• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి

భారతదేశం - ఉనికి
   'సింధునది' పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చింది. భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ భాగాన ఉంది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో 8º4' - 37º6' ఉత్తర అక్షాంశాలు, 68º7' - 97º25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇండియా ఉత్తర - దక్షిణాల మధ్య పొడవు 3200 కి.మీ. తూర్పు - పడమరల మధ్య పొడవు 3000 కి.మీ. 
* భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు 15,200 కి.మీ. భారతదేశ తీరరేఖ పొడవు 6,100 కి.మీ.
* భారతదేశ వైశాల్యం 3.28 మిలియన్ చ.కి.మీ. అండమాన్ నికోబార్ దీవుల వైశాల్యం 8,248 చ.కి.మీ. 
* లక్షదీవుల వైశాల్యం 32 చ.కి.మీ. వైశాల్యంలో ఇండియా 7వ స్థానం, జనాభాలో 2వ స్థానంలో ఉంది. 
*  భారత్ లో మొదట సూర్యోదయాన్ని చూసే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్రదేశం కంటే గుజరాత్‌లోని ద్వారక వద్ద 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయమవుతుంది.
  కారణం: ఇండియా అక్షాంశ, రేఖాంశాల పరంగా 30º పొడవు విస్తరించడం.
*  గ్రీనిచ్ కాలంతో పోలిస్తే భారత ప్రామాణిక కాలం గంటలు ముందు ఉంటుంది.
* భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82½º తూర్పు రేఖాంశం. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పోతుంది.
* కర్కటరేఖ భారతదేశంలో  ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం, గుజరాత్ రాష్ట్రాల మీదుగా పోతుంది.
* భూపరివేష్ఠిత రాష్ట్రాలు: అంతర్జాతీయ సరిహద్దుగాని, తీరరేఖగాని లేని రాష్ట్రాలు. అవి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్.
తీరరేఖ: భారతదేశంలో తీరరేఖ ఉన్న రాష్ట్రాల సంఖ్య 9. ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రాలు వరుసగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కి.మీ. చిన్నతీరరేఖ ఉన్న రాష్ట్రం గోవా. 3 సముద్రాల కలయిక జరిగే రాష్ట్రం - తమిళనాడు
సరిహద్దు రేఖలు:
* భారత్ - చైనా  మెక్‌మోహన్ రేఖ
* భారత్ - ఆప్ఘనిస్థాన్  డ్యూరాండ్ రేఖ 
* భారత్ - పాకిస్థాన్  రాడ్‌క్లిఫ్, 24º అక్షాంశం 
* భారత్ - శ్రీలంక  పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ.


దీవులు:
* భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య 247.
* బంగాళాఖాతంలోని దీవుల సంఖ్య 204.
* బంగాళాఖాతంలోని దీవులను అండమాన్ నికోబార్ దీవులని, అరేబియాసముద్రపు దీవులను లక్షదీవులని అంటారు.
* అండమాన్ నికోబార్ దీవులు 10º-14º ఉత్తరఅక్షాంశాల మధ్య విస్తరించి ఉంటే, లక్షదీవులు 8º-11º ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించాయి. 
* లక్ష దీవులు పగడపు దీవులు.
* లక్షదీవులలోని మిన్‌కాయ్ దీవి ద్వారా వెళ్లే ఛానల్ - ఛానల్. మిన్‌కాయ్ దీవి మాల్దీవులను, లక్షదీవులను వేరుచేస్తుంది.
* భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారత దీవి గ్రేట్‌నికోబార్.
* భారత్ - శ్రీలంకల మధ్య ఉండే దీవి  పంబన్‌దీవి.

ఇండియా - చిట్టచివరి ప్రాంతాలు
* ఉత్తరం  కిలక్‌దావన్ కనుమ (జమ్మూ-కాశ్మీర్) 
* దక్షిణం

 ఇందిరాపాయింట్ (అండమాన్‌నికోబార్) 
* తూర్పు  పూర్వాంచల్ పర్వతాలు (అరుణాచల్ ప్రదేశ్) 
* పడమర  రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్) 
* భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 28
* కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7. 
* చివరిగా ఏర్పడిన రాష్ట్రాలు :
           -  ఛత్తీస్‌గఢ్    (26వది) 
           - ఉత్తరాంచల్ (27వది)
           - జార్ఖండ్ (28వది) (2000 నవంబరు నెల).

కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు
1. చండీగఢ్ - చండీగఢ్
2. ఢిల్లీ - ఢిల్లీ
3. పాండిచ్చేరి - పాండిచ్చేరి
4. దాద్రానగర్‌హవేలి - సిల్వస్సా
5. లక్షదీవులు - కవరత్తి
6. అండమాన్ నికోబార్ దీవులు - పోర్ట్‌బ్లెయిర్
7. డయ్యూ, డామన్ - డామన్.


పొరుగు దేశాలతో సరిహద్దులున్న రాష్ట్రాలు:

దేశం సరిహద్దు రాష్ట్రాలు
1. పాకిస్థాన్ పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్
2. చైనా జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, సిక్కిం, హిమచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్
3. ఆప్ఘనిస్థాన్ జమ్మూకాశ్మీర్
4. నేపాల్ పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరాంచల్,ఉత్తరప్రదేశ్, సిక్కిం
5. భూటాన్ అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్
6. బంగ్లాదేశ్ అసోం, పశ్చిమబెంగాల్, మిజోరం, మేఘాలయ, త్రిపుర
7. మయన్మార్ మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్

* భారతదేశంతో పొడవైన సరిహద్దు ఉన్న దేశం - బంగ్లాదేశ్, 2వ దేశం - చైనా
* తక్కువ సరిహద్దుఉన్న దేశం- ఆప్ఘనిస్థాన్


భారతదేశం - అడవులు
    2003 నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశ భూభాగంలో అడవులు 20.5% మాత్రం విస్తరించి ఉన్నాయి. అయితే 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33.3% అడవులు ఉండేవి. విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్. అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు - హర్యానా, పంజాబ్.
* దేశంలో అటవీ సాంద్రత లేదా శాతంపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం - మిజోరం.
* తక్కువ - హర్యానా.
* ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ సాంద్రత ఎక్కువ.
వర్షపాత విస్తరణ ఆధారంగా అడవుల వర్గీకరణ
1. సతత హరిత అరణ్యాలు
2. ఆకురాల్చే అరణ్యాలు
3. చిట్ట అడవులు/ పొద అడవులు
4. టైడల్ అరణ్యాలు/ మాంగ్రూవ్/ మడ అడవులు
5. పర్వత ప్రాంత అరణ్యాలు


1. 1800-3300 మీ ఎత్తులోని హిమాలయ అరణ్యాలు - శృంగాకార అరణ్యాలు. ఇవి మెత్తని కలపనిస్తాయి.
వృక్ష జాతులు: పైన్, ఫిర్, సిల్వర్ ఫర్, దేవదార్, స్ప్రూస్.


2. 3300 మీ. కంటే ఎత్తులోని అరణ్యాలు - ఆల్ఫైన్ అరణ్యాలు.
వృక్షజాతులు: చిర్, బిర్చ్.
* పశ్చిమబెంగాల్‌లోని టైడల్ అడవుల్లో సుందరి అనే వృక్షం ఉండటంతో వాటిని సుందర్‌బన్స్ అడవులు అంటారు.
ఆంధ్రప్రదేశ్- అడవులు:
* 23.7% విస్తరించి ఉన్నాయి.
* ఎక్కువగా ఉన్న జిల్లాలు- ఖమ్మం, ఆదిలాబాద్.
* తక్కువగా ఉన్న జిల్లాలు- హైదరాబాద్, కృష్ణా.
* రూసా అనే సువాసన ఉన్న గడ్డిజాతి నిజామాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది. దీనిని అత్తర్లు (పర్‌ప్యూమ్స్) తయారీలో ఉపయోగిస్తారు.

Posted Date : 09-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌