మాదిరి ప్రశ్నలు
1. టి.ఎం.సి. అనే ప్రమాణాల్లో దేన్ని కొలుస్తారు?
జ: నీటి ఘనపరిమాణం
2. వైశాల్యానికి అతిచిన్న ప్రమాణం ఏది?
జ: బార్న్
3. విద్యుత్ వాహకతకు ప్రమాణం ఏమిటి?
జ: సీమెన్స్
4. కిందివాటిలో ప్రదీప్తతకు ప్రమాణం ఏది?
1) లక్స్ 2) ఫోట్ 3) ల్యూమెన్/ మీ2 4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
5. కింది వాటిలో రేడియోధార్మికతకు Sl ప్రమాణంగా దేన్ని పేర్కొంటారు?
1) క్యూరీ 2) రూథర్‌ఫర్డ్ 3) బెకరల్ 4) ఫెర్మీ
జ: 3(బెకరల్)
6. క్యాండిలా దేనికి ప్రమాణం?
జ: కాంతి తీవ్రత
7. కాంతి అభివాహానికి Sl ప్రమాణం .....
జ: ల్యూమెన్
8. రేడియోధార్మికతకు అతిపెద్ద ప్రమాణం ఏది?
జ: క్యూరీ
9. జీవశాస్త్రీయ వికిరణ డోసుకు ప్రమాణం ......
జ: సీవర్ట్
10. త్రిమితీయంగా ఫోటోలను చిత్రీకరించే హోలోగ్రఫీని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: డెన్నిస్ గాబర్
11. లేజర్ కాంతిని ఉత్పత్తి చేయవచ్చని సిద్ధాంతపరంగా సీహెచ్. టౌనెస్ ప్రతిపాదించారు. అయితే లేజర్‌ను మొట్టమొదటిసారి ఉత్పత్తి చేసింది ఎవరు?
జ: థియోడర్.హెచ్. మైమన్
12. భౌతికశాస్త్ర తొలి ఆవిష్కరణగా పేర్కొనే X - కిరణాలను ఉత్పత్తి చేసింది ఎవరు?
జ: రాంట్జెన్
13. న్యూటన్ నియమాలు వస్తు చలనాన్ని వివరిస్తాయి. గ్రహాల చలనాన్ని వివరించే నియమాలను ప్రతిపాదించిందెవరు?
జ: కెప్లర్
14. అణుబాంబును కనుక్కున్నది ఎవరు?
జ: ఓపెన్‌హైమర్
15. కాంతిలా ద్రవ్యం కూడా తరంగ స్వభావం కలిగి ఉంటుందని ద్రవ్య తరంగాలను ప్రతిపాదించింది?
జ: డీబ్రాయ్
16. గోళం దాని కేంద్రం వద్ద ఏర్పరిచే ఘనకోణం (స్టెరేడియన్లలో) ఎంత?
జ: 4 Π