• facebook
  • whatsapp
  • telegram

లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్స్‌

వివిధ పోటీ పరీక్షల్లో మెంటల్‌ ఎబిలిటీ విభాగం నుంచి  రీజనింగ్‌కు సంబంధించి లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్స్‌ అనే అంశంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి జ్యామితీయ   చిత్రాలతో కూడి ఉంటాయి. ఒక్కో చిత్రం ఒక్కో  సమూహాన్ని సూచిస్తుంది. అభ్యర్థి ఆ జ్యామితీయ చిత్రాలను నిశితంగా పరిశీలించి, తార్కికంగా సమాధానాలు రాబట్టాలి.

మాదిరి ప్రశ్నలు

1. కింది రేఖాచిత్రాన్ని పరిశీలించి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను గుర్తించండి.

ఎ. ఎంతమంది అక్షరాస్యులైన ప్రజలు ఉద్యోగులు?

1) 8      2) 5      3) 9      4) 6

వివరణ:

పై చిత్రంలో షేడ్‌ చేసిన ప్రాంతంలో ఉన్నవారు అక్షరాస్యులని, వారంతా ఉద్యోగాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కాబట్టి ఉద్యోగులుగా ఉన్న అక్షరాస్యులు 

                                    = 3 + 2 = 5

సమాధానం: 2

బి. ఎంతమంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు నిరక్షరాస్యులు?

1) 6      2) 7      3) 8      4) 12

వివరణ:

పై వెన్‌చిత్రంలో షేడ్‌ చేసిన ప్రాంతం వెనుకబడిన తరగతులకు చెందిన నిరక్షరాస్యులైన ప్రజలను సూచిస్తుంది.

7 + 5 = 12

సమాధానం: 4

2. దిగువ ఇచ్చిన వెన్‌చిత్రంలో త్రిభుజం పురుషులను,  దీర్ఘచతురస్రం ఉద్యోగస్తులను, వృత్తం డాక్టర్లను సూ చిస్తుంది. అయితే ఉద్యోగస్తులైన పురుష డాక్టర్లు ఎంతమంది?

1) 7      2) 8      3) 1      4) 2

వివరణ: 

పై చిత్రంలో షేడ్‌ చేసిన ప్రాంతంలోని సంఖ్య ఉద్యోగస్తులైన పురుష డాక్టర్లను సూచిస్తుంది.

ఉద్యోగస్తులైన పురుష డాక్టర్లు = 2

సమాధానం: 4

3. కింది వెన్‌చిత్రంలో  ని సంఖ్య వృత్తంలో పురుషులను,   లోని సంఖ్య వృత్తంలో మహిళలను సూచిస్తుంది.

పై చిత్రం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఎ. ఎంతమంది నాట్య కళాకారులు వాయిద్య కళాకారులై, వృత్తిరీత్యా ఇంజినీర్లు కారు?

1) 27     2) 12     3) 22     4) 15

వివరణ:

పై చిత్రంలో షేడ్‌ చేసిన ప్రాంతం నాట్య, వాయిద్య కళాకారులుగా ఉండి, వృత్తిరీత్యా ఇంజినీర్లు కాని వారిని సూచిస్తుంది

10 + 5 = 15    

సమాధానం: 4


బి. నాట్య, వాయిద్య కళాకారులు కాని ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు?

1) 41     2) 37     3) 45     4) 43

వివరణ:


పై చిత్రంలో షేడ్‌ చేసిన ప్రాంతం నాట్య, వాయిద్య కళాకారులు కాని ఇంజినీర్లను సూచిస్తుంది.

32 + 11 = 43    

సమాధానం: 4

సి. వాయిద్య కళాకారులు కాని మహిళలు ఎంతమంది?

1) 55     2) 67     3) 76     4) 38

వివరణ:

వాయిద్య కళాకారులు కాని మహిళలు = 

                             11 + 30 + 26 = 67 మంది


సమాధానం: 2

4. కింద ఇచ్చిన వెన్‌చిత్రంలో ఒక్కో జ్యామితీయ చిత్రం ఒక్కొక్క వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. త్రిభుజం విద్యావంతులను, దీర్ఘచతురస్రం పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తులను, చతరస్రం వ్యాపారవేత్తలను, వృత్తం ఆదాయ పన్ను కట్టేవారిని సూచిస్తుంది. 

ఎ. పై చిత్రం ఆధారంగా కింది వాక్యాల్లో సరైంది ఏది?

1) వ్యాపారవేత్తలు అందరు ఆదాయ పన్ను కడతారు.

2) కొంతమంది పరిపాలనా అనుభవం ఉన్నవారు ఆదాయ పన్ను కడతారు.

3) ఆదాయ పన్ను కట్టేవారందరూ విద్యావంతులు.

4) విద్యావంతులై, పరిపాలన అనుభవం లేనివారు ఆదాయ పన్ను కట్టరు.

బి. పై చిత్రం నుంచి దిగువ ఇచ్చిన వాక్యాల్లో సరైంది ఏది?

1) ఆదాయ పన్ను కట్టేవారిలో విద్యావంతులు లేరు.

2) పరిపాలనా అనుభవం ఉన్నవారు అంతా ఆదాయ పన్ను కట్టేవాళ్లు.

3) ఆదాయ పన్ను కట్టేవాళ్లలో పరిపాలనా అనుభవం ఉన్నవారు లేరు.

4) విద్యావంతుల్లో కొందరు వ్యాపారవేత్తలు కారు, ఆదాయ పన్ను కట్టరు.


వివరణ:


గమనిక: 1, 2, 3, 4, 5 లను భాగాలుగా గమనించండి.


ఎ. భాగం 4 నుంచి కొంతమంది పరిపాలనా అనుభవం ఉన్న వారు ఆదాయ పన్ను కడతారు అనేది సరైన వాక్యం.

సమాధానం: 2

బి. 2, 3, 4, 5 భాగాలు వ్యాపారవేత్తలు కానివారిని, ఆదాయ పన్ను కట్టని వారిని సూచిస్తాయి. కాబట్టి విద్యావంతుల్లో కొంతమంది వ్యాపారవేత్తలు కారు, ఆదాయ పన్ను కట్టరు అనే వాక్యం సరైంది.     

సమాధానం: 4

5. ఒక వెన్‌చిత్రంలో క్రీడాకారులను వృత్తంతో, అవివాహితులను చతురస్రంతో, మహిళలను త్రిభుజంతో,  విద్యావంతులను దీర్ఘచతురస్రంతో సూచించారు. ప్రతీ జ్యామితీయ చిత్రంలో సంబంధిత గణాంకాలను ఇచ్చారు.

పై చిత్రంలో 11 సంఖ్య దేన్ని సూచిస్తుంది?

1) వివాహితులు, విద్యావంతులు, క్రీడాకారులు

2) అవివాహితులు, నిరక్షరాస్యులు, మహిళలు,  క్రీడాకారులు

3) వివాహితులు, విద్యావంతులు, మహిళలు, మహిళా క్రీడాకారులు

4) అవివాహితులు, విద్యావంతులు, మహిళా  క్రీడాకారులు

వివరణ: 11 సంఖ్య అవివాహితులు, విద్యావంతులు, మహిళా క్రీడాకారులను సూచిస్తుంది.

సమాధానం: 4

Posted Date : 10-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌