• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ సంఘటనం, నిర్మాణం

గతపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. ఏ వాతావరణ పొరను 'మదర్ ఆఫ్ పెరల్స్' అంటారు?
జ: స్ట్రాటో ఆవరణం

 

2. వాతావరణంలోని కింది పొరను ఏమంటారు?
1) అయనో ఆవరణం           2) స్ట్రాటో ఆవరణం
3) ట్రోపో ఆవరణం             4) మీసో ఆవరణం
జ: 3(ట్రోపో ఆవరణం)

 

3. ఏ పొరలో రేడియో తరంగాలు ప్రసరిస్తాయి?
జ: అయనో ఆవరణం

 

4. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గడానికి కారణం?
ఎ) భూ ఉపరితలానికి దగ్గరగా భూమ్యాకర్షణ వల్ల వాతావరణ పొరలు పలచగా మారడం.
బి) ఎగువ వాతావరణంలో ఎక్కువ తడి ఉండటం.
సి) ఎగువ వాతావరణంలో గాలి సాంద్రత తక్కువగా ఉండటం.
డి) ఏదీకాదు
జ: సి మాత్రమే

5. కిందివాటిలో ఓజోన్ పొరను క్షీణింపజేసేది? (ఎఫ్‌సీవో, 2012)
1) కార్బన్ డై ఆక్సైడ్       2) లెడ్ ఆక్సైడ్
3) క్లోరోఫ్లోరో కార్బన్లు        4) నైట్రోజన్
జ: 3(క్లోరోఫ్లోరో కార్బన్లు)

 

6. ట్రోపో ఆవరణం ధ్రువాలు, భూమధ్య రేఖ వద్ద ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?
జ: 8 కి.మీ., 18 కి.మీ.

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో ట్రోపో ఆవరణం లక్షణం కానిది?
1) భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
2) దీని సగటు ఎత్తు ఉపరితలం నుంచి దాదాపు 13 కి.మీ.
3) జీవులకు ముఖ్యమైన పొర.
4) వాతావరణంలో మార్పులన్నీ అధికంగా సంభవించే పొర.
జ: 1(భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.)

 

2. వాతావరణంలోని జడవాయువు?
జ: ఆర్గాన్

 

3. ఓజోన్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించేవి?
జ: ఆక్సిజన్

4. వాతావరణంలోని ప్రధాన వాయువుల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
1) కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్, నైట్రోజన్, ఆక్సిజన్
2) నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్, ఆక్సిజన్, నైట్రోజన్
4) కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్
జ: 3(కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్, ఆక్సిజన్, నైట్రోజన్)

 

5. వాతావరణంలో లేని మెండలీవ్ ఆవర్తన పట్టికలోని వాయువు?
జ: క్లోరిన్

 

6. కిందివాటిలో వాతావరణ లక్షణం కానిది?
1) వాతావరణం దాదాపు 56 కోట్ల టన్నుల బరువు ఉంటుంది.
2) మొత్తం వాయురాశిలో దాదాపు సగభాగం భూమికి 4000 మీ. ఎత్తులో ఉంటుంది.
3) భూ ఉపరితలం అధిక సాంద్రతతో ఉంటుంది.
4) వాతావరణం స్థితిస్థాపకత లక్షణాన్ని కలిగి ఉంటుంది.
జ: 2(మొత్తం వాయురాశిలో దాదాపు సగభాగం భూమికి 4000 మీ. ఎత్తులో ఉంటుంది.)

7. కిందివాటిలో సరైంది.
ఎ) థర్మో ఆవరణానికి మరొక పేరు అయనో ఆవరణం.
బి) ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలను సమరూప ఆవరణాలు అంటారు.
సి) స్ట్రాటో ఆవరణం రేడియో తరంగాలను పరావర్తనం చేస్తుంది.
డి) స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది.
జ: ఎ, బి, డి

 

8. కిందివాటిలో అసత్యమైంది?
ఎ) ఉత్తరార్ధ గోళం ఉత్తర ధృవంలో మిరుమిట్లు గొలిపే ఆకాశంలోని కాంతిచారలను అరోరా ఆస్ట్రాలిస్ అంటారు.
బి) వాతావరణం వ్యాకోచం, సంకోచం చెందుతుంది.
సి) భూమిపై గ్లోబల్ వార్మింగ్‌కు కారణం కార్బన్ డై ఆక్సైడ్.
డి) వాతావరణంలో నీటిఆవిరిని అల్టీమీటర్‌తో కొలుస్తారు.
జ: ఎ, డి

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌