• facebook
  • whatsapp
  • telegram

నిరూపక జ్యామితి 

మోడల్‌ - I : A (x1, y1) B (x2, y2) AB రేఖా ఖండాన్ని బిందువు  P(x, y) అంతరంగా  m1: m2  నిష్పత్తిలో విభజిస్తుందని అనుకొంటే
 

ఉదాహరణ: బిందువులు A (-6, 10), B (3, -8) లచే ఏర్పడే రేఖాఖండాన్ని బిందువు (-4, 6) ఏ నిష్పత్తిలో విభజిస్తుంది?

1) 2 : 7              2) 7 : 2             3) 3 : 5               4) 5 : 3 

సాధన: తితీ రేఖా ఖండాన్ని బిందువు (-4, 6) అంతరంగా m1 : m2  నిష్పత్తిలో విభజిస్తుందని అనుకొంటే 


మోడల్‌ - II

A(x1, y1) B(x2, y2) C(x3, y3) శీర్షాలుగా ఉన్న త్రిభుజ వైశాల్యం 

= 1/2  |x1 (y2 - y3) + x2 (y3 - y1) + x3 (y1 - y2)|

ఉదాహరణ: బిందువులు (1, - 1) (-4, 6) (-3, - 5) శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోండి?

1) 14 చ.మీ.              2) 24 చ.మీ.            3) 18 చ.మీ.            4) 28 చ.మీ.

సాధన: ∆ABC  త్రిభుజ శీర్షాలు  A(1, -1) B (-4, 6) C (-3, -5) లు అనుకుంటే దాని వైశాల్యం కనుక్కోడానికి సూత్రం.

= 1/2  |x1 (y2 - y3) + x2 (y3 - y1) + x3 (y1 - y2)| 

= 1/2  |1 (6 - (-5) -4 (-5 - (-1) -3 ( -1 - 6)|

= 1/2  |1 (6 + 5) - 4 (-5 + 1) - 3(-7)| 

= 1/2  |1 (11) -4 (-4)-3 (-7)| 

= 1/2  |11 + 16 + 21| 

= 1/2  |48| ⇒ 48/2  ⇒ 24 చ.మీ.

సంక్షిప్త పద్ధతి:

 


మోడల్‌ - III

A(x1, y1), B(x2, y2) C(x3, y3) D(x4, y4 లు ఒక చతుర్భుజం యొక్క శీర్షాలు అయితే దాని వైశాల్యం కనుక్కోడానికి సూత్రం. 

= 1/2 |x1 (y2 - y4) + y2 (y3 - y1) + x3 (y4 - y2) + x4 (y1 - y3)| 


ఉదాహరణ: బిందువులు A(-5, 7), B(- 4, - 5) C(-1,- 6), D(4, 5) లు ఒక చతుర్భుజం యొక్క శీర్షాలు అయితే వైశాల్యం కనుక్కోండి?

1) 52 చ.మీ.       2) 62 చ.మీ.        3) 72 చ.మీ.         4) 82 చ.మీ.

సాధన: చతుర్భుజ భుజాలు  A(-5, 7) B(-4, -5) C(-1, -6), D(4, 5) వైశాల్యం కనుక్కోడానికి సూత్రం

= 1/2 |x1 (y2 - y4) + y2 (y3 - y1) + x3 (y4 - y2) + x4 (y1 - y3)|

= 1/2 | - 5 (-5 -5) - 4 (−6 -7) - 1 (5 - (-5))  + 4 (7- (- 6))|

= 1/2 | -5 (-10) - 4(-13) - 1 (5 + 5) + 4 (7 + 6)|

= 1/2 | 50 + 52 - 10 + 52| 


మోడల్‌ - IV
A(x1, y1)  బిందువు గుండా వెళుతూ  m వాలు కలిగిన సరళరేఖ సమీకరణం  (y - y1) = m (x - x1
ఉదాహరణ: (-2, 3) బిందువు గుండాపోతూ 3/4 వాలు కలిగిన సరళరేఖ సమీకరణం కనుక్కోండి?
1) 3x - 4y + 18 = 0           2) 4x - 3y + 18         3)  2x + 6y + 14                4) 4x + 2y + 9 = 0 

సాధన:  (-2, 3) బిందువు గుండాపోతూ ౌ వాలు కలిగిన సరళరేఖ సమీకరణం కనుక్కోడానికి సూత్రం 
(y - y1) = m (x - x1)
(y - 3) = 3/4 ( x - (-2)) 
4(y - 3) = 3 (x + 2) ⇒ 4y - 12 = 3x + 6
3x - 4y + 6 + 12 = 0
3x - 4y + 18 = 0 

సంక్షిప్త పద్ధతి: 
3/4,  (-2, 3), 3x - 4y = 3(-2) - 4(3) 
3x - 4y = -6 -12 ⇒ 3x - 4y + 18 = 0 

లవం x, హారం y


మోడల్‌ - V
A(x1, y1) B(x2, y2బిందువుల గుండా వెళ్లే సరళరేఖ సమీకరణం  (x - x1) (y2 - y1) = (y - y1) (x2 - x1)
ఉదాహరణ: (2, -3) (4, -7)  బిందువుల గుండా వెళ్లే సరళరేఖ సమీకరణం కనుక్కోండి?
1) 2x + y - 1= 0            2) x + 2y - 1 = 0    3) 2x - y + 1 = 0         4) x - 2y + 1 = 0 

సాధన:  (2, -3) (4, - 7) బిందువుల గుండావెళ్లే సరళరేఖ సమీకరణాన్ని కనుక్కునేందుకు సూత్రం
(x - x1) (y2 - y1) = (y - y1) (x2 - x1)
(x - 2) (-7 - (-3))  = (y - (-3)) (4-2)
(x - 2) (-7 + 3) = (y + 3) (2)
(x - 2) (-4) = (y + 3) (2)
4x + 8 = 2y + 6
4x + 2y + 6 - 8 = 0
4x + 2y - 2 = 0 ⇒ 2x + y -1 = 0 


సంక్షిప్త పద్ధతి: 

4x + 2y = 4(2) + 2 (-3)
4x + 2y = 8 - 6 ⇒ 4x + 2y - 2 = 0
2x + y - 1 = 0

 

మోడల్‌ - VI

A(x1, y1) B (x2, y2) బిందువుల గుండావెళుతూ (x, y) బిందువులకు లంబంగా ఉండే సరళరేఖ సమీకరణం 

ఉదాహరణ:  A(2, -5) B(4, -6) బిందువు గుండావెళుతూ  (-1, 3) బిందువుకు లంబంగా ఉండే సరళరేఖ సమీకరణం కనుక్కోండి?
1) x - 2y + 5 = 0            2)  2x - y + 5 = 0         3) x + 2y + 5          4) 2x + y - 5 = 0 

సాధన: A(x1, y1) B (x2, y2) బిందువు గుండా వెళ్లే సరళరేఖ సమీకరణానికి సూత్రం
(x - x1) (y2 - y1) = (y - y1) (x2 - x1)
(x - 2) (-6 - (-5)) = (y - (-5) (4 - 2)
(x - 2) (-6 + 5) = (y + 5) (2)
(x - 2) (-1) = (y + 5) (2)
-x + 2 = 2y + 10 ⇒ x + 2y + 10 - 2 = 0
x + 2y + 8 = 0
 దీనికి లంబంగా ఉండే 2x - y + k = 0 సమీకరణం  (-1, 3)  గుండావెళుతుంది
2(-1) - 3 + k = 0 ⇒ k = 5 

అప్పుడు లంబంగా ఉండే సమీకరణం  2x - y + 5 = 0 

సంక్షిప్త పద్ధతి: 

⇒ 2x - y = 2(-1) - 3
2x - y + 5 = 0

 

మోడల్‌ -  VII 

ఉదాహరణ:  2x + 3y + 7 = 0 సమీకరణానికి సమాంతరంగా ఉంటూ (5, 4) బిందువు గుండావెళ్లే సమీకరణాన్ని కనుక్కోండి?
1) 2x - 3y - 22 = 0              2) 3x - 2y - 22 = 0    
3) 2x + 3y - 22 = 0             4) 3x + 2y - 22 = 0 

సాధన: 2x + 3y + 7 = 0 కు సమాంతరంగా ఉండే సమీకరణం 2x + 3y + k = 0 (5, 4) బిందువు గుండావెళుతుంది. 
2 (5) +3 (4) + k = 0
10 + 12 + k = 0  ⇒ k = - 22 

కావలసిన సమీకరణం   2x + 3y - 22 = 0 
ఉదాహరణ: A(2, -5) B(4, -6) బిందువుల గుండావెళ్లే  (-1, 3)  బిందువుకు సమాంతరంగా ఉండే సరళరేఖ సమీకరణం కనుక్కోండి?
1) x + 2y - 5 = 0          2) 2x + y - 5 = 0           
3) 3x + 2y + 1 = 0       4) x - 2y + 5 = 0 

సాధన:  A(x1, y1)  B(x2, y2) బిందువుల గుండావెళ్లే సరళరేఖ సమీకరణం 
(x - x1) (y2 - y1) = (y - y1) (x2 - x1)
(x - 2) (-6 - (-5)) = (y - (-5)) (4 - 2)
(x - 2) (-6 - (-5) = (y + 5) (2)
(x - 2) (-1) = (y + 5) 2
-x + 2 = 2y + 10
x + 2y + 10 - 2 > 0
x + 2y + 8 = 0
 దీనికి సమాంతరంగా ఉండి (-1, 3)  బిందువు గుండావెళుతుంది.
x + 2y + k > 0
-1 + 2(3) + k > 0  
⇒ k = - 5
x + 2y - 5 = 0

Posted Date : 10-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌