• facebook
  • whatsapp
  • telegram

రసాయనశాస్త్రం - పరిశ్రమలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. గాజు తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఏవి?
A) సోడాయాష్‌          B) సున్నపురాయి           C) ఇసుక          D) అన్నీ
జ: D (అన్నీ)

 

2. రసాయనికంగా గాజు అనేది...
జ: సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల మిశ్రమం

 

3. కిందివాటిలో గాజుకు సంబంధించి సరైంది?
a) అతి శీతలీకరణం చెందిన ద్రవం                               b) అస్ఫటిక పదార్థం
c) పారదర్శక లేదా పారభాసిక పదార్థం                        d) అన్నీ
జ: d (అన్నీ)

 

4. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఏమంటారు?
జ: ఎచింగ్‌

 

5. ఎచింగ్‌ ప్రక్రియ కోసం ఉపయోగించే ఆమ్లం ఏది?
జ: హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం

 

6. ద్రవగాజును త్వరగా చల్లబరిస్తే పెళుసుగా తయారవుతుంది. కాబట్టి వేడిగాజును ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా చల్లబరుస్తారు. ఈ ప్రక్రియను ఏమంటారు?
జ: మంద శీతలీకరణం

 

7. గాజును వేడిచేసి మెత్తబరచి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిలో గాజు వస్తువులను తయారుచేసే ప్రక్రియను ఏమంటారు?
జ: గ్లాస్‌ బ్లోయింగ్‌

 

8. సున్నపురాయి రసాయనికనామం?
జ: కాల్షియం కార్బొనేట్‌

 

9. కిందివాటిని జతపరచండి.
గాజురంగు                             గాజుకు కలిపే లోహ ఆక్సైడ్‌
A) నీలం                               i) మాంగనీస్‌ డై ఆక్సైడ్‌
B) ఊదా                               ii) క్యూప్రస్‌ ఆక్సైడ్‌
C) ఆకుపచ్చ                         iii) కాపర్‌ సల్ఫేట్‌
D) ఎరుపు                            iv) క్రోమియం ఆక్సైడ్‌
జ: A-iii, B-i, C-iv, D-ii

 

10. కిందివాటిని జతపరచండి.
గాజు రకం                                         ఉపయోగాలు
A) పైరెక్స్‌ గాజు                               i) కిటికీ అద్దాలు, గాజు సీసాలు
B) మెత్తటి గాజు                              ii) దృశా పరికరాలు లేదా సోడా గాజు
C) ప్లింట్‌ గాజు                                iii) ప్రయోగశాలలో గాజు పరికరాలు
జ: A-iii, B-i, C-ii

 

11. గ్లాస్‌ బ్లోయింగ్‌ అనేది ఏ రకమైన గాజుతో సాధ్యపడుతుంది?
జ: పైరెక్స్‌ గాజు, బోరోసిలికేట్‌ గాజు

 

12. సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది?
జ: జాదవ్‌పూర్‌

 

13. సిమెంట్‌ను కనుక్కున్నది ఎవరు?
జ: జోసఫ్‌ ఆస్పిడిన్‌

 

14. రసాయనికంగా సిమెంట్‌ అంటే ఏమిటి?
జ: కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్‌ల మిశ్రమం

 

15. సిమెంట్‌ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఏవి?
a) సున్నపురాయి       b) బంకమన్ను          c) జిప్సం             d) అన్నీ
జ: d (అన్నీ)

 

16. జిప్సం రసాయననామం?
జ: కాల్షియం సల్ఫేట్‌ డైహైడ్రేట్‌

 

17. జిప్సంను 120ºC వద్ద వేడిచేసినప్పుడు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (POP) అనే పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ఫాల్స్‌ సీలింగ్‌, విగ్రహాల తయారీలో, విరిగిన ఎముకలు కట్టుకట్టడానికి ఉపయోగిస్తారు. POP రసాయన నామం ఏమిటి?
జ: కాల్షియం సల్ఫేట్‌ హెమీహైడ్రేట్‌

 

18. వ్యాధుల చికిత్సకు మందులను ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు?
జ: కీమోథెరపీ

 

19. శరీర నొప్పిని తగ్గించే మందులను ఏమంటారు?
జ: ఎనాల్జిసిక్‌లు

 

20. రేడియోధార్మిక కిరణాలు ఉపయోగించి క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స చేయడాన్ని ఏమంటారు?
జ: రేడియోథెరపీ

 

21. బ్యాక్టీరియా, వైరస్‌ లాంటి సూక్ష్మజీవుల జీవరసాయన చర్యలను అడ్డుకుని వాటి పెరుగుదలను ఆపే లేదా పూర్తిగా నశింపజేసే మందులను ఏమంటారు?
జ: సూక్ష్మజీవ నిరోధకాలు

 

22. కిందివాటిలో సూక్ష్మజీవ నిరోధకాలు ఏవి?
a) యాంటీబయాటిక్‌లు                                               b) యాంటీసెప్టిక్‌లు
c) యాంటీబయాటిక్‌లు, యాంటీసెప్టిక్‌లు                      d) ఏదీకాదు
జ: యాంటీబయాటిక్‌లు, యాంటీసెప్టిక్‌లు

 

23. జ్వరాన్ని తగ్గించే మందుల వర్గాన్ని ఏమంటారు?
జ: యాంటీపైరెటిక్‌లు

 

24. కిందివాటిలో యాంటాసిడ్‌లు లేదా ఆమ్ల విరోధులు ఏవి?
a) అల్యూమినియం హైడ్రాక్సైడ్‌                                    b) రెనిటిడీన్‌ (జన్‌టాక్‌)
c) ఒమిప్రజోల్‌                                                            d) అన్నీ
జ: d (అన్నీ)

 

25. యాంటాసిడ్‌గా ఉపయోగించే ‘మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియం’ ఏ పదార్థ జల మిశ్రమం?
జ: మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌

 

26. జీర్ణకోశంలో అధికంగా హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఉత్పత్తిని ఉత్తేజపరిచే రసాయన పదార్థం?
జ: హిస్టమీన్‌

 

27. మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇన్సులిన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?
జ: ఎఫ్‌. బెంటింగ్‌

 

28. పారాసిటమాల్‌ అనేది ఒక.....
జ: యాంటీపైరెటిక్, ఎనాల్జిసిక్‌

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌