• facebook
  • whatsapp
  • telegram

ప్రమాణాలు - కొలతలు 

మాదిరి ప్రశ్నలు

1. టి.ఎం.సి. అనే ప్రమాణాల్లో దేన్ని కొలుస్తారు?
జ: నీటి ఘనపరిమాణం


2. వైశాల్యానికి అతిచిన్న ప్రమాణం ఏది?
జ: బార్న్


3. విద్యుత్ వాహకతకు ప్రమాణం ఏమిటి?
జ: సీమెన్స్


4. కిందివాటిలో ప్రదీప్తతకు ప్రమాణం ఏది?
1) లక్స్            2) ఫోట్          3) ల్యూమెన్/ మీ2         4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)


5. కింది వాటిలో రేడియోధార్మికతకు Sl ప్రమాణంగా దేన్ని పేర్కొంటారు?
1) క్యూరీ        2) రూథర్‌ఫర్డ్            3) బెకరల్            4) ఫెర్మీ
జ: 3(బెకరల్)


6. క్యాండిలా దేనికి ప్రమాణం?
జ: కాంతి తీవ్రత


7. కాంతి అభివాహానికి Sl ప్రమాణం .....
జ: ల్యూమెన్


8. రేడియోధార్మికతకు అతిపెద్ద ప్రమాణం ఏది?
జ: క్యూరీ


9. జీవశాస్త్రీయ వికిరణ డోసుకు ప్రమాణం ......
జ: సీవర్ట్


10. త్రిమితీయంగా ఫోటోలను చిత్రీకరించే హోలోగ్రఫీని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: డెన్నిస్ గాబర్


11. లేజర్ కాంతిని ఉత్పత్తి చేయవచ్చని సిద్ధాంతపరంగా సీహెచ్. టౌనెస్ ప్రతిపాదించారు. అయితే లేజర్‌ను మొట్టమొదటిసారి ఉత్పత్తి చేసింది ఎవరు?
జ: థియోడర్.హెచ్. మైమన్


12. భౌతికశాస్త్ర తొలి ఆవిష్కరణగా పేర్కొనే X - కిరణాలను ఉత్పత్తి చేసింది ఎవరు?
జ: రాంట్‌జెన్


13. న్యూటన్ నియమాలు వస్తు చలనాన్ని వివరిస్తాయి. గ్రహాల చలనాన్ని వివరించే నియమాలను ప్రతిపాదించిందెవరు?
జ: కెప్లర్


14. అణుబాంబును కనుక్కున్నది ఎవరు?
జ: ఓపెన్‌హైమర్


15. కాంతిలా ద్రవ్యం కూడా తరంగ స్వభావం కలిగి ఉంటుందని ద్రవ్య తరంగాలను ప్రతిపాదించింది?
జ: డీబ్రాయ్


16. గోళం దాని కేంద్రం వద్ద ఏర్పరిచే ఘనకోణం (స్టెరేడియన్లలో) ఎంత?
జ: 4 Π

Posted Date : 02-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌