• facebook
  • whatsapp
  • telegram

ర్యాంకింగ్ ప‌రీక్ష‌

1. 30 మంది ఉన్న తరగతిలో శైలజ చివరి నుంచి 24వ స్థానంలో ఉంటే, మొదటి నుంచి ఎన్నో స్థానంలో ఉంటుంది?

    1) 5          2) 6          3) 7          4) 8

సాధన: మొదటి నుంచి ఆమె స్థానం = మొత్తం - చివరి నుంచి + 1

 = 30 - 24 + 1 = 7 

సమాధానం: 3

2. ఒక తరగతిలో విద్యార్థుల మార్కుల జాబితాలో అక్షయ్‌ మొదటి నుంచి 14వ స్థానంలో, చివరి నుంచి 15వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది?

    1) 27        2) 28        3) 29        4) పైవేవీకావు

సాధన: మొత్తం = మొదటి నుంచి + చివరి నుంచి - 1

= 14 +15 - 1 = 28

సమాధానం: 2

3. ఒక వరుసలో నిల్చున్న వ్యక్తుల్లో ఎడమ చివరి నుంచి A స్థానం 10. అదే వరుసలో కుడి చివర నుంచి B స్థానం 18. వారిద్దరూ పరస్పరం స్థానాలు మార్చుకున్నారు. అలా మార్చుకున్న తర్వాత ఎడమ చివర నుంచి A స్థానం 16గా మారింది. అయితే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు?

    1) 28        2) 33        3) 34        4) పైవేవీకావు

సాధన: 

మొత్తం = ఎడమ + కుడి - 1

= 16 + 18 - 1 = 33 

సమాధానం: 2

4. ఒక వరుసలో నిల్చున్న వ్యక్తుల్లో మొదటి నుంచి ఒక బాలుడి స్థానం 10, అదే వరుసలో చివరి నుంచి ఒక బాలిక స్థానం 20. ఆ వరుసలో నిల్చున్న ఒక బామ్మ, ఇంతకు ముందు పేర్కొన్న బాలుడికి 5 స్థానాలు కింద, బాలికకు 7 స్థానాలు పైన ఉంది. అయితే ఆ వరుసలో నిల్చున్న వారి సంఖ్య ఎంత?

    1) 37         2) 41         3) 42         4) 43

సాధన: 


బామ్మ స్థానం మొదటి నుంచి = 10 + 5 = 15

చివరి నుంచి = 20 + 7 = 27

మొత్తం = మొదటి నుంచి ఒక వ్యక్తి స్థానం + చివరి నుంచి అదే వ్యక్తి స్థానం - 1

= 15 + 27 - 1 = 41 

సమాధానం: 2

5. ఒక వరుసలో నిల్చున్న వ్యక్తుల్లో ఎడమ చివరి నుంచి బాల్‌ స్థానం 14. అదే వరుసలో కుడి చివరి నుంచి పాల్‌ స్థానం 25. వారిద్దరూ వారి స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. అలా మార్చుకున్న తర్వాత ఎడమ చివరి నుంచి బాల్‌ స్థానం 22గా మారింది. వారిద్దరికీ సరిగ్గా మధ్యలో లాల్‌ ఉన్నాడు. అయితే లాల్, బాల్‌లకు మధ్యలో ఎంత మంది ఉంటారు?

1) 3          2) 4          3) 6          4) 7

సాధన: 

  

బాల్, పాల్‌ల మధ్యలో 22  14  1 = 7

బాల్, లాల్‌ల మధ్యలో ముగ్గురు ఉంటారు.

సమాధానం: 1


6. 26 మంది ఉన్న ఒక వరుసలో రాజు ఎడమ చివర నుంచి 14వ స్థానంలో ఉన్నాడు. అతడు తన కుడికి 4 స్థానాలు జరిగితే కుడి చివర నుంచి అతడు ఎన్నో స్థానంలో ఉన్నాడు?

 1) 9         2) 11         3) 18         4) చెప్పలేం

సాధన: కుడి నుంచి రాజు స్థానం = మొత్తం  [ఎడమ నుంచి ్ఘ కుడికి జరిగిన స్థానాలు] + 1

    26 - [14 + 4] + 1 = 9 

సమాధానం: 1


7. 30 మంది ఉన్న ఒక వరుసలో శ్రీకాంత్‌ కుడివైపునకు 5 స్థానాలు జరగగా, ఎడమ చివరి నుంచి 14వ స్థానాన్ని పొందాడు. అయితే కుడి వైపు నుంచి అతడి ఇంతకు ముందు స్థానం ఎంత?

1) 9         2) 10         3) 21         4) 22

సాధన: కుడి నుంచి ఇంతకు ముందు ఉన్న స్థానం = మొత్తం - [ఎడమ నుంచి - కుడి వైపు జరిగినవి] + 1

    = 30 - [14 - 5] + 1

    = 30 -  9 + 1 = 22     

సమాధానం: 4


8. 120 మంది ఉన్న ఒక తరగతిలో బాలుర కంటే బాలికలు రెండు రెట్లు ఎక్కువ. నవీన్‌ అనే బాలుడు విద్యార్థులందరి మార్కుల జాబితాలో మొదటి నుంచి 60వ స్థానంలో ఉన్నాడు. అతడి ముందు 44 మంది బాలికలు ఉంటే, అతడి వెనకాల ఎంతమంది బాలురు ఉన్నారు?

    1) 16         2) 23         3) 24         4) 40

సాధన: 120 మందిలో బాలురు 40, బాలికలు 80. మొదటినుంచి 60వ స్థానంలో ఉన్న నవీన్‌కు ముందున్న 59 మందిలో 44 మంది బాలికలు అయితే 15 మంది బాలురు. మొత్తం 40 మంది బాలురులో 15 మంది ముందు ఉంటే అతడి వెనకాల 24 మంది బాలురు ఉంటారు. 

సమాధానం: 3


9. 70 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో 30% బాలికలు ఉన్నారు. లత అనే బాలిక ఆ తరగతి వార్షిక పరీక్షల్లో మొదటి నుంచి 26వ స్థానంలో ఉంది. ఆమె వెనకాల 11 మంది బాలికలు ఉన్నారు. లత కంటే ముందు ఎంత మంది బాలురు ఉన్నారు?

    1) 16         2) 33         3) 45         4) 49

సాధన: 70 మందిలో బాలికలు 21, బాలురు 49.

    లత మొదటి నుంచి 26వ స్థానంలో ఉంది. ఆమె వెనక ఇంకా 44 మంది ఉండాలి. అందులో 11 మంది బాలికలు, 33 మంది బాలురు. వెనకాల 33 మంది బాలురు ఉంటే ముందు 16 మంది బాలురు ఉంటారు.

సమాధానం: 1


10. ఉత్తరం వైపు ముఖం చేసి ఉన్న ఒక బాలికల వరుసలో P కి ఎడమవైపు 10వ స్థానంలో R ఉంది. P కుడి చివరి నుంచి 21వ స్థానంలో ఉంది. ఎడమ చివరి నుంచి 17వ స్థానంలో ఉన్న M, R కి కుడి వైపు 4వ స్థానంలో ఉంది. అయితే ఆ వరుసలో ఎంతమంది బాలికలు ఉన్నారు?

    1) 37         2) 43         3) 47         4) 44

సాధన: 


  M ⇒ 27 + 17 -1 = 43      

సమాధానం: 2


11. ఒక బాలుర వరుసలో అక్షయ్‌ ఎడమ నుంచి 16 స్థానంలో, విజయ్‌ కుడి నుంచి 18వ స్థానంలో ఉన్నారు. అవినాష్, అక్షయ్‌కి కుడివైపు 11వ స్థానంలో, విజయ్‌కి కుడివైపు నుంచి 3వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ వరుసలో ఎంతమంది బాలురు ఉన్నారు?

    1) 30         2) 38         3) 41         4) 48

సాధన:    


అవినాష్‌ = ఎడమ నుంచి + కుడి నుంచి - 1

    27 + 15 - 1 = 41 

సమాధానం: 3


12. దక్షిణం వైపు ముఖం చేసిన 25 మంది పిల్లల వరుసలో R స్థానం కుడి నుంచి 16, B స్థానం ఎడమ నుంచి 18. అయితే R, B ల మధ్య ఎంత మంది పిల్లలు ఉన్నారు?

    1) 8      2) 10      3) 9      4) 7

సాధన: మొత్తం = 25, R + B  = 16 + 18 = 34

    34 - [25 + 2] = 7

    R, B లను కలిపితే మొత్తం కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి దాని నుంచి (మొత్తం +2 ను) తీసేయాలి. 

సమాధానం:


13. ఉత్తరానికి ముఖం చేసిన 40 మంది బాలుర వరుసలో అమర్‌ కుడి చివర నుంచి 28వ స్థానంలో ఉన్నాడు. అమర్, సందీప్‌కి కుడి వైపు 6వ స్థానంలో ఉన్నాడు. సందీప్, విజయ్‌కి ఎడమ వైపున 11వ స్థానంలో ఉన్నాడు. ఎడమ చివర నుంచి విజయ్‌ స్థానం ఎంత?

    1) 17         2) 21         3) 20         4) 18

సాధన: 


    విజయ్‌ స్థానం ఎడమ చివరి నుంచి = 40 - 23 + 1 = 18     

సమాధానం: 4


14. 31 మంది విద్యార్థుల్లో రుచి, రూప స్థానాలు వరుసగా 7, 11. చివరి నుంచి వారి స్థానాలను గుర్తించండి.

    1) 20, 24     2) 25, 21     3) 21, 26     4) 26, 20

సాధన: చివరి నుంచి రుచి స్థానం = 31 - 7 + 1 = 25

    చివరి నుంచి రూప స్థానం = 31 - 11 + 1 = 21

సమాధానం: 2


15. ఒక తరగతిలో A మొదటి నుంచి 5వ స్థానంలో ఉన్నాడు. B చివరి నుంచి 8వ స్థానంలో ఉన్నాడు. C అనే వ్యక్తి A తర్వాత 6వ స్థానంలో, A, B లకు సరిగ్గా మధ్యలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలో మొత్తం ఎంతమంది ఉంటారు?

1) 25         2) 26         3) 23         4) 24

సాధన: 

    A = 5 + 6 = 11

    B = 8 + 6 = 14

  C స్థానం, మొదటి నుంచి 11, చివరి నుంచి 14.

    మొత్తం = 11 + 14 - 1 = 24 

సమాధానం: 4


16. కొంతమంది బాలురు వృత్తాకారంలో సమానదూరాల్లో కూర్చున్నారు. వారిలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఎదురుగా 11వ స్థానంలో ఉన్న వ్యక్తి కూర్చున్నాడు. అయితే ఆ వృత్తాకారంలో మొత్తం ఎంతమంది బాలురు ఉన్నారు?

    1) 18         2) 19         3) 20         4) 22

సాధన: 


సంక్షిప్త పద్ధతి: (11-2) * 2 = 18 

సమాధానం: 1
 

17. ఒక పాఠశాలలో ఒక తరగతికి చెందిన విద్యార్థులు నిలువు వరుసలో నిల్చున్నారు. రాము ఆ వరుసలో పై నుంచి 26వ స్థానంలో, కింది నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
1) 34             2) 31             3) 36              4) 30 
సాధన: 

సూత్రం: తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 
= (రాము స్థానాల మొత్తం) - 1
= (26 + 6) - 1 = 32 -1 = 31 
తరగతిలోని మొత్తం విద్యార్థులు = 31 
సమాధానం: 2


18. కొంతమంది విద్యార్థులున్న ఒక తరగతిలో మహేష్‌ ఎడమ నుంచి 10వ స్థానంలో, కుడి నుంచి 28వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలో ఉండే మొత్తం విద్యార్థులు ఎంతమంది?
1) 37           2) 38          3) 28              4) 40 
సాధన:

= (రెండువైపుల నుంచి మహేష్‌ స్థానాల మొత్తం) - 1
= (10 + 28) - 1 = 38 - 1 = 37 
 సమాధానం: 1


19. ఒక తరగతిలో విద్యార్థులు వరుసగా కూర్చున్నారు. వారిలో లత ఎటునుంచి చూసినా 17వ స్థానంలో ఉంది. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య?
1) 30             2) 42              3) 45               4) 33  
సాధన: ఎటునుంచి చూసినా లత 17వ స్థానంలో ఉంది అంటే 

తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య
= (16 + 16 + 1) = 32 + 1 = 33 
సమాధానం: 4


20.  ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు వరుసగా కూర్చున్నారు. వారిలో రాజు కుడివైపు నుంచి 14వ స్థానంలో ఉన్నాడు. అయితే ఎడమవైపు నుంచి రాజు స్థానం ఎంత?
1) 45          2) 36            3) 27              4) 21  
సాధన: 

సూత్రం: ఎడమవైపు నుంచి రాజు స్థానం 
= (తరగతిలో మొత్తం విద్యార్థులు  కుడి వైపు నుంచి రాజు స్థానం) + 1
(40 - 14) + 1 = 26 + 1 = 27 
సమాధానం: 3


21. ఒక తరగతిలోని విద్యార్థుల వరుసలో మోహన్‌ ఎడమ నుంచి 13వ స్థానంలో ఉన్నాడు. సుమన్‌ కుడి నుంచి 12వ స్థానంలో, ఎడమ నుంచి 18వ స్థానంలో ఉన్నాడు. అయితే మోహన్‌కు కుడివైపు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?
1) 18               2) 20              3) 16             4) 29
సాధన: 

మోహన్‌కు కుడివైపు ఉన్న విద్యార్థుల సంఖ్యను కనుక్కోవాలంటే, ముందు ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలో ఒకే విద్యార్థి ఉన్న రెండు స్థానాలను ఇచ్చారు. కాబట్టి సుమన్‌కు రెండువైపులా ఉన్న స్థానాల ఆధారంగా మొత్తం విద్యార్థుల సంఖ్యను కనుక్కోవాలి.
ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 
= రెండువైపుల నుంచి సుమన్‌ స్థానాల మొత్తం - 1
= (12 + 18) - 1 = 30 - 1 = 29 
మోహన్‌కు కుడివైపున ఉన్న విద్యార్థుల సంఖ్య 
= మొత్తం విద్యార్థుల సంఖ్య  ఎడమవైపు నుంచి మోహన్‌ స్థానం
= 29 - 13 = 16 
సమాధానం: 3


22. ఒక వరుసలో A అనే వ్యక్తి ఎడమవైపు నుంచి 10వ స్థానంలో, B అనే వ్యక్తి కుడివైపు నుంచి 15వ స్థానంలో ఉన్నారు. వారిద్దరూ వారి స్థానాలను పరస్పరం మార్చుకుంటే A ఎడమ నుంచి 15వ స్థానానికి మారాడు. అయితే కుడివైపు నుంచి B ఏ స్థానంలో ఉన్నాడు?"
1) 20            2) 18            3) 25           4) 24 
సాధన:  

కుడి వైపు నుంచి తీ స్థానం = A రెండు స్థానాల భేదం + B మొదటి స్థానం
= (15 - 10) + 15 = 5 + 15 = 20
సమాధానం: 1


23. ఒక వరుసలో A అనే వ్యక్తి ఎడమ నుంచి 10వ స్థానంలో, B కుడి నుంచి 9వ స్థానంలో ఉన్నారు. వారిద్దరూ వారి స్థానాలను పరస్పరం మార్చుకుంటే, A ఎడమ నుంచి 15వ స్థానానికి మారాడు. అయితే ఆ వరుసలో ఉండే మొత్తం వ్యక్తుల సంఖ్య?
1) 25            2) 23             3) 27             4) 36 
సాధన:

ఆ వరుసలో ఉండే మొత్తం వ్యక్తుల సంఖ్య 
= (A నూతన స్థానం + B పాత స్థానం) - 1 
= (15 + 9) - 1 = 24 - 1 = 23 
సమాధానం: 2


24. ఒక వరుసలో 17 మంది ఉన్నారు. వారిలో ప్రతి 2వ స్థానంలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆ వరుస ప్రారంభంలోనూ, చివర్లోనూ స్త్రీలు ఉన్నారు. అయితే ఆ వరుసలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
1) 8           2) 10            3) 6            4) 5 
సాధన: దత్తాంశం నుంచి, 17 మంది ఉన్న ఆ వరుసలో స్త్రీ, పురుషుల అమరిక కింది విధంగా ఉంటుంది.

ఆ వరుసలో ఉన్న పురుషుల సంఖ్య = 8 
సమాధానం: 1

Posted Date : 10-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌