• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ వ్యాపారం

1. నిరపేక్ష అనుకూలత అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

1) ఆడంస్మిత్‌      2) డేవిడ్‌ రికార్డో      3)మార్షల్‌      4) జె.ఎం.కీన్స్‌


2. తులనాత్మక వ్యయ అనుకూలత అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

1)ఆడంస్మిత్‌      2) జె.ఎం.కీన్స్‌    3) డేవిడ్‌ రికార్డో     4) మార్షల్‌


3. అవకాశ వ్యయాల అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంత రూపకర్త?

1)హేబర్లర్‌    2) డేవిడ్‌ రికార్డో     3) మాల్థస్‌     4) హిక్స్‌


4. ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్తలు?

1)హెక్సర్‌ - ఓహ్లిన్‌   2)రాబిన్స్‌ - మార్షల్‌    3) జె.ఎం.కీన్స్‌ - ఆడంస్మిత్‌    4) ఎవరూ కాదు


5. అంతర్జాతీయ వ్యాపారంలో అనుసరిస్తున్న వస్తువుల వర్గీకరణ పద్ధతి.....

1)పొందికపరచిన పద్ధతి    2) విలోమ పద్ధతి    3)అనులోమ పద్ధతి     4) ఆరోహణ పద్ధతి


6. పొందికపరచిన వస్తువుల వర్గీకరణ పద్ధతిని అభివృద్ధి చేసిన అంతర్జాతీయ సంస్థ,  సంవత్సరం?

1) ప్రపంచ కస్టమ్స్‌ సంస్థ, 1988    2)ప్రపంచ వాణిజ్య సంస్థ, 1989   3)ప్రపంచ బ్యాంకు, 1990   4)ఐఎంఎఫ్, 1991


7. కిందివాటిలో వస్తు మార్పిడి నిష్పత్తికి సంబంధించిన వర్తక నిబంధనలు ఏవి?

1) వస్తు వర్తక నిబంధనలు    2)నికర వస్తు వర్తక నిబంధనలు   3)ఆదాయ వర్తక నిబంధనలు     4)పైవన్నీ


8. కిందివాటిలో రెండో ప్రపంచ యుద్ధం (1939 - 45) తర్వాత ఏర్పాటైన మూడో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఏది?

1)అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ    2) ప్రపంచ బ్యాంకు     3) అంతర్జాతీయ వ్యాపార సంస్థ    4) పైవన్నీ


9. భారతదేశంలో పొందికపరచిన అంతర్జాతీయ వర్తక వస్తు వర్గీకరణను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1987 - 88     2) 1988 - 89    3)1989 - 90     4)1990 - 91


10. ప్రపంచ కస్టమ్స్‌ సంస్థ పొందికపరచిన  వర్గీకరణ విధానాన్ని ఎప్పుడు సవరించింది?

1)2022, జనవరి 1    2) 2022, జనవరి 2   3) 2022, జనవరి 3    4)2022, జనవరి 4


11. భారత ప్రభుత్వం వస్తు, సేవల పన్నుపై విధించిన Harmonized System Nomenclature  (పొందిక పరచిన వర్గీకరణ పద్ధతి) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2021, ఏప్రిల్‌ 1   2) 2021, ఏప్రిల్‌ 2    3) 2021, ఏప్రిల్‌ 3   4) 2021, ఏప్రిల్‌ 4


12. 2021 - 22లో భారత్‌ నుంచి ఎక్కువ ఎగుమతులు జరిగిన మొదటి మూడు దేశాలు?

1) అమెరికా, యూఏఈ, చైనా    2) జపాన్, జర్మనీ, బ్రిటన్‌     3)దక్షిణ కొరియా, జపాన్, మారిషస్‌     4) రష్యా, ఉక్రెయిన్, చైనా


13. 202122లో భారత్‌ నుంచి అమెరికాకు ఎంత శాతం ఎగుమతులు జరిగాయి?

1) 18.4%    2) 17.4%    3)16.4%     4) 15.4%


14. 202122 ఆర్థిక సర్వే ప్రకారం, భారతదేశం కింది ఏ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేసింది?

1)పెట్రోలియం ఉత్పత్తులు    2)ముత్యాలు      3)ఇనుము - ఉక్కు     4) పైవన్నీ


15. 2021 - 22 ఆర్థిక సర్వే ప్రకారం, భారతదేశం కింది ఏ వస్తువులను అత్యధికంగా దిగుమతి చేసింది?

1)ముడి చమురు    2) బంగారం    3) పెట్రోలియం ఉత్పత్తులు   4) పైవన్నీ


16. 2021 - 22 ఆర్థిక సర్వే ప్రకారం, భారతదేశానికి పామాయిల్‌ను సరఫరా చేస్తున్న 10 దేశాల్లో ఇండోనేసియా స్థానం?

1)మొదటి    2) రెండో     3)మూడో     4) నాలుగో


17. భారతదేశం పెట్రోలియం దిగుమతుల కోసం కింది ఏ దేశాలపై అధికంగా ఆధారపడింది?

1) జపాన్, సౌత్‌ కొరియా      2)ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్ట్‌ దేశాలు

3) అమెరికా, చైనా   4) సింగపూర్, దావోస్‌


18. కింది ఏ దేశం భారత్‌కి అత్యధికంగా పెట్రోలియంను ఎగుమతి చేస్తుంది?

1)ఇరాక్‌     2) సౌదీ అరేబియా     3) యూఏఈ     4) పైవన్నీ


19. 1950 వ దశకంలో భారతదేశం కింది  ఏ దిగుమతి విధానాన్ని అనుసరించింది?

1) దిగుమతి ప్రత్యామ్నాయ విధానం    2) ఎగుమతి ప్రత్యాయ విధానం

3) 1, 2      4)వాణిజ్య స్వేచ్ఛా విధానం


20. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తొలిసారిగా వినియోగ వస్తువుల దిగుమతిని సరళీకృతం చేసిన సంవత్సరం?

1) 1975   2) 1976     3) 1977     4)1978


21. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక రూపాయి మూల్యహీనీకరణ (విలువను తగ్గించడం) జరిగిన సంవత్సరం?

1) 1949   2) 1966     3) 1991   4) పైవన్నీ


22. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వస్తువులను దిగుమతి చేసుకునే విధానాన్ని ఏమంటారు?

1) టోకనైజేషన్‌    2)కానలైజేషన్‌     3) డాలరైజేషన్‌     4) ఏదీకాదు


23. భారత ప్రభుత్వం మొదటి ఎగ్జిమ్‌ విధాన్ని ్బన్ల్ప్ని౯్మ ఖ్ఝ్ప్ని౯్మ  న్లిi్ఝ్శ ప్రకటించిన సంవత్సరం, అది అమలైన కాలం?

1) 1985, మూడేళ్లు   2) 1986, నాలుగేళ్లు    3)1987, అయిదేళ్లు    4)1988, ఆరేళ్లు


24. ప్రస్తుతం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ వ్యాపార విధానం కాల వ్యవధి?

1) 2015 ఏప్రిల్‌ - 2020 మార్చి వాణిజ్య విధానం (కొవిడ్‌ కారణంగా దీన్ని 2021 సెప్టెంబరు వరకు పొడిగించారు.)

2) 2000 - 15 వాణిజ్య విధానం

3)2024 - 25 వాణిజ్య విధానం

4) ఏదీకాదు


25. ఎగుమతులను ప్రోత్సహించడానికి దిగుమతులపై సున్నా కస్టమ్స్‌ సుంకం వసూలుచేసే విధానాన్ని ఏమంటారు?

1)ఎగుమతుల ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం

2) దిగుమతుల ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం     3)1, 2     4)ఏదీకాదు


26. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఎగుమతి కంపెనీలను నక్షత్రాల సంఖ్యతో వర్గీకరిస్తారు.

బి) ఈ నక్షత్రాల గరిష్ఠ సంఖ్య 5.

సి) అయిదు వేల కోట్లు, అంతకు మించి ఎగుమతులు చేసే సంస్థలన్నింటికీ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఉంటుంది.

1) ఎ మాత్రమే    2) ఎ, బి     3)బి, సి      4) పైవన్నీ


27. విదేశీ వ్యాపారంలో పాల్గొనని దేశాన్ని ఏమంటారు?

1) అసంవృత ఆర్థిక వ్యవస్థ (Closed  Economy)

2) సంవృత ఆర్థిక వ్యవస్థ  (Open  Economy)

3) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ

4) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ


28. సంవృత ఆర్థిక వ్యవస్థ అంటే?

1)విదేశీ వ్యాపారంలో పాల్గొనే దేశం

2) విదేశీ వ్యాపారంలో పాల్గొనని దేశం 

3)1, 2   4) ఏదీకాదు


29. దేశంలోని భౌగోళిక సరిహద్దుల్లో ప్రజల మధ్య జరిగే వ్యాపారాన్ని ఏమంటారు?

1) దేశీయ వ్యాపారం  2) విదేశీ వ్యాపారం   3)స్థానిక వ్యాపారం     4)బహిరంగ వ్యాపారం


30. వర్తకం అంటే ఏమిటి?

1) ప్రజల మధ్య వస్తువుల మార్పిడి      2) ప్రజల మధ్య ద్రవ్య మార్పిడి

3) దేశాల మధ్య ద్రవ్య మార్పిడి     4)పైవన్నీ


31. సుంకాలు, వర్తకంపై సాధారణ ఒప్పందం (GAT)  ఎప్పుడు అమల్లోకి వచ్చిది?

1) 1948, జనవరి 1    2)1948, జనవరి 2

3)  1948, జనవరి 3    4)1949, జనవరి 4


32. గాట్‌ సమావేశాలను 1947 - 93 మధ్య ఎన్ని సార్లు నిర్వహించారు?

1) 6      2)7       3) 8     4) 9


సమాధానాలు


1-1  2-3  3-1  4-1  5-1  6-1  7-4  8-4  9-1  10-1  11-1  12-1  13-1  14-4  15-4  16-2  17-2  18-4  19-1  20-3  21-4  22-2  23-1  24-1  25-1  26-4  27-1  28-1  29-1  30-1   31-1 32-3


మరికొన్ని...


1. వివిధ సార్వభౌమ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్ని ఏమంటారు?

1) దేశీయ వ్యాపారం    2)అంతర్గత వ్యాపారం 

3) అంతర్జాతీయ వ్యాపారం    4) ఏదీకాదు 


2. ఒక దేశం మరొక దేశం కంటే తక్కువ వ్యయంతో వస్తువును ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు?

1)నిరపేక్ష అనుకూలత      2) తులనాత్మక అనుకూలత 

3) అవకాశ వ్యయం     4)ఉదాసీన వక్రరేఖ


3. ప్రపంచ వాణిజ్య సంస్థ  (World Trade Organisation - WTO)ను ఎప్పుడు స్థాపించారు?

1)1995, జనవరి 1   2)1996, జనవరి 2 

3)1997, జనవరి 3    4) 1998, జనవరి 4


4. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దీని ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌  Dr. Ngozi Okonjo-Iweala)

1) జెనీవా (స్విట్జర్లాండ్‌)      2)వాషింగ్టన్‌ డి.సి. (అమెరికా) 

3) మాస్కో (రష్యా)      4) ఏదీకాదు


5. ఎ, బి అనే రెండు దేశాలు ఉన్నాయి. బి కంటే ఎ దేశానికి రెండు వస్తువుల తయారీలో నిరపేక్ష అనుకూలత ఉంది. బి దేశానికి రెండు వస్తువుల ఉత్పత్తిలో సమాన అనుకూలత లేదు. ఈ పరిస్థితిని ఏమంటారు?

1)అవకాశ వ్యయం     2) నిరపేక్ష అనుకూలత 

3) తులనాత్మక అనుకూలత     4)ఏదీకాదు


6. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)  లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి?

1)161   2) 162  3) 163    4)164


7. అంతర్జాతీయ వ్యాపార కాపలాదారు (Watchdog of the World Trade) అని దేన్ని పిలుస్తారు?

1) ప్రపంచ బ్యాంకు   2) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

3)ప్రపంచ వాణిజ్య సంస్థ    4) యూఎన్‌ఓ


సమాధానాలు


1-3    2-1    3-1     4-1    5-3     6-4     7-3

Posted Date : 11-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌