• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం -  చారిత్రక నేపథ్యం

1. రాజ్యాంగ వివరణకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ప్రభుత్వ స్వరూపం, స్వభావం, జాతీయ లక్ష్యాలు, ఆశయాలను వివరిస్తుంది.

బి) దేశప్రజలు, పాలకులు అనుసరించాల్సిన నియమ-నిబంధనలను వివరిస్తుంది.

సి) ప్రభుత్వం పనిచేసే విధానాన్ని వివరిస్తుంది.

డి) దేశ పరిపాలనను వివరించే అత్యున్నత శాసనంగా కొనసాగుతుంది.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి   3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 4


2. రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ప్రపంచంలో రాజ్యాంగం కలిగిన తొలి దేశం - బ్రిటన్‌.

బి) బ్రిటన్‌ దేశానికి ‘లిఖిత’ (written)  రాజ్యాంగం లేదు.

సి) ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం - అమెరికా.

డి) ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం - భారత్‌.

1) ఎ, బి, డి      2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4)  పైవన్నీ

జ: 4


3. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) రాజ్యాంగం అనే భావనను తొలిసారి శాస్త్రీయంగా ప్రతిపాదించింది - అరిస్టాటిల్‌

బి) ‘పాలిటిక్స్‌’ అనే గ్రంథాన్ని రాసింది   - అరిస్టాటిల్‌.

సి) అరిస్టాటిల్‌ 158 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు.

డి) అమెరికా శాసనవ్యవస్థ ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా శాసనాలను రూపొందిస్తుంది.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి   3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 2


4. ‘‘వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన ఉత్తమమైంది’’ అని ఎవరు పేర్కొన్నారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌      2) మానవేంద్రనాథ్‌ రాయ్‌      3) అరిస్టాటిల్‌     4) హెచ్‌.జె.లాస్కి

జ: 3


5. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టంగా దేన్ని పేర్కొంటారు?

1) ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు  - 1600, డిసెంబరు 31

2)  మద్రాస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు - 1687    

3)రెగ్యులేటింగ్‌ చట్టం - 1773   4) భారత ప్రభుత్వ చట్టం - 1935

జ: 3


6. బి.సి.రావత్‌ అనే రాజనీతిజ్ఞుడు పేర్కొన్న భారత రాజ్యాంగ చారిత్రక పరిణామ క్రమాన్ని (6 దశలు) గుర్తించండి.

1) మొదటి దశ: 16001773,    రెండో దశ: 17731858

2) మూడో దశ: 18581909, నాలుగో దశ: 19091935

3) అయిదో దశ: 19351947,  ఆరో దశ: 19471950

4) పైవన్నీ

జ: 4


7. ఈస్టిండియా కంపెనీ అవినీతి, అక్రమాల నియంత్రణకు ‘రెగ్యులేటింగ్‌ చట్టం 1773’ని రూపొందించారు. దీన్ని ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేశారు?

1) జనరల్‌ బుర్గోయిన్‌    2) ఫిలిప్‌ ఫ్రాన్సిస్‌      3) జాన్‌ పీటర్సన్‌    4) చార్లెస్‌ మెట్‌కాఫ్‌

జ: 1


8. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఈ చట్టం రూపకల్పనలో నాటి బ్రిటన్‌ ప్రధాని లార్డ్‌నార్త్‌ కీలకపాత్ర పోషించారు.

బి) బెంగాల్‌ గవర్నర్‌ హోదాను బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా మార్చారు.

సి) భారత్‌లో వికేంద్రీకరణ పాలనకు ఆంగ్లేయులు పునాదులు వేశారు.

డి) ఈస్టిండియా కంపెనీ అధికారుల వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలను నిషేధించారు.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి   3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ: 3


9. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ప్రకారం గవర్నర్‌ జనరల్‌కి పరిపాలనలో సహకరించేందుకు కార్యనిర్వాహక మండలి (Executive council)  ని ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులుగా నియమితులైనవారు ఎవరు?

1)  క్లావెరింగ్, బాల్‌వెల్‌      2) ఫిలిప్‌ ఫ్రాన్సిస్‌     3) మాన్‌సన్‌     4) పైవారంతా

జ: 4


10. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ప్రకారం బొంబాయి, మద్రాస్‌ ప్రెసిడెన్సీల గవర్నర్‌లను ఎవరి నియంత్రణలోకి తెచ్చారు?

1) బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌       2) బ్రిటిష్‌ పార్లమెంట్‌      3) సుప్రీంకోర్టు   4) గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

జ: 1


11. 1774లో కలకత్తాలోని పోర్ట్‌విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?

1) సర్‌ ఎలిజా ఇంఫే   2) బార్నెస్‌ పీకాక్‌   3) సర్‌ మారిస్‌ గ్వేయర్‌    4) థామస్‌ మన్రో

జ: 1


12. పిట్స్‌ ఇండియా చట్టం, 1784కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) అప్పటి బ్రిటన్‌ ప్రధాని విలియం పిట్‌ జూనియర్‌ సూచన మేరకు ఈ చట్టాన్ని రూపొందించారు.

బి) ఈ చట్టం చేసే సమయంలో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వారెన్‌ హేస్టింగ్స్‌ ఉన్నారు.

సి) గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలోని సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కి తగ్గించారు.

డి) బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవిని భారతదేశ గవర్నర్‌ జనరల్‌ పదవిగా మార్చారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి         3) ఎ, బి, సి     4) పైవన్నీ

జ: 3


13. పిట్స్‌ ఇండియా చట్టం, 1784 కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఈస్టిండియా కంపెనీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు.

బి) ఈస్టిండియా కంపెనీ వర్తక, వాణిజ్య వ్యవహారాలను నియంత్రించేందుకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు.

సి) కలకత్తాలో తొలిసారి హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.

డి) గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కల్పించారు.

1) ఎ, సి, డి     2) ఎ, బి, డి    3) ఎ, బి, సి      4) పైవన్నీ

జ: 2


14. గవర్నర్‌ జనరల్‌కు కౌన్సిల్‌ తీర్మానాలపైవీటో అధికారాన్ని (veto power)  ఏ చట్టం ద్వారా కల్పించారు?

1) రెగ్యులేటింగ్‌ చట్టం, 1773    2) సెటిల్‌మెంట్‌ చట్టం, 1781    3) పిట్స్‌ ఇండియా చట్టం, 1784   4) చార్టర్‌ చట్టం, 1793

జ: 4


15. బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌లోని సభ్యుల జీతభత్యాలను భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లిస్తామని ఏ చట్టం ద్వారా పేర్కొన్నారు?

1) చార్టర్‌ చట్టం, 1793    2) చార్టర్‌ చట్టం, 1813    3) చార్టర్‌ చట్టం, 1833     4) పిట్స్‌ ఇండియా చట్టం, 1784

జ: 1


16. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? (చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహా)

1) సెటిల్‌మెంట్‌ చట్టం, 1781    2) చార్టర్‌ చట్టం, 1793     3) చార్టర్‌ చట్టం, 1813    4) చార్టర్‌ చట్టం, 1833

జ:3


17. భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించిన చట్టం ఏది?

1) పిట్స్‌ ఇండియా చట్టం, 1784     2) చార్టర్‌ చట్టం, 1813    3) చార్టర్‌ చట్టం, 1793    4) చార్టర్‌ చట్టం, 1833

జ: 2

మరికొన్ని..


1. చార్టర్‌ చట్టం, 1833కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఈస్టిండియా కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి, దాన్ని పరిపాలనా సంస్థగా మార్చారు.

బి) తేయాకు, చైనాతో వ్యాపారాన్ని కూడా ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యం నుంచి తొలగించారు.

సి) యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు అవకాశం కల్పించారు.

డి) భారతదేశంలో బానిసత్వాన్ని రద్దుచేశారు.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి      3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 1


2. చార్టర్‌ చట్టం, 1853 కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఈస్టిండియా కంపెనీ పాలనాకాలంలో ప్రవేశపెట్టిన చిట్టచివరి చార్టర్‌ ఇది.

బి) శాసనాల రూపకల్పనకు సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.

సి) గవర్నర్‌ జనరల్‌ అధికార విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు.

డి) ఈస్టిండియా కంపెనీకి మరో 20 ఏళ్లు భారత్‌లో వ్యాపార, వర్తక అనుమతులను కల్పిస్తూ నిర్ణయించారు.

1) ఎ   2) సి     3) ఎ, బి, సి    4) పైవన్నీ

జ: 3


3. కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో స్థానిక ప్రతినిధులకు మొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని కల్పించిన చట్టం ఏది?

1) చార్టర్‌ చట్టం, 1853     2) చార్టర్‌ చట్టం, 1833     3) చార్టర్‌ చట్టం, 1813    4) సెటిల్‌మెంట్‌ చట్టం, 1781

జ: 1


4. విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలను చేపడుతున్నట్లు ఎప్పుడు ప్రకటించారు?

1) 1858, నవంబరు 1    2) 1857, నవంబరు 1    3) 1859, నవంబరు 1     4) 1860, నవంబరు 1

జ: 1


5. భారతప్రభుత్వ చట్టం, 1858కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయ్యింది.

బి) లండన్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు.

సి) భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సహకరించేందుకు 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.

డి) ఈ చట్టాన్ని ‘గుడ్‌ గవర్నెన్స్‌ ఇన్‌ ఇండియా’గా పేర్కొన్నారు.

1) ఎ, బి     2) ఎ, డి     3) బి, సి     4) పైవన్నీ

జ: 4 

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌