• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం

1. 1805లో లండన్ మిషనరీ సొసైటీ ఏ ప్రాంతంలో తన కార్యక్రమాలు చేపట్టింది?
జ: జమ్మలమడుగు
 

2. కడప, కర్నూలు ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీ కార్యక్రమాలు ప్రారంభించిన మిషన్ -
జ: గోస్పల్ మిషన్
 

3. హిందూ రిఫార్మర్ పత్రికను ఎవరు ప్రారంభించారు?
జ: మన్నవ బుచ్చయ్య పంతులు
 

4. మచిలీపట్నం నుంచి ఉమారంగనాయకులు నాయుడు ప్రారంభించిన పత్రిక ఏది?
జ: పురుషార్థప్రదాయని
 

5. కందుకూరి కార్యక్రమాలను కొక్కండ వెంకటరత్నం ఏ పత్రికలో విమర్శించేవారు?
జ: ఆంధ్రభాషా సంజీవని
 

6. చిలకమర్తి రచనలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి?
జ: చింతామణి

7. తొలి తెలుగు పత్రిక -
జ: సత్యదూత
 

8. 1902లో కృష్ణా పత్రికను స్థాపించినదెవరు?
జ: కొండా వెంకటప్పయ్య
 

9. తెలుగు నేలపై అచ్చయి వెలువడిన తొలి తెలుగు పత్రిక ఏది?
జ: హితవాది
 

10. కిందివారిలో గోల్కొండ పత్రిక సంపాదకుడు -
1) మాడపాటి హనుమంతరావు            2) సురవరం ప్రతాపరెడ్డి   
3) ఖాసా సుబ్బారావు                        4) ఎవరూకాదు 

జ: 2 (సురవరం ప్రతాపరెడ్డి)

11. 'అమృతాంజన్‌'ను కనుక్కున్న వ్యక్తి ఎవరు?
జ: కాశీనాథుని నాగేశ్వరరావు
 

12. 'హిత సూచని' గ్రంథం రాసి సంఘ సంస్కరణ ఉద్యమన్ని నడిపిన వ్యక్తి-
జ: సామినేని ముద్దు నరసింహం
 

13. 'వితంతు వివేకం' గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: పరవస్తు రంగాచార్యులు

14. ఆంధ్రాలో కల్నల్ ఆల్కాట్ పర్యటనను ఏర్పాటు చేసిన వ్యక్తి-
జ: తల్లాప్రగడ సుబ్బారావు
 

15. క్రిసెంట్ పత్రిక ద్వారా సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేసింది-
జ: గాజుల నరసుశెట్టి
 

16. పిఠాపురం కేంద్రంగా ఆర్య సమాజం శాఖను ఎవరు ప్రారంభించారు?
జ: ఆదిపూడి సోమనాథరావు
 

17. కందుకూరి వీరేశలింగం గురువుగా ఎవరిని పేర్కొంటారు?
జ: ఆత్మూరి లక్ష్మీ నరసింహం
 

18. కందుకూరి స్థాపించిన తొలి బాలికా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు-
జ: మల్లాది అచ్చన్న శాస్త్రి
 

19. కందుకూరి ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహాన్ని ఎప్పుడు జరిపించారు?
జ: 1881, డిసెంబరు 11
 

20. ఆంధ్రాలో తొలి వితంతు వివాహానికి పెళ్లి మంత్రాలు చదివింది-
జ: పి. ఆనందాచార్యులు
 

21. కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన తొలి పత్రిక-
జ: వివేక వర్ధిని

22. 1898లో మద్రాస్‌లో కందుకూరికి 'దక్షిణ భారత విద్యాసాగరుడు' బిరుదును ఎవరిచ్చారు?
జ: ఎం.జి. రెనడే
 

23. 1893లో కందుకూరి వీరేశలింగం పొందిన బిరుదు-
జ: రావు బహదూర్
 

24. మద్రాస్‌లో ఎవరి నివాసంలో కందుకూరి వీరేశలింగం పంతులు మరణించారు?
జ: కొమర్రాజు లక్ష్మణరావు
 

25. భారతదేశంలో తొలి వితంతు వివాహన్ని జరిపించిన వ్యక్తి-
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్
 

26. 1906లో కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: రాజమండ్రి
 

27. తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్రకు ఆధార గ్రంథం-
జ: వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్
 

28. రాజశేఖర చరిత్రకు మరొక పేరు-
జ: వివేక చంద్రిక
 

29. సాంఘిక దురాచారమైన కన్యాశుల్కాన్ని విమర్శిస్తూ కందుకూరి రాసిన నాటకం-
జ: బ్రహ్మ వివాహం

30. కింది అంశాలను సరైన వరుసలో అమర్చండి.
     1) కందుకూరి వీరేశలింగం తొలి పత్రిక స్థాపన
     2) దక్షిణ భారత విద్యాసాగరుడు బిరుదు పొందడం
     3) హితకారిణి సమాజ స్థాపన
     4) రాజమండ్రిలో వితంతు శరణాలయ స్థాపన
జ: 1, 2, 4, 3
 

31. సాంఘిక శుద్ధి సంఘాన్ని స్థాపించి సంఘ సంస్కరణ ఉద్యమం చేసినదెవరు?
జ: రఘుపతి వెంకటరత్నం నాయుడు
 

32. కిందివాటిలో రఘుపతి వెంకటరత్నం నాయుడు బిరుదు కానిది-
     1) కులపతి      2) బ్రహ్మర్షి      3) అభినవ సోక్రటీస్      4) రావు బహదూర్
జ: 4(రావు బహదూర్)
 

33. కిందివాటిలో ఏది రఘుపతి వెంకటరత్నం నాయుడి కృషి ఫలితంగా నిషేధితమైంది?
     1) సతి పద్థతి      2) కన్యాశుల్కం      3) వరకట్నం      4) దేవదాసీ వ్యవస్థ
జ: 4(దేవదాసీ వ్యవస్థ)
 

34. రఘుపతి వెంకటరత్నం నాయుడు నడపని పత్రిక -
    1) బ్రహ్మప్రకాశిక    2) ఫెలోవ‌ర్కర్    3) సోఫ‌ల్ రిఫార్మర్     4) పీపుల్ప్ ఒపీనియ‌న్‌
జ: 4(పీపుల్ప్ ఒపీనియ‌న్‌)

35. విద్యారంగంలో చేసిన కృషికి ఆంగ్ల ప్రభుత్వం రఘుపతి వెంకటరత్నం నాయుడికి ఇచ్చిన బిరుదు
జ: నైట్‌హుడ్
 

36. వ్యవహారిక తెలుగు భాషలో రాసిన తొలి నాటకం-
జ: కన్యాశుల్కం
 

37. నవయుగ వైతాళికుడుగా పేరొందిన ఆంధ్రుడు-
జ: గురజాడ అప్పారావు
 

38. తెలుగుభాషలో తొలి కథానికను రాసింది-
జ: గురజాడ అప్పారావు
 

39. 1906లో విజ్ఞాన చంద్రికామండలిని ప్రారంభించినదెవరు?
జ: కొమర్రాజు లక్ష్మణరావు
 

40. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరొందిన వ్యక్తి-
జ: గిడుగు రామమూర్తి
 

41. ఆంధ్ర చరిత్ర పరిశోధన పితామహుడిగా పేరొందిన వ్యక్తి ఎవరు?
జ: కొమర్రాజు లక్ష్మణరావు
 

42. సూర్యరాయ ఆంధ్రభాషా నిఘంటువును రాసినదెవరు?
జ: జయంతి రామయ్య

43. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొందింది-
జ: అయ్యంకి వెంకట రమణయ్య
 

44. 'తుది విన్నపం' పేరుతో స్వీయ చరిత్ర రాసిందెవరు?
జ: గిడుగు రామమూర్తి
 

45. కింది రచనలను జతపరచండి.
1) వ్యాస మంజరి    ఎ. గిడుగు రామమూర్తి
2) శాసన పద్యమంజరి    బి. జయంతి రామయ్య
3) తెలుగు పత్రిక    సి. గిడుగు రామమూర్తి
4) దేశమాత పత్రిక    డి. చిలకమర్తి లక్ష్మీనరసింహం
జ: 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
 

46. 'మాలపల్లి' నవలను రాసింది-
జ: ఉన్నవ లక్ష్మీనారాయణ
 

47. 1901లో కొమర్రాజు లక్ష్మణరావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: హైదరాబాద్

48. భారతదేశంలో ప్రాంతీయ భాషలో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని రాసిన వ్యక్తి-
జ: కొమర్రాజు లక్ష్మణరావు
 

49. సవర భాష అభివృద్ధికి గిడుగు చేసిన కృషికి మద్రాస్ ప్రభుత్వం ఏ బిరుదుతో గౌరవించింది?
జ: రావు సాహెబ్
 

50. విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన 'ఆంధ్రుల చరిత్ర'ను ఎవరు రాశారు?
జ: చిలుకూరి వీరభద్రరావు
 

51. గురజాడ అప్పారావు తన దేశభక్తి గీతాలను ఏ గ్రంథంలో రాశారు?
జ: ముత్యాల సరాలు
 

52. గురజాడ 'కన్యాశుల్కం' నాటకాన్ని ఎప్పుడు రాశారు?
జ: 1896
 

53. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి వితంతు శరణాలయాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: మద్రాసు
 

54. 1874లో కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన వివేకవర్ధిని పత్రిక-
జ: మాస పత్రిక
 

55. సవర-ఇంగ్లిష్ నిఘంటువును రూపొందించింది-
జ: గిడుగు రామమూర్తి

56. అంధకవి, ఆంధ్రా మిల్టన్‌గా పేరొందిన కవి-
జ: ఆచంట లక్ష్మీపతి
 

57. 'బుడబుక్కల జోస్యం' గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: ఉన్నవ లక్ష్మీనారాయణ
 

58. 1922లో గుంటూరులో శారదా నికేతన్‌ను ఎవరు స్థాపించారు?
జ: ఉన్నవ లక్ష్మీబాయమ్మ
 

59. కందుకూరి వీరేశలింగం పంతులు గురించి ''తన దేహం, గేహం, విద్య, ధనం ప్రజలకు అర్చించిన ఘనుడు"
అని అన్నదెవరు?
జ: చిలకమర్తి లక్ష్మీనరసింహం
 

60. కందుకూరి వీరేశలింగం పంతులు తన ''విదేశీ నారీమణుల చరిత్రం" వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచురించారు?
జ: తెలుగు జనానా

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌