• facebook
  • whatsapp
  • telegram

ప్రవచనాలు - తీర్మానాలు (STATEMENTS - CONCLUSIONS)

మాదిరి ప్రశ్నలు


గమనిక: ఇచ్చిన ప్రవచనాలను మొదటి తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (ఎ) గానూ, రెండో తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (బి) గానూ, రెండూ అనుసరిస్తే సమాధానం (సి) గానూ, రెండూ అనుసరించకపోతే సమాధానం (డి)గా గుర్తించాలి.


1. ప్రవచనాలు:
కొందరు సైనికులు ధైర్యవంతులు.
కొందరు సైనికులు తెలివైనవారు.
తీర్మానాలు:
1) కొందరు సైనికులు ధైర్యవంతులు లేదా తెలివైనవారు.
2) కొందరు సైనికలు ధైర్యవంతులు గానీ తెలివైనవారు గానీ కాదు.
సమాధానం: (డి)

2. ప్రవచనాలు:
ఏ మ్యాగజీన్ టోపీ కాదు.
అన్ని టోపీలూ కెమెరాలు.
తీర్మానాలు:
1) ఏ కెమెరా మ్యాగజీన్ కాదు.
2) కొన్ని టోపీలు మ్యాగజీన్‌లు.
సమాధానం: (డి)

3. ప్రవచనాలు:
కొన్ని కాకులు చిరుతలు.
ఏ నక్కా కాకి కాదు.
తీర్మానాలు:
1) కొన్ని చిరుతలు కాకులు.
2) కొన్ని చిరుతలు నక్కలు కాదు.
సమాధానం: (బి)

4. ప్రవచనాలు:
కొన్ని పెన్నులు టేబుళ్లు.
ఏ టేబులూ కుర్చీ కాదు.
తీర్మానాలు:
1) కొన్ని టేబుళ్లు పెన్నులు.
2) ఏ పెన్నూ కుర్చీ కాదు.
సమాధానం: (ఎ)

5. ప్రవచనాలు:
అన్ని పక్షులూ కాకులు.
అన్ని చిలుకలూ పిచ్చుకలు.
తీర్మానాలు:
1) అన్ని పక్షులూ చిలుకలు.
2) అన్ని కాకులూ పిచ్చుకలు.
సమాధానం: (డి)

6. ప్రవచనాలు:
అన్ని గడియారాలూ పంకాలు.
కొన్ని పంకాలు గోడలు.
తీర్మానాలు:
1) కొన్ని గడియారాలు గోడలు.
2) కొన్ని గడియారాలు గోడలు కాదు.
సమాధానం: (సి)

Posted Date : 29-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌