• facebook
  • whatsapp
  • telegram

ద‌త్తాంశ ప‌ట్టికీక‌ర‌ణ‌

మాదిరి ప్రశ్నలు

కింది సమాచారాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.  
1) A, B, C, D, E లలో ఒకరు టెన్నిస్, మరొకరు బాస్కెట్‌బాల్, ఇంకొకరు క్యారమ్స్‌ ఆడతారు. A, D లు అవివాహిత స్త్రీలు. వారు ఏ ఆటలో పాల్గొనరు. ఏ స్త్రీ కూడా టెన్నిస్, బాస్కెట్‌బాల్‌ ఆడరు. వారిలో ఒక వివాహిత జంట ఉంది. E అనే వ్యక్తి బాస్కెట్‌బాల్‌ ఆడతారు. బాస్కెట్‌బాల్, క్యారమ్స్‌ ఆడని B సోదరి C. అయితే

    1. టెన్నిస్‌ ఆడే వ్యక్తి ఎవరు?
    2. క్యారమ్స్‌ ఆడే వ్యక్తి ఎవరు?
    3. బాస్కెట్‌బాల్‌ ఆడే వ్యక్తి ఎవరు?
    4. E భార్య ఎవరు?
    5. అయిదుగురు వ్యక్తుల్లో ముగ్గురు స్త్రీలు ఎవరు?

వివరణ: దత్తాంశాన్ని విశ్లేషించగా
   B బాస్కెట్‌బాల్, క్యారమ్స్‌ ఆడరు కాబట్టి టెన్నిస్‌ ఆడతారు. అంటే B పురుషుడు
    బాస్కెట్‌బాల్‌ ఆడతాడు కాబట్టి E పురుషుడు. 
    C కచ్చితంగా క్యారమ్స్‌ ఆడతారు. 
    A, D లు అవివాహిత స్త్రీలు, ఏ ఆట ఆడరు. కాబట్టి E, C లు భార్యాభర్తలు
    పై విశ్లేషణను పట్టికీకరించగా,



సమాధానాలు
1. టెన్నిస్‌ ఆడే వ్యక్తి B          2. క్యారమ్స్‌ ఆడే వ్యక్తి C
3. బాస్కెట్‌బాల్‌ ఆడే వ్యక్తి E     4. E భార్య C
5. అయిదుగురు వ్యక్తుల్లో ముగ్గురు స్త్రీలు A, C, D

2) A, B, C, D, E లు ఒక కుటుంబంలోని వ్యక్తులు. వారిలో వ్యాపారి, టైలర్, ఫిట్టర్, బ్యూటీషియన్, ఇంజినీర్‌ ఉన్నారు. A కూతురు B అవివాహిత. ఆమె ఒక టైలర్‌. C సోదరుడు E ఇంజినీర్‌. ఆ కుటుంబంలో ఒక వివాహిత జంట ఉంది. వారిలో భర్త C. భార్యను కోల్పోయిన A ఒక వ్యాపారి. అతడికి ఇద్దరు కుమారులు, ఒక అవివాహిత కూతురు ఉంది. A కోడలు బ్యూటీషియన్‌ అయితే
1. A కోడలు ఎవరు?    2. C వృత్తి ఏమిటి?
3. C భార్య ఎవరు?     4. ఫిట్టర్‌ ఎవరు?
5. A కుమారులు ఎవరు?
వివరణ: పై దత్తాంశాన్ని విశ్లేషించి, పట్టికీకరించగా

సమాధానాలు
1. A కోడలు D      2. ది ఒక ఫిట్టర్‌            3. C భార్య D           
4. ఫిట్టర్‌ C         5. C, E లు A కుమారులు

3) ఒక కుటుంబంలో P, Q, R, S, T, U, V, W అనే ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు స్త్రీలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు లాయర్లు, ఒకరు టీచర్, మరొకరు ఇంజినీర్, ఇంకొకరు డాక్టర్‌. ఏ స్త్రీ కూడా ఇంజినీర్‌ కాదు. R లాయరు P ను వివాహం చేసుకున్నారు. P టీచర్‌. V ఇంజినీర్‌ S ను వివాహం చేసుకున్నారు. S లాయరు కాదు, డాక్టర్‌ కాదు. ఏ ఇద్దరు స్త్రీలు ఒకే వృత్తిలో లేరు. W చెల్లెలు Q. W మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే 

1. T వృత్తి ఏమిటి?
2. ఆ కుటుంబంలోని పురుషులు ఎవరు?
3. Q వృత్తి ఏమిటి?
4. W చేస్తున్న వృత్తినే ఎంచుకున్నవారు?
5. ఒకే ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల సమూహాలు ఏవి?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించి పట్టికీకరించగా



సమాధానాలు

1. T ఒక లాయర్‌
2. P, T, V, W లు ఆ కుటుంబంలోని పురుషులు
3. Q డాక్టర్‌
4. W, S లు మేనేజర్లుగా పని చేస్తున్నారు
5. W, S లు మేనేజర్లు; R, T లు లాయర్లు

4) A, B, C, D, E, F లు ఒక వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు డాక్టర్లు, ఒక ఆర్కిటెక్ట్, ఒక అకౌంటెంట్‌ ఉన్నారు. D అనే ఇంజినీర్‌ను A అనే ఆర్కిటెక్ట్‌ వివాహం చేసుకున్నారు. A, B, C, D లు రెండు వివాహిత జంటలు, వారిలో ఏ ఇద్దరు కూడా ఒకే వృత్తిలో లేరు. F, B లు ఒకే వృత్తిలో ఉన్నారు. C సోదరుడు F. అయితే

    1. డాక్టర్ల జంట ఏది?
    2. ఇంజినీర్ల జంట ఏది?
    3. F కి C ఏమవుతారు?
    4. వివాహిత జంటలు ఏవి?
    5. భర్తల జంట ఏది?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించగా,

* A ఒక ఆర్కిటెక్ట్, D ఒక ఇంజినీర్‌.

* A, D దీని వివాహం చేసుకున్నారు కాబట్టి AD ఒక జంట.

* A, B, C, D లు రెండు వివాహిత జంటలు కాబట్టి BC ఒక జంట.

* A, B, C, D లు వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. B, F లు ఒకే వృత్తిలో ఉన్నారు. 

* B అకౌంటెంట్‌ను వివాహం చేసుకున్నాడు కాబట్టి C అకౌంటెంట్‌.

* B, F లు డాక్టర్లు అవుతారు. గ్రూప్‌లో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు కాబట్టి E ఇంజినీర్‌ అవుతారు. 


సమాధానాలు

    1. B, F లు డాక్టర్లు     2. D, E లు ఇంజినీర్లు

    3. F కి C సోదరుడు అవుతాడు

    4. A-D, B-C లు వివాహిత జంటలు

   5. A, B, C, D ల లింగభేదాలు దత్తాంశం నుంచి కచ్చితంగా తెలియదు కాబట్టి భర్తల జంటలను నిర్ధారించలేం.

5) ఒక కుటుంబంలో P, Q, R, S, T, U అనే ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారు టైపిస్టు, ఆర్కిటెక్ట్, వ్యాపారి, టైలర్, ఫొటోగ్రాఫర్, పెయింటింగ్‌ వృత్తుల్లో ఉన్నారు. వీరిలో రెండు వివాహిత జంటలు ఉన్నాయి. వ్యాపారి టైలర్‌ను, ఆర్కిటెక్ట్‌ టైపిస్టును వివాహం చేసుకున్నారు. పెయింటర్‌ U... Q కు కుమారుడు, T కు సోదరుడు. P కోడలు R ఒక టైపిస్టు. T అవివాహిత ఫొటోగ్రాఫర్‌. U నాయనమ్మ P. అయితే 
    1. U కి T ఏమవుతారు? 
    2. Q వృత్తి ఏమిటి? 
    3. P వృత్తి ఏమిటి?  
    4. వివాహిత జంటలు ఏవి?
    5. U కి S ఏమవుతారు? 
వివరణ: పై దత్తాంశాన్ని కుటుంబ చిత్రరూపంలో వ్యక్తీకరించగా 



సమాధానాలు
1. దత్తాంశం నుంచి U, T ల లింగభేదాలు కనుక్కోలేం కాబట్టి వారి మధ్య సంబంధాన్ని కచ్చితంగా చెప్పలేం.   
2. Q ఒక ఆర్కిటెక్ట్‌.  
3. P ఒక టైలర్‌. 
4. P-S, Q-R వివాహిత జంటలు.
5. U కి S తాతయ్య అవుతారు.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌