• facebook
  • whatsapp
  • telegram

ఆర్య నాగ‌రిక‌త / వేద నాగ‌రిక‌త‌

మాదిరి ప్రశ్నలు


1. ఉపనిషత్తు అంటే ఏమిటి?

1) దూరంగా కూర్చోవడం          2) దగ్గరగా కూర్చోవడం

3) మధ్యలో కూర్చోవడం        4) పైవన్నీ

జ: 2


2. బృహదారణ్యక ఉపనిషత్తు, చాంద్యోగ్య ఉపనిషత్తులను ఏ రూపంలో రాశారు?

1) పద్యరూపం       2) గద్యరూపం     3) ఉపమాలంకారం      4) ఉత్ప్రేక్షాలంకారం

జ: 2


3. మొత్తం ఉపనిషత్తులు ఎన్ని?

1) 104          2) 108            3) 208        4) 106

జ: 2


4. మొత్తం పురాణాలు ఎన్ని?

1) 18          2) 16          3) 14             4)  20

జ: 1


5. కిందివాటిలో భారతీయ ఇతిహాసాలను గుర్తించండి.

1) భగవద్గీత                  2) ఉపనిషత్తులు

3) రామాయణం, మహాభారతం            4) పురాణాలు, భగవద్గీత

జ: 3


6. మహాభారతానికి మరో పేరు?

1) జయసంహిత      2) పురసంహిత        3) విష్ణుసంహిత      4) విజయసంహిత 

జ: 1


7. రామాయణాన్ని రచించింది ఎవరు?

1) ఉదాతి      2) ప్రజాపతి         3) వ్యాసుడు      4) వాల్మీకి

జ: 4


8. నాలుగు ఆశ్రమ ధర్మాలను ఏ ఉపనిషత్తులో వివరించారు?

1) శతపథ బ్రాహ్మణం              2) మైత్రేయి ఉపనిషత్తు

3) జబల ఉపనిషత్తు              4) ఐతరేయ బ్రాహ్మణం 

జ: 3


9. విశ్వం పుట్టుక గురించి రుగ్వేదంలో ఎన్నో మండలంలో ప్రస్తావించారు?

1) 7వ మండలం        2) 9వ మండలం        3) 5వ మండలం        4) 10వ మండలం

జ: 4


10. ఆర్యులకు, దాస్యులకు మధ్య ఉన్న భేదాలను ఏ వేదంలో ప్రస్తావించారు?

1) రుగ్వేదం      2) సామవేదం       3) యజుర్వేదం      4) అధర్వణవేదం

జ: 1


11. కింది ఏ గ్రంథంలో భారతదేశాన్ని అయిదు భాగాలుగా విభజించారు?
1) ఐతరేయ బ్రాహ్మణం        2) అధర్వణ వేదం       3) ముండక ఉపనిషత్తు       4) పైవన్నీ

జ: 1


12. కింది ఏ గ్రంథంలో భర్తలో భార్య సగమై ఉండి, అతడ్ని సంపూర్ణుడ్ని చేస్తుంది అని ఉంది?

1) పురాణాలు          2) ఉపనిషత్తులు      3) శతపథ బ్రాహ్మణం      4) రుగ్వేదం

జ: 3


13. ‘బ్రాహ్మణులపై క్షత్రియులు ఆధిపత్యం వహించారు’ అని ఏ గ్రంథంలో ఉంది?

1) శతపథ బ్రాహ్మణం         2) మైత్రేయి ఉపనిషత్తు

3) రుగ్వేదం             4) ఐతరేయ బ్రాహ్మణం

జ: 4


14. గాయత్రీ మంత్రం ఏ వేదంలో ఉంది?

1) సామవేదం        2) యజుర్వేదం          3) అధర్వణ వేదం        4) రుగ్వేదం

జ: 4


15. నాలుగు వర్ణాలు కలిగిన సమాజం ఏ వేదంలో ఉంది?

1) అధర్వణ వేదం      2) రుగ్వేదం         3) సామవేదం       4) గాంధర్వ వేదం

జ: 2

16. కింది అంశాలను జతపరచండి.

 జాబితా - I      జాబితా - II

i) ఇంద్రుడు       a) ఖగోళాధిపతి

ii) వరుణుడు      b) యుద్ధ దేవుడు

iii) పృథ్వి       c) దేవతలకు మాత

iv) అదితి       d) భూదేవత

1) i-b, ii-a, iii-d, iv-c       2) i-d, ii-c, iii-b, iv-a

3) i-c, ii-d, iii-a, iv-b        4) i-b, ii-d, iii-a, iv-c

జ: 1


17. కిందివాటిలో సరికానిది?

1) రుగ్వేదం శ్లోకాల సంకలనం

2) వేదాలన్నింటిలో ప్రాచీనమైంది రుగ్వేదం

3) సామవేదంలో మంత్రతంత్రాలు ఉన్నాయి

4) సుర, సోమ అనేవి మత్తు పానీయాలు

జ: 3


18. వేదకాలంలో ఇంద్రుడి తర్వాతి స్థానం పొందిన దేవత?

1) అగ్ని                2) వాయువు         3) అదితి           4) బృహస్పతి

జ: 1


19. కింది అంశాలను జతపరచండి.

జాబితా -I       జాబితా - II

i) వాత          a) నీటి దేవుడు

ii) త్రిత          b) వాయు దేవుడు

iii) మారుత్‌    c) సృష్టిమూల పురుషుడు

iv) ప్రజాపతి   d) తుపాను, పిడుగుల దేవత

1)  i-b, ii-a, iii-d, iv-c       2)  i-d, ii-c, iii-b, iv-a

3)  i-c, ii-d, iii-a, iv-b       4)  i-b, ii-d, iii-a, iv-c

జ: 1


20. రాజు సింహాసనాన్ని అధిష్టించే ముందు జరిపే యాగం ఏమిటి?

1) అభిషేక యాగం      2) వాజపేయ యాగం      3) రత్నహవింశి    4) రాజసూయ యాగం

జ: 4


21. గోప అంటే?

1) రాజు          2) మంత్రి         3) పురోహిత        4) కుటుంబ పెద్ద

జ: 1


22. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I     జాబితా - II

i) శిక్ష            a) గ్రామర్‌

ii) వ్యాకరణ    b) ఉచ్ఛరణ శాస్త్రం

iii) నిరుక్తా     c) పవిత్ర ప్రదేశాలు, గృహస్థ విధులు, సామాజిక బాధ్యతలు

iv కల్ప         d) పదాల ఉత్పత్తి (ఎటమాలజీ)

1) i-b, ii-a, iii-d, iv-c       2) i-d, ii-c, iii-b, iv-a

3) i-c, ii-d, iii-a, iv-b          4) i-b, ii-d, iii-a, iv-c

జ: 1


23. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సమితి అంటే సాధారణ అసెంబ్లీ      బి) జన అనేది తెగకు సంబంధించిన పదం

సి) ద్విజులు అంటే బ్రాహ్మణులు        డి) గణ అంటే తెగ అసెంబ్లీ

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి         3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ: 4


24. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I                జాబితా - II

i) సుత             a) పన్ను వసూలు చేసే అధికారి

ii) భాగదీషు      b) గడ్డిమైదానాలకు అధిపతి

iii) సంగ్రహిత     c) రథసారథి

iv) వజ్రపతి       d) కోశాధికారి

1) i-b, ii-a, iii-d, iv-c        2) i-c, ii-a, iii-d, iv-b

3) i-c, ii-d, iii-a, iv-b      4) i-b, ii-d, iii-a, iv-c

జ: 2


25. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I          జాబితా - II

i) రధకార       a) రాజుకి చెల్లించే పన్ను

ii) బలి           b) గ్రామాల సముదాయం

iii) విస్‌          c) పురాలను నాశనం చేసేవారు

iv) పురంధర్‌   d) రథాలు తయారు చేసేవారు

1) i-d, ii-a, iii-b, iv-c       2)  i-c, ii-a, iii-b, iv-d

3) i-c, ii-d, iii-a, iv-b      4) i-b, ii-d, iii-a, iv-c

జ: 1


26. రుగ్వేదంలో కింది ఏ నదులను పేర్కొన్నారు?

ఎ) గోమతి      బి) సింధూ

సి) శతుద్రి      డి) గంగ

1) ఎ, బి         2) బి, డి          3) ఎ, సి        4) పైవన్నీ 

జ: 4


27. రుగ్వేదం ప్రకారం భారత రాజకీయ స్వరూపాన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి.

1) రాష్ట్ర, జన, విస్, గ్రామ, కుల

2) జన, విస్, గ్రామ, కుల, రాష్ట్ర

3) విస్, జన, గ్రామ, కుల, రాష్ట్ర

4) కుల, గ్రామ, విస్, జన, రాష్ట్ర

జ: 4


28. ఆర్యుల ఆకాశ దేవత ఎవరు?

1) జ్యూస్‌/ ద్యూస్‌        2) కృషివల          3) ఇంద్ర         4) పుషాణ్‌

జ: 1

1. ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్‌ ప్రాంతం అని పేర్కొంది ఎవరు?

1) స్వామి దయానంద సరస్వతి   2) ఎ.సి.థార్న్‌ 

3) బాలగంగాధర్‌ తిలక్‌              4) మాక్స్‌ముల్లర్‌

2. గాయత్రీ మంత్రం ఏ వేదంలో ఉంది?

1) రుగ్వేదం                           2) సామవేదం

3) యజుర్వేదం                       4) అధర్వణ వేదం

3. ఉపనిషత్తు అంటే?

1)  జ్ఞానం                            2) సామీప్యం  

3) అన్వేషణ                         4) పైవన్నీ


4. కిందివాటిని జతపరచండి.

i)  న్యాయ                           a) కపిలుడు

ii) సాంఖ్య                           b) బాదరాయణుడు

iii) పూర్వమీమాంస              c) గౌతముడు

iv) ఉత్తరమీమాంస               d) జైమినీ


1)  i)  b         ii)  c      iii) d         iv) a


2)  i)  c         ii)  a      iii) b         iv) d


3)  i)  a         ii)  b      iii) d         iv) c


4)  i)  c         ii)  a      iii) d         iv) b

5. తొలి వేదఆర్యుల ప్రధాన దైవం?

1)   అమ్మతల్లి               2) ఇంద్రుడు

3) అగ్ని                       4) త్రిమూర్తులు


6. రుగ్వేదం ప్రకారం దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది?

1)  రావి                       2) సట్లెజ్‌  

3)  జీలం                     4) చినాబ్‌


7. వేద కాలంలో అయఃస్‌ అంటే?

1) వరి  2) యుద్ధం 3) ఇనుము 4) బానిస


8. మలివేదకాలంలో రాజుకు సహాయపడిన ఉద్యోగులు?

1)  సేనాని             2) పురోహిత  

3)  రత్నిన్‌లు          4) హలిస్కులు


9. వేదాంగాలు ఎన్ని?

1) 4        2) 6       3) 108        4)80


10. నేటి నదులను ప్రాచీన కాలం నాటి నదుల పేర్లతో జతపరచండి.

i) జీలం                a)పరుష్ని


ii)  చినాబ్‌             b) వితస్థ


iii) రావి                 c) విపస్‌


iv) బియాస్‌             d) అసిక్ని

1)  i)  b         ii)  c      iii) d         iv) a


2)  i)  b        ii)  d      iii) a         iv) c


3)  i)  d        ii)  b      iii) c         iv) a


4)  i)  a         ii)  b      iii) c        iv) d

11. ‘నేను కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి తోటమాలి’ ఈ పదాలు ఎందులోవి?

1) రుగ్వేదం               2) సామవేదం  

3)  అధర్వణ వేదం      4)  యజుర్వేదం


12. వేదకాలంలో యుద్ధ దేవత?

1)  ఇంద్రుడు  2) అగ్ని 3) పృథ్వి 4) అదితి

సమాధానాలు


1) 3       2) 1      3) 2       4) 4      5) 2        6) 1       7) 3      8) 3       9) 2       10) 2      11) 1       12)1

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌