• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)
జ: వాతావరణ మార్పు
 

2. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)
జ: 2005, ఫిబ్రవరి 16
 

3. 2022 నాటికి భారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్-1, 2017)
జ: 100
 

4. అంతరించిపోతున్న జీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్‌ఐ, 2016)
జ: రెడ్‌లిస్ట్‌
 

5. అంతర్జాతీయ మొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్‌ఏ, 2018)
జ: 1992

6. కిందివాటిని జతపరచండి.
జాబితా - I                                జాబితా -II
i) పర్యావరణ దినోత్సవం          A) సెప్టెంబర్‌ 16

ii) జీవవైవిధ్య దినోత్సవం         B) ఏప్రిల్‌ 22

iii) ధరిత్రి దినోత్సవం              C) మే 22

iv) ఓజోన్‌ దినోత్సవం            D) జూన్‌ 5

      i     ii     iii   iv
జ: D   C     B     A

7. కిందివాటిని జతపరచండి.

   సదస్సులు                                     సంవత్సరం

i) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం                A) 1987

ii) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌                   B) 1997

iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు  C) 2016

iv)  ఓజోన్‌ తరుగుదల సదస్సు             D) 2018
      i        ii       iii       iv
జ: B      A       D        C

8. కార్బన్‌పై ట్యాక్స్‌ విధించిన మొదటి దేశం
జ: న్యూజిలాండ్‌
 

9. UNEP ని విస్తరించండి.
జ: United Nations Environment Programme
 

10. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: స్టాక్‌హోం

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌