• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఉనికి - భౌగోళిక అంశాలు

1. ఆదిమ జాతి/ తెగకు సంబంధించి కిందివాటిలో సరికాని జత?

1) పిగ్మీలు - కాంగో నది ప్రాంతం       2) సమాంగ్‌ - మలేసియా

3) శిరస్సు ఖండించేవారు - బోర్నియా ద్వీపం     4) రెడ్‌ ఇండియన్స్‌ - సుమెత్రా ద్వీపం

జ: 4


2. భూమధ్యరేఖా మండలంలోని సతతహరితారణ్యాల్లో పెరిగే తీగజాతి ఊయళ్లను ఏమంటారు? 

1) సెల్వాలు        2) లయనాలు        3) ఒకాపిస్‌        4) ప్రయరీలు

జ: 2


3. కిందివాటిలో సరికానిది?

1) వెనెజులాలోని చురాన్‌ నదిపై ఏంజల్‌ జలపాతం ఉంది.

2) ఆఫ్రికాలోని జాంబేజి నదిపై విక్టోరియా జలపాతం ఉంది.

3) దక్షిణ అమెరికాలోని సెయింట్‌ లారెన్స్‌ నదిపై నయాగరా జలపాతం ఉంది.

4) పైవన్నీ

జ: 3


4. ఉత్తర అమెరికాలో ఎత్తయిన పర్వత శిఖరం ‘మెకన్లీ’. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  దీని పేరును ఏమని మార్చారు?

1) దెనాలి       2) ఎల్‌బర్డ్‌       3) మిచెల్‌          4) కన్లీ

జ: 1


5. కిందివాటిలో సరైనవి ఏవి? 

1) బ్రెజిల్‌లోని చిట్టడవులను కటంగాలు అంటారు.

2) చిలీ, పెరూ దేశాల తీరప్రాంతాల్లో కొన్నివేల సంవత్సరాలుగా నిక్షేపించిన పక్షి రెట్టలను గుమానో అంటారు.

3) ప్రయరీ గడ్డి భూములను ‘బ్రెడ్‌ బాస్కెట్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా’గా పేర్కొంటారు.

4) పైవన్నీ 

జ: 4


6. ఎడారులు లేని ఖండం ఏది? (ఇవి సాధారణంగా ఖండాలకు పశ్చిమాన 15నుంచి 30o మధ్య ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో విస్తరించి ఉంటాయి.)

1) ఆస్ట్రేలియా        2) అంటార్కిటికా        3) ఐరోపా         4) ఆఫ్రికా

జ: 3


7. భూభాగ విస్తీర్ణపరంగా ఖండాలను ఆరోహణ  క్రమంలో గుర్తించండి.

1) ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా

2) ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఐరోపా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా

3) ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా

4) ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా

జ: 1


8. ఆసియాలో అత్యంత పొడవైన నది?

1) అముర్‌        2) యాంగ్జి       3) మెకాంగ్‌        4) యురబ్

జ: 2


9. కింది అంశాలను జతపరచండి.

    జాబితా - I                             జాబితా - II

i) కంట్రీ ఆఫ్‌ కెనాల్స్‌                     a) థాయ్‌లాండ్‌

ii) ల్యాండ్‌ ఆఫ్‌ రివర్స్‌                   b) టర్కీ

iii) ల్యాండ్‌ ఆఫ్‌ వైట్‌ ఎలిఫెంట్స్‌       c) బంగ్లాదేశ్‌ 

iv) సిక్‌ మ్యాన్‌ ఆఫ్‌ యూరప్‌          d) పాకిస్థాన్‌

1) i-c, ii-b, iii-a, iv-d        2) i-d, ii-c, iii-a, iv-b

3) i-d, ii-a, iii-c, iv-b      4) i-d, ii-c, iii-b, iv-a

జ: 2


10. ఆఫ్రికాకి ఉత్తరాన, ఐరోపాకి దక్షిణాన ఉన్న జలభాగం?

1) మధ్యదరా సముద్రం        2) ఎర్ర సముద్రం

3) అట్లాంటిక్‌ మహాసముద్రం         4) హిందూ మహాసముద్రం

జ: 1


11. నల్ల సముద్రానికి, కాస్పియన్‌ సముద్రానికి మధ్య వారధిలా ఉన్న పర్వతాలు?

1) యురల్‌ పర్వతాలు      2) ఆల్ఫ్స్‌ పర్వతాలు     3) కాక్సస్‌ పర్వతాలు      4) వాస్‌జెస్‌ పర్వతాలు

జ: 3


12. కింది అంశాలను జతపరచండి.

    జాబితా - I               జాబితా - II

i) చీకటి ఖండం           a) దక్షిణ అమెరికా

ii) మంచు ఖండం       b) అంటార్కిటికా

iii) ఎత్తయిన ఖండం    c) ఆఫ్రికా

iv) పక్షి ఖండం          d) ఆస్ట్రేలియా

1) i-c, ii-d, iii-a, iv-b           2) i-c, ii-d, iii-b, iv-a

3) i-c, ii-a, iii-d, iv-b           4) i-c, ii-b, iii-d, iv-a

జ: 2


13. ఎడారిలో ప్రయాణించగల జీవనదులను ఏమంటారు?

1) జీరోఫైట్స్‌      2) ఎక్సోటిక్‌         3) బిగ్‌జేమ్స్‌      4) ప్లయా

జ: 2


14. ప్లయా, వాడీలు, ఒయాసిస్‌ అనేవి వరుసగా...

1) ఉప్పునీటి సరస్సు, ఎడారిలోని తాత్కాలిక సరస్సు, మంచినీటి సరస్సు

2) ఎడారిలోని మంచినీటి సరస్సు, ఎడారిలోని ఉప్పునీటి సరస్సు, ఎడారిలోని నదీకాలువ

3) ఎడారిలోని ఉప్పునీటి సరస్సు, ఎడారిలోని తాత్కాలిక నీటి ప్రవాహాలు, ఎడారిలోని మంచినీటి సరస్సు

4) తాత్కాలిక ప్రవాహాలు, ఉప్పునీటి సరస్సు, మంచినీటి సరస్సు

జ: 3


15. చంద్రమాన సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం వసంత రుతువు చైత్ర - వైశాఖ మాసాల్లో వస్తుంది. అయితే సూర్యమాన సంవత్సర క్యాలెండర్‌ ప్రకారం ఏ నెలల్లో వస్తుంది? 

1) జనవరి - ఫిబ్రవరి     2) మార్చి - ఏప్రిల్‌      3) సెప్టెంబరు - అక్టోబరు     4) నవంబరు - డిసెంబరు

జ: 2


16. కిందివాటిలో సరికానిది?

1) ద్రవరూపంలోని నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీబ¡వనం అంటారు.

2) ఘనపదార్థం ద్రవరూపంలోకి మారకుండా నేరుగా వాయురూపంలోకి మారుతుంది.

3) వృక్షాలు వాతావరణంలోకి నీటి ఆవిరిని విడుదల చేసే ప్రక్రియను నిశ్వాసం అంటారు.

4) గాలిలోని నీటిఆవిరి పరిమాణం నిష్పత్తిని విశిష్ట ఆర్థ్రత అంటారు.

జ: 3


17. ఆస్ట్రేలియాలో సంభవించే చక్రవాత వర్షపాతాన్ని ఏమంటారు??

1) విల్లీ - విల్లీ       2) హరికేన్లు       3) టైప్లూన్స్‌         4) తుపానులు 

జ: 1


18. ప్రపంచమంతా రేయింబవళ్లు సమానంగా ఉండే రోజులు?

1) జూన్‌ 21, డిసెంబరు 22          2) మార్చి 21, సెప్టెంబరు 23

3) మార్చి 21, జూన్‌ 21           4) సెప్టెంబరు 23, డిసెంబరు 22 

జ: 2


19. భ్రమణకాలం సమానంగా ఉన్న గ్రహాలు ఏవి?

1) శుక్రుడు, భూమి    2) భూమి, గురుడు     3) శని, అంగారకుడు     4) భూమి, అంగారకుడు

జ: 4


20. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) జు ఆకారపు లోయ - నది       2) బార్కన్స్‌ - పవన చర్య

3) గీ ఆకారపు లోయ - హిమనీనది         4) బీచ్‌లు - నదీ వక్రతలు

జ: 4


21. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I                     జాబితా - II

i) స్టాలిన్‌ కాలువ        a) ఉత్తర సముద్రం, బాల్టిక్‌ సముద్రాలను కలుపుతుంది.

ii) పనామా కాలువ    b) పసిఫిక్, అట్లాంటిక్‌ మహాసముద్రాలను కలుపుతుంది

iii) సూయజ్‌            c) బాల్టిక్, ఆర్కిటిక్‌ కాలువ సముద్రాలను కలుపుతుంది

iv) కీల్‌ కాలువ         d) మధ్యదరా, ఎర్రసముద్రాలను కలుపుతుంది

1) i-c, ii-a, iii-b, iv-d       2) i-c, ii-b, iii-d, iv-a

3) i-c, ii-d, iii-a, iv-b       4) i-d, ii-c, iii-b, iv-a

జ: 2


మరికొన్ని...


1. భారతదేశంలోని ఆదిమ జాతి/ తెగలను వారు నివసించే ప్రాంతాలతో జతపరచండి.

    జాతి/ తెగ             ప్రాంతం

i) భిల్లులు         a) అసోం

ii) కర్బీలు         b) అండమాన్‌ నికోబార్‌ దీవులు

iii) లెప్చాలు      c) మధ్యప్రదేశ్‌

iv) నీగ్రిటోలు      d) సిక్కిం

1) i-c, ii-d, iii-b, iv-a            2) i-a, ii-c, iii-b, iv-d

3) i-b, ii-d, iii-a, iv-c           4) i-c, ii-a, iii-d, iv-b

జ: 4


2. ‘మెటియోరాలజీ’ అంటే ఏమిటి? 

1) వాతావరణ అధ్యయన శాస్త్రం        2) అంతరిక్ష అధ్యయన శాస్త్రం

3) భూస్వరూప అధ్యయన శాస్త్రం      4) భూనిర్మాణ అధ్యయన శాస్త్రం

జ: 1


3. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) గ్రీన్‌ ప్లానెట్‌ - యురేనస్‌ 

2) రెడ్‌ ప్లానెట్‌ - అంగారకుడు

3) రష్యన్‌ ప్లానెట్‌ - బుధుడు 

4) నీలిగ్రహం - భూమి

జ: 3


4. కిందివాటిలో సరికానిది ఏది?

1) ఎడ్మండ్‌ హేలీ అనే శాస్త్రవేత్త హేలీ తోకచుక్క కాలవ్యవధులను గుర్తించాడు.

2) హేలీ తోకచుక్క 1986లో ఒకసారి కనిపించింది.

3) హేలీ తోకచుక్కలో 6 భాగాలుంటాయి.

4) తోకచుక్కలను మురికి మంచు బంతులని అంటారు.

జ: 3


5. P, S, L  అనేవి భూకంపాలకు కారణమయ్యే తరంగాలు. అయితే భూకంపం సంభవించినప్పుడు భూఉపరితలంపై అధిక నష్టం జరగడానికి ఏ తరంగాలు కారణం?

1) P తరంగాలు      2) S తరంగాలు      3) L తరంగాలు     4) పైవన్నీ

జ: 3


6. ‘ర్యాపిడ్స్‌’ అంటే ఏమిటి? 

1) ఉపనదుల కారణంగా ఏర్పడే మైదానాలు    2) ఉపనదుల వరుస క్రమం

3) చిన్న జలపాతాల వరుస              4) నదుల వరుస క్రమం

జ: 3


7. కిందివాటిలో సరికానిది? 

1) ఉత్తరార్ధగోళంలో భూభాగం, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ

2) ఉత్తరార్ధ గోళంలోని రంగుల కాంతులను అరోరా బొరియాలిస్‌ అంటారు.

3) దక్షిణార్ధ గోళంలోని రంగుల కాంతులను అరోరా ఆస్ట్రాలిస్‌ అంటారు.

4) ఉత్తరార్ధ ధృవ పక్షి పెంగ్విన్, దక్షిణ  ధృవ పక్షి గూడ్లగూబ.

జ: 4


8. ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో ద్రాక్ష పండ్లు పక్వానికి రావడానికి దోహదపడే ఉష్ణపవనం?

1) చినూక్‌      2) పాంపెరొ        3) ఫోన్‌      4) బా

జ: 3


కొన్ని ముఖ్యాంశాలు..

* కాలీఫ్లవర్‌ ఆకారంలోని మేఘాలు - క్యుములస్, అధిక వర్షానికి కారణమయ్యే మేఘాలు - క్యుములోనింబస్, ఆకాశంలో వేగంగా కదులుతూ కనిపించే మేఘాలు - స్ట్రాటస్, పెద్దవర్షం తర్వాత కనిపించే మేఘాలు - ఆల్టోస్ట్రాటస్‌.

* ఖడ్గమృగాలకు ఆవాసాలుగా ఏర్పడిన జాతీయ పార్కులు - ఖజిరంగా, జల్దపార

* రంగన్‌తిట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్ణాటకలో ఉంది.

* సిజు పక్షుల సంరక్షణ కేంద్రం మేఘాలయలో ఉంది.

* 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సర్‌లో చిత్తడి నేలల పరిరక్షణపై ఒప్పందం జరిగింది. ఇది 1975 నుంచి అమల్లోకి వచ్చింది. చిత్తడినేలలు/ తడినేలల సంరక్షణకు సంబంధించిన మొదటి అంతర్జాతీయ ఒప్పందం ఇది.

* కుంచకల్‌ జలపాతం భారతదేశంలోనే ఎత్తయిన జలపాతం.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మెక్‌మోహన్‌ రేఖ కింది ఏ రెండు దేశాల మధ్య ఉంది? (జూనియర్‌ స్టెనో, 2010)
జ: భారత్‌ - చైనా

 

2. భారత ప్రధాన భూభాగపు దక్షిణ ప్రాంతం? (అసిస్టెంట్‌ టీఎంవీఐ, 2009)
జ: కన్యాకుమారి

 

3. కిందివాటిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది?
     1) గుజరాత్‌      2) మధ్యప్రదేశ్‌      3) ఆంధ్రప్రదేశ్‌      4) మహారాష్ట్ర
జ: 2 (మధ్యప్రదేశ్‌)

 

4. కింది ఏ దేశంతో భారతదేశానికి సమష్టి సరిహద్దు లేదు? (జేఎల్, 2004) 
     1) అఫ్గానిస్థాన్‌      2) బంగ్లాదేశ్‌      3) నేపాల్‌      4) బర్మా
జ: 1 (అఫ్గానిస్థాన్‌)

 

5. భారతదేశ మొత్తం భూభాగ వైశాల్యం ఎంత? (జేఎల్, 2006)
జ: 32,87,263 చ.కి.మీ.

6. వైశాల్యంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం? (జేఎల్, 2011)
జ: లక్షదీవులు

 

7. భారత్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం (గ్రూప్‌ 1, 2007)
జ: 8º జలమార్గం

 

8. సర్‌క్రీక్‌ వివాదం కింది ఏయే దేశాల మధ్య ఉంది? (గ్రూప్‌ 1, 2004)
     1) భారత్‌ - పాకిస్థాన్‌      2) నార్వే -  స్వీడన్‌    
     3) మయన్మార్‌ - థాయ్‌లాండ్‌      4) నేపాల్‌ - చైనా
జ: 1 (భారత్‌ - పాకిస్థాన్‌)

 

9. కిందివాటిలో మూడు దేశాలతో సరిహద్దు గల రాష్ట్రాలు? (గ్రూప్‌ 4, 2011)
     1) జమ్ముకశ్మీర్, పశ్చిమ్‌ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌
     2) పశ్చిమ్‌ బంగ, మణిపూర్, జమ్ముకశ్మీర్, గుజరాత్‌
     3) జమ్ముకశ్మీర్, త్రిపుర, సిక్కిం, పశ్చిమ్‌ బంగ 
     4) పశ్చిమ్‌ బంగ, నాగాలాండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌
జ: 1 (జమ్ముకశ్మీర్, పశ్చిమ్‌ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌)

 

10. భారత్, అఫ్గానిస్థాన్‌లను వేరుచేసే రేఖ (డీఈవో, 2010)
జ: డ్యూరాండ్‌ రేఖ

 

11. భారతదేశం ఎన్ని దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది? (పీఎల్, 2011)
జ: 7


12. విస్తీర్ణపరంగా భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఏది?
    1) మధ్యప్రదేశ్     2) ఉత్తర్ ప్రదేశ్     3) ఆంధ్రప్రదేశ్     4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

13. కర్కటరేఖ దేశంలోని ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళుతోంది?
జ: ఏడు

14. భారతదేశం ప్రపంచంలోని ఎంత శాతం భూభాగాన్ని కలిగి ఉంది?
జ: 2.4 శాతం

15. దేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది?
జ: ఉత్తర్ ప్రదేశ్

16. కిందివాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం కానిది ఏది?
    1) ఝార్ఖండ్     2) చత్తీస్‌గఢ్     3) పంజాబ్     4) హరియాణా
జ: 3 (పంజాబ్)

17. ఏ రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ ఉంది?
జ: గుజరాత్

18. భారతదేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దును కలిగి ఉన్న దేశం ఏది?
జ: బంగ్లాదేశ్

19. భారతదేశ దక్షిణ సరిహద్దు అయిన 'ఇందిరా పాయింట్' ఏ దీవిలో ఉంది?
జ: గ్రేట్ నికోబార్

20. 'డ్యూరాండ్ రేఖ' ఏయే దేశాల సరిహద్దు రేఖగా ఉంది?
జ: భారతదేశం - అఫ్గనిస్థాన్

21. దేశంలోని ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి?
జ: 17

22. భారతదేశ తూర్పు-పడమర సరిహద్దు మధ్య ఉన్న కాలవ్యవధి ఎంత?
జ: 2 గంటలు

23. మనదేశంలోని తీరరేఖ పొడవు ఎంత?
జ: 7516 కి.మీ.

24. కిందివాటిలో భారతదేశంలోని అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది?
    1) పుదుచ్చేరి     2) అండమాన్ నికోబార్ దీవులు     3) చండీగఢ్     4) డయ్యూ-డామన్
జ: 2 (అండమాన్ నికోబార్ దీవులు)

25. కొంకణ్ తీరమని కిందివాటిలో ఏ రాష్ట్ర తీరాన్ని పిలుస్తారు?
    1) మహారాష్ట్ర     2) కర్ణాటక     3) కేరళ     4) ఒడిశా
జ: 1 (మహారాష్ట్ర)

26. ఉత్తర - దక్షిణాలుగా భారతదేశ పొడవు ఎంత?
జ: 3214 కి.మీ.


27. దాద్రానగర్ హవేలి రాజధాని- 
జ: సిల్వస్సా

28. భారతదేశంలో నేటివరకు చివరిగా ఏర్పడిన రాష్ట్రం-
జ: జార్ఖండ్

29.  పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం-
జ: గుజరాత్ 

30. లక్షదీవుల వైశాల్యం-
జ: 32 చ.కి.మీ.

31. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారతదేశ దీవి-
జ: గ్రేట్ నికోబార్

32. భారతదేశంతో అత్యంత పొడవైన సరిహద్దు ఉన్న దేశం-
జ: బంగ్లాదేశ్

33. భారతదేశంలో కర్కటరేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్లదు?
జ: మహారాష్ట్ర

34. 82తూర్పు రేఖాంశం వెళ్లని రాష్ట్రమేది?
జ: ఉత్తరాంచల్

35. భూపరివేష్ఠిత రాష్ట్రం కానిదేది?
జ: ఉత్తరప్రదేశ్

36. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రమేది?
జ: మణిపూర్

37. సిక్కిం రాష్ట్రానికి ఏ దేశంతో సరిహద్దు లేదు?
జ: మయన్మార్

38. భారతదేశ దక్షిణ చివరిప్రాంతం
జ: ఇందిరా పాయింట్

39. భారత్- ఆప్ఘనిస్థాన్ మధ్య సరిహద్దురేఖ
జ: డ్యూరాండ్‌రేఖ

40. వైశాల్యంలో భారతదేశ స్థానం-
జ: 7

41. అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం-
జ: హర్యానా

42. దేశంలో అటవీసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం-
జ: మిజోరం

43. వాణిజ్యపరంగా విలువైన అడవులు-
జ: ఆకురాల్చే అడవులు

44. 100 నుంచి 200 సెం.మీ. వర్షపాతంలో పెరిగే వృక్షాలు-
జ: ఆకురాల్చే అరణ్యాలు

45. సతతహరిత అరణ్యాలకు చెందిన వృక్షం-
జ: ఎబోని

46. ఆంధ్రప్రదేశ్‌లో అడవులు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
జవాబు: హైదరాబాద్

47. 'రూసా' గడ్డిజాతి ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో ఎక్కువ?
జ: నిజామాబాద్

48. సముద్ర అలల తాకిడివల్ల ఏర్పడే అడవులు-
జ: టైడల్ అడవులు

Posted Date : 20-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌