• facebook
  • whatsapp
  • telegram

కాంతి

నమూనా ప్రశ్నలు
 

1. ఏ రంగు కాంతి విషయంలో పట్టకం (పదార్థం) వక్రీభవన గుణకం కనిష్ఠం?
జ: ఎరుపు

 

2. కిందివాటిలో మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచేవి?
       ఎ) కుంభాకార కటకం             బి) పుటాకార కటకం
       సి) కుంభాకార దర్పణం         డి) పుటాకార దర్పణం         ఇ) సమతల దర్పణం
జ: బి, సి, ఇ

 

3. ఎండోస్కోపి, ల్యాప్రోస్కోపి వైద్య విధానంలో ఉపయోగపడే కాంతి ధర్మం ఏది?
జ: సంపూర్ణాంతర పరావర్తనం

 

4. కిందివాటిలో సరైన కాంతి జనకం - తరంగాగ్రం జత?
       ఎ) బిందు జనకం - స్తూపాకార తరంగాగ్రం
       బి) బిందు జనకం - గోళాకార తరంగాగ్రం
       సి) అనంత దూరంలోని జనకం - సమతల తరంగాగ్రం
       డి) పొడిగించిన జనకం - స్తూపాకార తరంగాగ్రం
జ: బి, సి, డి

 

5. శీతల సముద్ర తీరంలో దూరంగా ఉండే నౌక లూమింగ్‌ ధర్మం వల్ల ఏ విధంగా కనిపిస్తుంది?
జ: తలకిందులుగా, పైకి

 

6. వర్ణ విపథనం తొలగించడానికి వాడే కుంభాకార, పుటాకార సంయోగం పాటించే నియమం
జ: 

 

7. న్యూటన్‌ వలయాలతో ముడిపడిన కాంతి ధర్మం ఏది?
జ: వ్యతికరణం

 

8. లేజర్‌ ఉత్పత్తిలోని జనాభా విలోమం వల్ల లేజర్‌ కాంతికి వచ్చే ప్రత్యేక ధర్మం -
జ: అధిక తీవ్రత

 

9. హోలోగ్రామ్‌ విషయంలో సరైంది?
       ఎ) 3డి ఫొటోగ్రాఫ్‌
       బి) కాంతి తీవ్రత, దశలు నిక్షిప్తం
       సి) కాంతి వ్యతికరణంతో చిత్రీకరించిన చిత్రం
       డి) పైవన్నీ
జ: డి ( పైవన్నీ)

 

10. పెరిస్కోప్‌లో ఏర్పడే ప్రతిబింబ లక్షణం వస్తువు దృష్ట్యా ఏ విధంగా ఉంటుంది?
       ఎ) మిథ్యా ప్రతిబింబం
       బి) పార్శ్వ విలోమం చెందిన ప్రతిబింబం
       సి) పార్శ్వ విలోమం చెందని ప్రతిబింబం
       డి) వస్తువు పరిమాణానికి సమానమైన ప్రతిబింబం
జ: ఎ, సి, డి

 

11. ఆరోగ్యవంతుడైన మానవుడికి స్పష్టదృష్టి కనిష్ఠ దూరం ఎంత?
జ: 25 సెం.మీ.

 

12. కిందివాటిని జతపరచండి. 

 ఫలితం  కారణం
 ఎ) ఇంద్రధనస్సు  i) సంపూర్ణాంతర పరావర్తనం
 బి) ఎండమావి  ii) రుజుమార్గంలో కాంతి ప్రసారం
 సి) గ్రహణాలు  iii) వక్రీభవనం
 డి) నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం  iv) కాంతి విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం

    ఎ         బి           సి            డి
జ: iv          i            ii            iii

 

13. కాంతి వేగం దేనిలో కనిష్ఠం?
జ: వజ్రం

 

14. సూర్యకాంతిని పట్టకం ద్వారా పంపితే అది ఏడు రంగులుగా విడిపోయే ధర్మాన్ని ఏమంటారు?
జ: విక్షేపణం

 

15. సాధారణ మైక్రోస్కోప్‌ కంటే ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ఇచ్చే ఆవర్ధనం చాలా ఎక్కువ ఎందుకంటే?
జ: ఎలక్ట్రాన్‌ ద్రవ్య తరంగం తరంగ దైర్ఘ్యం, కాంతి తరంగ దైర్ఘ్యం కంటే తక్కువ

 

16. గాజులో అత్యల్ప వేగంతో ప్రయాణించే కాంతిరంగు?
జ: ఊదా రంగు కాంతి

 

17. వివిధ రంగుల్లో ఉన్న అక్షరాలు ముద్రితమైన కాగితంపై మందమైన గాజు పలకను ఉంచితే ఏ రంగు అక్షరాలు మిగతా వాటితో పోల్చితే తక్కువగా పైకి వచ్చినట్లు కనిపిస్తాయి?
జ: ఎరుపు

 

18. ‘అస్టిగ్మాటిజం’ అనే దృష్టి దోషంతో బాధపడేవారి కంటి అద్దాల్లో వేటిని అమర్చుతారు?
జ: స్తూపాకార కటకం

 

19. ధృవణాన్ని ప్రదర్శించే తరంగాలు ఏవి?
జ: కాంతి తరంగాలు

 

20. శూన్యంలో కాంతి వేగం ఎంత?
జ: 3 × 108 మీ./సె.

 

21. నీటిపై తేలే పలుచని చమురు పొర వివిధ రంగుల్లో కనిపించడానికి కారణం?
జ: వ్యతికరణం

 

22. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు కారణమైన తరంగాలు ఏవి?
జ: పరారుణ తరంగాలు

 

23. అంతరిక్షంలో ఆకాశం నలుపు రంగులో కనిపించడానికి కారణం?
జ: వాతావరణం లేకపోవడం, కాంతి పరిక్షేపణం చెందకపోవడం

 

24. కెలిడియోస్కోప్‌ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
జ: పరావర్తనం

 

25. వాహనాల హెడ్‌లైట్లలో అమర్చి ఉండే దర్పణం ఏది?
జ: పుటాకార

 

26. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకం నుంచి 10 సెం.మీ. దూరంలో ఒక పెన్సిల్‌ని నిటారుగా ఉంచితే దాని ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది?
జ: నిటారైన ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబం

 

27. CD (కాంపాక్ట్‌ డిస్క్) ని ఎండలో చూస్తే అది వివిధ రంగుల్లో కనిపించడానికి కారణం?
జ: కాంతి వివర్తనం

 

28. కింది ప్రవచనాల్లో సరికానిది?
జ: కుంభాకార కటక నాభీయ సామర్థ్యం రుణాత్మకం

 

29. ENT డాక్టర్‌ తన తలపై అమర్చుకునే పుటాకార దర్పణం కాంతిని ......
జ: రోగిపై కేంద్రీకరిస్తుంది

 

30. వ్యతికరణంలో చీకటి, వెలుగు పట్టీల వద్ద శక్తి ......
జ: పునర్విభజన చెందుతుంది

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌