• facebook
  • whatsapp
  • telegram

  అణుసాంకేతిక‌త

* డాక్టర్ హోమి జహంగీర్ బాబా భారత అణుశక్తి పితామహుడిగా పేరుగాంచారు. ఇతని ఆధ్వర్యంలో 1945లో ముంబయిలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (TIFR) ఏర్పడింది. దీనిలో 1945 డిసెంబర్‌లో అణు పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

1948, ఆగస్టు 10న భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని తొలి అధ్యక్షుడిగా హోమి.జె. బాబాను నియమించారు.

* దీని కేంద్ర కార్యాలయం ముంబయిలో ఉంది.

* దీని రెండో అధ్యక్షుడు విక్రం సారాభాయ్.

భారత అణుశక్తి సంస్థకు అయిదు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి

1. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC), ముంబయి

2. ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (IGCAR), కల్పకం (తమిళనాడు)

3. రాజా రమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (RRCAT), ఇండోర్ (మధ్యప్రదేశ్)

4. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (VECC), కోల్‌కతా

5. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రిసెర్చ్ (AMED), హైదరాబాద్

బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC)

* భారత ప్రభుత్వం 1954, జనవరి 3న అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్ ట్రాంబే (AEET) ను హోమి.జె.బాబా ఆధ్వర్యంలో స్థాపించారు.

* 1966న హోమి.జె.బాబా మరణానంతరం దీనికి 1907, జనవరి 22న బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC) గా నామకరణం చేశారు.

* BARC ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.

* BARC రెండో ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో ఏర్పాటు చేశారు.

* దీని నినాదం "ATOMS IN THE SERVICE OF THE NATION".

దీనిలో సుమారు 3,000 - 4,000 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, ఇతర సాంకేతిక నిపుణులు పరిశోధన చేస్తున్నారు.

* ఈ కేంద్రం వద్ద హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ 2005, జూన్ 4న ఏర్పాటు చేశారు.

BARC లో ఏర్పాటు చేసిన అణుపరిశోధనా కేంద్రాలు

1. అప్సర (APSARA)

* 1956, ఆగస్టు 4న యునైటెడ్ కింగ్‌డమ్ సహాయంతో ప్రారంభించారు.

* ఇది భారతదేశ మొదటి అణురియాక్టర్.

* ఈ పేరును జవహర్‌లాల్ నెహ్రూ సూచించారు.

* ఇది స్విమ్మింగ్ పూల్ తరహా రియాక్టర్.

* దీని సామర్థ్యం ఒక మిలియన్ వాట్లు.

* యురేనియంను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నారు.

* 2010 సంవత్సరంలో మూసివేశారు.

2. సిరస్ (CIRUS - కెనడా ఇండియా రియాక్టర్ యునైటెడ్ స్టేట్స్)

* 1960లో కెనడా సహాయంతో ఏర్పాటు చేశారు.

* దీని సామర్థ్యం 40 మెగా వాట్లు.

* ఇంధనంగా సహజ యురేనియంను ఉపయోగిస్తారు.

* 2010, డిసెంబర్ 31న మూసివేశారు.

3. జెర్లినా (ZERLINA)

* దీన్ని 1961, జనవరి 14న ఏర్పాటు చేశారు.

* ఇంధనంగా సహజ యురేనియం, భారజలాన్ని ఉపయోగిస్తారు.

* దీని సామర్థ్యం 100 మెగా వాట్లు.

* దీన్ని 1983లో మూసివేశారు.

4. పూర్ణిమ (PURNIMA)

దీనిలో మూడు ప్లాంట్లు ఉన్నాయి

i) పూర్ణిమ - I

* దీన్ని 1971లో ఏర్పాటు చేశారు.

* 1972 మే, 18న క్రిటికాలిటి పొందింది. (క్రిటికాలిటి అంటే న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తిని ప్రారంభించింది అని అర్థం.)

* దీని సామర్థ్యం ఒక మెగా వాట్.

* దీనిలోని ఇంధనం ప్లుటోనియం ఆక్సైడ్.

* దీన్ని శీఘ్ర రియాక్టర్ సాంకేతిక శాస్త్ర పరిశోధనకు ఉపయోగిస్తారు.

* ఇది  ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (FBTR).

ii) పూర్ణిమ - II

* దీని సామర్థ్యం 100 మెగావాట్లు.

* ఇంధనంగా యురేనియం 233 (U-233) ని ఉపయోగిస్తారు.

* 1984, మే 10న క్రిటికాలిటి పొందింది.

iii) పూర్ణిమ - III

* దీని సామర్థ్యం ఒక మెగావాట్.

* ఇంధనంగా యురేనియం 233 (U-233) ని ఉపయోగిస్తారు.

* 1990, నవంబరు 9న క్రిటికాలిటి పొందింది.

5. ధృవ (DHRUVA)

* ఇంధనంగా సహజ యురేనియంను ఉపయోగిస్తారు.

* 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

* బాబా అణుపరిశోధనా కేంద్రం దేశంలో అతిపెద్ద పరిశోధనా రియాక్టరు.

* 1984, ఆగస్టు 15న ఏర్పాటు చేశారు.

* 1985, ఆగస్టులో క్రిటికాలిటి పొందింది.

* డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) ని 1954, ఆగస్టు 3న ముంబయిలో ఏర్పాటుచేశారు.

* దీని కార్యదర్శిగా భారత అణుశక్తి సంఘం అధ్యక్షులు పనిచేస్తారు.

* అటామిక్ ఎనర్జీ రెగ్యులేటింగ్ బోర్డును 1983, నవంబరు 15న ముంబయిలో ఏర్పాటు చేశారు.

* దీని ఆధ్వర్యంలో దేశంలో అణుశక్తి ఉత్పత్తిని పర్యవేక్షిస్తారు.

కామిని (KAMINI): దీన్ని 1996లో ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్  (IGCAR)  కల్పాక్కంలో ఏర్పాటు చేశారు. కల్పక్కం మినీ రియాక్టర్‌కు  సంక్షిప్త రూపమే కామిని.  U-233   ఇంధనాన్ని ఉపయోగించుకుని పనిచేసే పరిశోధక రియాక్టర్లలో ప్రపంచంలోనే మొదటిది కామిని. దీన్ని   IGCAR, BARC సంయుక్తంగా రూపొందించాయి.

భారతదేశంలో అణువిద్యుత్ కేంద్రాలు

1. తారాపూర్ (TARAPUR)

* దేశంలో ఏర్పాటు చేసిన మొదటి అణు రియాక్టర్.

* 1962లో అమెరికా సహాయంతో దీన్ని ఏర్పాటు చేశారు.

* దీన్ని మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఏర్పాటు చేశారు.

* దీనిలో మిశ్రమ ఇంధనంను ఉపయోగిస్తారు (యురేనియం, ప్లుటోనియం ఆక్సైడ్).

* 1969 అక్టోబర్, 28న ఉత్పత్తి ప్రారంభించింది.

దీనిలో 4 యూనిట్లు ఉన్నాయి.

* తారాపూర్ - 1 BWR (Boiling Water Reactor)

* తారాపూర్ - 2 BWR (Boiling Water Reactor)

* తారాపూర్ - 3 PHWR (Pressuried Heavey Water Reactor)

* తారాపూర్ - 4 PHWR (Pressuried Heavey Water Reactor)

సాంకేతికతతో పనిచేస్తాయి.

* దీని సామర్థ్యం 2 × 160   = 320 మెగా వాట్లు

                        2 ×  540 = 1080 మెగా వాట్లు
                                        _________

                        మొత్తం = 1400 మెగావాట్లు
                                        _________

2. రావత్‌భటా అణు విద్యుత్ కేంద్రం

* దీన్ని 1936లో ప్రారంభించారు. రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం, రాణాప్రతాప్ సాగర్ అని పిలుస్తారు.

* 1973, డిసెంబర్ 16న ఉత్పత్తిని ప్రారంభించారు.

* కెనడాలోని డగ్లస్ పాయింట్ రియాక్టర్‌ను 1961లో ప్రారంభించారు. దీని నకలుగా స్వదేశీ పరిజ్ఞానంతో 1936లో ప్రారంభించారు.

* రావత్‌భటాలో 6 యూనిట్లు ఉన్నాయి.

* 6 యూనిట్లు PHWR (Pressuried Heavy Water Technology) సాంకేతికతతో పనిచేస్తున్నాయి.

* దీనిలో 5వ ప్లాంటు నిరంతరంగా 765 రోజులు పనిచేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రియాక్టరు జీవితకాలం 40 సంవత్సరాలు.

* గతంలో అమెరికా రియాక్టరు నిరంతరం 739 రోజులు పని చేసింది.

* తారాపూర్ తరువాత అణు విద్యుత్ సామర్థ్యంలో రావత్‌భటా రెండో స్థానంలో ఉంది.

* దీని సామర్థ్యం 4 × 220 = 880

                          1 × 100 = 100

                          1 × 200 = 200

మొత్తం 1180 మెగావాట్లు.

3. కల్పకం (Kalpakam)

* చెన్నైకి దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో కల్పకంలో నిర్మించారు. దీన్ని మద్రాస్ పవర్ స్టేషన్ అని పిలుస్తారు.

ఇక్కడి అణు రియాక్టర్ కామిని (Kalpakam mini reactor).

ప్లూటోనియంను ఇంధనంగా, ద్రవ సోడియంను శీతలీకరణిగా ఉపయోగిస్తారు. దీన్ని పూర్ణిమ సరఫరా చేస్తుంది.

* ఇది ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (FBTR) సాంకేతికతకు చెందింది.

* దీన్ని 1970లో ప్రారంభిస్తే, 1984, జనవరి 24న ఉత్పత్తిని ప్రారంభించింది.

* దీని సామర్థ్యం 2 × 220 = 440 మెగావాట్లు.

4. కైగా అణు విద్యుత్ కేంద్రం

* కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, కార్వార్ జిల్లాలో కాళీనది ఒడ్డున 1989న ప్రారంభించారు.

* 2000, నవంబరు 16న ఉత్పత్తి ప్రారంభించారు.

* దీనిలో నాలుగు సీఏఎన్‌యూ ప్లాంట్లు ఉన్నాయి.

* పీహెచ్‌డబ్ల్యూఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తుంది.

*  మన దేశంలోని అణు రియాక్టర్ల సామర్థ్యంలో మూడో స్థానంలో ఉంది.

5. నరోరా అణు విద్యుత్ కేంద్రం

* ఉత్తర్ ప్రదేశ్‌లోని బులందర్ సాహర్ జిల్లాలో ఉంది.

* మొదటి ప్లాంటు 1991, జనవరి 1న; రెండో ప్లాంటు 1992, జులై 1న ప్రారంభించారు.

* ఇది PHWR సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తుంది.

* దీని సామర్థ్యం 2 ×  220 = 440 మెగావాట్లు

ఉత్తర్ ప్రదేశ్ వ్యవసాయ అవసరాలకు ఉపయోగించారు.

6. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం

* తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో కుడంకుళంలో ఏర్పాటు చేశారు. 2002, మార్చి 31న ప్రారంభించారు.

* దీనిలో ఉత్పత్తి 2014, డిసెంబర్ 31న ప్రారంభమైంది.

* దీన్ని రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. (రష్యా సంస్థ - రోస్టామ్)

* దీనికి సంబంధించి 1988, నవంబర్ 20న రాజీవ్ గాంధీ, మైఖేల్ ‌గోర్భచెవ్ మధ్య ఒప్పందం కుదిరింది.

* ఇది వీవీఈఆర్ పరిజ్ఞానంతో పని చేస్తుంది.

* 2016, ఆగస్టు 10న నూతన ప్లాంటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

7. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం

* దీన్ని 1948లో ప్రారంభించారు. గుజరాత్‌లోని 'వైరా'లో నిర్మించారు.

* 1993, మే 6న ఉత్పత్తి ప్రారంభించింది.

* దీని సామర్థ్యం 2 × 220 = 440 మెగా వాట్లు

* PHWR రకానికి చెందింది.

* అణు ఇంధన శుద్ధి ప్లాంటు తారాపూర్, ట్రాంబే, కల్పకంలో ఉన్నాయి.

8. టోకోమాక్ (Tocomach)

* ప్లాస్మా ప్రవర్తనను నియంత్రించే పరికరాన్ని 'టోకోమాక్' అంటారు.

దేశీయంగా తయారైన మొదటి టోకోమాక్ ఆదిత్య.

* ఇది 1989, సెప్టెంబర్‌లో పని ప్రారంభించింది.

* ప్రస్తుతం భారతదేశంలో 20 అణు విద్యుత్ రియాక్టర్లు పని చేస్తున్నాయి. ఇవి మొత్తం 4780 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

*  2032 సంవత్సరంలోగా 63,000 మెగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా భారత ప్రభుత్వం నిర్దేశించింది.

ప్రభుత్వం భవిష్యత్తులో నిర్మించనున్న అణు రియాక్టర్లు

i) పంజాబ్ - 2 × 700 = 1400 మెగావాట్లు

ii) మధ్యప్రదేశ్ - 2 × 700 = 1400 మెగావాట్లు

iii) హరిపుర (పశ్చిమ్ బంగ) - 6 × 1000 = 6000 మెగావాట్లు

iv) కొవ్వాడ (ఆంధ్రప్రదేశ్) - 6 × 1000 = 6000 మెగావాట్లు

v) కుడంకుళం (తమిళనాడు) - 4 × 1000 = 4000  మెగావాట్లు

vi) జైతాపూర్ (మహారాష్ట్ర) - 6 × 1650 = 9000 మెగావాట్లు

vii) మితివిర్షి (గుజరాత్) - 6 × 1000 = 6000 మెగావాట్లు

* ఇది దేశంలో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి, నిర్వహించే సంస్థ.

ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCILను 1987లో ముంబయిలో ఏర్పాటు చేశారు.

అణు శక్తి కార్యక్రమం - దశలు

1) ప్రెజురైడ్ హెవీ వాటర్ రియాక్టర్ (PHWR)

* దీనిలో ఇంధనంగా సహజ యురేనియం (U - 235) ను ఉపయోగిస్తారు.

* ఇది ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉంది.

* నియంత్రణకారిగా భారజలంను ఉపయోగిస్తారు.

2) ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (FBTR)

* దీనిలో ప్లుటోనియంను ఇంధనంగా ఉపయోగిస్తారు.

* ఇది అత్యంత సమర్థమంతమైన ఇంధనం

* కల్పకంలో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

3) అడ్వాన్స్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్ (AHWR)

* దీనిలో థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తారు.

* ఈ పరిజ్ఞానం భారతదేశంలో లేదు.

* BARCలో ఈ పరిజ్ఞానం అభివృద్ధి దశలో ఉంది.

4) బాయిలింగ్ వాటర్ రియాకర్టర్ (BWR)

5) లైట్ వాటర్ రియాకర్టర్ (LWR)

* ప్రస్తుతం భారత విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2.5%.

అణు ఇంధనాలు

యురేనియం

* యురేనియం 'పిచ్‌బ్లెండ్' అనే ధాతువు రూపంలో లభిస్తుంది.

* గాఢ యురేనియం పొడిని "Yellow Cake" అని అంటారు.

* మన దేశంలో యురేనియం నిల్వలు 80,200 మెట్రిక్ టన్నులు. ప్రపంచ యురేనియం నిల్వల్లో ఇది 1.5% మాత్రమే.

* బిహార్‌లోని 'సింగ్‌భమ్ జిల్లాలో 160 కిలోమీటర్ల మేర యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇవి దేశంలో మొత్తంగా 80% ఉన్నాయి.

* ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లో యురేనియం ముడి పదార్థాలను గుర్తించారు.

* మన దేశంలో యురేనియం నిల్వలకు ఏర్పాటు చేసిన సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UCIL). ప్రధాన కార్యాలయం జాదూగూడ (ఝార్ఖండ్)లో ఉంది.

* యురేనియం ఉత్పత్తి పరంగా మొదటి దేశాలు

     i) కజకిస్థాన్ - 32%

     ii) కెనడా - 18.2%

     iii) ఆస్ట్రేలియా - 11%

* ఒక కిలోగ్రాము యురేనియం (235) విస్ఫోటనం చెందితే 18.7 మిలియన్ కిలోవాట్‌ల శక్తి విడుదల అవుతుంది.

థోరియం

ఇది 'మోనజైట్ ధాతువు రూపంలో లభిస్తుంది.

కేరళలోని 'ఆళ్వాయి తీరం వద్ద అధికంగా లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సముద్ర తీరాల్లోని ఇసుక మేటల్లో ఉందని కనుక్కున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో అధిక నిల్వలు ఉన్నాయి.

ఝార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ్ బంగలోని 'పురూలియా ప్రాంతంలో పెద్ద మొత్తంలో థోరియం, జిర్కోనియం నిల్వలు ఉన్నట్లు కనుక్కున్నారు.

* శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన దేశంలో థోరియం నిల్వలు 3,60,000 టన్నులు.

ప్రపంచ థోరియం నిల్వల్లో భారతదేశం వాటా 32%.

* భారత్‌లో థోరియం అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కేరళ.

* థోరియం నిల్వల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

* యురేనియంను శుద్ధి చేసే కేంద్రం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC)ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు.
* రెండో కేంద్రం రావత్‌భటా (రాజస్థాన్)లో ఏర్పాటు చేస్తున్నారు.

ప్లుటోనియం

ఇది కృత్ర్రిమ రేడియోధార్మిక పదార్థం.

* ప్రస్తుతం భారతదేశంలో దీన్ని వాడుతున్నారు.

* ప్లుటోనియం ఇంధనాన్ని ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్స్ (FBTR)లో ఉపయోగిస్తారు.

భారజల ప్లాంట్లు (Heavy Water Plants)

* మన దేశంలో భారజల ప్లాంట్లను నిర్మించి, నిర్వహించేందుకు ముంబయిలో బోర్డు ఆఫ్ హెవీ వాటర్‌ను ఏర్పాటు చేశారు.

భారజలాన్ని 'డ్యుటీరియం ఆక్సైడ్' (D2O) అని అంటారు. దీన్ని భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో మితకారి (Moderator), శీతలీకరణి (Coolent)గా ఉపయోగిస్తారు.

ప్రస్తుతం దేశంలో మొత్తం భారజల కేంద్రాల సంఖ్య 9.

* మొదటగా ఏర్పాటు చేసిన భారజల కేంద్రం నంగల్ (పంజాబ్).

* తెలంగాణలో ఏర్పాటు చేసిన భారజల కేంద్రం మణుగూరు (ఖమ్మం).

భారజల కేంద్రాలు ఉన్న ప్రాంతాలు

1. నంగల్ - పంజాబ్

2. తాల్చేర్ - ఒడిశా

3. ధాల్ - మహారాష్ట్ర

4. ట్యుటికోరిన్ - తమిళనాడు

5. బరోడా - గుజరాత్

6. మణుగూరు - తెలంగాణ

7. హజీరా - గుజరాత్

8. రావత్‌భటా 1 - రాజస్థాన్

9. రావత్‌భటా 2 - రాజస్థాన్

1942లో మొదటి అణువిద్యుత్ కేంద్రాన్ని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన 'ఎన్రికో ఫెర్మి' నిర్మించాడు.

భారతదేశంలో అణుశక్తి పరిశోధనా కేంద్రాలు

* అటామిక్ ఎనర్జీ కమిషన్ ముంబయిలో ఉంది.

* ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL)ను 1967, ఏప్రిల్ 11న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

* న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC)ని హైదరాబాద్‌లో 1971, డిసెంబర్ 31న ప్రారంభించారు.

* ఇందిరా గాంధీ అణుపరిశోధనా కేంద్రం, కల్పకం (1971)

* రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ - ఇండోర్, మధ్యప్రదేశ్ (1984)

* బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ - ముంబయి (1989)

* హరీష్ చంద్ర రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - అలహాబాద్

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ సెంటర్ - అహ్మదాబాద్

* హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ ల్యాబొరేటరి - గుల్మార్గ్ (కశ్మీర్)
* సెంట్రల్ మైనింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ధ‌న్‌బాద్‌ (ఝార్ఖండ్)
* ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ - ముంబయి (1950, ఆగస్టు 18)
సాహ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ - కోల్‌కతా
* టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ - ముంబయి
* యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - జాదూగూడ (ఝార్ఖండ్)
* టాటా మెమోరియల్ సెంటర్ - ముంబయి
* వర్చువల్ న్యూక్లియర్ డాటా ఫిజిక్స్ సెంటర్‌ను బార్క్‌లో 2011లో ఏర్పాటు చేశారు.


అణుపాటవ పరీక్షలు
* అణుశక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి భారతదేశం రెండు సందర్భాల్లో మొత్తం 6 సార్లు రాజస్థాన్‌లోని థార్ ఎడారిలోని పోఖ్రాన్‌లో అణుపాటవ పరీక్షలు నిర్వహించింది.
i) మొదటిసారి 1974, మే 18న, 'స్మైలింగ్ బుద్ధ' పేరుతో భూగర్భంలో అణుపాటవ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు డాక్టర్. రాజారామన్న,  డాక్టర్. సేత్నా.
* ఆ సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ, రాష్ట్రపతి వి.వి. గిరి, రక్షణమంత్రి జగ్‌జీవన్‌రామ్, అణుశక్తి సంఘం ఛైర్మన్ సేత్నా ఉన్నారు.
ii. రెండో సారి 'ఆపరేషన్ శక్తి' పేరుతో 1998, మే 11న మూడు పరీక్షలు, మే 13న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
* ఈ పరీక్షల వల్ల హైడ్రోజన్ బాంబు తయారు చేసే సామర్థ్యం భారత్‌కు లభించింది.
* ఇలాంటి సామర్థ్యం ఉన్న దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్.
* ఈ పరీక్షలను పర్యవేక్షించినవారు డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలాం, డాక్టర్. చిదంబరం, డాక్టర్. సంతానం,  డాక్టర్. అనిల్ కాకోద్కర్.
* ఆ సమయంలో ప్రధాని వాజ్‌పేయీ, రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్, రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్, అణుశక్తి సంఘం ఛైర్మన్ చిదంబరం.
* మే 11ను 1999 నుంచి భారతదేశ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* పాకిస్థాన్ అణుశాస్త్ర పితామహుడిగా పేరు గాంచినవారు అబ్దుల్ ఖాదీర్ ఖాన్.
* పాకిస్థాన్‌లోని అణుపరిశోధనా కేంద్రం కహూట.
* అబ్దుల్ ఖాదీర్ ఖాన్ 1998, మే 28, 30 తేదీల్లో ఆరు అణుపాటవ పరీక్షలు నిర్వహించారు. వీటిని పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని చాఘాయ్ కొండల్లో నిర్వహించారు.


ప్రపంచ దేశాలు నిర్వహించిన అణుపరీక్షలు
i) అమెరికా - 1945, నెవెడా ప్రాంతంలో
ii) రష్యా - 1949, సైబీరియా ప్రాంతంలో
iii) యూ.కె. - 1952, భూగర్భంలో
iv) ఫ్రాన్స్ - 1960, భూగర్భంలో
v) చైనా - 1964, గోబి ఎడారి
vi) ఇజ్రాయెల్ - 1967, భూగర్భంలో
vii) భారతదేశం - 1974, పోఖ్రాన్
viii) పాకిస్థాన్ - 1998, చాఘాయ్ కొండలు
ix) ఉత్తర కొరియా - 2006 అక్టోబర్, 2009 మే, 2013, ఫిబ్రవరి 12, కిల్జీ బొగ్గు గని
x) ఇరాన్ - 2012 మార్చి - భూగర్భంలో నిర్వహించారు.
* అణుబాంబును అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. దీన్ని అమెరికా శాస్త్రవేత్త 'హేమర్' తయారు చేశారు.
* అణుబాంబు విస్ఫోటనం తర్వాత హానికరమైన రేడియోధార్మిక వికిరణాలు నేలపై చేరుతాయి. దీన్నే 'రేడియో యాక్టివ్ ఫాలౌట్' అంటారు.
* అణుబాంబు విస్ఫోటనంలో 50% అణుశక్తి, 33% ఉష్ణశక్తి, 17% రేడియోధార్మిక వికిరణాలు విడుదల అవుతాయని 1971లో 'వార్నర్' అనే శాస్త్రవేత్త తెలిపారు.


న్యూక్లియర్ వింటర్
* అణుబాంబు పేలుడు సంభవించినప్పుడు కలిగే విపరీత పరిస్థితుల వల్ల పెద్త మొత్తంలో రేడియోధార్మిక వికిరణాలు పొగ, దుమ్ము, దూళి కణాలతో ఒక మేఘంలాగా వాతావరణంలో ఏర్పడి తాత్కాలికంగా సూర్యరశ్మిని నిరోధించి ఉష్ణోగ్రతను 00C కంటే తక్కువ స్థాయికి తాత్కాలికంగా తీసుకువస్తాయి. ఇటువంటి పరిస్థితిని 'న్యూక్లియర్ వింటర్' అని అంటారు.
* ఈ సందర్భంలో కిరణజన్య సంయోగ క్రియ సూర్యరశ్మి అందక నిలిచి పోవడం వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోయి ప్రాణకోటికి నష్టం ఏర్పడుతుంది.


ప్రపంచంలో అణు విద్యుత్
* ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న అణు విద్యుత్‌లో ఆస్ట్రేలియాలోని 'వియన్నా'లో ఉన్న 'అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ' ప్రకారం ప్రస్తుతం 31 దేశాల్లో 437 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా 2014 చివరి నాటికి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ 3,72,210 మెగావాట్లు.
* అణురియాక్టర్లు, అణు విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో - అమెరికా, రెండో స్థానం - ఫ్రాన్స్, మూడో స్థానం - జపాన్, నాలుగో స్థానం - రష్యా, భారతదేశం 10వ స్థానంలో ఉంది                  
* అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ(International Atomic Energy Agency - IAEA)ప్రధాన కార్యాలయం ఆస్ట్రేలియాలోని 'వియన్నాలో ఉంది.
* దీన్ని 1957, జులై 29న ఏర్పాటు చేశారు.
* దీనిలో సభ్య దేశాల సంఖ్య 168.
* చివరగా చేరిన దేశం తుర్క్‌మెనిస్థాన్.
* దక్షిణ ఫ్రాన్స్‌లోని కడరాక్ అనే ప్రదేశం వద్ద 'ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పరిమెంటల్ రియాక్టర్' (ITNER)ను 16 దేశాలు కలసి సంయుక్తంగా నిర్వహించాయి. దీనికి కావలసిన 10% పరికరాలను మన దేశం సరఫరా చేస్తుంది.


అణుభద్రత సమావేశాలు
* ప్రపంచంలోని వివిధ దేశాల అణుభద్రతను, అణు తీవ్రవాదాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించారు.
* 2010, ఏప్రిల్ 12, 13న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో
* 2012, మార్చి 26, 27న దక్షిణ కొరియా సియోల్‌లో
* 2014, మార్చి 24, 25న నెదర్లాండ్‌లోని హేగ్‌లో
2016, మార్చి 31, ఏప్రిల్ 1న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సమావేశాలు జరిగాయి.
* ఈ అణుభద్రత సమావేశాల్లో వివిధ తీర్మానాలు చేశారు.


అణు దుర్ఘటనలు (Atomic Incidents)
* ప్రపంచంలో ఇప్పటివరకు మూడు అణు దుర్ఘటనలు జరిగాయి.
i) త్రీ మైల్ ఐలాండ్ దుర్ఘటన 1979లో అమెరికాలో జరిగింది.
ii) చెర్నోబిల్ (ఉక్రెయిన్) దుర్ఘటన 1986, ఏప్రిల్ 26న జరిగింది.
పై రెండూ మానవ తప్పిదాల వల్ల జరిగాయి.
iii) పుకుషిమా దైషి దుర్ఘటన 2011, మార్చి 11న సునామీ వల్ల జరిగింది.


అణు పరిశోధనా కేంద్రాలు
* ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (IGCAR), (1971)
* దీని ప్రధాన కార్యాలయం తమిళనాడులోని కల్పకంలో ఉంది.
ఈ సంస్థ రెండో దశ అణు రియాక్టర్లు అయిన 'ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్‌ల (FBTR) అభివృద్ధికి ఉద్దేశించింది.
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్(AMDER)
* దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
* ఈ సంస్థ అణు ఇంధనాలైన యురేనియం, ప్లుటోనియం, థోరియం లాంటి ఖనిజాలను అన్వేషిస్తుంది.
రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (RRCAT), 1984
* దీని ప్రధాన కార్యాలయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంది.
బాబా అణు పరిశోధనా సంస్థ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడానికి ఉద్దేశించింది.
* లేజర్, యాక్సిలరేటర్స్ అంశాల్లో పరిశోధనలు నిర్వహిస్తుంది.
వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (VECC), (1977)
* దీని ప్రధాన కార్యాలయం కోల్‌క‌తాలో ఉంది.
* న్యూక్లియర్ సైన్స్, మెటీరియల్ సైన్స్‌లలో పరిశోధనలు చేయడానికి ఉద్దేశించిన అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రం.
బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ (BRIT)
* వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్య రంగాల్లో వాడే అనేక రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేస్తుంది.
* దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.


Non-Proliferation Treaty (NPT)
* అణ్వాయుధాలను శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించేలా చేసే ఒప్పందం.
* 1970 నుంచి అమల్లోకి వచ్చింది.
* NPTపై సంతకాలు చేసిన దేశాల సంఖ్య 190.
* ఈ ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలు భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్.
ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తారు.


Comprehensive Nuclear Test Ban Treaty (CTBT)
* అణు విస్ఫోటనాలను నిషేధించే ఉద్దేశంతో చేసిన ఒప్పందం.
* 1996లో దీన్ని ఏర్పాటు చేశారు.
* ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు 183.
* సంతకం చేయని దేశాలు భారత్, ఇజ్రాయెల్, పాకిస్థాన్, ఉత్తర కొరియా.


Nuclear Suppliers Group (NSG)
* దీని ఉద్దేశం అణ్వాయుధాల పెరుగుదలను అరికట్టడం.
* దీన్ని 1974లో స్థాపించారు. 1975 నుంచి అమలు చేశారు.
* దీనిలో సభ్య దేశాలు 48.
* దీనిలో సభ్యత్వం కోసం భారతదేశం కృషి చేస్తోంది.
* దీన్నే లండన్ సప్లయర్స్ గ్రూప్ అని కూడా అంటారు.
 

Posted Date : 02-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌