• facebook
  • whatsapp
  • telegram

క్యాలెండర్‌ - అదనపు రోజుల అనువర్తనాలు

తీసేస్తే గతం.. కలిపితే భవిష్యత్తు!

  రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ వాటిపై రీజనింగ్‌లో వచ్చే ప్రశ్నలు కొంత తికమక పెట్టేస్తుంటాయి. పరీక్షలో సమయాన్నీ వృథా చేసేస్తాయి. కానీ చిన్న గణిత ప్రక్రియ తర్వాత వచ్చే శేషాన్ని అడిగిన ప్రశ్ననుబట్టి కలిపినా, తీసేసినా సమాధానం వచ్చేస్తుందనే సూత్రాన్ని తెలుసుకుంటే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.  

* వారానికి రోజులు  7

* ఇచ్చిన రోజులను 7తో భాగిస్తే వచ్చే శేషాన్ని విషమ దినాలు లేదా అదనపు రోజులు అంటారు.

ఉదా 1: 38 రోజులకు గల అదనపు రోజులు ఎన్ని?

సాధన:

 ఇక్కడ 5 అనేది వారాల సంఖ్యను, 3 అనేది అదనపు రోజులను తెలియజేస్తుంది.

ఉదా 2: 145 రోజులకు గల అదనపు రోజులు ఎన్ని?

సాధన:

 20 వారాలు, 5 అదనపు రోజులు ఉన్నాయి

ఉదా 3: 365 రోజులకు గల అదనపు రోజులు ఎన్ని?

సాధన:

 52 వారాలు, ఒక అదనపు రోజు ఉన్నాయి.

గమనిక: 

* సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఇందులో 52 వారాలు, ఒక అదనపు రోజు ఉంటుంది.

* లీపు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. వీటిలో 52 వారాలు, 2 అదనపు రోజులు ఉంటాయి.

మాదిరి ప్రశ్నలు

1. ఈరోజు ఆదివారం అయితే 45 రోజుల తర్వాత ఏ వారం?

1) గురువారం   2) బుధవారం   3) మంగళవారం   4) శనివారం

జవాబు: 2

సాధన: 45 రోజుల్లో ఉండే వారాలు, అదనపు రోజులను కనుక్కోవాలి

 ఆదివారం + 3 = బుధవారం

2. ఈరోజు మంగళవారం అయితే 78 రోజుల తర్వాత ఏ వారం?

1) మంగళవారం   2) సోమవారం   3) గురువారం   4) బుధవారం

జవాబు: 4

సాధన: ముందుగా 78 రోజుల్లోని వారాలు, అదనపు రోజుల సంఖ్యను కనుక్కోవాలి

 మంగళవారం +1 = బుధవారం

3. ఈరోజు గురువారం అయితే 44 రోజుల క్రితం ఏ వారం?

1) మంగళవారం  2) గురువారం  3) శనివారం  4) ఆదివారం

జవాబు: 1

సాధన: 

 గురువారం - 2 = మంగళవారం

4. ఈరోజు శనివారం అయితే 101 రోజుల క్రితం ఏ వారం?

1) ఆదివారం   2) మంగళవారం  3) బుధవారం  4) శనివారం

జవాబు: 3

సాధన: 

 శనివారం - 3 = బుధవారం

5. ఈరోజు శనివారం అయితే 58వ రోజు ఏ వారం?

1) బుధవారం  2) ఆదివారం  3) శుక్రవారం  4) సోమవారం

జవాబు: 2

సాధన: 

శనివారం + (2 - 1) = ఆదివారం

6. ఈరోజు బుధవారం అయితే 93వ రోజు ఏ వారం అవుతుంది?

1) గురువారం  2) శుక్రవారం  3) శనివారం  4) సోమవారం

జవాబు: 1

సాధన: 

బుధవారం + (2 - 1) = గురువారం

గమనిక

* ప్రశ్నలో తర్వాత రోజు కనుక్కోమన్నప్పుడు శేషాన్ని కలపాలి.

* ప్రశ్నలో క్రితం రోజు కనుక్కోమన్నప్పుడు శేషాన్ని తీసివేయాలి.

* ప్రశ్నలో ‘వ రోజు’ కనుక్కోమన్నప్పుడు శేషానికి ఒకటి తగ్గించి కలపాలి.

సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడం

* లీపు సంవత్సరం తర్వాతి సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి 6 కలపాలి.

* లీపు సంవత్సరం తర్వాతి 2, 3వ సంవత్సరాలను పోలిన సంవత్సరాలను కనుక్కోవడానికి 11 కలపాలి.

* లీపు సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి 28 కలపాలి.

7. 2021వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం తిరిగి వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది?

1) 2026  2) 2027   3) 2028  4) 2030

జవాబు: 2

సాధన: 

అదనపు రోజుల మొత్తం అనేది 7 యొక్క గుణిజం వచ్చే వరకు పై విధానాన్ని కొనసాగించాలి

అదనపు రోజుల మొత్తం = 1 +1 + 2 + 1 + 1 + 1 = 7

 2021వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం 2027లో వస్తుంది.

సంక్షిప్త పద్ధతి

2021 అనేది లీపు సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం కాబట్టి దీన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి 6 కలపాలి.

2021 + 6 = 2027

8.1996వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం తిరిగి వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది?

1) 2024   2) 2028  3) 2020  4) 2032

జవాబు: 1

సాధన: 1996 అనేది లీపు సంవత్సరం కాబట్టి దీనికి 28 కలపాలి

1996 + 28 = 2024

9. 2026వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం తిరిగి వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది?

1) 2030  2) 2029   3) 2037  4) 2038

జవాబు: 3

సాధన: 2026 అనేది లీపు సంవత్సరం తర్వాత వచ్చే రెండో సంవత్సరం కాబట్టి 11 కలపాలి

 2026 + 11 = 2037

10. 2007వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం తిరిగి వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది?

1) 2016  2) 2020  3) 2010   4) 2018

జవాబు: 4

సాధన: 2007 అనేది లీపు సంవత్సరం తర్వాత వచ్చే మూడో సంవత్సరం కాబట్టి 11 కలపాలి.

 2007 + 11 = 2018

రచయిత: గోలి ప్రశాంత్‌రెడ్డి

Posted Date : 03-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌