మాదిరి ప్రశ్నలు
1. అత్యధిక జీవ వైవిధ్యం కలిగి ఉన్న దేశం ఏది?
జ: బ్రెజిల్
2. అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 16వ
3. కిందివాటిలో జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే అంశం ఏది?
ఎ) ఆవాసాల వినాశనం బి) అన్యజాతుల చొరబాటు
సి) సహజ వనరుల మితిమీరిన వాడకం డి) అన్నీ
జ: డి (అన్నీ)
4. హాట్స్పాట్లను ప్రతిపాదించింది ఎవరు?
జ: నార్మన్ మైర్స్
5. భారతదేశంలో ఉన్న హాట్స్పాట్లు ఎన్ని?
జ: 4
6. కొత్తగా ఆవిర్భవించి, ఒక ప్రాంతానికే పరిమితమైన జీవజాతులు చూపే స్థానీయత ఏది?
జ: నియో ఎండమిజమ్
7. కిందివాటిలో అతిపెద్ద జీవ వైవిధ్య స్థాయి ఏది?
ఎ) జన్యు వైవిధ్యం బి) జాతి వైవిధ్యం సి) జీవావరణ వైవిధ్యం డి) పైవేవీకాదు
జ: సి (జీవావరణ వైవిధ్యం)
8. కిందివాటిలో జీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
ఎ) ఆహ్లాదపు ప్రయోజనాలు బి) నైతిక ప్రయోజనాలు సి) ఉత్పాదక ప్రయోజనాలు డి) అన్నీ
జ: డి (అన్నీ)
9. సక్యులెంట్ కరూ ప్రాంతం ఏ మండలంలోని హాట్‌స్పాట్‌గా గుర్తించవచ్చు?
జ: ఆఫ్రికా
10. కిందివాటిలో అత్యధిక హాట్స్పాట్లున్న మండలం?
ఎ) ఆఫ్రికా బి) ఆసియా పసిఫిక్ సి) యూరప్, మధ్య ఆసియా డి) ఏదీ కాదు
జ: బి (ఆసియా పసిఫిక్)
11. , , లు వరుసగా ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలను సూచిస్తే వీటి మధ్య సంబంధం ఏది?
జ: < <
12. జీవ వైవిధ్యం పదాన్ని రోసన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
జ: 1985
13. కిందివాటిలో భారతదేశంలోకి ప్రవేశించిన అన్యదేశ జాతి మొక్కలేవి?
ఎ) కాంగ్రెస్ గ్రాస్ బి) లాంటనా సి) ఐకార్నియా డి) అన్నీ
జ: డి (అన్నీ)
14. జీవ వైవిధ్య సంపద ......
జ: భూమధ్య రేఖా ప్రాంతం వైపు వెళుతున్న కొద్దీ పెరుగుతుంది.
15. కిందివాటిలో సుమారు 50% జీవ వైవిధ్య సంపదను కలిగి ఉంది .......
ఎ) ఉష్ణమండల వర్షారణ్యం బి) సమశీతోష్ణ వర్షారణ్యం సి) ప్రవాళ భిత్తికలు డి) గడ్డి భూములు
జ: ఎ (ఉష్ణమండల వర్షారణ్యం)