• facebook
  • whatsapp
  • telegram

అనాల‌జీ

* ప్రశ్నలోని రెండు భాగాల్లో మొదటి రెండు పదాల మధ్య ఉండే సంబంధం/పోలిక ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.
1. 
ఫ్యాక్టరీకి కార్మికుడిలా ల్యాబొరేటరీకి ......? 
1) ఉద్యోగి     2) శాస్త్రవేత్త     3) టెస్ట్‌ట్యూబ్‌     4) డాక్టర్‌

సమాధానం: 2
సాధన: ఫ్యాక్టరీలో పని చేసేది కార్మికుడు అయితే ల్యాబొరేటరీలో పనిచేసేది శాస్త్రవేత్త.

2. రైతు : నాగలి : : డాక్టర్‌ : ? 

 1) దుస్తులు     2) డబ్బులు     3) బిల్డింగ్‌     4) స్టెతస్కోప్‌
సమాధానం: 4
సాధన: రైతుకు పొలం సాగు చేయడానికి నాగలి అవసరమైతే డాక్టర్‌కు రోగిని పరీక్షించడానికి స్టెతస్కోప్‌ అవసరం.

* దీనిలో రెండు భాగాలకు ఒకే భాగాన్ని ఇస్తారు. అదే సంబంధం గల రెండో భాగాన్ని సమాధానంగా గుర్తించాలి. 

1. గాలం : చేప : : ?
1) సింపోజియం : మ్యూజిక్‌       2) గ్లౌజ్‌ : బంతి

3) స్టేడియం : ఆటలు             4) స్థలం : సభావళి
సమాధానం: 2
సాధన: చేపను గాలంతో పట్టుకుంటారు అలాగే బంతిని పట్టుకోవడానికి గ్లౌజ్‌ అవసరం.  

2. ప్రయోగశాల : క్రిములు : : ?
1) గ్రంథాలయం : పుస్తకాలు     2) పాఠశాల : విద్యార్థులు
3) వేదశాల : గ్రహాలు           4) ఆటస్థలం : ఆటలు

సమాధానం: 3
సాధన: క్రిముల గురించి ప్రయోగశాలలో అధ్యయనం చేస్తారు అలాగే గ్రహాల గురించి వేదశాలలో అధ్యయనం చేస్తారు. 
 

* దీనిలో రెండు భాగాల్లో కొన్ని ఆంగ్ల అక్షరాలను ఇస్తారు. ఆ ఆంగ్ల అక్షర క్రమంలోని అంతరం ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.

1. E : S : : C : ?
1) P           2) R            3) Q            4) S 

సమాధానం: 3


2. NFX : PHM : : AXH : ?
 1)BYI       2) DAK        3) CZJ          4)  DAN

సమాధానం: 3


మాదిరి ప్రశ్నలు

1. డాక్టర్‌ : ఆసుపత్రి : : టీచర్‌ : ?
1) పాకశాల     2) ప్రయోగశాల      3) కళాశాల      4) కర్మాగారం
సమాధానం: 3
సాధన: డాక్టర్‌ పని ప్రదేశం ఆసుపత్రి అయితే టీచర్‌ పని ప్రదేశం కళాశాల. 

2. విద్యార్థులు : తరగతి : : మంత్రులు : ?
1) సభ     2) మండలి     3) సమావేశం     4) సమితి
సమాధానం: 2
సాధన: విద్యార్థుల సమూహం తరగతి, మంత్రుల సమూహం మండలి.

3. రచయిత : కలం : : చెఫ్‌ : ?
1) సూది       2) చాకు       3) రంపం      4) గొడ్డలి
సమాధానం: 2
సాధన: రచయిత ఉపయోగించే సాధనం కలం అయితే చెఫ్‌కు చాకు అవసరం. 

4. రచయిత : పుస్తకం : : రైతు : ?
1) పొలం       2) పంట       3) చెట్లు       4) నేల
సమాధానం: 2
సాధన: రచయిత అంతిమ ఫలితం పుస్తకం కాబట్టి రైతు అంతిమ ఫలితం పంట అవుతుంది.  

5. ఫర్నిచర్‌ : కలప : : గోడ : ?
1) విత్తనం     2) సిమెంటు     3) ఇటుక      4) నీరు
సమాధానం: 3
సాధన: ఫర్నిచర్‌ తయారీకి కలప అవసరమవుతుంది అలాగే గోడ కట్టడానికి ఇటుక కావాలి.

6. పెన్సిల్‌ : ఎరేజర్‌ : : కప్‌ : ?
1) ఆన్సర్‌      2) సాసర్‌       3) బ్రౌజర్‌     4) ప్లేట్‌
సమాధానం: 2
సాధన: పెన్సిల్‌ - ఎరేజర్‌ మాదిరి కప్‌ - సాసర్‌ కూడా జంట పదాలు.

7. వ్యాధులు : పాథాలజీ : : రాయడం : ?
1) ఆస్ట్రాలజీ      2) పెడాలజీ      3) వైరాలజీ      4) పాలియోగ్రఫీ
సమాధానం: 4
సాధన: వ్యాధి అధ్యయన శాస్త్రం పాథాలజీ, రాతలను అధ్యయనం చేసే శాస్త్రం పాలియోగ్రఫీ.

8. బోటనీ : ఫిజియోలజీ : : మొక్కలు : ?
1) మానవుడు     2) మానవ శరీరం      3) కళ్లు      4) అస్థిపంజరం
సమాధానం: 2
సాధన: మొక్కల అధ్యయన శాస్త్రం బోటనీ, మానవ శరీరం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫిజియోలజీ.

9. డిగ్రీలు : ఆంపియర్‌ : : ఉష్ణోగ్రత : ?
1) ద్రవ్యరాశి     2) విద్యుత్‌ ప్రవాహం      3) విద్యుత్‌ నిరోధం      4) యాంగిల్‌
సమాధానం: 2
సాధన: ఉష్ణోగ్రతకు ప్రమాణం డిగ్రీలు అయితే విద్యుత్‌ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్‌.

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు

1. సమయం : గడియారం : : కాంతి : ?
1) దీపం     2) బుడగ      3) విత్తనం     4) భూమి


2. Engagement : Marriage : : ?
1) Success : Failure                           2) Explosion : Destruction 
3) Boy : Man                                     3) Talk : Exaggeration


3. Good : Exacellent : : ?
1) Bad : Immoral                             2) Hill : Mountain
3) Caution : careless                        4) Jealously : Respect

4. జర్నలిజం : న్యూస్‌ పేపర్‌ : : ?
1) కరెన్సీ : అర్థశాస్త్రం           2) భూవిజ్ఞానం : భూమి
3) ద్రవ్యం : బ్యాంకు            4) పాలు : వెన్న

5. 248 : 403 : : 594 : ?
1) 676       2) 295       3) 749       4) 711

6. 17 : 289 : : 25 : ?
1) 262       2) 306       3) 650       4) 625

7. దిగుమతి : ఎగుమతి : : ఖర్చు : ?
1) అప్పు      2) లాభం     3) ఆదాయం      4) లోటు


సమాధానాలు: 1-1; 2-2; 3-2; 4-2; 5-3; 6-4; 7-3.
 

Posted Date : 07-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌