• facebook
  • whatsapp
  • telegram

బౌద్ధ - జైన మతాలు

గౌతమ బుద్ధుడు

ముఖ్యాంశాలు

* అసలు పేరు - సిద్ధార్థుడు 

* వంశం - శాక్య

* తండ్రి - శుద్ధోధనుడు (కపిలవస్తు రాజు) 

తల్లి - మహామాయ (కోసలదేశ రాణి) 

* మారుతల్లి - గౌతమి 

* భార్య - యశోధర 

* కుమారుడు - రాహులుడు 

* గుర్రం - కంఠక 

* రథసారధి - చెన్నుడు 

* జ్ఞానోదయం - నిరంజన నదీతీరం రావిచెట్టు కింద 

* సుజాత - బుద్ధుడికి పాలుపోసి రక్షించిన మహిళ

* మొదటి బోధన - సారనాథ్‌

* కుశినగర్‌ - బుద్ధుడు మరణించిన ప్రదేశం 

* అలారమ - బుద్ధుడి మొదటి గురువు 

* దుఖఃదర్శనాలు - వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి 

* పద్మసంభవుడు - టిబెట్‌లో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధాచార్యులు

* త్రిపీటకాలు - 1. వినయ 2. సుత్త 3. అభిదమ్మ. సుత్త పీటకాన్ని అయిదు నికాయలుగా విభజించారు. అవి: దీర్ఘ నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుత్తర నికాయ, ఖుద్దాక నికాయ.

* ధర్మచక్ర పరివర్తనం - సారనాథ్‌లో బుద్ధుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని మొదట 5 మంది శిష్యులకు మృగదావనంలో (జింకల వనం) బోధించాడు.

* భిక్షువు - బౌద్ధసన్యాసి

మహాయానం, హీనయానం - బౌద్ధమత శాఖలు

* సల్లేఖనవ్రతం - ఉపవాసం ఉండి, శరీరాన్ని కృశింపజేసుకోవడం

* నిర్యాణం - మరణించడం

* మహాభినిష్క్రమణం - బుద్ధుడు ఇల్లువిడిచి వెళ్లడం

* త్రిరత్నాలు - బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.

* బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ - ప్రజాపతి గౌతమి

* ఆమ్రపాలి అనే వేశ్య, అంగుళీమాలుడు అనే దొంగ బౌద్ధ మతంలో చేరారు.

* బుద్ధుడి తొలి శిష్యుడు - ఆనందుడు

* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.

* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం - నాగార్జున కొండ విశ్వవిద్యాలయం.

* సాంచీ స్తూపం - భోపాల్, మధ్యప్రదేశ్‌

*  సారనాథ్‌ స్తూపం - ఉత్తర్‌ ప్రదేశ్‌

* భారత్‌లో అతిప్రాచీన స్తూపం - పిప్రావహ

* దక్షిణ భారతదేశంలో అతిప్రాచీన స్తూపం - భట్టిప్రోలు

బుద్ధుడి బోధనలు 

గౌతమ బుద్ధుడి బోధనలు అందరికీ సులభంగా అర్థమై, ఆచరించే విధంగా ఉంటాయి. అవి:

* బుద్ధుడు వేదాలు, బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించాడు. యజ్ఞయాగాదుల పేరుతో జంతుబలులు ఇవ్వడాన్ని ఖండించాడు.

వర్గ, వర్ణ, కుల వ్యవస్థల గురించి ప్రశ్నించాడు. ఆత్మ, బ్రహ్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు.

 మానవుడు తన స్వయంకృషి వల్లే లక్ష్యసిద్ధి పొందొచ్చని బోధించాడు. 

బుద్ధుడు నాలుగు ‘ఆర్య సత్యాలను’ బోధించాడు. 

ఎ) ప్రపంచమంతా దుఃఖమయం   బి) దుఃఖానికి కారణం కోరికలు

సి) దుఃఖం నశించాలంటే కోరికలనుజయించాలి.   డి) కోరికలను జయించాలంటే ‘అష్టాంగమార్గాన్ని’ అనుసరించాలి. 

బుద్ధుడు అతి విలాసవంతమైన, అతి పొదుపరి జీవితానికి దూరంగా ఉండి ‘మధ్యమార్గాన్ని’ అనుసరించాలని బోధించారు. 

సామాజిక పరివర్తన: బుద్ధుడు సామాజిక  ప్రవర్తనలో ప్రధాన అంశాలను బºధించాడు. అవి:  

ఇతరుల ఆస్తిని ఆశించకూడదు. 

* ఎవరినీ హింసించకూడదు.

* మత్తు పదార్థాలు ఉపయోగించకూడదు. 

* అసత్యం మాట్లాడకూడదు. 

* లంచగొండి పనులు చేయకూడదు.

* మనిషి జీవితాన్ని తనే నిర్ణయించుకుంటాడు. తాను చేసిన పనుల ప్రభావమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 

* మనిషి చేసే మంచి, చెడులు పునర్జన్మను నిర్ణయిస్తాయని బోధించాడు.

అష్టాంగ మార్గం: దుఃఖ నివారణ, మోక్ష సాధనకు బుద్ధుడు చూపిన మార్గం లేదా చెప్పిన సూత్రాలను అష్టాంగ మార్గం అంటారు. దీన్నే ‘మధ్యమార్గమని’ కూడా పిలుస్తారు. దీనిలోని ఎనిమిది సూత్రాలు:


1. సమ్యక్‌ (సరైన) వాక్కు - Right speech

2. సమ్యక్‌ (సరైన) క్రియ - Right action

3. సమ్యక్‌ (సరైన) జీవనం - Right livelihood

4. సమ్యక్‌ (సరైన) శ్రమ - Right effort

5. సమ్యక్‌ (సరైన) ఆలోచన - Right thinking

6. సమ్యక్‌ (సరైన) ధ్యానం - Right meditation

7. సమ్యక్‌ (సరైన) నిశ్చయం - Right resolve

8. సమ్యక్‌ (సరైన) దృష్టి - Right views

* ‘‘ఈ ఎనిమిది మార్గాలు పాటించే వ్యక్తి పురోహిత వర్గంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వీటిని ఎల్లప్పుడూ పాటించే వ్యక్తి ‘గమ్యాన్ని’ చేరుకుంటాడు.’’ అని బుద్ధుడు తెలిపాడు.

జైనమతం - ముఖ్యాంశాలు


కైవల్యం - మోక్షం పొందడం

గాంధారులు - వర్ధమాన మహావీరుడి 11 మంది శిష్యులు

పరిషత్‌/ సంగీతి - సమావేశం

శ్వేతాంబరులు - తెల్లటి వస్త్రం ధరించేవారు

దిగంబరులు - నగ్నంగా ఉండేవారు

సమైయాలు - జైనమతంలోని ఒక శాఖ. మహావీరుడి బోధనలు కచ్చితంగా పాటించేవారు

అంగాలు - జైనమతానికి చెందినవి

అంగుళీమాల - బొటనవేళ్లని మాలగా కుట్టి మెడలో వేసుకునేవాడు

మాదిరి ప్రశ్నలు

1. వర్ధమాన మహావీరుడి తొలి శిష్యులను ఏమంటారు?

1) భగవతీయులు    2) గాంధారులు    3) ఉత్కాలికులు     4) వైశేషికులు


2. మహావీరుడి తర్వాత జైనమతానికి నాయకత్వం వహించింది?

1) ఆర్యసుధర్మ    2) తత్వార్థిధిగమ   3) హరిభద్రసూరి   4) ఆదినాథ


3. ‘షడ్‌దర్శన సముచ్ఛయం’ గ్రంథ రచయిత ఎవరు?

1) హరిభద్రసూరి     2) ఆదినాథ    3) జయధవళ      4) కుంతలనాథ


4. ‘తర్కరహస్య దీపిక’ అనే వ్యాఖ్యానాన్ని రాసింది?

1) గుణభర   2) ఏకవీర    3) గణరత్న   4) ఆర్యసుధర్మ


5. కిందివాటిలో జైన గుహ ఏది?

1) ఖందగిరి     2) హాథిగుంపా   3) రాణినూర్‌    4) పైవన్నీ


6. ఆదినాథుడి దేవాలయం ఎక్కడ ఉంది?

1) రాజస్థాన్‌    2)  పశ్చిమ్‌ బంగా   3) బిహార్‌   4) ఒడిశా


7. శ్రావణబెళగొళలో ఉన్న బాహుబలి గోమఠేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఎవరు?

1) క్షేత్రపాలుడు    2) చాముండరాయుడు   3) చాముండనాయుడు   4) సింహబల


8. జైనమతం చరిత్రను తెలిపే గ్రంథం ఏది?

1) జమాలికథ    2)  జైనకల్పతరువు   3) రత్నమాలిక      4)  జైనకల్పసూత్రం


9. కుమారపాలుడి ఆస్థానంలో ఉన్న సుప్రసిద్ధ జైన పండితుడు ఎవరు? 

1) హేమచంద్రుడు     2) విద్యాదేవియాన్‌    3) అమోగవర్ష    4) అశ్వసేన


10. ‘త్రిపీటకాలు’ ఏ భాషలో ఉన్నాయి? 

1) పాళీ     2) అర్థమాగది   3) సంస్కృతం   4) ఏదీకాదు


11. బుద్ధుడి పూర్వజన్మ వృత్తాంతాలను ఏమంటారు?

1) నీతికథలు     2) అభూత కథలు    3) వెదళ్లు   4) జాతక కథలు 


12. బౌద్ధసంఘ అవతరణ గురించి కింది దేనిలో ప్రస్తావించారు?

1) మహావగ్గ     2) మిళిందపన్హా    3) వజ్రసూచి       4) లలితవిస్తారం 


13. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I        జాబితా - II

a) నాగసేన          i) నర్వాస్తివాదభిధర్మం 

b) అశ్వఘోష       ii)  మిళిందపన్హా 

c) ఆచార్య   నాగార్జున     iii) బుద్ధ చరిత 

d) వసుబంధు       iv) పంచవింశతి

1) a-ii, b-iii, c-iv d-    2) a-iii, b-i, c-iv d-ii     3) a-ii, b-iv, c-i d-iii     4) a-iv, b-iii, c-i d-ii 


14. కిందివాటిలో సరైనవి?

ఎ) లలితవిస్తారం పౌరాణికత ఉన్న గ్రంథం

బి) చాళుక్య శాసనాల్లో ‘హరిత’ అనే బౌద్ధదేవతల ప్రస్తావన ఉంది. 

సి) నానాఘాట్‌ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించారు.

డి) సుత్తపీటకంలో 5 నియమాలు ఉన్నాయి.

1) ఎ, బి   2) సి, డి     3) ఎ, బి, సి    4) ఎ, బి, డి


15. ‘మహావంశం’ గ్రంథ రచయిత? 

1) మహాకాయ      2)  దిఘనికాయ  3) మహానామ   4)  హేమచంద్

16. నాయపుత్త, దేహదిన్న అనేవి ఎవరి బిరుదులు?

1)  పార్శ్వనాథ      2) నేమినాథ    3)  గౌతమబుద్ధ       4)  వర్ధమాన మహావీర


17. వర్ధమాన మహావీరుడి అన్న పేరు ఏమిటి?

1) ఆనందవర్ధనుడు     2) నందివర్ధనుడు      3)  విష్ణువర్ధనుడు    4)  ఆర్యవర్ధనుడు


18. పంచవ్రతాలు ఏ మతానికి చెందినవి?

1) బౌద్ధమతం     2)  జైనమతం    3) హిందూమతం     4)   చార్వాక


19. ‘జైనకల్ప సూత్రం’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?

1) భద్రబాహు   2)  స్థూలబాహు   3) హేమచంద్ర     4) చాముండరాయ


20. జైనమతాన్ని స్వీకరించిన సుప్రసిద్ధ మౌర్య చక్రవర్తి ఎవరు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) అశోకుడు   3) బింబిసార   4) పైవన్నీ


సమాధానాలు

1-2  2-1  3-1  4-3  5-4  6-1 7-2  8-4  9-1  10-1  11-4  12-1  13-1  14-4  15-3  16-4  17-2  18-2  19-1  20-1.

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌