• facebook
  • whatsapp
  • telegram

శిక్షణ సంస్థలు... బెటాలియన్‌లు... ప్రదేశాలు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పారా మిలిటరీ దళాలకు చెందిన నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. అవి
1. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA) - హైదరాబాద్
2. బేసిక్ ట్రెయినింగ్ సెంటర్ (BTC) - భాను (చండీగఢ్)
3. సెంట్రల్ ట్రెయినింగ్ కాలేజ్ (CTC) - II - కోయంబత్తూరు
4. BSF ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ (BIDR) టికాన్‌పూర్ (గ్వాలియర్)

బెటాలియన్ ప్రదేశం
1. మొదటి బెటాలియన్ (BSF కు చెందింది) గౌహతి (అసోం)
2. రెండో బెటాలియన్ (BSF) బరాసట్ (కోల్‌కత)
3. మూడో బెటాలియన్ (CISF) ముండలి (ఒడిశా)
4. నాలుగో బెటాలియన్ (CISF) అరక్కోనం (చెన్నై)
5. అయిదో బెటాలియన్ (CRPF) పుణె (మహారాష్ట్ర)
6. ఆరో బెటాలియన్ (CRPF) గాంధీనగర్ (గుజరాత్)
7. ఏడో బెటాలియన్ (ITBP) భటిండా (పంజాబ్)
8. ఎనిమిదో బెటాలియన్ (ITBP) గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)

* ఇవి కాకుండా భారత ప్రభుత్వం 2010లో బీహార్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, విజయవాడలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ల నుంచి ఒక్కొక్క బెటాలియన్ అదనంగా పెంచాలని నిర్ణయించింది. సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)
విపత్తు నిర్వహణ చట్టం (Disaster Management Act) - 2005 లోని సెక్షన్ 44ను అనుసరించి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ పారా మిలటరీ దళాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లలో ఒక్కొక్క దాన్నుంచి 2 బెటాలియన్‌లను అంటే మొత్తం 8 బెటాలియన్‌లను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌గా రూపొందించారు. ఈ ఎనిమిది బెటాలియన్‌లు ఒక్కొక్కదాంట్లో సుమారు 1000 మంది సిబ్బంది ఉంటారు. ఇవి విపత్తు లేదా విపత్తు లాంటి సందర్భాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. వీరిలో కొందరికి సహజ, మరికొందరికి మానవకారక విపత్తుల నిర్వహణలో పాలుపంచుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Posted Date : 07-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌