• facebook
  • whatsapp
  • telegram

పాచిక‌లు

పాచిక అనేది ఒక త్రిజామితీయ భౌతిక వస్తువు. ఇది ఘన లేదా దీర్ఘ ఘనాకారంలో ఉంటుంది. దీనికి గల ఆరు సమతలాలపై అక్షరాలు, అంకెలు లేదా గుర్తులు ఉంటాయి. వీటి ఆధారంగానే సమస్యలను అడుగుతారు. వీటిలో మూసి ఉంచిన పాచిక (Closed dice) తెరచి ఉంచిన పాచికల (Open dice) సమస్యలు ఉంటాయి.

మూసి ఉంచిన పాచిక 

    ఈ పాచికలు రెండు రకాలు. అవి:   

    1. స్థిర పాచిక   

    2. సాధారణ పాచిక


స్థిర పాచిక: పాచికకు ఉన్న 6 తలాల్లో ఏవైనా రెండు ఎదురెదురు తలాలపై ఇచ్చిన అంకెలు లేదా చుక్కల మొత్తం 7 అవ్వాలి. ఏవైనా రెండు పక్కతలాల మొత్తం 7 కాకూడదు.
ఉదా:        

       ఎదురు తలాలు 
        1 ⇔ 6

        2 ⇔ 5

        3 ⇔ 4


   ∴ 1 + 6 = 2 + 5 = 3 + 4 = 7
    రెండు పక్కతలాల మొత్తం ¹ 7.
 

సాధారణ పాచిక: ఎదురెదురు తలాల మొత్తం 7 కాకుండా, ఏవైనా రెండు పక్కతలాల మొత్తం 7 అయితే దాన్ని సాధారణ పాచిక అంటారు.
ఉదా: 

       ఎదురు తలాలు 
        1 ⇔ 3
        2 ⇔ 6
        4 ⇔ 5


   ∴ 1 + 3  7, 2 + 6  7, 4 + 5 ≠ 7


మాదిరి సమస్యలు


1.  ఇచ్చిన పాచికలో 5కు ఎదురు తలంపై ఉన్న అంకె ఎంత?

సాధన: పక్కతలాల మొత్తం 1 + 3 = 4 ¹ 7
                          3 + 5 = 8 ¹ 7
                          5 + 1 = 6 ¹ 7
    కాబట్టి ఇచ్చిన పాచిక స్థిర పాచిక.
    స్థిర పాచికలో ఎదురెదురు తలాల మొత్తం = 7
   ∴  5 ⇔ 2   (∵ 5 + 2 = 7)


2. పాచికలో 2కు ఎదురు తలంపై ఉన్న అంకె?

సాధన: 2 + 5 = 7 పక్క తలాల మొత్తం 7 కాబట్టి ఇది సాధారణ పాచిక.
    2కు 4, 5 లు పక్కతలాలు కాబట్టి 2 కు ఎదురు తలాలు 1, 3, 6 లలో ఏదైనా కావచ్చు.

    ఈ రెండు పాచికలను దొర్లించినప్పుడు అవి పటంలో చూపిన విధంగా ఉంటే 2కు ఎదురు తలం ఏది?
సాధన: ఈ రెండు స్థితుల్లో ఉమ్మడిగా ఏ తలమూ లేదు. కాబట్టి 2కు ఎదురుతలంగా 4, 6 మినహా 1, 3,  5లు కావచ్చు.

         
            ఇచ్చిన పాచికలో ఎదురెదురు తలాలు ఏవి?
సాధన:  a కు ఎదురు తలాలు 
m/n/p
        b కు ఎదురు తలాలు 
 m/n/p
        c కు ఎదురు తలాలు 
 m/n/p 

 

పాచికల నియమాలు


రూల్‌ 1: ఇచ్చిన పాచిక రెండు స్థానాల్లో కేవలం ఒక అంకె మాత్రమే ఉమ్మడిగా ఉండి అది ఎదురెదురు తలం అయితే అక్కడ లేని అంకె ఉమ్మడి అంకెకు ఎదురు తలం అవుతుంది.
ఉదా:


    ఇచ్చిన పాచికల్లో ఉమ్మడి అంకె 5 కాబట్టి 

    ఈ రెండు స్థానాల్లో లేని అంకె 1

     ∴  5 ⇔ 1


రూల్‌ 2: ఇచ్చిన పాచిక రెండు స్థానాల్లో రెండు అంకెలు ఉమ్మడిగా ఉంటే, ఆ రెండింటినీ తొలగించగా మిగిలిన రెండు అంకెలు ఒకదానికొకటి ఎదురెదురు తలాలు అవుతాయి.
ఉదా:

ఉమ్మడి అంకెలు 1, 6 లను మినహాయిస్తే మిగిలిన 2, 4 లు ఎదురెదురు తలాలు అవుతాయి. 

∴  2 ⇔ 4


రూల్‌ 3: ఇచ్చిన పాచిక రెండు స్థానాల్లో కేవలం ఒక అంకె మాత్రమే ఉమ్మడిగా ఉంటే రూల్‌ 1 మాదిరి అక్కడ లేని అంకె ఆ ఉమ్మడి అంకెకు ఎదురు తలంలో ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఉమ్మడి అంకెలు, పక్కతలాలు అవుతాయి.
ఉదా:

∴  3 ⇔ 6

(3కు ఎదురుతలం 6)


రూల్‌ 4: పాచిక యొక్క 3 స్థానాలు ఇస్తే ఆ మూడింటిలో ఉమ్మడిగా ఉన్న అంకె అక్కడ లేని అంకెకు ఎదురు తలం అవుతుంది.

ఉదా:


    ఈ పాచిక మూడు స్థానాల్లో ఉమ్మడిగా ఉన్న అంకె 3. ఈ మూడింటిలో లేని అంకె 4. కాబట్టి 3కు ఎదురుతలం 4 అవుతుంది.

∴  3 ⇔ 4
    గమనిక: నాలుగు స్థానాలిస్తే ఏవైనా మూడింటిని తీసుకోవాలి. 


రచయిత: జేవీఎస్‌ రావు 

Posted Date : 01-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌