• facebook
  • whatsapp
  • telegram

న్యాయ వ్యవస్థ

1.  భారత రాజ్యాంగానికి సంరక్షకులు?

జ‌: సుప్రీంకోర్టు         


2.   భారత్‌లో న్యాయ వ్యవస్థను అభివృద్ధిపరిచి ‘న్యాయవ్యవస్థకు పితామహుడి’గా పేరొందినవారు? 

జ‌: కారన్‌వాలీస్‌             


3. మన దేశంలో 1774లో తొలి సుప్రీంకోర్టును ఏ చట్టం ప్రకారం కలకత్తాలో ఏర్పాటుచేశారు?

జ‌: 1773 రెగ్యులేటింగ్‌ చట్టం 
 

4.కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి?

జ‌: సర్‌ ఎలిజాఇంఫే


5. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కలకత్తాలో ఉన్న  సుప్రీంకోర్టును ‘ఫెడరల్‌ కోర్టు’గా మార్పు చేసి ఎక్కడ ఏర్పాటుచేశారు?

జ‌: న్యూఢిల్లీ     


6. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుంది?

జ‌: 1950, జనవరి 28          


7. మన దేశంలో సుప్రీంకోర్టును రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఏర్పాటుచేశారు?

1) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు     2) రాజ్యాంగానికి అర్థవివరణ ఇచ్చేందుకు
3) రాజ్యాంగ ఆధిక్యతను కాపాడేందుకు    4) అన్నీ

జ‌:  అన్నీ


8. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నారు?

జ‌:  Vవ భాగం - ఆర్టికల్‌ 124 - 147     


9. న్యాయవ్యవస్థకు సంబంధించి ‘కొలీజియం’ అంటే? 

జ‌: భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన 5 మంది న్యాయమూర్తుల మండలి


10. ‘కొలీజియం’ వ్యవస్థ ప్రధాన విధి/సిఫారసు?

1) న్యాయమూర్తుల నియామకం           2) న్యాయమూర్తుల బదిలీలు 
3) న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలు     4) అన్నీ

జ‌: అన్నీ


11. కిందివాటిలో సరికానిది?

1) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి - హరిలాల్‌ జె. కానియా
2) సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి - రంజన్‌ గొగోయ్‌
3) సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి - కె.జి. బాలకృష్ణన్‌
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు - ఎస్‌.ఎం. సిక్రీ

జ‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు - ఎస్‌.ఎం. సిక్రీ

12. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు ఎంత మెజార్టీతో తొలగించగలదు?

జ‌: 2/3వ వంతు     

13. ఆర్టికల్‌ 125 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను ఎవరు నిర్ణయిస్తారు?

జ‌: పార్లమెంటు


14. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు?

జ‌: 65 సంవత్సరాలు        


15. సుప్రీంకోర్టులో నియమితులయ్యే తాత్కాలిక న్యాయమూర్తుల పదవీకాలం?

జ‌: రెండేళ్లు        


16.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు? 

జ‌:  న్యాయ సమీక్ష      


17. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు ఏ అధికారాల్లో భాగంగా విచారిస్తుంది?

జ‌: ఒరిజినల్‌/ ప్రారంభ విచారణాధికారాలు     


18. సుప్రీంకోర్టు ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ వివరిస్తుంది?

జ‌:  ఆర్టికల్‌ 129


19. ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’ అంటే? 

జ‌: సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచడం
 

20. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందవచ్చు?

జ‌: ఆర్టికల్‌ 143       


21. మన రాజ్యాంగ నిర్మాతలు ‘న్యాయ సమీక్ష’ అధికారాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు?

జ‌: అమెరికా        


22. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి?

జ‌:  ఫాతిమా బీబీ        


23. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావనను తొలిసారిగా ఏ దేశ న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టారు?

జ‌: అమెరికా       


24. మన దేశంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అంగీకరించిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు?

జ‌:  పి.ఎన్‌. భగవతి, వి.ఆర్‌. కృష్ణ అయ్యర్‌ 
 

25. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని పేర్కొంటున్న ఆర్టికల్‌?

జ‌:  ఆర్టికల్‌ 39(A)


26. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్‌ ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్లు జారీ చేస్తుంది?

జ‌: ఆర్టికల్‌ 32     


27.  భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు?

జ‌: అటార్నీ జనరల్‌        


28. 1861 ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం ప్రకారం 1862లో మన దేశంలో తొలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు?

జ‌:  కలకత్తా          


 

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌