• facebook
  • whatsapp
  • telegram

  సూక్ష్మజీవులు

1. రొట్టెల (బ్రెడ్‌ల) తయారీలో పిండి కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి?

జ‌: ఈస్ట్‌లు   


2. కింది ఏ పాల ఉత్పత్తుల తయారీలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు?

i. జున్ను     ii. మజ్జిగ     iii. పెరుగు

జ‌: i, ii, iii


3. చీజ్, జున్ను తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవులు ఏవి?

i. స్ట్రెప్టోకోకస్‌ లాక్టిస్‌   

ii. స్ట్రెప్టోకోకస్‌ క్రిమోరిస్‌  

iii. ల్యూకోనాస్టాక్‌ సిట్రిలోరం 

జ‌: i, ii, iii  


4. బటర్‌మిల్క్‌ లేదా మజ్జిగకు తనదైన ప్రత్యేక రుచి కలగడానికి కారణమైన బ్యాక్టీరియం ఏది?

జ‌: ల్యూకోనాస్టాక్‌ డెక్స్‌ట్రానం


5. కిందివాటిలో వెనిగర్‌ తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవులు ఏవి?

i. ఈస్ట్‌ జాతులు  

ii. ఎసిటోబ్యాక్టర్‌ జాతులు 

iii. ఆస్పర్‌జిల్లస్‌ జాతులు  

iv. పెనిసిల్లియం జాతులు

జ‌: i, ii      


6. శాఖరోమైసిస్‌ ఎలిప్సోయిడిస్‌ అనే సూక్ష్మజీవి ద్రాక్షరసంతో చర్యజరపడం వల్ల ఉత్పత్తయ్యే ఆల్కహాల్‌ సంబంధ పానీయం?

జ‌: వైన్‌  


7. కిందివాటిలో దేనిపై సూక్ష్మజీవ సంబంధ జీవరసాయన చర్యలు జరగడం వల్ల ‘బీరు’ అనే ఆల్కహాల్‌ సంబంధ పానీయం ఉత్పత్తవుతుంది?

1) బార్లీ మాల్ట్‌    2) ద్రాక్ష రసం

3) మొలాసిస్‌   4) అరటి గుజ్జు

జ‌: బార్లీ మాల్ట్‌


8. మొలాసిస్‌ కిణ్వన ప్రక్రియలో ఏర్పడే మద్యం రకం?

జ‌: రమ్‌  

 

9. ‘రమ్‌’ అనే ఆల్కహాల్‌ సంబంధ మత్తు పానీయాన్ని తయారు చేయడానికి కిణ్వన ప్రక్రియలో వినియోగించే సూక్ష్మజీవి ఏది?

జ‌: శాఖరోమైసిస్‌ సెర్వేసియే  


10. లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా (LAB) ప్రాముఖ్యత?

జ‌: పాలను పెరుగుగా మార్చడంలో సహకరించడం.


11. పర్యావరణపరంగా బ్యాక్టీరియా వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి?

i. వాతావరణంలో లభించే నత్రజనిని ‘నత్రజని స్థాపన’ చేసి, దాన్ని మొక్కలకు అందుబాటులోకి తేవడం.

ii. జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిత్తి చేసి, పర్యావరణ పరిశుభ్రతకు సహకరించడం.

iii. వాతావరణంలోని కార్బన్‌ మోనాక్సైడ్‌ను కార్బన్‌ డైఆక్సైడ్‌గా మార్చడం.

జ‌:  i, ii    


12. యాంటీబయాటిక్స్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి?

i. ఇవి సూక్ష్మజీవులు ఉత్పత్తిచేసే ప్రత్యేక కర్బన సమ్మేళనాలు.

ii. ఇవి ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను, అభివృద్ధిని నిరోధిస్తాయి.

iii. యాంటీబయాటిక్‌కి ఉదాహరణ పెనిసిల్లిన్‌.

జ‌:  i, ii, iii


13. బయోగ్యాస్‌లో ప్రధానంగా ఉండే వాయువు? 

జ‌:  మీథేన్‌  


14. మిథనోజెన్స్‌ అంటే?

జ‌:  కొన్ని రకాల సూక్ష్మజీవులు అవాయు పరిస్థితుల్లో సెల్యులోజ్‌ పదార్థాలపై పెరుగుతూ మీథేన్, దివీ2 లను ఉత్పత్తి చేస్తాయి. ఈ సూక్షజీవులను మిథనోజెన్స్‌ అంటారు.


15. మిథనోజెనిక్‌ బ్యాక్టీరియంకు ఉదాహరణ?

జ‌: మిథనో బ్యాక్టీరియం    

 

16. బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసేవి?

జ‌: మిథనోజెన్స్‌


17. పెనిసిల్లియం నొటేటం నుంచి ఉత్పత్తి చేసే యాంటీబయాటిక్‌ ఏది?

జ‌: పెన్సిలిన్‌   


18. లెగ్యూమ్‌ మొక్కలతో సహజీవనం ద్వారా నత్రజని స్థాపనకే తోడ్పడే బ్యాక్టీరియం ఏది?

జ‌: రైజోబియం    


19. స్వేచ్ఛగా జీవిస్తూ, వాతావరణంలో లభించే నత్రజనిని స్థాపన చేసే బ్యాక్టీరియా కిందివాటిలో ఏది? 

i. రైజోబియం     ii. అజోస్పైరిల్లం  iii. అజొటోబ్యాక్టర్‌

జ‌:  ii, iii    


20. కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i. పాశ్చరీకరణం చేసిన పాలను వేడిచేయకుండా వినియోగించవచ్చు.

ii. పాశ్చరీకరణంలో పాలను 70°C వద్ద సుమారు 1530 సెకన్ల పాటు వేడి చేసి, తిరిగి వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు.

iii. పాశ్చరీకరణం ప్రక్రియను లూయిస్‌ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు.

iv. పాల పాశ్చరీకరణం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తారు.

జ‌: i, ii, iii, iv


21. సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించడానికి పచ్చళ్లు, జామ్‌లలో కింది ఏ పదార్థాలను కలుపుతారు?

i. సోడియం బెంజోయేట్‌

ii. సోడియం మెటా బైసల్ఫేట్‌

iii. పొటాషియం టారో సల్ఫేట్‌

జ‌: i, ii  


22. కిందివాటిలో మైకోరైజాను ఏర్పర్చేవి ఏవి?

జ‌: శిలీంద్రాలు

 

23. మైకోరైజా ఏర్పాటులో సహకరించే జీవికి ఉదాహరణ?

జ‌:  గ్లోమస్‌  


24. మైకోరైజాలో భాగమైన సూక్ష్మజీవుల ద్వారా నేల నుంచి మొక్కలు ఏ పోషకాన్ని గ్రహిస్తాయి?

జ‌: ఫాస్ఫరస్‌ 


25. కిందివాటిలో జీవఎరువులుగా ఉపయోగపడని సూక్ష్మజీవులు ఏవి?

జ‌:  వైరస్‌లు


26. వరిపొలాల్లో ప్రధాన జీవఎరువులుగా ఉపయోగపడుతున్న శైవల జాతులు?

జ‌:  నీలి ఆకుపచ్చ శైవలాలు


27. జీవఎరువులుగా ఉపయోగపడే సయనో ఫైసీకి చెందిన శైవలాలు?

i. అనబీనా     ii. నాస్టాక్‌ 

iii. అసిల్లటోరియా iv. వాల్వాక్స్‌

జ‌:  i, ii, iii      


28. జీవ నియంత్రణలో సహకరించే సూక్ష్మజీవికి ఉదాహరణ?

జ‌:  బాసిల్లస్‌ థురింజియెన్సిస్‌ 


29. Bt - పత్తి మొక్కల్లో కీటక వ్యతిరేక విషపదార్థాలు ఉత్పత్తి కావడానికి ఏ జన్యువును ప్రవేశపెడతారు?

జ‌: థురింజియెన్సిస్‌ టాక్సిన్‌ జీన్‌  


30. జీవనియంత్రణలో సహకరించే వైరస్‌కు ఉదాహరణ?

జ‌:  బాక్యులో వైరస్‌  

 

31. గోబర్‌ గ్యాస్‌ దేని నుంచి తయారవుతుంది? 

జ‌: సెల్యులోజ్‌ను ఆహారంగా తీసుకున్న పశువుల విసర్జక పదార్థాలు 


32. కిణ్వన ప్రక్రియలో ఈస్ట్‌ను ఉపయోగించి చక్కెరలను ఆల్కహల్‌గా మారుస్తారు. ఈ ప్రక్రియను కనుక్కున్న శాస్త్రవేత్త?

జ‌:  లూయిస్‌ పాశ్చర్‌  

 

33. వాణిజ్యపరంగా రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గించడానికి ‘స్టాటెన్స్‌’ అనే ఔషధాలను  వాడతారు. వీటిని ఉత్పత్తి చేసే ఈస్ట్‌ జాతి ఏది?

జ‌:  మోనాస్కస్‌ పర్‌పూరియస్‌ (Monascus Purpureus)

 

34. సూక్ష్మజీవులు, అవి ఉత్పత్తి చేసే ఉపయోగకర పదార్థాలతో జతపరచండి.

సూక్ష్మజీవి           ఉత్పన్నం 

i) ఆస్పర్‌జిల్లస్‌ నైజర్‌  a) లాక్టిక్‌ ఆమ్లం 

ii) ఎసిటోబ్యాక్టర్‌      b) బ్యుటైరిక్‌ ఆమ్లం ఎసిటై

iii) క్లాస్ట్రీడియం       c) ఎసిటిక్‌ ఆమ్లం బ్యుటైలికం

iv) లాక్టోబాసిల్లస్‌     d) సిట్రిక్‌ ఆమ్లం 

జ‌:  i-d, ii-c, iii-b, iv-a


35. స్ట్రెప్టోకోకస్‌ బ్యాక్టీరియం ఉత్పత్తి చేసే ఏ పదార్థం ‘క్లాట్‌ బూస్టర్‌’గా ఉపయోగపడుతుంది?  

జ‌:  స్ట్రెప్టోకైనేజ్‌    


36. ఇథనాల్‌ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే సూక్ష్మజీవి?

జ‌: ఈస్ట్‌   


37. కిందివాటిలో యాంటీబయాటిక్‌ కానిది?

జ‌:  పారాసిటమాల్‌


38. ట్రైకోడెర్మా పోలీస్పోరం ఉత్పత్తి చేసే జీవ సంబంధ క్రియాశీల పదార్థాలు?

జ‌:  సైక్లోస్పొరిన్‌ ‘ఎ’    


39. ట్రైకోడెర్మా అనే ఫంగస్‌ ఉత్పత్తి చేసిన ఏ పదార్థం అవయవ మార్పిడి జరిగిన రోగుల్లో రోగనిరోధక శక్తి తగ్గడానికి (ఇమ్యునోసప్రెషన్‌) కారకంగా పని చేస్తుంది?

జ‌:  సైక్లోస్పొరిన్‌ ‘ఎ’    


40. స్విస్‌ చీజ్‌ తయారీలో ఉపయోగించేది....

జ‌:  బ్యాక్టీరియా

 

Posted Date : 02-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌