• facebook
  • whatsapp
  • telegram

గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు

ముఖ్యాంశాలు

* ‘గ్రామపంచాయతీ’ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఏర్పాటు చేస్తారు.

* గ్రామపంచాయతీలో కనీస వార్డుల సంఖ్య - 5, గరిష్ఠ వార్డుల సంఖ్య - 21.

* గ్రామపంచాయతీ సమావేశాలు సర్పంచ్‌ అధ్యక్షతన నెలకొకసారి జరగాలి.

* మనదేశంలో జాతీయస్థాయిలో ‘పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ’ను 2004లో ఏర్పాటు చేశారు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1987, జనవరి 15 న 330 పంచాయతీ సమితులను రద్దు చేసి, వాటి స్థానంలో 1104 మండల పరిషత్‌లను ఏర్పాటు చేసింది.

* స్థానిక సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయకపోతే "Recall" విధానం ద్వారా తొలగించాలని గాంధీజీ ప్రతిపాదించారు.

* జిల్లాస్థాయిలో ‘‘సామాజిక న్యాయకమిటీలను’’ ఏర్పాటు చేయాలని జలగం వెంగళరావు కమిటీ సిఫార్సు చేసింది.

1. పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం కోసం ఏర్పాటైన సీహెచ్‌. హనుమంతరావు కమిటీ చేసిన సిఫార్సును గుర్తించండి.

ఎ) గ్రామపంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి

బి) జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటుచేయాలి

సి) జిల్లాపరిషత్‌ అభివృద్ధిలో జిల్లా కలెక్టర్‌ కీలకపాత్ర పోషించాలి

డి) ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను’ ఏర్పాటు చేయాలి

1) ఎ, సి    2) బి, సి

3) ఎ, డి    4) పైవన్నీ 

2. కింది వాటిలో అశోక్‌ మెహతా కమిటీ చేసిన సిఫార్సును గుర్తించండి.

ఎ) గ్రామపంచాయతీల స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి

బి) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి.

సి) మండల పరిషత్, జిల్లా పరిషత్‌ అనే రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలి.

డి) ఈ కమిటీ 132 సిఫార్సులు చేసింది.

1) ఎ, సి    2) బి, సి

3) ఎ, డి    4) పైవన్నీ 

3. 1986లో ఏర్పాటైన ఎల్‌.ఎం.సింఘ్వీ కమిషన్‌ స్థానిక సంస్థలపై చేసిన సిఫార్సు లను గుర్తించండి.

ఎ) స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి

బి) ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి

సి) గ్రామసభల ప్రాధాన్యాన్ని పెంచాలి

డి) స్థానిక సంస్థల పదవీకాలం ఆరేళ్లు ఉండాలి

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి

3) ఎ, బి, డి      4) పైవన్నీ

4. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ్బ1992్శ ద్వారా రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు?

1) 29     2) 18     3) 23     4) 32

5. 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రధాని ఎవరు?

1) రాజీవ్‌గాంధీ  2) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌

3) పి.వి.నరసింహారావు

4) హెచ్‌.డి.దేవెగౌడ

6. కింది వాటిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన ఘట్టానికి సంబంధించి సరైంది ఏది?

ఎ) పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది.

బి) 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

సి) 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1992, డిసెంబరు 22న పార్లమెంట్‌ ఆమోదించింది.

డి) 73వ రాజ్యాంగ సవరణ బిల్లుపై 1993, ఏప్రిల్‌ 20న అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ ఆమోదముద్ర వేశారు.

1) ఎ, సి    2) బి, సి

3) ఎ, డి    4) పైవన్నీ 

7. 73వ రాజ్యాంగ సవరణ చట్టం  (1992) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1993, మే 20

2) 1993, ఏప్రిల్‌ 24

3) 1993, మార్చి 30

4) 1993, జూన్‌ 1

8. కింద పేర్కొన్న ఏ కమిటీ "Block Development Officer" (BDO)  అనే పదవిని రద్దు చేసి, "District Development Officedr" (DDO) పదవిని ఏర్పాటు  చేయాలని సిఫార్సు చేసింది?

1) దంతెవాలా కమిటీ

2) సీహెచ్‌. హనుమంతరావు కమిటీ

3) జి.వి.కె.రావు కమిటీ

4) పి.సి.మిశ్రా కమిటీ

9. గ్రామసభకు సంబంధించి కింది వాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగంలోని ఆర్టికల్‌  243్బత్శి గ్రామసభ గురించి వివరిస్తుంది.

బి) గ్రామపంచాయతీ పరిధిలో నమోదైన ఓటర్లంతా గ్రామసభలో సభ్యులుగా ఉంటారు.

సి) గ్రామసభకు సర్పంచ్‌ అధ్యక్షులుగా ఉంటారు.

డి) ‘గ్రామసభ’ గ్రామపంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది.

1) ఎ, సి    2) బి, సి

3) ఎ, డి    4) పైవన్నీ

10. ఏ కమిటీ సిఫార్సుల మేరకు "PESA" Act (Panchayat Raj Extension to Scheduled  Areas Act) ను  రూపొందించారు?

1) దిలీప్‌సింగ్‌ భూరియా కమిటీ

2) రామేశ్వర్‌ ఓరాన్‌ కమిటీ

3) బింద్రూనాయక్‌ కమిటీ

4) అహ్లువాలియా కమిటీ

11. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మహిళలకు ఎంతశాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(D) పేర్కొంటోంది?

1) 1/2వ వంతు     2) 1/3వ వంతు

3) 1/4వ వంతు     4) 2/3వ వంతు

12. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు? 

1) 18   2) 21   3) 25   4) 30

13. మనదేశంలో PESA యాక్ట్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 

1) 1994, మార్చి 24  2) 1995, మే 26

3) 1996, డిసెంబరు 24

4) 1997, డిసెంబరు 24

14. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243్బద్శి ప్రకారం వివిధ పదవులకు నిర్వహించే ఎన్నికలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?

ఎ) గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఎన్నిక ప్రత్యక్షం లేదా పరోక్షం

బి) పంచాయతీ సమితి (మాధ్యమిక స్థాయి) అధ్యక్షుడి ఎన్నిక పరోక్షం

సి) జిల్లా పరిషత్‌ (ఉన్నత స్థాయి) అధ్యక్షుడి ఎన్నిక పరోక్షం.

డి) గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఎన్నిక ప్రత్యక్షం.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) పైవన్నీ

15. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం?

1) కర్ణాటక     2) రాజస్థాన్‌

3) ఆంధ్రప్రదేశ్‌    4) బిహార్‌

16. కింది ఏ రాష్ట్రాలు ఆర్టికల్‌ 243(G) ప్రకారం స్థానిక సంస్థలకు 29 రకాల అధికారాలు, విధులను బదిలీ చేశాయి?

1) కర్ణాటక, కేరళ    2) తమిళనాడు, సిక్కిం

3) రాజస్థాన్, పశ్చిమ్‌ బంగా

4) పైవన్నీ

17. పంచాయతీరాజ్‌ ఎన్నికల నిర్వహణ కోసం ‘రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

1) ఆర్టికల్‌ 243 (J)      2) ఆర్టికల్‌ 243 (K)

3) ఆర్టికల్‌ 243(N)   4) ఆర్టికల్‌ 243 (B)

18. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రకారం గ్రామసభ సమావేశాలను ఏటా ఏ తేదీల్లో నిర్వహించాలని నిర్దేశించారు?

1) అక్టోబరు 3, ఏప్రిల్‌ 14

2) అక్టోబరు 2, ఏప్రిల్‌ 14

3) అక్టోబరు 1, ఏప్రిల్‌ 1

4) అక్టోబరు 3, ఏప్రిల్‌ 3

సమాధానాలు

1 - 2   2 - 4   3 - 1   4 - 1   5 - 1   6 - 4   7 - 2   8 - 3    9 - 4   10 - 1   11 - 2   12 - 2   13 - 3   14 - 1   15 - 4    16 - 4   17 - 2    18 - 1  

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దేన్ని కల్పిస్తుంది?  (ఏపీ సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2018)

1) పంచాయతీరాజ్‌ సంస్థలకు రాజ్యాంగ హోదా

2) మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా

3) సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా

4) కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి ప్రత్యేక హోదా

2. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? (ఏపీ సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2012)  (ఏపీ గ్రామ సచివాలయం, 2019)

1) మార్చి 24    2) అక్టోబరు 24

3) ఆగస్టు 24    4) ఏప్రిల్‌ 24

3. పంచాయతీరాజ్‌ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంది. కిందివాటిలో ఏది దానిలో భాగం కాదు? (టీఎస్‌ గ్రూప్‌-II, 2016)

1) అగ్నిమాపక సేవలు

2) టెక్నికల్‌ ట్రైనింగ్, ఒకేషనల్‌ విద్య

3) చిన్ననీటిపారుదల నీటి వనరులపై అజమాయిషీ, వాటర్‌షెడ్‌ అభివృద్ధి 

4) సంప్రదాయేతర ఇంధన వనరులు

4. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243్బద్శీ ప్రకారం పంచాయతీల్లో షెడ్యూల్డ్‌ తరగతులు, షెడ్యూల్డ్‌ వర్గాలకు కేటాయించిన సీట్లలో ఆ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్‌  కింది ఏ విధంగా ఉంటుంది? (టీఎస్‌ గ్రూప్‌-II, 2016)

1) ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మొత్తం సీట్లలో 20% తగ్గకుండా

2) ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మొత్తం సీట్లలో 15% తగ్గకుండా

3) ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మొత్తం సీట్లలో 1/3 వంతు తగ్గకుండా

4) ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మొత్తం సీట్లలో 50% తగ్గకుండా

5. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ పంచాయతీరాజ్‌ సంస్థల గురించి ప్రస్తావిస్తుంది?  (ఏపీ గ్రూప్‌-II, 2012)  (ఏపీ పంచాయతీ సెక్రటరీ, 2014)

1) ఆర్టికల్‌ 36       2) ఆర్టికల్‌ 39

3) ఆర్టికల్‌ 40       4) ఆర్టికల్‌ 48

6. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏ రాష్ట్రం పంచాయతీరాజ్‌ సంస్థలను ఏర్పాటు చేసినది?్బపంచాయతీ సెక్రటరీ, 2014్శ

1) కర్ణాటక        2) బిహార్‌

3) పశ్చిమ్‌బంగా        4) ఒడిశా

7. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది? (ఏపీ గ్రామ సచివాలయం  2019)

1) ఆర్టికల్‌ 243 (C)   2) ఆర్టికల్‌ 243 (D)

3) ఆర్టికల్‌ 243 (K)   4) ఆర్టికల్‌ 243 (T)

8. అశోక్‌ మెహతా కమిటీ దేనికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది? (పంచాయతీ సెక్రటరీ  2014)

1) గ్రామసభ      2) మండల పరిషత్‌

3) తాలూకా పంచాయతీ సమితి

4) జిల్లా పరిషత్‌

9. రాజ్యాంగంలోని శ్రీఖివ షెడ్యూల్‌లో ఎన్ని అంశాలు ఉన్నాయి?    ్బగ్రూప్‌-ఖిఖి, 2012్శ

1) 19 అంశాలు    2) 18 అంశాలు

3) 29 అంశాలు    4) 28 అంశాలు

సమాధానాలు

1 - 1    2 - 4   3 - 2   4 - 3   5 - 3   6 - 1   7 - 3   8 - 2  9 - 3 


 

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌