• facebook
  • whatsapp
  • telegram

పేదరికం

మాదిరి ప్రశ్నలు


1. ఒక దేశం ఆదాయ సమానత్వాన్ని సాధించినప్పుడు అదృశ్యమయ్యే పేదరికం ఏది?
ఎ) నిరపేక్ష పేదరికం   బి) సాపేక్ష పేదరికం   సి) పాక్షిక పేదరికం   డి) నిరపేక్ష - సాపేక్ష పేదరికం
జ: (బి)


2. 'పావర్టీ ఇన్ ఇండియా' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ     బి) మిన్హాస్      సి) దండేకర్, రథ్     డి) బర్దన్
జ: (సి)


3. మన దేశంలో పేదరికపు అంచనాలను అధికారికంగా ప్రకటించే సంస్థ ఏది?
ఎ) ప్రణాళిక సంఘం   బి) నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ    సి) ప్రణాళిక మంత్రిత్వ శాఖ   డి) కేంద్ర గణాంక సంస్థ
జ: (ఎ)


4. మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం తెలిపే పేదరిక లెక్కింపు కొలమానం?
ఎ) పేదరిక వ్యత్యాస సూచి   బి) సేన్ పేదరిక సూచి   సి) బహుపార్శ్వ పేదరిక సూచి   డి) తలల లెక్కింపు పద్ధతి
జ: (డి)


5. పేదరికాన్ని అంచనా వేసే పద్ధతిని సమీక్షించడానికి 2005 డిసెంబరులో వేసిన కమిటీ ఏది?
ఎ) లక్డావాలా   బి) తెందూల్కర్    సి) రంగరాజన్    డి) అహ్లూవాలియా
జ: (బి)


6. ఎన్ఎస్ఎస్‌వో (68వ రౌండ్) ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో పేదరికంలో ఉన్న జనాభా శాతం ఎంత?
ఎ) 26.1   బి) 22.9   సి) 21.9   డి) 20.9
జ: (సి)


7. 'ట్రికిల్ డౌన్ సిద్ధాంతం' ప్రకారం ఒక దేశంలో వృధ్ధి జరుగుతున్నపుడు పేదరికం ఏ విధంగా ఉంటుంది?
ఎ) పెరుగుతుంది   బి) తగ్గుతుంది   సి) స్థిరంగా ఉంటుంది   డి) సంబంధం లేదు
జ: (బి)


8. 'గరీబీ హటావో' అనే నినాదం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ప్రధాని ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ   బి) లాల్‌బహదూర్ శాస్త్రి   సి) చరణ్ సింగ్   డి) ఇందిరాగాంధీ
జ: (డి)


9. పేదరిక నిర్మూలకు 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశ పెట్టారు?
ఎ) 3వ ప్రణాళిక   బి) 4వ ప్రణాళిక   సి) 5వ ప్రణాళిక   డి) 6వ ప్రణాళిక
జ: (సి)


10. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం ఏది?
ఎ) జాతీయ పనికి ఆహార పథకం   బి) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన

సి) ఎంజీఎన్ఆర్ఈజీఎస్              డి) భారత్ నిర్మాణ్ యోజన
జ: (డి)


11. కిందివాటిలో పేదరికానికి కారణం కానిది ఏది?
ఎ) జనాభా పెరుగుదల    బి) మూలధన కొరత    సి) ఆర్థిక శక్తి వికేంద్రీకరణ    డి) ద్రవ్యోల్భణ పెరుగుదల
జ: (సి)


12. ఇటీవల ప్రవేశపెట్టిన 'జన్‌ధన్ యోజన' ఉద్దేశం ఏమిటి?
ఎ) గ్రామీణ పేదల ఉత్పాదకతను పెంచడం

బి) జనాభాను శీఘ్రంగా నియంత్రించడం

సి) గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచడం

డి) ఆర్థికంగా సమ్మిళితం
జ: (డి)


13. తెందూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం పేదలున్న రాష్ట్రం ఏది?
ఎ) ఒడిశా   బి) బిహార్   సి) రాజస్థాన్   డి) ఉత్తర్‌ప్రదేశ్
జ: (ఎ)


14. భారతదేశంపై ప్రత్యేక దృష్టితో పేదరికం గురించి అధ్యయనాలను చేసినందుకు ఈ ఏటి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆంగస్ డీటన్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) అమెరికా   బి) జపాన్   సి) ఫ్రాన్స్   డి) స్కాట్లాండ్
జ: (డి)


15. తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 2014, అక్టోబరు   బి) 2014, ఆగస్టు 15   సి) 2014, జూన్ 2   డి) 2014, నవంబరు 8
జ: (డి)


16. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కల్యాణ లక్ష్మి' పథకం ఎవరికి ఉద్దేశించింది?
ఎ) పేద ఎస్సీ బాలికలకు   బి) పేద ఎస్టీ బాలికలకు   సి) పేద ఎస్సీ, ఎస్టీ బాలికలకు   డి) పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు
జ: (సి)    

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌