• facebook
  • whatsapp
  • telegram

పౌరసత్వం - ప్రాథమిక హక్కులు

1. ప్రాథమిక హక్కుల రక్షణకు 'రిట్స్' జారీచేసే పద్ధతిని దేన్నుంచి గ్రహించారు?
: బ్రిటిష్ లా

 

2. ఏ ఆర్టికల్ లేని రాజ్యాంగం శూన్యమని, అది రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం లాంటిదని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రస్తుతించారు?
: 32

 

3. పౌరసత్వం గురించి సరైన వాటిని గుర్తించండి.
A) రాజ్యాంగంలో రెండో భాగంలో 5 - 11 ఆర్టికల్స్ వీటిని వివరిస్తాయి.
B) పౌరసత్వ చట్టాన్ని 1955లో రూపొందించారు.
C) రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని పొందుపరిచింది.
D) సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం పొందే వ్యక్తి ఎనిమిదో షెడ్యూల్‌లోని ఏదైనా ఒక భాషలో సరిపడినంత ప్రావీణ్యం కలిగి ఉండాలి.
: A, B, C, D

 

4. ''భారతదేశంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు స్థిరమైన తాత్వికతను కలిగిలేవు'' అని పేర్కొన్నది ఎవరు?
జ: ఐవర్ జెన్నింగ్స్

5. కింద పేర్కొన్న ఏ పద్ధతుల్లో భారతదేశ పౌరసత్వాన్ని ఆర్జించవచ్చు/ పొందవచ్చు?
A) పుట్టుక ద్వారా B) వారసత్వం ద్వారా  C) రిజిస్ట్రేషన్ ద్వారా D) సహజీకృత పద్ధతి ద్వారా
E) భూభాగ విలీనం ద్వారా
జ: పైవన్నీ

 

6. ఆర్టికల్ 28లో పేర్కొన్న కింది ఏ సంస్థల్లో మతబోధనకు అనుమతి ఉంది?
: ధర్మాదాయ/ ట్రస్ట్ స్థాపించిన, రాజ్య పోషణలో ఉన్న సంస్థలు

 

7. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశాన్ని ఏవిధంగా పేర్కొంటోంది?
: ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్
8. కింది ప్రాథమిక హక్కులను, సంబంధిత ఆర్టికల్స్‌తో జతపరచండి.
A) ఆర్టికల్ 14               1) అంటరానితనం నిషేధం                  
B) ఆర్టికల్ 17               2) అల్పసంఖ్యాక వర్గాల వారి రక్షణ
C) ఆర్టికల్ 21(A)         3) చట్టం ముందు సమానత్వం     
D) ఆర్టికల్ 29              4) ప్రాథమిక విద్యను పొందే హక్కు
: A-3, B-1, C-4, D-2

9. 'హిందుత్వం అనేది భారత ఉపఖండంలోని ప్రజల జీవన విధానం' అని సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పులో పేర్కొంది?
: మనోహర్ జోషి కేసు (1995)

 

10. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కింది ఏ పద్ధతుల్లో పౌరసత్వం రద్దవుతుంది?
1) పరిత్యాగం ద్వారా (By Renunciation)           

2) సమాపనం ద్వారా (By Termination)
3) విహీనత ద్వారా (By Deprivation)               

4) పైవన్నీ
: 4 ( పైవన్నీ)

 

11. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి?
జ: 6

 

12. కిందివాటిలో ఆస్తిహక్కుకు సంబంధించి తప్పుగా పేర్కొన్నది ఏది?
1) ఇది ఆర్టికల్స్ 19 (1) (f), 31 లలో ఉండేది.
2) దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా (1978లో) ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
3) దీన్ని XII వ భాగంలో ఆర్టికల్ 300 A లో చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు.
4) ఈ హక్కుకి భంగం కలిగితే, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
జ: 4 (ఈ హక్కుకి భంగం కలిగితే, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.)

13. భారత భూభాగంలో ఏ ప్రాంతంలోనైనా సైనిక పాలన ప్రకటించినప్పుడు పార్లమెంట్ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చని తెలిపే ఆర్టికల్ ఏది?
: 34

 

14. ఆర్టికల్స్ 32, 226 ప్రకారం రిట్లను జారీచేసే అధికారం ఎవరికి ఉంది?
: సుప్రీంకోర్టు, హైకోర్టు

 

15. ప్రాథమిక హక్కుల గురించి సరైన వాటిని గుర్తించండి.
A) అమెరికా రాజ్యాంగం నుంచి వీటిని గ్రహించారు.
B) రాజ్యాంగం మూడో భాగంలో ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు వీటిని పేర్కొన్నారు.
C) వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంది.
D) రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి, నిరంకుశ పాలనను నిరోధిస్తాయి.
జ: A, B, C, D

 

16. పార్లమెంట్ చేసిన వివిధ నిర్బంధ నిరోధక చట్టాలను, సంబంధిత సంవత్సరాలతో జతపరచండి.
A) 1974 1) బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం
B) 1980 2) విదేశీమారక మార్పిడి, దొంగ వ్యాపార నిరోధక నిర్వహణ చట్టం (COFEPOSA)
C) 1986 3) Immoral Traffic (Prevention) Act
D) 1956 4) జాతీయ భద్రతా చట్టం
: A-2, B-4, C-1, D-3

17. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి (AFSPA) వ్యతిరేకంగా గత 16 సంవత్సరాలుగా నిరాహారదీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిళ ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారు?
: ఆగస్ట్ 9న దీక్ష విరమించి, ఎన్నికల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించింది

 

18. సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగానే పరిగణించాలని పేర్కొంది?
: మోహిని జైన్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక

 

19. సైనికులకు నిషిద్ధమైన ప్రాథమిక హక్కు ఏది?
: సంఘాలను ఏర్పరుచుకునే హక్కు

 

20. కిందివాటిలో స్వేచ్ఛా హక్కుల జాబితాలో లేనిది?
1) భావ ప్రకటన హక్కు
2) పనికి వేతనం పొందే హక్కు
3) స్థిరనివాస హక్కు
4) సంచార హక్కు
: 2 ( పనికి వేతనం పొందే హక్కు )

 

21. కింద పేర్కొన్న ఏ రాష్ట్ర ప్రజలకు స్థిర నివాసం, స్థిరాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది?
: జమ్మూ, కశ్మీర్

22. కిందివాటిలో తప్పుగా పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) ఆర్టికల్ 28 - అల్పసంఖ్యాక వర్గాలవారి పరిరక్షణ
2) ఆర్టికల్ 16 - ప్రభుత్వోద్యోగాల విషయంలో సమానావకాశాలు
3) ఆర్టికల్ 18 - బిరుదుల రద్దు
4) ఆర్టికల్ 23 - వెట్టిచాకిరీ నిషేధం
: 1 (ఆర్టికల్ 28 - అల్పసంఖ్యాక వర్గాలవారి పరిరక్షణ )

 

23. 'ఏ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు అభియోగానికి, శిక్షకు గురిచేయకూడదు' - దీన్ని ఏమంటారు?
: No Double Jeopardy

 

24. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రద్దుకాని ఆర్టికల్స్ ఏవి?
జ: 20, 21

 

25. కిందివాటిలో సరైంది గుర్తించండి.
A) కేశవానంద భారతి కేసులో (1973) రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
B) మినర్వా మిల్స్ కేసులో (1980) ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది.
: A, B

26. 'సాయుధ దళాలు, పారామిలటరీ దళాలు, పోలీసు వర్గాలకు, అత్యవసర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను పరిమితం చేయవచ్చు లేదా తీసివేయవచ్చు' - అని తెలిపే ఆర్టికల్ ఏది?
: 33

 

27. కింది అంశాలను జతపరచండి:
A) స్వేచ్ఛా హక్కు                  1) బిరుదుల రద్దు
B) సమానత్వపు హక్కు        2) బాలకార్మిక వ్యవస్థ నిషేధం
C) పీడన నిరోధ హక్కు          3) పత్రికా స్వేచ్ఛ
D) మతస్వాతంత్రపు హక్కు   4) మతనిర్వహణ స్వేచ్ఛ
: A-3, B-1, C-2, D-4

 

28. సమాచారహక్కు చట్టాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పొందుపరిచారు?
జ: 19

 

29. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
A) 'చట్టం ముందు సమానత్వం' అనే భావనకు బ్రిటిష్ రాజ్యాంగం స్ఫూర్తి.
B) 'చట్టం ముందు సమానత్వం' అనే భావనను బ్రిటిష్ న్యాయశాస్త్రవేత్త ఎ.వి.డైసీ ప్రతిపాదించిన 'సమన్యాయం' అనే సిద్ధాంతం నుంచి గ్రహించారు.
C) 'చట్టం వల్ల సమాన రక్షణ' అనే భావనకు అమెరికా రాజ్యాంగం స్ఫూర్తి.
D) చట్టం ముందు సమానత్వం - అనే భావనకు భారత రాష్ట్రపతి, గవర్నర్‌లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
: A, B, C, D

30. నిరోధక నిర్బంధం (Preventive Detention) అంటే ఏమిటి?
జ: దేశ క్షేమం దృష్ట్యా అనుమానితులను నిర్బంధంలోకి తీసుకోవడం

 

31. ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల సంరక్షణార్థం ప్రత్యేక సదుపాయాల (రిజర్వేషన్లు) కల్పనకు వీలు కల్పిస్తున్న ఆర్టికల్ ఏది?
జ: 15(4)

 

32. కింది అంశాలను జతపరచండి:
A) జీవించే హక్కు                     1) ఆర్టికల్ 19(1) (a)
B) వృత్తి స్వాతంత్య్రం                 2) ఆర్టికల్ 28
C) మత బోధనలపై నిషేధం      3) ఆర్టికల్ 19(1)g
D) వాక్ స్వాతంత్య్రం                 4) ఆర్టికల్ 21
జ: A-4, B-3, C-2, D-1

 

33. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) అస్పృశ్యత నేరం కింద శిక్షపడిన వ్యక్తి చట్టసభలకు పోటీచేయడానికి అనర్హుడవుతాడు.
2) రాష్ట్రపతి సమ్మతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి ఎలాంటి బిరుదులు స్వీకరించకూడదు.
3) ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో మౌలిక స్వరూప భాగంగా గుర్తింపు పొందాయి.
4) ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంది.
: 2 (ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంది.)

34. సుప్రీంకోర్టు కింది ఏ సంస్థలను మత సంస్థలుగా ప్రకటించింది?
A) రామకృష్ణ మిషన్               B) అరబిందో సొసైటీ               C) ఆనంద్‌మార్గ్
: A, C

 

35. దేశంలోని 6 - 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ పార్లమెంట్ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చట్టాన్ని రూపొందించింది?
జ: 86

రచయిత: టి. రామకృష్ణ

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌