్నీ    

2. చోళుల గ్రామీణ పరిపాలనను వివరించే ఉత్తర మేరూర్‌ శాసనాన్ని వేయించిన చోళరాజు ఎవరు?

1) మొదటి పరాంతకుడు

2) రెండో పరాంతకుడు

3) కులోత్తుంగ చోళుడు

4) రాజరాజ నరేంద్రుడు 

3. మనదేశంలో 1882, మే 18న స్థానిక స్వపరిపాలనకు సంబంధించి నిర్దిష్ట రూపాన్నిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తిని ‘స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు’గా అభివర్ణిస్తారు. ఆయన ఎవరు?

1) వారన్‌ హేస్టింగ్స్‌     2) లార్డ్‌ రిప్పన్‌

3) లార్డ్‌ విట్టన్‌     4) చార్లెస్‌ విల్కిన్‌సన్‌

4. చార్లెస్‌ హాబ్‌హౌస్‌ నాయకత్వంలో ఏర్పడిన ‘రాయల్‌ కమిషన్‌’ పంచాయతీరాజ్‌ వ్యవస్థపై ఇచ్చిన నివేదికకు సంబంధించి కింది వాటిలో సరైంది? 

ఎ. ప్రతి గ్రామానికి ఒక గ్రామపంచాయతీని ఏర్పాటు చేయాలి

బి. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకునేప్రతినిధుల సంఖ్యను పెంచాలి

సి. ప్రాథమిక విద్యను నిర్వహించే బాధ్యతను మున్సిపాలిటీలకు అప్పగించాలి

డి. ఈ కమిషన్‌ 1907లో ఏర్పాటైంది

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) పైవన్నీ

5. వివిధ సామాజిక అభివృద్ధి ప్రయోగాలను ప్రారంభించిన వారికి సంబంధించి సరికానిది.

1) గుర్గావ్‌ ప్రయోగం - ఎఫ్‌.ఐ.బ్రేయన్‌ 

2) మార్తాండం ప్రయోగం - కె.ఎం.ఫణిక్కర్‌

3) శ్రీనికేతన్‌ ప్రయోగం - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 

4) సేవాగ్రాం ప్రయోగం - మహాత్మాగాంధీ

6. బరోడా సామాజిక ప్రయోగానికి సంబంధించి సరైంది ఏది? 

ఎ. దీన్ని 1932లో వి.టి.కృష్ణమాచారి ప్రారంభించారు.

బి. గ్రామీణ ప్రాంతంలోని యువతీయువకులను అభివృద్ధిలో భాగస్వాములను చేయడం దీని లక్ష్యం.

సి. పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, రోడ్లు వేయడం మొదలైన రంగాల్లో శిక్షణ ఇచ్చారు.

డి. దీనికి అమెరికా వ్యవసాయ రంగ నిపుణుడు స్పెన్సర్‌హాచ్‌ సహకారం అందించారు.

1) ఎ, బి, సి         2) ఎ, బి, డి 

3) ఎ, సి, డి       4) పైవన్నీ

7. వివిధ సామాజిక వికాస పథకాలు, అవి ప్రారంభించిన వారికి సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ. ఫిర్కా పథకం - టంగుటూరి ప్రకాశం 

బి. ఇటావా పథకం - అల్బర్ట్‌ మేయర్‌ 

సి. దేశ్‌పాండే పథకం - దలాల్‌ పాండే 

డి. నీలోఖేరి పథకం - ఎస్‌.కె.డే 

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి

3) ఎ, బి, డి      4) పైవన్నీ 

8. వివిధ సామాజిక వికాస పథకాలు, అమలైన ప్రాంతాలకు సంబంధించి సరికానిదేది? 

1) ఇటావా పథకం - ఉత్తర్‌ ప్రదేశ్‌ 

2) నీలోఖేరి పథకం - హరియాణా  

3) మార్తాండం పథకం - కేరళ 

4) ఫిర్కా పథకం - మద్రాస్‌

9. 1948లో ప్రారంభమైన ఇటావా ప్రయోగానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? 

ఎ. ఎంపిక చేసిన సుమారు 97 గ్రామాల్లో దీన్ని నిర్వహించారు.

బి. కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజాభిÅవృద్ధి కోసం కృషి చేశారు.

సి. వ్యవసాయం, పాడిపరిశ్రమలు, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించారు. 

డి. ప్రాతిపదిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు.  

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) పైవన్నీ 

10. దేశ విభజన ఫలితంగా నిరాశ్రయులైన సుమారు 7000 మందికి పునరావాసం కల్పించడం, వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో శిక్షణ ఇవ్వడం మొదలైన అంశాలతో సంబంధం ఉన్న సామాజిక వికాస పథకాన్ని గుర్తించండి. 

1) సేవాగ్రాం పథకం   2) ఫిర్కా పథకం 

3) నీలోఖేరి పథకం   4) ఇటావా పథకం 

11. కింది వాటిలో బల్వంతరాయ్‌ మెహతా కమిటీ చేసిన సిఫార్సుల్లో సరికానిది గుర్తించండి.

1) స్థానిక సంస్థలకు తగిన అధికారాలు, ఆర్థిక వనరులు కల్పించాలి

2) భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి

3) స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ ప్రాతిపదికగా కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరగాలి

4) స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి

12. ‘‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’’ ్బదిదీశ్శిని మనదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? 

1) 1951, అక్టోబరు 2 

2) 1952, అక్టోబరు 2 

3) 1952, నవంబరు 26

4) 1953, జనవరి 16

13. కింది వాటిలో ‘‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’’  ్బదిదీశి)కి సంబంధించి సరైంది ఏది?

ఎ. దేశంలోని 50 జిల్లాల్లో ఉన్న 55 బ్లాకుల్లో ప్రారంభించారు. 

బి. దీని కాలపరిమితి మూడేళ్లు.

సి. ప్రతి బ్లాకులో 100 గ్రామాలు, 70,000 జనాభా ఉంటుంది.

డి. దేశ ప్రగతిలో గ్రామీణ ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించడం దీని ఉద్దేశం.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) పైవన్నీ

14. మనదేశంలో ‘‘నేషనల్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీస్‌ స్కీమ్‌’’కు ్బవినిళీళ్శీ సంబంధించి సరైంది?  

ఎ. దీన్ని 1953, అక్టోబరు 2న శాశ్వత ప్రాతిపదికపై ప్రారంభించారు.

బి. సహకార సిద్ధాంతాలను విస్తృతం చేసి, గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యం కల్పించడం దీని లక్ష్యం

సి. ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’కి కొనసాగింపుగా 1700 బ్లాకుల్లో దీన్ని ప్రారంభించారు.

డి. 1959, మార్చి 31న దీన్ని నిలిపేశారు.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) పైవన్నీ

15. అశోక్‌ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది?

1) రెండు    2) మూడు 

3) నాలుగు    4) అయిదు

సమాధానాలు

1 - 4   2 - 1   3 - 2   4 - 4   5 - 2   6 - 1   7 - 3   8 - 3    9 - 1   10 - 3    11 - 4    12 - 2    13 - 4    14 - 1    15 - 1

* స్థానిక సంస్థల పదవీ కాలం నాలుగేళ్లు ఉండాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? 

1) బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

2) అశోక్‌ మెహతా కమిటీ

3) దంత్‌వాలా కమిటీ

4) దండేకర్‌ కమిటీ

జవాబు: 2

* మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో గ్రామీణాభివృద్ధికి కీలకమైన సిఫార్సులు చేసిన కమిటీ? 

1) పి.డి.టి. మిశ్రా కమిటీ

2) టి.టి. ఛటర్జీ కమిటీ 

3) కె. సంతానం కమిటీ

4) వి.టి. కృష్ణమాచారి కమిటీ

జవాబు: 4

* నేషనల్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీస్‌ స్కీమ్‌ను ్బవినిళీళ్శీ ‘సుశిక్షితులైన తోటమాలి  నిర్వహించే చక్కటి ఉద్యానవనం’ అని ఎవరు పేర్కొన్నారు?

1) నెహ్రూ   2) కె.టి.కృష్ణమాచారి

3) ఎస్‌.కె.డే

4) అనంతశయనం అయ్యంగార్‌

జవాబు: 3

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. గ్రామ స్వరాజ్‌ భావనకు రూపకల్పన చేసింది ఎవరు? (ఏపీ కానిస్టేబుల్స్, 2016)

1) జయప్రకాష్‌ నారాయణ్‌

2) ఆచార్య వినోబాభావే

3) మహత్మాగాంధీ  4) స్వామి దయానంద

2. జిల్లా స్థాయి ప్రణాళికను ఏ కమిటీ సిఫార్సు చేసింది?  (ఏపీ సబ్‌ఇన్‌స్పెక్టర్స్, 2012)

1) జి.వి.కె.రావు కమిటీ

2) ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ

3) కె.సంతానం కమిటీ

4) దంత్‌వాలా కమిటీ

3. మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ మొదటిసారి ఏ రాష్ట్రంలో అమలు చేశారు?  (ఏపీపీఎస్సీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ - 2012)

1) రాజస్థాన్‌    2) ఆంధ్రప్రదేశ్‌

3) కర్ణాటక    4) తమిళనాడు

4. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు? (ఏపీపీఎస్సీ, గ్రూప్‌-ఖి, 2010)

1) ఎన్‌.సంజీవరెడ్డి       2) డి.సంజీవయ్య

3) కె.బ్రహ్మానందరెడ్డి

4) పి.వి.నరసింహారావు 

5. భారతదేశంలో మొదటి మున్సిపల్‌  కార్పొరేషన్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? (సబ్‌ఇన్‌స్పెక్టర్స్, కమ్యూనికేషన్‌ - 2013)

1) కలకత్తా    2) బొంబాయి

3) మద్రాసు    4) దిల్లీ

6. పంచాయతీలకు రాజ్యాంగ హోదాను సిఫార్సు చేసిన కమిటీ ఏది? (పంచాయతీ సెక్రటరీ - 2019)

1) బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

2) అశోక్‌ మెహతా కమిటీ

3) ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ

4) తుంగన్‌ కమిటీ

7. టంగుటూరి ప్రకాశం నేతృత్వంలోని ప్రాదేశిక ప్రభుత్వం 1946లో ప్రవేశపెట్టిన  గ్రామీణాభివృద్ధి పథకం పేరు? (పంచాయతీ సెక్రటరీ - 2017)

1) నీలోఖేరి పథకం   2) రైతు శ్రామిక్‌ పథకం

3) ఫిర్కా అభివృద్ధి పథకం

4) పరపతి ప్రగతి పథకం

8. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ ఎక్కడ ఉంది? (పంచాయతీ సెక్రటరీ - 2017, ఏపీ వార్డు సచివాలయం - 2019)

1్శ మైసూర్‌    2్శ ఆవడి

3్శ కాన్పూర్‌    4్శ హైదరాబాద్‌

9. సి.నరసింహం కమిటీ సిఫార్సును గుర్తించండి? 

1) పంచాయతీ సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నిక

2) వార్డు సభ్యుడి పదవికి పరోక్ష ఎన్నిక

3) మండల పరిషత్‌ అధ్యక్షుడి పదవికి ప్రత్యక్ష ఎన్నిక

4) పంచాయతీ సర్పంచ్‌ పదవికి పరోక్ష ఎన్నిక

10. 1959లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏ స్థాయిలో అమలవుతోంది?  (గ్రూప్‌-II, 2012)

1) సమితి, బ్లాక్‌ స్థాయులు

2) బ్లాక్, జిల్లా స్థాయులు

3్శ సమితి, జిల్లా స్థాయులు

4) గ్రామ, బ్లాక్, జిల్లాస్థాయులు

11. భారతదేశంలో సామాజికాభిÅవృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిన వారెవరు? (ఏపీ వార్డు సచివాలయం - 2019)

1) మహాత్మాగాంధీ      2) ఎస్‌.కె.డే

3) ఆర్‌.ఎన్‌.ఠాగూర్‌      4) రనడే

సమాధానాలు

13    21   31   41   53   63   73   84  91 104 112

Posted Date : 15-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌