• facebook
  • whatsapp
  • telegram

మొక్క - కణజాల వర్ధనం

1. కణజాల వర్ధనంలో మొక్కకణం విభజన చెంది పూర్తి మొక్కగా మారే సామర్థ్యాన్ని ఏమంటారు?
జ: టోటి పొటెన్సీ
 

2. కణజాల వర్ధనంలో పోషక యానకాన్ని ఘనస్థితికి తేవడానికి ఉపయోగపడే అగార్‌-అగార్‌ను వేటి నుంచి సంగ్రహిస్తారు?
జ: శైవలాలు
 

3. కణజాల వర్ధనంలో ఉపయోగించే పోషక యానకం మొక్క కణాలకు వేటిని అందిస్తుంది?
a) ఖనిజ లవణాలు   b) హార్మోన్‌లు  c) నీరు   d) అన్నింటినీ
జ: అన్నింటినీ
 

4. మొక్కలను కణజాల వర్ధనం ద్వారా సృష్టించడం ఏ విధంగా ఉపయోగపడుతుంది?
a) తక్కువ సమయంలో ఎక్కువ మొక్కల ఉత్పత్తి    b)  అరుదైన మొక్కల ఉత్పత్తి
c) ఒకే లక్షణాలున్న అనేక మొక్కల ఉత్పత్తి          d)  అన్నీ
జ: అన్నీ
 

5. పోషక యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడానికి ప్రయోగశాలలో ఉపయోగించే పరికరం?
జ: ఆటోక్లేవ్‌
 

6. కణజాల వర్ధనాన్ని కింది ఏ రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు?
a) వ్యవసాయ రంగం  b) హార్టీకల్చర్‌  c) పారిశ్రామిక రంగం  d) అన్నీ
జ: అన్నీ
 

7. కృత్రిమ విత్తనాలను ఏ విధంగా తయారు చేస్తారు?
జ: శాఖీయ పిండాలచూట్టూ రసాయనాన్ని పూసి
 

8. కణజాల వర్ధన ప్రక్రియలో సూక్ష్మ వ్యాప్తి అంటే?
జ: కణజాల వర్ధనం ద్వారా పెద్ద మొత్తంలో మొక్కలను ఉత్పత్తి చేయడం
 

9. కిందివాటిలో మొక్క శాఖీయ కణానికి మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణం?
a) కణ విభజన   b) టోటి పొటెన్సీ   c) యూని పొటెన్సీ  d) కణజాలాన్ని ఉత్పత్తి చేయడం
జ: టోటి పొటెన్సీ

Posted Date : 02-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌