• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నదీ వ్యవస్థ

1. టిబెట్‌లో 'సింహపు నోరు' అని ఏ నదిని పిలుస్తారు?
జ: సింధు


2. సలాల్, బాగ్లిహోర్, దుల్‌హస్తీ జల విద్యుత్ కేంద్రాలను ఏ నదిపై నిర్మించారు?
జ: చీనాబ్ నది


3. భారతదేశంలోకెల్లా ఎత్తయిన పెద్ద ఆనకట్ట అయిన భాక్రానంగల్ ఏ నదిపై ఉంది?
జ: సట్లెజ్


4. ఏ నదిని 'ఆర్గికేయ' అని కూడా పిలుస్తారు?
జ: బియాస్


5. చంద్ర, భాగ అనే రెండు చిన్న నదుల వల్ల ఏర్పడిన నది ఏది?
జ: చీనాబ్


6. కిందివాటిలో గంగానదికి ఉపనదులుగా ఉన్నవేవి?
1) కోసి        2) శారద         3) సోన్         4) అన్నీ
జ: 4 (అన్నీ)


7. గాంధీసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
జ: చంబల్


8. ఏ నదిని 'బెంగాల్ దుఃఖదాయని' అని పిలుస్తారు?
జ: దామోదర్ నది


9. ఏ దేశంలో బ్రహ్మపుత్ర నదిని 'జమున' అనే పేరుతో పిలుస్తారు?
జ: బంగ్లాదేశ్

Posted Date : 09-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌