• facebook
  • whatsapp
  • telegram

స్తూపం

1. సౌమ్య స్తూపాకారంలో ఉన్న కెలిడియోస్కోప్‌ తయారీకి చార్టును ఉపయోగించాలనుకుంది. ఆ కెలిడియోస్కోప్‌ పొడవు 25 సెం.మీ., వ్యాసార్ధం 3.5 సెం.మీ. ఉండాలంటే దాని వక్రతలం కోసం ఎంత వైశాల్యం గల చార్టు పేపర్‌ అవసరమవుతుంది? (సెం.మీ2.లలో)
1) 625       2) 650       3) 525        4) 550
జ: 4

2. 14 సెం.మీ. ఎత్తు గల ఒక క్రమ స్తూపం వక్రతల వైశాల్యం 88 సెం.మీ2. అయితే ఆ స్తూపం వ్యాసం ఎంత? (సెం.మీ.లలో)
1) 4       2) 3       3) 1       4) 1
జ: 3

3. ఒక దేవాలయంలో 25 స్తూపాకార స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం వ్యాసార్ధం 28 సెం.మీ., ఎత్తు 4 మీ. అయితే ఆ స్తంభాల వక్రతలానికి రంగు వేయడానికి 1 చ.మీ.కు రూ.160 చొప్పున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది?
1) రూ.28160           2) రూ.27160             3) రూ.25160              4) రూ.24160
జ: 1

4. ఒక స్తూపం వ్యాసార్ధం 3.5 సెం.మీ., ఎత్తు 7.5 సెం.మీ. అయితే ఆ స్తూపం సంపూర్ణతల వైశాల్యం, వక్రతల వైశాల్యాల నిష్పత్తి
1) 22 : 7             2) 22 : 15             3) 15 : 22              4) 7 : 22
జ: 2

5. ఒక బావి వ్యాసం 6 మీ., లోతు 21 మీ. అయితే బావి లోపలి తలాన్ని ప్లాస్టరింగ్‌ చేయడానికి 1 చ.మీ.కు రూ.9.50 చొప్పున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది?
1) రూ.3962          2) రూ.3662              3) రూ.3862             4) రూ.3762
జ: 4

6. ఒక క్రమ స్తూపం భూవ్యాసం 42 సెం.మీ., ఎత్తు 10 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం (సెం.మీ3.లలో)
1) 13860            2) 13680             3) 13760            4) 13640
జ: 1

7. 44 సెం.మీ. × 17 సెం.మీ. కొలతలు గల ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితం పొడవు వెంబడి ఏర్పడిన స్తూపం ఘనపరిమాణం ఎంత? (సెం.మీ3.లలో)
1) 2418             2) 2718               3) 2618              4) 2518
జ: 3

8. ఒక స్తూపం వ్యాసార్ధం, ఎత్తులు 2 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని ఘనపరిమాణం 1617 సెం.మీ3. అయితే ఆ స్తూపం సంపూర్ణతల వైశాల్యం ఎంత? (సెం.మీ2.లలో)
1) 750             2) 770             3) 780              4) 820
జ: 2

Posted Date : 10-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌